చూసొద్దాం రండి
చూసొద్దాం రండి | |
---|---|
దర్శకత్వం | రాజా వన్నెంరెడ్డి |
నిర్మాత | సుంకర మధుమురళి |
తారాగణం | జగపతి బాబు, శ్రీకాంత్, రంభ |
ఛాయాగ్రహణం | కె. ప్రసాద్ |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | మెలోడీ మల్టీమీడియా |
విడుదల తేదీ | ఆగస్టు 18, 2000 |
సినిమా నిడివి | 152 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చూసొద్దాం రండి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో 2000లో విడుదలైన చిత్రం. ఇందులో జగపతి బాబు, శ్రీకాంత్, రంభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి మెలోడీ మల్టీమీడియా పతాకంపై నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. ఎల్. ఆర్. ఈశ్వరి ఈ సినిమాలో చివరి సారిగా పాడింది.
కథ
[మార్చు]భీమవరపు బుచ్చిబాబు అలియాస్ బాబు, అంజి ఇళ్ళ బ్రోకర్లు. ఒకసారి గీత అనే అందమైన అమ్మాయి వీళ్ళ దగ్గరికి వస్తే బాబు తెలివిగా తాము ఉంటున్న అద్దె ఇంటిలోకే ఒక భాగం ఆమెకు అద్దెకిస్తారు. ఆ ఇల్లు టైగర్ ధర్మకు సంబంధించినది. గీత అక్కడికి రావడానికి కారణం తాను ప్రేమించిన అరవింద్ ను వెతకడం. అతన్ని కనుగొన్న తర్వాత అరవింద్ తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కొంచెం సమయం అడుగుతాడు.
తారాగణం
[మార్చు]- అరవింద్ గా జగపతి బాబు
- భీమవరపు బుచ్చిబాబు అలియాస్ బాబుగా శ్రీకాంత్
- గీతగా రంభ
- కోటయ్యగా కోట శ్రీనివాసరావు
- సింహాచలంగా బ్రహ్మానందం
- అంజిగా సుధాకర్
- తిరుపతిగా ఆలీ
- ఎం. ఎస్. నారాయణ
- తనికెళ్ళ భరణి
- సుబ్బుగా ఎ. వి. ఎస్
- అరవింద్ తండ్రిగా గిరిబాబు
- టైగర్ ధర్మగా పొన్నంబళం
- లాయర్ గా బెనర్జీ
- కె.కె.శర్మ
- హోటల్ సర్వరుగా గౌతంరాజు
- జెన్నీ
- సాధిక
- అరవింద్ తల్లిగా అన్నపూర్ణ
- బాబు బామ్మగా రమాప్రభ
- పార్వతిగా శివ పార్వతి
- అనిత చౌదరి
- రజిత
- బెంగళూరు పద్మ
- అమరావతిగా కృష్ణవేణి
- శాంతిగా కల్పన
- కల్పన రాయ్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సంగీతం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.
- చిన్ననాటి రెండు జళ్ళ ఆ పెళ్ళి కూతురు