అక్షాంశ రేఖాంశాలు: 12°30′N 75°00′E / 12.5°N 75°E / 12.5; 75

కాసర్‌గోడ్ జిల్లా

వికీపీడియా నుండి
(కాసరగోడ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Kasaragod District
Kanhirakode District[1]
Kasaragod
Clockwise from top:
Ranipuram, Bekal Fort, Bekal beach, Chandragiri fort, Kavvayi Backwaters at Nileshwaram, Chandragiri River at Kanathur near Kasaragod
Nickname: 
The Land of Seven Languages[2]
Location in Kerala
Location in Kerala
పటం
Kasaragod district
Coordinates: 12°30′N 75°00′E / 12.5°N 75°E / 12.5; 75
Country India
StateKerala
RegionNorth Malabar
Established24 మే 1984; 40 సంవత్సరాల క్రితం (1984-05-24)
Founded byGovernment of Kerala
HeadquartersKasaragod
Subdistricts
Government
 • District CollectorDr. D Sajith Babu IAS
 • Superintendent of PoliceP B Rajeev IPS
 • MPRajmohan Unnithan (INC)
విస్తీర్ణం
 • Total1,992 కి.మీ2 (769 చ. మై)
జనాభా
 (2018)[3]
 • Total13,90,894
 • జనసాంద్రత698/కి.మీ2 (1,810/చ. మై.)
Demographics
 • Language (2011)
 • Religion (2011)
Human Development
 • Sex ratio (2011)1080 /1000 [6]
 • Literacy (2011)90.09%[7]
Time zoneUTC+5:30 (IST)
PIN
671121
Telephone code0499
ISO 3166 codeIN-KL
Vehicle registrationKL-14, KL-60, KL-79
HDI (2005)Increase 0.760[8] (High)

కాసర్‌గోడ్ జిల్లా , భారతదేశం, కేరళ రాష్ట్రంలోని ఒక జిల్లా.[9] కాసర్‌గోడ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.1956 నవంబరు 1న ఈ జిల్లా రూపొందించబడింది.[10] గతంలో దక్షిణ కనరా జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా కేంద్రం కాసర్‌గోడ్ పట్టణం జిల్లా పేరుగా నిర్ణయించారు. కాసర్‌గోడ్ జిల్లా కేరళరాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా కొబ్బరి నార, చేనేత వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జిల్లాలో తులునాడు, కూర్గ్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షక ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 29.3 కి.మీ పొడవైన సముద్రతీరం ఉంది. జిల్లాలో పర్వతశ్రేణి కూడా ఉంది. జిల్లాలో కొండలు, నదులు, గుడులు, సముద్రతీరాలు, కోటలు ఉన్నాయి. జిల్లా సంప్రదాయకంగా సుసంపన్నమై ఉంది. జిల్లాకు సప్తభాషా సంగమభూమిగా ప్రత్యేకత ఉంది. జిల్లాలో 7 ప్రధాన భాషలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా ఎండోసఫేట్ క్రిమిసంహారక భూమి కలిగిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.

సరిహద్దులు

[మార్చు]

జిల్లాకు దక్షిణ సరిహద్దుగా కన్నూరు జిల్లా, ఆగ్నేయ సరిహద్దుగా కొడుగు జిల్లా, ఉత్తర సరిహద్దుగా దక్షిణ కన్నడ జిల్లా, తూర్పు సరిహద్దుగా పశ్చిమ కనుమలు ఉన్నాయి.

పరిపాలనా విభాగాలు

[మార్చు]
విషయాలు వివరణలు
తాలూకాలు 4 కాసరగోడ్, హోస్‌దుర్గ్, వెళ్ళరుకుండ్, మంజేశ్వర్.
ప్రధానపట్టణాలు కన్హాగడ్, కాసరగోడ్, ఉప్పల, త్రికరిపుర్, నిలెష్వర్.[11]
మండలాలు మంజెష్వరం, కాసరగోడ్ పట్టణం (కాసరగోడ్), కన్హాగడ్, నిలెష్వరం, అరప్ప, కరద్క. కేరళ, కాసరగోడ్
అక్షరాస్యత 85.17%

చరిత్ర

[మార్చు]

కాసర్‌గోడ్‌ను అరేబియన్లు హార్క్‌విల్లియా [12] పలువురు అరేబియన్ ప్రయాణీకులు 9వ, 14వ శతాబ్దంలో కాసర్‌గోడుకు వెళ్ళారు. ఆకాలంలో ఇది ప్రముఖ వ్యాపారకేంద్రంగా ఉంది. పోర్చుగీస్ యాత్రీకుడు దుయర్తె బార్బొస 1514లో కాసర్‌గాడు సమీపంలో ఉన్న కుంబ్లకు వెళ్ళాడు. ఇక్కడ నుండి కాయిర్‌ బదులుగా బియ్యం ఎగుమతి చేయబడ్డాయని పేర్కొన్నాడు.[12]

