Jump to content

చర్చ:తెలంగాణ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
తెలంగాణ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


తెలంగాణ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 23 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


తెలంగాణ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 23 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషంఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసం సంరక్షణ

[మార్చు]

వ్యాసాన్ని పదే పదే అనామకులు అసంగతమైన దిద్దుబాట్లు చేస్తుండటం వల్ల కేవలం సభ్యులే మార్పులు చేసేలా సంరక్షిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 12:15, 22 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం పక్కదోవలు పడుతున్నది. వ్యాసానికి సంబంధించిన ప్రత్యక్ష సమాచారం కంటె వాదనలపైనే కొందరు సభ్యులు దృష్టిసారిస్తున్నారు. అసలే రావణకాష్టంగా రగులుతున్న సమస్యను తెవికీలోనూ రగిలించాలనుకోవడం భావ్యం కాదు. తెలంగాణ గురించి వ్రాయాలంటే తెలంగాణ భౌగోళికం, చరిత్ర, ప్రత్యేక తెలంగాణ కారణాలు, ఇంతవరకు జరిగిన ఉద్యమాలు, తెలంగాణ యొక్క విశిష్టత తదితరాలు వ్రాయడానికి బోలెడంత అవకాశం ఉంది. ఇవన్నీ వదిలి కేవలం వాదనపైనే దృష్టి పెట్టడం సమంజసం కాదు. వాదనలు ఉండరాదని కాదు కాని అసలు వ్యాస సమాచారం కంటే వాదనలే ఎక్కువయ్యాయి. పత్రికలలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తూ చేసిన వ్యాఖ్యలను సరాసరిగా తెవికీలో ఎక్కించడం ఏ మాత్రం సమంజసం కాదు. కాబట్టి అభ్యంతరంగా ఉన్న వాక్యాలను తొలిగిస్తూ పాయింట్ల రూపంలో కొన్ని వాదనలు మాత్రమే ఉంచాను. -- C.Chandra Kanth Rao-చర్చ 19:30, 23 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చంద్రకాంత రావు గారూ, ఈ పని చేయడానికి అనుభవం లేక ఊరకున్నాను. --రవిచంద్ర (చర్చ) 16:23, 24 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి సామాన్యుల వాదనలు అనే పార తొలగించమని కోరుతున్నాను. ఎందుకంటె అవి పూర్తిగా సీమంధ్ర కు అనుకూలంగా ఉన్నవి.తెలంగాణ లోని సామాన్యుల ప్రత్యెక రాష్టం కోసం పోరాడుతున్నారు కనుక వ్యాసం నుంచి "సామాన్యుల వాదనలు" అనే పర తొలగించటం మంచిది.

మా తెలుగుతల్లికి మల్లెపూదండ లాగానే తెలంగాణా తల్లికి జయజయహే పాట పాడుకుంటున్నారు:

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||
పోతన దీ పురిటిగడ్డ రుద్రమ దీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీము డేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||
జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరా లు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
సురాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||
‘పంపన’కు జన్మనిచ్చి ‘బద్దెన’కు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
‘హాలుని’ గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన || జై…||
ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కి సోమన్న’
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’ || జై…||
కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధు వతడు
‘దిగ్నాగుని’ కన్న నేల ధిక్కారమే జన్మహక్కు || జై…||
రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచెర్ల
‘సర్వజ్ఞ సింగభూపాలుని’ బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
‘పిలలమఱ్ఱి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు || జై…||
సమ్మక్క’లు ‘సారక్క’లు ‘సర్వాయిపాపన్న’లు
సబ్బండావర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథ
దండునడిపే పాలమూరు ‘పండుగోల్ల సాయన్న’ || జై…||
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పు డమరుకము డక్కి శారదస్వరనాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగా
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం || జై…||
బడులగుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక
ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మా వెలగాలి || జై…||
గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥ -- అందెశ్రీ

