ఖమ్మం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖమ్మం రెవెన్యూ డివిజను
నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణ దృశ్యం
నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణ దృశ్యం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఖమ్మం

ఖమ్మం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ఖమ్మం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 15 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఖమ్మం పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవిన్యూ డివిజను ఖమ్మం లోకసభ నియోజకవర్గం, ఖమ్మం శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలన[మార్చు]

ఖమ్మం డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం ఖమ్మం రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 ఖమ్మం మండలం (అర్బన్) 9 రెవెన్యూ గ్రామాలు
2 ఖమ్మం మండలం (రూరల్) 19 రెవెన్యూ గ్రామాలు
3 తిరుమలాయపాలెం మండలం 25 రెవెన్యూ గ్రామాలు
4 కూసుమంచి మండలం 18 రెవెన్యూ గ్రామాలు
5 నేలకొండపల్లి మండలం 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
6 బోనకల్ మండలం 18 రెవెన్యూ గ్రామాలు
7 చింతకాని మండలం 16 రెవెన్యూ గ్రామాలు
8 ముదిగొండ మండలం 23 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
9 కొణిజర్ల మండలం 17 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
10 సింగరేణి మండలం 11 రెవెన్యూ గ్రామాలు
11 కామేపల్లి మండలం 13 రెవెన్యూ గ్రామాలు
12 మధిర మండలం 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
13 ఎర్రుపాలెం మండలం 24 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
14 వైరా మండలం 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
15 రఘునాథపాలెం మండలం 12 రెవెన్యూ గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-21.
  3. "Khammam Revenue Division". www.khammam.telangana.gov.in. Archived from the original on 2021-05-21. Retrieved 2022-06-21.
  4. "List of Revenue Divisions, Mandals in Khammam District". www.teachersbadi.in. Archived from the original on 2021-05-15. Retrieved 2022-06-21.
  5. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-06-21.