కాసర్‌గోడ్

[మార్చు]

కాసర్‌గోడ్ పురాతన ప్రముఖ భారతీయ సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. జిల్లాలో తులు ప్రజలు మరొయు మలయాళం ప్రజలు నివసించే 64 గ్రామాలు ఉన్నాయి. [12] కాసర్‌గోడ్‌ మీద విజయనగర రాజులు దాడిచేసిన సమయంలో కాసర్‌గోడ్ కోలాతిరి రాజా (నీలేశ్వరం రాజధానిగా చేసుకుని పాలించాడు) పాలనలో ఉండేది. విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరగానే ఈ ప్రాంతపు పాలన ఇక్కరీ నాయికాల ఆధీనంలోకి మారింది.[12] విజయనగర పాలన పతనం అయిన వెంటనే " వెకప్ప నాయక్ " స్వతంత్రం ప్రకటించుకున్నాడు.[12] ఫ్రాంసిస్ బుక్కనన్ ఆర్థర్ విల్లెస్లీ (విల్లెస్లీ మొదటి డ్యూక్) కుటుంబ వైద్యుడు 1800లో కాసర్‌గోడ్‌ను సందర్శించాడు.[12] అతని ప్రయాణంలో అతిరపరంబు, కవ్వై, నీలేశ్వరం, బెకల్, చంద్రగిరి, మంజేశ్వరంల గురించిన సమాచారం సేకరించి లిఖితపూర్వకంగా నమోదు చేసాడు.[12]

హైదర్ అలి

[మార్చు]

1773లో హైదర్ అలి ఇక్కరీ నాయికాల రాజధాని బెదనూర్ (బిద్నూర్) ను జయించాడు. ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ మలబార్ ప్రాంతంలో అధికభాగాన్ని ఆక్రమించాడు. 1792 శ్రీరంగపట్నం ఒప్పందం అనుసరించి టిప్పు తులునాడు వదిలి మిగిలిన మలబారును బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించాడు. టిప్పు సుల్తన్ మరణం తరువాత టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ప్రభుత్వం తులునాడును స్వాధీనం చేసుకుంది.[12]

నైసర్గికం

[మార్చు]

జిల్లా సముద్రమట్టానికి 19మీ ఎత్తున ఉంది. జిల్లాలో అత్యధికంగా కొబ్బరిచెట్లు ఉన్నాయి. అలాగే కొండలు, శెలయేర్లు ఉన్నాయి.[13] జిల్లాలో పెంకులు పరచిన కప్పులు కలిగిన గృహాలు ఉన్నాయి. ప్రాంతీయంగా ఎర్రమట్టితో చేసి కాల్చిన పెంకులతో కప్పి ఉంటాయి. ఎర్రమట్టి లేటరైట్ బ్లాకులతో చేసిన గోడలతో గృహాలు నిర్మించబడతాయి. పురాతన గృహాలు సాధారణంగా కొయ్యనగిషీలతో అలంకరించబడిఉంటుంది.

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - కాసర్‌గోడ్
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 33.1
(91.6)
33.3
(91.9)
33.9
(93.0)
34.3
(93.7)
33.4
(92.1)
29.8
(85.6)
28.7
(83.7)
28.8
(83.8)
30.1
(86.2)
31.2
(88.2)
32.7
(90.9)
33.1
(91.6)
31.9
(89.4)
సగటు అల్ప °C (°F) 21.1
(70.0)
21.9
(71.4)
23.7
(74.7)
24.9
(76.8)
24.9
(76.8)
23.5
(74.3)
23
(73)
23
(73)
23.2
(73.8)
23.2
(73.8)
22.7
(72.9)
21.3
(70.3)
23.0
(73.4)
సగటు అవపాతం mm (inches) 0.8
(0.03)
0
(0)
17.3
(0.68)
32.7
(1.29)
182.9
(7.20)
1,010.5
(39.78)
1,002.8
(39.48)
663.6
(26.13)
246.5
(9.70)
222.6
(8.76)
69
(2.7)
12.4
(0.49)
3,461.1
(136.24)
Source: Meo Weather

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19012,31,280—    
19112,47,467+0.68%
19212,56,931+0.38%
19313,02,043+1.63%
19413,42,301+1.26%
19514,11,031+1.85%
19615,12,146+2.22%
19716,83,020+2.92%
19818,72,741+2.48%
199110,71,508+2.07%
200112,04,078+1.17%
201113,07,375+0.83%
201813,90,894+0.89%
source:[14]

