Jump to content

గాంధీనగర్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 23°13′00″N 72°41′00″E / 23.2167°N 72.6833°E / 23.2167; 72.6833
వికీపీడియా నుండి
మధ్య గుజరాత్ జిల్లాలు
అదాలజ్ స్టెప్‌వెల్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గాంధీనగర్ జిల్లా ఒకటి. గాంధీనగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 649 చ.కి.మీ. 1964లో గాంధీనగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,334,455. .[1]

  • జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి:- చంద్ఖేడా, మొటెర, ఆదలా.
  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి:- గాంధీనగర్, కాలోల్ ఐ.ఎన్.ఎ., దహెగం, మనస (గుజరాత్)
  • జిల్లాలో 216 గ్రామాలు ఉన్నాయి.

సరిహద్దులు

[మార్చు]

జిల్లా ఈశాన్య సరిహద్దులో సబర్‌ కాంతా జిల్లా, ఆరవల్లి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఖేడా జిల్లా, నైరుతీ సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా, వాయవ్య సరిహద్దులో మహెసనా జిల్లా ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

జిల్లా సర్ఖెజ్ - గాంధీనగర్ రథారిమార్గం, అహమ్మదాబాదు- వదోదరా రహదారులతో అనుసంధానమై ఉంది. ఇవి గుజరాత్ మధ్యభాగంలో వాణిజ్యకూడళ్ళుగా ఉన్నాయి.

నైసర్గికం

[మార్చు]

గాంధీనగర్ నగరం పంజాబు రాష్ట్ర చండీగఢ్ నగరంలా చక్కాగా ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. ఇది ఒకచదరపు మీ వైశాల్యం ఉన్న 30 విభాగాలుగా ఉంది. ఒక్కో విభాగంలో ఒక్కోక ప్రాథమిక పాఠశాల, ఒక మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఒక మెడుకల్ డిస్పెంసరీ, ఒక నిర్వహణా కార్యాలయం ఉంటుంది. .

ఆర్ధికం

[మార్చు]

గాంధీనగర్ సమీపంలో ఐ.టి సంస్థలు ఉన్నాయి. జిల్లాలో టాటా కంసల్టెంసీ, సైబేజ్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇంఫోసిటీలో పలు కపనీలు కార్యాలయాలు ఆరభిస్తున్నాయి. జిల్లాలో క్రీడాకారులు కూడా అధికంగా ఉన్నారు.[2] జిల్లాలో ప్రధాన ఆలయ సమూహం అయిన అక్షరధాం ఉంది.

విధ్య

[మార్చు]

గాంధీనగర్‌లో పలు విద్యాసంస్థలు ఉన్నాయి. దీరూభాయ్ అంబానీ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఐ.సి.టి, ఎంటర్‌ప్రీనర్‌షిప్ డెవెలెప్మెంట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ప్లాస్మా రీసెర్చ్ ఇంస్టిట్యూట్, గుజరాత్ లా యూనివర్శిటీ ఉన్నాయి. గాంధీనగర్ విద్యావిధానం గుజరాత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. అక్షరాస్యత 87.11%. గాంధీ నగర్ గుజరాత్ హృదయంగా ప్రస్తుతించబడుతుంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,387,478, [3]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 660 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.15%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 920:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 85.78% in 2011.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001లో జిల్లా అక్షరాస్యత 76.5% ఉంది. 2011 నాటికి అక్షరాస్యత దాదాపు 10% అభివృద్ధి చెందింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-25. Retrieved 2014-11-13.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

23°13′00″N 72°41′00″E / 23.2167°N 72.6833°E / 23.2167; 72.6833

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]