రాష్టం అవతరించిన పిదప ఈ వ్యాసము అందుబాటులో ఉంటే బావుంటుంది. ఇదంతా (పటము, జిల్లాలు, ఇతరత్రా) ఊహలు మాత్రమే. రాజ్యంగ పరంగా లబించినదే మనకు ఆధారము. అంతవరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యాసాలు మనకు తోచినట్లు వ్రాసుకుంటే, ప్రపంచములోని తెలుగు మరియు భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరిని మనము తప్పుదారి పట్టించినట్లు అయి విద్యార్థులు, ఉద్యోగస్థులు, అందరూ తప్పుడు సమాచారముతో చాలా నష్టపోతారు. JVRKPRASAD (చర్చ) 03:13, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రాష్టం అవతరించిన పిదప ఈ వ్యాసము అందుబాటులో ఉంటే బావుంటుంది. ఇదంతా (పటము, జిల్లాలు, ఇతరత్రా) ఊహలు మాత్రమే. రాజ్యంగ పరంగా లబించినదే మనకు ఆధారము. అంతవరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యాసాలు మనకు తోచినట్లు వ్రాసుకుంటే, ప్రపంచములోని తెలుగు మరియు భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరిని మనము తప్పుదారి పట్టించినట్లు అయి విద్యార్థులు, ఉద్యోగస్థులు, అందరూ తప్పుడు సమాచారముతో చాలా నష్టపోతారు. JVRKPRASAD (చర్చ) 03:13, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వీక్షణలలో రికార్డు సృష్టిస్తున్న తెలంగాణ వ్యాసం