కేరళ ప్రభుత్వం ప్రచురించిన 2018 జనాభా లెక్కలు ప్రకారం, కాసర్‌గోడ్ జిల్లాలో 13,90,894 [3] జనాభా ఉంది, ఇది ట్రినిడాడ్, టొబాగో[49] లేదా యుఎస్ రాష్ట్రం న్యూ హాంప్‌షైర్‌తో సమానంగా ఉంటుంది. [50] 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, భారతదేశంలోని మొత్తం 640 జిల్లాలలో ఈ జిల్లాకు జనాభాపరంగా 375వ ర్యాంకింగ్ ఇచ్చింది.[51] జిల్లాలో ఒక చదరపు కిలోమీటరుకు 654 మంది జనాభా సాంద్రత (1,690/చ.మైళ్లు).[51] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 8.18%గా ఉంది.[51] కాసరగోడ్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 1080 మంది స్త్రీలు ఉన్నారు,[51] అక్షరాస్యత రేటు 90.09%.[52] జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 4.08%, 3.74% ఉన్నారు.[51] తుళు భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించే కేరళ తుళు అకాడమీ జిల్లాలోని హోసంగడిలో పనిచేస్తుంది.

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో మళయాళం భాష 82.69%, తుళు భాష 8.77%, కన్నడ 4.23%, మరాఠీ 1.76%, కొంకణి 1.29%, ఇతర భాషలు 1.26% మంది మాట్లాడతారు.[53]

Kasaragod District Map

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,302,600.[15]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[16]
అమెరికాలోని. న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[16]
640 భారతదేశ జిల్లాలలో. 375 వ స్థానంలో ఉంది.[15]
1చ.కి.మీ జనసాంద్రత. 654 [15]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.18%.[15]
స్త్రీ పురుష నిష్పత్తి. 1009:1000[15]
జాతీయ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 89.85%.[15]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
ముస్లిం 34.31%,
హిందువులు 58.57% 
క్రైస్తవులు 7.05%.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]
Chandragiri bridge which connects Kasargod town to Chemnad Panchayath.

జాతీయ రహదారి 66 (మునుపటి జాతీయ రహదారి 17) కాసర్‌గాడ్ జిల్లాలోని కుంజత్తూర్ వద్ద కేరళాలో ప్రవేశిస్తుంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని ఉప్పల, కాసర్‌గాడ్ జిల్లా, కంహంగాడ్ ద్వారా మేంగుళూర్ చేరుతుంది. రహదారి నెట్‌వర్క్‌కు చెందిన రహదారి తలపాడి ప్రధాననగరాలైన ఉప్పల, కాసర్‌గాడ్, కంహంగాడ్, నీలేశ్వర్, చెరువదూర్ లను అనుసంధానిస్తుంది. రహదారి జిల్లాలో కలికడవు పిలికోడ్ వద్ద జిల్లాను వదిలి వేరొక జిల్లాలో ప్రవేశించి ఎడపల్లితో ముగుస్తుంది. ఇతర ప్రధాన రహదారిలలో కాసర్‌గాడ్ - సులియా, కాసర్‌గాడ్ - పుత్తూర్, ఉప్పల - భయర్, కంహంగాడ్ - పనతూర్, కంహంగాడ్ -కొన్నక్కాడ్, కాసర్‌గాడ్ - బెకల్ - కంహన్‌గాడ్, నీలేశ్వర్- చిట్టరికల్, హొసన్‌గాడి - అనెకల్ ఉన్నాయి. చెరుపుళా - మలోం - బందదుక్కా- ననరపడవు ఘాట్ రోడ్డు ప్రతిపాదించబడింది.

రైలు మార్గం

[మార్చు]

ప్రధాన రైలు స్టేషన్లు:- కాసర్‌గాడ్, కంహంగాడ్, ఉప్పల, మంజేశ్వర్, నీలేశ్వర్, చెరువత్తూర్.

భాషలు

[మార్చు]

భారతదేశంలో ప్రధాన 7 భాషలకు (ప్రాంతీయ గిరిజల భాషలు కాక మిగిలినవి) చెందిన ప్రజలు నివసిస్తున్న జిల్లాలో కాసర్‌గోడ్ జిల్లా ఒకటి. ఒక్కొక భాషకు పలువురు వాడకందార్లు ఉన్నారు. [17] జిల్లాలో గుర్తించతగిన భాషలలో మలయాళం, కన్నడం, తులు, కొంకణి భాషలు వాడుకలో ఉన్నాయి. పాఠశాలలలో మలయాళ, ఆంగ్లం భాషలతో కన్నడ భాష కూడా బోధనాభాషగా ఉంది. వీటితో మరాఠీ, బియరీ భాష, హిందీ, ఉర్దు భాషలను అల్పసంఖ్యాక ప్రజలలో వాడుకలో ఉన్నాయి. కాసర్‌గోడ్ జిల్లాలో హవ్యక బ్రాహ్మణులు ఆధికసంఖ్యలో ఉన్నారు.[17][18] జిల్లా మలయాళం భాషమీద కన్నడ, తులు భాషల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వాడుకలో ఉన్న కన్నడ, తులు భాషల మీద మలయాళ భాషా ప్రభావం ఉంది.[19][20]

