గుడిమెట్ల (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడిమెట్ల
—  రెవిన్యూ గ్రామం  —
గుడిమెట్ల is located in ఆంధ్ర ప్రదేశ్
గుడిమెట్ల
గుడిమెట్ల
అక్షాంశరేఖాంశాలు: 15°27′50″N 78°57′47″E / 15.463773°N 78.963032°E / 15.463773; 78.963032
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం రాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ మధిరె చంద్రశేఖరరెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 4,057
 - పురుషుల సంఖ్య 2,054
 - స్త్రీల సంఖ్య 2,003
 - గృహాల సంఖ్య 1,036
పిన్ కోడ్ 523 356
ఎస్.టి.డి కోడ్ 08405

గుడిమెట్ల, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్: 523 356., ఎస్.టి.డి. కోడ్ = 08405.

గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,315.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,237, మహిళల సంఖ్య 2,078, గ్రామంలో నివాస గృహాలు 987 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,194 హెక్టారులు

సమీప గ్రామాలు[మార్చు]

తాటిచెర్ల 6 కి.మీ, మోక్షగుండం 7 కి.మీ, సోమిదేవిపల్లి 8 కి.మీ, రాచర్ల 8 కి.మీ, దద్దవాడ 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పడమరన గిద్దలూరు మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, దక్షణాన కొమరోలు మండలం, ఉత్తరాన కంభం మండలం.


గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గుడిమెట్ల శంకరుని పెద్ద చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మధిరె చంద్రశేఖరరెడ్డి, 114 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ సీతా రామచంద్రస్వామివారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం దీక్షాహోమం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 31వతేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో, ధ్వజస్తంభ, గోపుర, శిఖరప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. [3]
  2. శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,జూన్-16వ తేదీ మంగళవారం నాడు, అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఉదయన్నే బోనాలు సిద్ధం చేసుకొని ఆలయానికి ప్రదర్శనగా తరలివెళ్ళి, అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [4]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-2; 12వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-1; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-17; 4వపేజీ.