[మార్చు]
తేది 18-02-2014 నుంచి తెలుగు వికీపీడియాలో "తెలంగాణ" వ్యాసం అత్యధిక వీక్షణలతో రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు వికీపీడియాలోనే అత్యంత నాణ్యతతో, తగిన మూలాలతో, అవసరమైన చిత్రాలతో, తాజాకరణతో కూడి, నా స్వంత విజ్ఞాన సర్వస్వము మరియు అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందిన తెలంగాణ వ్యాసం వారంలో అత్యధిక వీక్షణలు జరిగిన వ్యాసంగానూ రికార్డు సృష్టించింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:17, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా, తెలుగు వికీపీడియాను కోర్టులకి ఈడిస్తే, మీరు బాగానే ఉంటారు. నిర్వాహాకులు, అధికారులు బోనులో నిలబడి వారు అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వాలి. మీరు మీడియాకి, పోలీసులకి, కోర్టులకి, చట్టాలకి, ప్రభుత్వాలకి, ఇతరత్రా వారి అందరికీ తమరే హాజరు అయ్యి అన్నింటికీ నాదే (తమరిదే) భాధ్యత, వికీపీడియాకి ఎటువంటి సంబంధములేదని ఇప్పుడే ఒక హామీ పత్రము విడుదల చేయండి. నిర్వాహాకులు, అధికారులు అందరికి మెయిల్ వెంటనే పంపండి. JVRKPRASAD (చర్చ) 01:28, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలంగాణా ప్రాంతానికి వ్యాసం ఉండటంలో తప్పేముంది. రాయలసీమకు, కోసాంధ్రకు వ్యాసాలున్నాయి కదా. --వైజాసత్య (చర్చ) 03:10, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలోనే అత్యుత్తమ వ్యాసంగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ వ్యాసాన్ని మరియు తెలంగాణకు చెందిన వ్యాసాల అభివృద్ధిని చూసి సహించని కొందరు చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలే తప్ప ఇది మరేమి కాదు. తెలంగాణ వ్యాసాలనేవి రాజ్యాంగబద్దం కావని, అలాంటివి తెవికీలో చేర్చడం తగవని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తెవికీలో ఏదేని వ్యాసం చేర్చుటకు, ఎలాంటి వ్యాసమైనా వ్రాయుటకు ఎవరికైనా హక్కుంది, దానికి తగిన ఆధారాలు మరియు మూలాలే ముఖ్యమనే విషయం గమనిస్తే చాలు. ఒక ప్రాంతానికి చెందిన వ్యాసం వ్రాయడం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా అవుతుంది? తెలంగాణ అనేది ఊహా వ్యాసమని ముద్రవేయడం దారుణమైన విషయం. అయిననూ తెవికీకి కావలసింది ఊహనా, వాస్తవమా అనేది ముఖ్యం కాదు, అలా అయితే అక్షాంశం, రేఖాంశం వ్యాసాల సంగంతేంటీ? (ఇవి ఊహా రేఖలే మరి!) స్వర్గం, నరకం లాంటి వ్యాసాలు ఎందుకున్నాయి! అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకఉండకపోయిననూ తెలంగాణ వ్యాసం గురించి అభ్యంతరపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇది ఒక ప్రాంతంగా అందరికీ సుపరిచితమే కాకుండా బలమైన మూలాలున్నాయి. తెవికీ వ్యాసానికి కాలవసింది బలమైన మూలాలే, అవి లేనప్పుడు మాత్రమే వ్యాసాన్ని ఊహాజనిత వ్యాసంగా పరిగణించి తొలగింపునకు ప్రతిపాదించవచ్చు. రాష్ట్రం అవతరణ తర్వాతే తెలంగాణ వ్యాసం అనడం విడ్డూరంగా ఉంది. చరిత్రలో కృష్ణా, తుంగభద్రల మధ్య ఉన్న ప్రాంతం రాయచూరు డోబ్‌గా ప్రసిద్ధి చెందింది, ఇది ఒక ప్రాంతమే తప్ప దీనికి అధికారికంగా ఎలాంటి గుర్తింపులు లేవు. ఇలాంటి వ్యాసాలు బోలెడన్నీ ఉన్నాయి. ఒక ప్రాంతానికి, ఒక వీధికి, చివరికి ఒక గుట్టపై కూడా వ్యాసం చేర్చవచ్చనే విషయాన్ని సభ్యులు విస్మరిస్తున్నారు. కేవలం వర్గం:నమ్మకాలు పైనే మనకొక వర్గం ఉంది. దేవతలకు సంబంధించిన రూపాలు ఆ విధంగా ఉన్నాయని ఎవరు చూశారు? (అయిననూ దేవతల బొమ్మలు తెవికీలో లేవా?) ఇలా చెప్పాలంటే ఇదో పెద్ద జాబితా అవుతుంది. చెట్టు, పుట్ట, గుట్టలపైనే అభ్యంతరం లేనప్పుడు మూడున్నర కోట్ల ప్రజలు నివశిస్తున్న ఒక ప్రాంతానికి చెందిన వ్యాసంపై అభ్యంతరమా? దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే వైజాసత్య గారు ప్రారంభించి, చదువరి గారు కొంత అభివృద్ధి పర్చిన ఈ వ్యాసాన్ని తగిన ఆధారాలతో నేను మరింత అభివృద్ధిపరుస్తున్నాను. ఈ వ్యాసాన్ని నేను అభివృద్ధిపర్చడానికి ముందు తెలంగాణ ఉద్యమాలతో, వాదనలతో ఉన్న సమాచారంతో కూడుకొని ఉండి, తరుచుగా దుశ్చర్యలకు గురికావడంతో చివరికి వ్యాసంపై సంరక్షణ కూడా విధించబడింది. అలాంటి వాదనలతో కూడిన వ్యాసాన్ని తరలించి సంరక్షణ తొలగించి కేవలం వివాదాలకు తావులేని విషయ సమాచారమే చేరుస్తున్నాను. వ్యతిరేకంగా ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు లేకున్ననూ కొందరికి నచ్చనంత మాత్రానా ఉండదగిన ఇలాంటి వ్యాసాలు కూడా తెవికీలో ఉండరాదని అనడంలో ఎలాంటి సమంజసమైన కారణం కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టినట్టు అదే పని నా బ్లాగుల్లో చేయలేదని అనడం కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని నేను తెవికీలో ఎప్పుడు విడగొట్టానో తెలుసుకుంటే మంచిది. కావాలంటే వ్యాస చరితం చూడండి. ఇటీవలి కాలంలో నాది ఒక్క దిద్దుబాటు కూడా ఆ వ్యాసంలో లేదు. తెలంగాణ వ్యాసాన్ని అభివృద్ధి పరుస్తున్నానే తప్ప ఇతర వ్యాసాల జోలికి నేను వెళ్ళడం లేదు, అలాంటి వ్యాసాలను నేనేమి కుంచించడం లేదు. తెలంగాణ వ్యాసాన్ని రాష్ట్రంగా కాకుండా ఒక ప్రాంతంగానే అభివృద్ధి పరిచాను. ఇది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం శుభపరిణామమే, ఒకవేళ అలా కాకుండకపోయిఉండిననూ వ్యాసం వ్యాసమే అవుతుంది కాని రాజ్యాంగహోదాతో ఇలాంటి వ్యాసాలకు సంబంధమే లేదు (రాజ్యాంగపరంగా తెలంగాణ వ్యాసాలపై నిషేధం ఉంటేతప్ప). రాజ్యాంగ వ్యతిరేకులు, దేశద్రోహులు, తీవ్రవాదుల వ్యాసాలు కూడా తెవికీలో ఉన్న సంగతిని గుర్తించుకోవాలి. ఎప్పటినుంచో తెలంగాణ భౌగోళిక పటానికి ఎంతో స్పష్టత ఉంది. ఇలాంటి వాటికి అభ్యంతరపరిచే అవకాశం ఎవరికీ లేదు. దీనికీ రాజ్యాంగ గుర్తింపు అవసరం లేదు. ఒక ప్రాంతంగా గుర్తించడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేవా అనేదే ముఖ్యం. ప్రతి అంశానికి, ప్రతి పటానికి రాజ్యాంగ గుర్తింపు ఉండదు, మనకు గ్రంథాలే ముఖ్యం. అసలు తెవికీలో భారతదేశ భౌగోళిక పటమే భారత ప్రభుత్వం విడుదల చేసే అధికారిక పటానికి భిన్నంగా ఉంది! అలాంటివన్నా సరిచేసి దేశభక్తి చాటుకోవడం మంచిది. తెలంగాణ ఏర్పాటువల్ల ఏర్పడిన కోపాన్ని తెవికీలో తెలంగాణ వ్యాసం అభివృద్ధిపరుస్తున్న సభ్యులపై చూపడం అన్యాయమైన విషయం. ఉభయ సభలు తెలంగాణ బిల్లును ఆమోదించేంతవరకు నేను తెలంగాణను రాష్ట్రంగా ఎక్కడా పేర్కొనలేను. రాజ్యసభ ఆమోదం అనంతరం మరునాడు అన్ని వార్తాపత్రికలలో "29వ రాష్ట్రంగా తెలంగాణ" శీర్షికతో మొదటి పేజీలలో తాటికాయంత అక్షరాలతో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. విద్యార్థులను, ఉద్యోగులను తప్పుదారి పట్టించే అంశాలేమీ తెలంగాణ వ్యాసంలో లేవు కాని అనేక వ్యాసాలలో తాజాకరణ చేయకుండా ఉంచిన పాత సమాచారమే విద్యార్థులకు తప్పుదారి పట్టిస్తుంది! సి. చంద్ర కాంత రావు- చర్చ