విద్య

[మార్చు]
ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం ఎయిడెడ్ అసహాయ మొత్తం
లోవర్ ప్రైమరీ స్కూల్ 141 115 7 263
మాధ్యమిక 73 72 4 149
హై స్కూల్ 43 19 8 70
హయ్యర్ సెకండరీ స్కూల్ 31 14 0 45
ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ 3 1 9 13
ఇంజినీరింగ్ కాలేజ్ 2 1 3
వ్యవసాయ కళాశాల 1 0 0 1
ఫార్మసీ కాలేజీ 0 1 0 1
ఉపాధ్యాయ శిక్షణ స్కూల్ 2 1 0 3

కేరళ విశ్వవిద్యాలయం

[మార్చు]
ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం ఎయిడెడ్ అసహాయ మొత్తం
బ్లైండ్ / చెవిటి 1 1 0 2
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2 0 0 2
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ 0 0 1 1
పాలిటెక్నిక్ 2 1 0 3
కేంద్రీయ విద్యాలయ 0 0 0 3
నవోదయ విద్యాలయ 0 0 0 1
బి.ఇ.డి సెంటర్ 1 0 0 1

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
Ranipuram Hill Station
Bekal Fort Beach

కాసరగాడ్ కేరళాలో ఆకర్షణీయమైన జిల్లాలలో ఒకటి. కేరళ ప్రవహిస్తున్న 44 నదులలో 9 నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. కొండలు, సముద్రతీరాలు, బ్యాక్ వాటర్, ఆలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నాయి.

  • బెకాల్ కోట - ఇది కేరళలో అతిపెద్ద కోటగా గుర్తించబడుతుంది. కన్హాగడ్ నుండి 14కి.మీ, కాసరగోడ్ పట్టణం నుండి 15 కీ.మీ దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషను బెకాల్ కోట రైల్వే స్టేషను, పల్లికెరె రైల్వే స్టేషను, సమీపం లోని విమానాశ్రయం మంగళూరు ఎయిర్వేస్.
  • అనంతపుర సరోవర ఆలయాలు, విష్ణువుకు ఒక పురాతన, ఆకర్షణీయమైన ఆలయం.
  • మల్లికార్జున ఆలయం కాసర్గోడ్ టౌన్ కేంద్రంలో ఉన్న మరొక దేవాలయం పరమశివుడు ఇక్కడ ప్రధాన దైవంగా ఉన్నాడు.
  • రనిపురం - కన్హాగడ్-పనథుర్ రాష్ట్ర రహదారి గడ్డి కొండల సమీపంలోని కూడలి, కన్హాగడ్ లింక్.
  • కొత్తంచేరిరి హిల్స - మలొం సమీపంలో ఉన్న పర్వతావళి. కావేరీ నది ప్రారంభం ఇది తలకావేరికి సమాంతరంగా ఉంది. ఇది 36 కన్హాగడ్ టౌన్ నుండి కీమీ.
  • వలియపరంబ బ్యాక్ వాటర్స్
  • ఇతర పర్యాటక ఆకర్షణలు చంద్రగిరి కోట, ఆనందాశ్రమం, నిత్యానందాశ్రమం, కరీం ఫారెస్ట్ పార్క్ ఉన్నాయి - కేరళ గిరిజనులు చేసిన ఫారెస్ట్ పార్క్, పరప్పలో ఉన్న నీలేశ్వర్ ఆలయం ఉన్నాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కాసర్రోడ్డులో ఒక ఐటి పార్క్ స్థాపించాలని యోచిస్తోంది. చీమెనిలో 50,000 మందికి ఐటి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
  • ఆధుర్, వైవిధ్యమైన జంతుజాలం, వృక్షజాలం ఉన్న అందమైన ప్రాంతం ఇది..

