ఖాదర్ పాషా దర్గా
ఖాదర్ పాషా దర్గా మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పట్టణానికి కిలో మీటర్ దూరంలో, సోమశిల వైపు వెళ్ళె దారిలో నల్లమల కొండల శ్రేణిలో కొలువై ఉంది. ఈ ప్రాంతంలో ఇది అతి పెద్ద దర్గాగా విరాజిల్లుతుంది.
చారిత్రక నేపథ్యం
[మార్చు]వందల సంవత్సరాలకు పూర్వం ఖాదర్ పాషా అను సూఫీ మత గురువు ఈ ప్రాంతానికి వచ్చి, నల్లమల అటవీ ప్రాంతం సమీపంలోని ఎత్తైన కొండలపై నివాసాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలుస్తుంది.[1] తర్వాత కొంత కాలానికి ఆయన ఇక్కడే సమాధి అయ్యారు. కొల్లాపూర్ సంస్థానాధిపతులు ఖాదర్ పాషా సమాధిని గుర్తించి, అక్కడే ఒక దర్గాను నిర్మింపజేశారు. వీరు ఈ దర్గాలో ఫాతిహా ఖ్వానీ (చదివింపులు), దర్గా నిర్వహణ, బాగోగులు, ఉర్సులు ఉత్సవాలు నిర్వహించడం, దర్గాలలో మస్జిద్ లు మదరసాలు నిర్వహించడం కొరకు ముజావర్ లకు 19 ఎకరాల భూమిని దర్గా పేరిట ఇనాంగా ఇచ్చారు.
ఉర్సు ఉత్సవాలు
[మార్చు]ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. కొల్లాపూర్ పట్టణంలోని జామా మస్జిద్ నుండి గంధోత్సవపు ఉరేగింపు మొదలై దర్గా వరకు సాగుతుంది. ఉత్సవాల నిర్వాహకులు ముస్లిమ్‌లు అయినప్పటికీ ఉరేగింపులో మాత్రం అధిక సంఖ్యలో హిందూ భక్తులు పాల్గొంటారు. కులమతాలకతీతంగా ప్రజలు దర్గాలోని ఖాదర్ పాషాను కొలుస్తుంటారు. ప్రతి సోమ, గురు, శుక్ర వారాలలో అధిక సంఖ్యలో భక్తులు దర్గాను సందర్శిస్తుంటారు. హిందూ భక్తులు ప్రత్యేకంగా మొక్కుబడులు కట్టి ప్రత్యేక సందర్భాలలో దర్గా దగ్గర నియాజ్ (కందూరులు) చేస్తుంటారు.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 74