కాల రేఖ

[మార్చు]

కాలరేఖలో తెలంగాణా ప్రాంతపు చరిత్రలో ముఖ్యఘట్టాలు, మలుపుతిప్పిన సంఘటనలు ఉండాలి. పి.వి.నరసింహారావు మరణించటం లేదా యశోదారెడ్డి మరణించటం తెలంగాణా చరిత్రను మలుపుతిప్పిన/ తిప్పగలిగిన ఘటనలు కావు. అదే పద్ధతిలో కాలరేఖ విభాగాన్ని సవరిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 10:08, 1 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వచ్చమైన తెలుగు !

[మార్చు]

స్వచ్చమైన తెలుగు . Scientifically there is no such thing as pure language (not only Telugu) in the world. wiki is not a place for our myths to be written as facts. Please remove this line. Chavakiran (చర్చ) 20:15, 3 ఆగష్టు 2014 (UTC)

తెలుగు తల్లి vs తెలంగాణా తల్లి

[మార్చు]

నాకు ఇప్పటి కీ సందేహమే... తెలంగాణము అంటే "తెలుంగుల ఆణియము" అని నిర్వచనమని ఈసరికే చాలా మందికి తెలుసునని నా అభిప్రాయము... ( ఆణియము అనగా ప్రదేశము, లేక స్థలము అని అర్థము... తెలుగు నిఘంటువు లొ ఈ పదమునకు అర్ధము వున్నది.. పలు సందర్భాలలో ఈ చర్చ కూడా జరిగియున్నది...)

తెలుంగుల ప్రాంతము, తెలంగాణము కాగా, తెలుంగుల తల్లి , తెలుగు తల్లి కాకుండా, తెలంగాణ తల్లి ఎలా అయ్యింది? నా అభిప్రాయము ప్రకారము, చాలా మందికి తెలంగాణ అర్ధము తెలియక పోవడమే అనుకుంటున్నాను. నాకు కూడా, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో, సాక్షి పత్రికలో A.B.K ప్రసాద్ గారు రచించిన ఒక వ్యాసం లో చూడగా తెలిసింది. ఆయన మాటల్లో నే " భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రాలలో, తమిళులకు తమిళనాడు అని, కన్నడిగులకు కర్నాటక అని పెట్టగా, మనకు కూడా, తెలుగు నాడు అనో, మొత్తంగా తెలంగాణ అనో పెడితే బాగుండేది కదా.. అప్పుడు ఏ గొడవా వుండేది కాదు" అని అన్న సందర్భంలో ఈ నిర్వచనం చెప్పారు.. ఆ తరువాత నిఘంటువు వెతికా..