యాత్రా ప్రదేశం

[మార్చు]
  • అనంతపుర సరోవర ఆలయం: ఇది విష్ణువు ప్రధాన దైవంగా ఉన్న పురాతన ఆలయం.
  • బేలా చర్చ్: ఇది " అవర్ లేడీ ఆఫ్ సరోవర్ చర్చ్ "గా కూడా గుర్తించబడుతుంది. ఈ కాథలిక్ చర్చ్ కాసర్‌గాడ్‌కు 14 కి.మీ దూరంలో, మంగుళూరుకు 50కి.మీ దక్షిణంలో ఉంది. ఈ చర్చి 1890లో నిర్మించబడింది. జిల్లాలో పురాతన చర్చిగా ఇది గుర్తించబడుతుంది. గోథిక్ గుర్తుగా మిగిలి ఉన్న ఈ చర్చి మంగళూరు డియోసెస్ ఆధీనంలో ఉంది. ఈ చర్చి శతాబ్ది ఉత్సవాలు జరిపిన సందర్భంలో ఈ చర్చి పునరుద్ధరిచబడింది. కాథలిక్కుల మాతృభాష కొంకణి.
  • త్రిక్కానాడ్ శివాలయం అరేబియన్ సముద్రతీరంలో ఉంది. బెకల్ వంతెనకు 1 కి.మీ దూరంలో ఉంది. ఆలయ పరిసరాలు అందంగా ఉంటాయి. భక్తులకు ఈ ఆలయ దర్శనం అలౌకిక ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు పాండూరాజు ఈ ఆలయాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆయన పడవకు నిప్పంటుకుని రాతికి కొట్టుకుందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఇది దక్షిణ కాశిగా ప్రశంశించబడుతుంది.
  • మథుర్ గణపతి ఆలయం నిర్మాణవైభవం అద్భుతంగా ఉంటుంది.
  • మాలిక్ దినార్ మసీద్, ఇండియా ఆరభకాల మసీదులలో ఒకటి. మహమ్మద్ ప్రవక్త జీవించి ఉన్న సమయంలోనే ఇది నిర్మించబడినట్లు భావిస్తున్నారు. ఇది కాస్ర్‌గాడ్ రైల్వే స్టేషను‌కు 3 కి.మీ దూరంలో ఉన్నదని భావిస్తున్నారు.
  • మల్లికార్జునఆలయం: కాసరగాడ్ కేంద్రంలో ఉన్న మరొక ఆలయం ఇది. ఇందులో శివుడు ప్రధాన దైవంగా ఉన్నాడు.
  • 'పాలకున్ను భగవతి ఆలయం.
  • మల్లం ఆలయం.
  • కమ్మడం భగవతి ఆలయం. ధానులో ఉన్న తెయ్యం కలియాట్టం చాలా ప్రాబల్యం సంతరించుకుని వందలాది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతినెల సంక్రమణ రోజుకు ఈ ఆలయదర్శనానికి భక్తులు అధికంగా వస్తుంటారు. కామాడత్ భగవతి, చాముండి (రాకేశ్వరి) ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం నీలేశ్వరానికి దూరంలో ఉంది.

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]
Another look at the Bekal Fort

కాసర్‌గోడ్ జిల్లా మూడు ఆటవీ జిల్లాల మధ్య ఉంది. ఉత్తరంలో దక్షిణ కన్నడ (ఒక నేషనల్ పార్క్, 2 విడ్ లైఫ్ అభయారణ్యాలు ఉన్నాయి. తూర్పున కొడుగు (1 నేషనల్ పార్క్, 2 వన్యప్రాణి శాక్చ్యురీలు ఉన్నాయి. దక్షిణంలో కన్నౌర్ (ఒక వన్యప్రాణి శాక్చ్యురీ), ఒక ఎలిఫెంట్ కారిడార్) ఉంది. జిల్లాలో సతతహరిరాణ్యాలు, మాంగ్రోవ్ అరణ్యం విస్తారంగా ఉన్నప్పటికీ జిల్లా ఆటవీశాఖ అధికారులు రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు గాని కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు గాని జిల్లాలో శాక్చ్యురీ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించలేదు. ఉంది.

కాసర్‌గోడ్

[మార్చు]

కాసర్‌గోడ్ జిల్లా వృక్షసంపద అధికంగా కలిగి ఉంది. సముద్రతీరాలలో మినహా మిగిలిన ప్రాంతాలలో వివిధ జాతులకు చెందిన సహజ వృక్షాలు అధికంగా కనిపిస్తుంటాయి. అనుకూలమైన వృక్షాలు అధికంగా పెరగడానికి అవకాశం ఉన్నందున ఒకేరకమైన వృక్షాలు కాక వైవిధ్యం ఉన్న వృక్షాలు అధికంగా కనిపిస్తుంటాయి. నిషిద్ధ అరణ్య ప్రాంతాలలో సతతహరితారణ్యాలు, మాంగ్రోవ్ అరణ్యాలు అధికంగా ఉంటాయి.

రాణిపురం అభయారణ్యం

[మార్చు]

కంహంగాడ్ ఫారెస్ట్‌లో " రాణిపురం విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయాలని పనథడి ఆర్.ఎఫ్ ప్రతిపాదించింది. పశ్చిమ కనుమలో భాగంగా ఉన్న ఇక్కడ వివిధ వృక్షజాలం, జంతుజాలం ఉంది. ఇది తలకావేరీ వన్యప్రాణి శాక్చ్యూరీతో విలీనం ఔతుంది.రాణిపురం హిల్ స్టేషను పనథడి రిజర్వ్ ఫారెస్టులో భాగంగా ఉంది. ఇది అభయారణ్య ఏర్పాటుకు అనువైనదిగా భావిస్తున్నారు. ఇక్కడ షోలా ఫారెస్ట్ ఉంది. ఏనుగులు, చిరుతలు, జింకలు, అడవి కుక్కలు, అడవి పందులు, మకాక్యూలు, అడవి పిల్లులు, చిరుత పిల్లులు, స్లెండర్ లోరిస్, పొర్క్పైంస్, మలబార్ అడవి ఉడుతలు, మలబార్ పిల్లులు, పలు జాతుల పిల్లులు, అరుదైన శీతాకోక చిలుకలు, ఔషధ మొక్కలు ఈ అరణ్యంలో కనిపిస్తుంటాయి.

అంతరించిపోతున్న జంతువులు

[మార్చు]

అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చబడిన ఈ జతువులు పంటలను రక్షించుకునే నిమిత్తం ప్రజలచేత చంపబడుతున్నాయి కనుక వీటిని రక్షించడానికి అభయారణ్యం ఏర్పాటు చేస్తున్నారు. రాణిపురం వన్యప్రాణి అభయారణ్యం కర్నాటక లోని తలకావేరి అభయారణ్యంతో విలీనం ఔతుంది. అందువలన ఇది జిల్లాలోని పర్యాటక ప్రాంతంగా మారొంది. రాణిపురం హిల్ స్టేషను కూడా పర్యాటక ఆకర్షణలో ఒకటిగా ఉంది. దీనీని అభయారణ్యంగా ప్రకటించడం వలన పశ్చిమ తీరాన ఉన్న వైవిధ్యమైన పర్యావరణాన్ని సంరక్షించడానికి వీలౌతుంది. ఆక్రమణ, దోపిడీ, రాత్రివేళలో వేట, గనుల త్రవ్వకం, చట్టవిరీధంగా చెట్లను పడగొట్టడం మొదలైనవి నేషనల్‌పార్కుకు అభద్రతాకరంగా పరిణమిస్తున్నాయి. మన్నంకడవు ఆనకట్ట ప్రతిపాదించబడింది. ఇది స్వచ్ఛ జలాల అభివృద్ధి, జలనరుల పర్యావరణ రక్షణ, మొసళ్ళు, ఇతర వన్యమృగ ఆశ్రయం, అంతరించిపోతున్న చేపజాతులు, పక్షుల రక్షణ వంటి వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆనకట్ట రిజర్వాయర్ చుట్టూ అరణ్యాలను అభివృద్ధి చేయడం వలన ఇక్కడ మరొక అభయారణ్యం, ఎలిఫెంట్ కారుడార్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది.

మాలొం అభయారణ్యం

[మార్చు]

మాలొం వన్యప్రాణి అభయారణ్యం (5 చ.కి.మీ వైశాల్యం) కంహన్గాడ్ భూభాగం వర్షారణ్యాలు, అనేక వన్యమృగాలలు ఆలవాలమై పర్యాటక ఆకర్షణగా అలరారుతుంది. అభయారణ్యం అడవిపందులు, స్లెండర్ లోరీలు, రెసిసస్ కోతి, ఎగిరే ఉడుత, పొర్క్యూపైన్ మొదలైన జంతువులు ఉన్నాయి. మలబార్ హార్న్‌బిల్, నెమలి, గ్రే - హార్న్‌బిల్ మొదలైన పక్షులుకూడా ఈ అరణ్యంలో కనిపిస్తుంటాయి. ఎగిరే ఉడుత, గబ్బిలాలు, అడవి పిల్లి, సీతాకోక చిలుకలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆక్రమణలు, రాత్రివేళ వేట, తరచుగా చెట్ల నరికివేత, గ్రామైట్ గనుల త్రవ్వకం అరణ్యాలు క్షీణంచడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పర్యాటకులు రాజనాగం, కొండవిలువ మొదలైన సర్పాలను కూడా చూసే అవకాశం ఉంది. కంహన్గాడ్ లోని బలాల్- కల్లర్ పంచాయితీలో మాలొం పట్టణామికి 5.కి.మీ దూరంలో సతతహరితారణ్యాలు, షోలా, ఆర్చిడ్స్, ఔషధ మొక్కలు, పసరిక భూములు మొదలైనవి ఉన్నాయి. ఏనుగులు, అడవి దున్న, చిరుత, అడవికుక్కలు, మాంగూస్, పంగొలిన్, అడవి పిల్లులు, మలబార్ రాక్షస ఉడుతలు, ఎగిరే ఉడుతలు, నక్క, పొర్కుపైన్, బానెట్ మకాక్యూలు, లాంగూర్, చిరుత పిల్లులు, జింక, అడవి పంది, స్లెండర్ లోరిస్, హేర్స్, ఉడుతలు, గబ్బిలాలు మొదలైన 24 జాతుల ప్రాణులు ఉన్నాయి. అరణ్యంలో కనిపిస్తున్న 200 జాతుల పక్షులలో ప్రధానంగా హార్న్ బిల్, పారడైజ్ ఎగిరే క్యాచర్, ఆకుపచ్చ బార్బెట్, నెమలి, ట్రోగాన్, వడ్రంగిపిట్ట, మలబార్ గ్రే హార్న్ బిల్, వైట్ బెల్లీడ్ ట్రీ పై, హృదయ మచ్చల వడ్రంగి పిట్ట మొదలైన పక్షులు కనిపిస్తూ ఉన్నాయి. వేలాది కీటకాలలో 100 జాతుల సీతాకోకలు ఉన్నాయి. వీటిలో కత్తి తోక, అటవీ అప్సరస, మలబార్ పక్షి జాతులు ఉన్నాయి. కింగ్ కోబ్రా, నాగుబాములు, తాచుపాము, ఎలుక పాములు, భారత నాగు (ఇండ్యన్ కోబ్రాస్), పసరిక పాములు, మానిటర్ బల్లులు మొదలైన సరీసృపాలు ఉన్నాయి.