తెలంగాణా కు తల్లి తెలుగు తల్లి యే ... తెలంగాణా కు భాష తెలుగు భాష నే ... ఈరోజు ఈనాడు లో ఒక వార్త చూసా... చాలా బాధగా అనిపించింది.. ప్రక్కన చూడుము.

దస్త్రం:తెలంగాణ భాష.jpg
తెలుగు భాష vs తెలంగాణ భాష

"తెలంగాణ భాష" కాదు... ఇది తెలుగు లో ఒక యాస మాత్రామే ... ఒక రాష్ట్రంగా విడిపోయినంత మాత్రాన "తెలుగు భాష" "తెలంగాణ భాష" ఎలా అవుతుంది??? ఎన్నో తరాల నాటి మన భాషని, ఇలా వక్రీకరించడం ఏమైనా బాగుందా?? ఒక్కసారి, కాకతీయుల నాటి సుమతీ శతకం, వారి రచనలు చూడండి... మధ్యలో ఏదో నిజాం పరిపాలనలో ఉర్దూ యాస కలిసినంత మాత్రాన మన చరిత్రను మనమే చెరిపేసుకుంటామా ?? అడుగు ముందుకు వేయాల్సింది పోయి, ఇంకా వెనక్కు లాగేసుకుంటామా...

వికిపీడియా అందరికీ ఒక మార్గనిర్దేసిని కాబట్టి, దయచేసి అందరికీ ఒక అవగాహన కలిగించాల్సింది గా కోరుచున్నాను. దయచేసి ఆలోచించండి... --పై వ్యాఖ్య చేర్చిన వారు వాడుకరి :రాజశేఖర, 2014-12-08T06:29:20

వ్యాసానికి అభివృద్ధి పనులు

[మార్చు]
చర్చకు స్పందనలు లేకుండా కాలదోషం పట్టినందున {{సహాయం కావాలి-విఫలం}} తొలగించాను.--అర్జున (చర్చ) 23:51, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పాత జిల్లాల సమాచారం ఉంచుదాం

[మార్చు]

పాత జిల్లాల సమాచారం తీసెయ్యవద్దు. "జిల్లాల చరిత్ర" అనో, "పాత జిల్లాల సమాచారం" అనో "పాత జిల్లాల గణాంకాలు" అనో చిన్న విభాగం చేసి ఆ సమాచారాన్ని అక్కడ చేర్చితే బాగుంటుంది. అర్జున గారూ, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 01:53, 15 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరిగారు, మీ సూచనకు ధన్యవాదాలు. జిల్లాల వ్యాసంలో వుంటుంది అనుకున్నాను. కానీ లేదు.తెలంగాణ జిల్లాలు (అవిభక్త ఆంధ్రప్రదేశ్) లో చేర్చాను.-- అర్జున (చర్చ) 02:04, 15 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తాజాపరచాలి

[మార్చు]

తెలంగాణ ఉద్యమం కాలంలో ఎక్కువ విస్తరించిన వ్యాసం కావున ఈ వ్యాసం తాజాపరచాల్సిన అవసరం వుంది. ఆంగ్ల వికీవ్యాసం నుండి అనువదించి విలీనం చేయటం ఉపయోగంగా వుంటుంది. అర్జున (చర్చ) 00:04, 16 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస పరిమాణం పెంచడంలో ఎక్కువగా కృషి చేసిన @C.Chandra Kanth Rao:, @తెలంగాణ రాఖీ:, @Nrahamthulla:, @కార్తీక రాజు:, @K.Venkataramana:, @Chaduvari:,@యర్రా రామారావు: గారలు, సహాయం చేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 23:59, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ప్రస్తుతం నేను వేరే పనులతో తలమునకలుగా ఉన్నందున ఈ పని చెయ్యలేను. ఇందులో పనిచేసిన పాతవాళ్లే తాజాకరించే పని చెయ్యాలనేమీ లేదు. పైగా ఆంగ్ల వ్యాసం నుండి అనువదించడమే నని అంటున్నారు. కాబట్టి ఎవరైనా చెయ్యవచ్చు -మీరే పూనుకుని చేసెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 05:18, 23 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]