అడోర్ అభయారణ్యం

[మార్చు]

జిల్లాలో అడోర్ అభయారణ్యం 2 చ.కి.మీ వైశాల్యంలో ఏర్పాటుచేయబడింది. అడవి పిల్లి, స్లెండర్ లోరీలు, అడవి పంది, పొర్క్యుపైన్, తాబేలు, నెమలి, మలబార్ హార్న్ బిల్, సీతాకోకచిలుకలు, ఔషధ మొక్కలు, సతతహరితారణ్యాలు ఉన్నాయి. చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయడం, వేట, ఆక్రమణ ఈ అభయారణ్య క్షీణతకు కారణం ఔతున్నాయి. ఈ అభయారణ్యం అభయారణ్యం కాసర్‌గోడ్ పట్టణానికి 35కి.మీ దూరంలో అడోర్-కుట్టికోల్ పంచాయితీలో ఉంది.

పరప్ప అభయారణ్యం

[మార్చు]

పరప్ప అభయారణ్యానికి చెందిన కంహంగాడ్ అరణ్యశ్రేణిలో అడవి పిల్లులు, సన్నని లోరిస్, అడవి పంది, ముళ్ళపంది, తాబేళ్లు, నెమలి, మలబార్ హార్న్ బిల్, సీతాకోకచిలుకలు, ఔషధ మొక్కలు, తడి హరిత అడవులు ఉన్నాయి. అక్రమ చెట్టు పడటానికి, వేట, ఆక్రమణల ఈ అభయారణ్యం ప్రధానలకు ప్రధాన ప్రమాదికారిగా ఉన్నాయి. కుమ్మడం శాక్రెడ్ గ్రోవ్ వన్యప్రాణి అభయారణ్యంకి (50 ఎకరాక వైశాల్యం)లో భవవతి ఆలయానికి సంబంధించిన కుమ్మడం కెవ్వులో అడవి పిల్లి, మానిటర్ లిజార్డ్, సివెట్లు, నక్క, గబ్బిలాలు, పాములు, చూసిన పక్షులు, వివిధ జాతులు సీతాకోకచిలుకలు ఉన్నాయి. ఇది నీలేశ్వర్ పట్టణానికి 25 కి.మీ దూరంలో ఉంది.

కరీం అభయారణ్యం

[మార్చు]

భారతదేశంలోని మొదటి ప్రైవేట్ శాక్చ్యురీ కరీం అభయారణ్యం (32 ఎకరాల వైశాల్యం) గా గుర్తించబడుతుంది. ఇక్కడ విభిన్న జాతులకు చెందిన చెట్లు, ఔషధీయ మొక్కలు, పక్షులు, విషసర్పాలు, ఉభయచరాలు, చిన్న అడావి జంతువులు, సూక్ష్మప్రాణులు మొదలైన ప్రాణులు ఉన్నాయి. పర్యావరణ పరిశోధకులు, శాస్త్రఙలు, విశ్వవిద్యాలయ, ఆయుర్వేద విద్యార్థులు, సాధారణ ప్రజలు దేశమంతటి నుండి ఇక్కడకు పరిశోధనార్ధం వస్తుంటారు. ఆయన విత్తనాల సేకరణ, వితరణ చేస్తుంటాడు. అడవి చెట్లు, ఔషధ మొక్కల ఉత్పత్తి చేస్తుంటాడు. అతను నిరుపయోగ భూములను దట్టమైన అరణ్యాలుగా మారుస్తూ దేశానికి, ప్రకృతి మాతకు సహకారం అందిస్తున్నాయి. లాభాపేక్ష రహిత మైన ఆయన సేవలు శ్లాఘించతగినవి. ఇది కంహంగాడ్ పట్టణానికి 23 కి.మీ దూరంలో ఉంది. కంహంగాడ్ నుండి ఇక్కడకు వెంటవెంటనే బసులు లభ్యం ఔతుంటాయి.

ప్రత్యేక తులునాడు కొరకు పోరాటం

[మార్చు]

దక్షిణ భారతదేశంలోని తులువ సంప్రదాయం కన్నడిగుల సంప్రదాయం కంటే ప్రత్యేకమైనది. స్వాతంత్ర్యం తరువాత జిల్లాల పుంర్వివిభజన సమయంలో తువభాషను ఆధికారభాషగా చేయమని తులుప్రజలు ఆదోళన చేసారు. ఉడిపి, కర్ణాటక రాష్ట్రం లోని దక్షిణకెనరా, కాసర్‌గోడ్ జిల్లాలను కలిపి ప్రత్యేకరాష్ట్రం కావాలని ఆందోళన చేసారు. తరువాత సంవత్సరాలలో ఈ ప్రతిపాదన బలహీనపడింది. తులు రాజ్య హోరతా సమితి వంటి పలు సంస్థలు తులువ ప్రజాసేవార్ధం ఏర్పాటు చేయబడ్డాయి.[21][22][23][24]

జాతీయ ఉద్యమం

[మార్చు]

కాసర్‌గోడ్ ప్రాంతం జాతీయ ఉద్యమంలో ప్రధానపాత్ర వహించింది. జిల్లాకు చెందిన మొహమ్మద్ షెరుల్ సాహిబ్, కండిగె కృష్ణ భట్ మొదలైన నాయకులు స్వతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వహించారు. జిల్లాలో అదనంగా ఉమేష్ రావు, కె.ఎం.కృష్ణన్ నంబియార్, శ్రీ శంకర్‌జి, నరంతట్ట రామన్ నాయర్, ఎ.సి కన్నన్ నాయర్, టి. గోపాలన్ నాయర్, మెలోథ్ నారాయణన్ నంబియార్ మొదలైన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు.

అగారియన్ సంఘర్షణ ముగింపుకు వచ్చిన తరువాత ప్రజలు పాలకుల పీడన, ఆణిచివేత నుండి వెలుపలికి వచ్చారు. జమీందారులు, రాజులు స్వతంత్రసమరంలో పాల్గొన్నారు. 1932లో గాంధీజి ఖైదు చేయబడిన తరువాత కడకొం సత్యాగ్రహం మొదలైంది. 1941లో పలయి హార్వెస్ట్ ఆందోళన, 1942 చిమెని ఎస్టేట్ స్ట్రగుల్, 1944 కయ్యూర్ అగారియన్, 1946 ఎలరీ ఎస్టేట్ ఆందోళన, 1948 కరింథలం పడ్డీ సైజ్యూర్ రివోల్ట్, పలు ఇతర సంఘర్షణలు రైతుల మద్య స్వాతంత్ర్య సమరంలో భాగంగా తలెత్తాయి. రైతుల పోరాటలతో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, గిరిజన ప్రజల సాయంతో పలు స్వతంత్ర పోరాటాలు తలెత్తాయి.

ఇవి కూడ చూడండి

[మార్చు]

మలబార్ జిల్లా

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Kanhirakode అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "Kasargod - the land of seven languages". invest kerala. Government of Kerala. Retrieved 12 September 2020.[permanent dead link]
  3. Annual Vital Statistics Report - 2018 (PDF). Thiruvananthapuram: Department of Economics and Statistics, Government of Kerala. 2020. p. 55. Archived from the original (PDF) on 2021-11-02. Retrieved 2023-06-02.
  4. "Language – Kerala, Districts and Sub-districts". Census of India 2011. Office of the Registrar General.
  5. "Religion – Kerala, Districts and Sub-districts". Census of India 2011. Office of the Registrar General.
  6. "Sex Ratio" (PDF). censusindia.gov.in.
  7. "Literacy" (PDF). censusindia.gov.in.
  8. "Kerala | UNDP in India". UNDP.
  9. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  10. "Kasargod - After District Formation". Kasargod District. Archived from the original on 2009-04-10. Retrieved 2009-03-11.
  11. There are 38 Grama Panchayats in Kasargod District Archived 2014-10-06 at the Wayback Machine (kasargod.nic.in).
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 12.6 12.7 "Kasaragod History". Government of Kerala. Archived from the original on 2006-07-01. Retrieved 2009-03-11.
  13. Falling Rain Genomics, Inc - Kasaragod
  14. Decadal Variation In Population Since 1901
  15. 15.0 15.1 15.2 15.3 15.4 15.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  16. 16.0 16.1 "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  17. 17.0 17.1 Kumar Suresh Singh (1998). India's communities. Vol. 6. Anthropological Survey of India. p. 1549.
  18. "Kasaragod". Archived from the original on 2014-10-06. Retrieved 2014-06-30.
  19. A Sreedhara Menon (1 January 2007). A Survey Of Kerala History. DC Books. pp. 14–15. ISBN 978-81-264-1578-6.
  20. "Introduction to Kasaragod district". Archived from the original on 2014-06-26. Retrieved 2014-06-30.
  21. [1]
  22. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-04. Retrieved 2014-06-30.
  23. "Tulu organisations to meet soon". The Hindu. Chennai, India. 2008-03-06. Archived from the original on 2012-03-04. Retrieved 2014-06-30.
  24. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-11. Retrieved 2014-06-30.

వెలుపలి లింకులు

[మార్చు]