Jump to content

నాగం జనార్ధన్ రెడ్డి

వికీపీడియా నుండి
(నాగం జనార్ధనరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
నాగం జనార్థన్ రెడ్డి
నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్థన్ రెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి
నియోజకవర్గం నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1948-05-22) 1948 మే 22 (వయసు 76)
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం నాగపూర్ గ్రామం
రాజకీయ పార్టీ బీఆర్ఎస్‌
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
బీజేపీ
టీడీపీ
జీవిత భాగస్వామి ఎన్.సుగుణ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమారై.
అక్టోబరు 14, 2009నాటికి

పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నాగం జనార్ధన్ రెడ్డి మే 22, 1948న జన్మించాడు. ఆయన స్వస్థలం నాగర్ కర్నూల్ మండలంలోని నాగపూర్ గ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది. మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందినాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు నిర్వహించాడు. తెలంగాన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా సమర్పించి తెలంగాణ నగరాను స్థాపించారు. 2012 ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా బరిలోకి దిగి మరో సారి విజయం సాధించారు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. ఆయన తండ్రి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించేవాడు. ఆయన తండ్రి పేరు వెంకటస్వామి, తల్లి నారాయణమ్మ. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివాడు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో జరిగింది. తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించాడు. అప్పట్లో తెలంగాణా ఉద్యమం ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు మొత్తంపై 5 సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. నాగం జనార్ధన్ రెడ్డి 1995 నుండి  2004 వరకు ఆరోగ్యమంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011లో బహిష్కరణకు గురి అయ్యారు. 2012లో తెలంగాణ విషయంలో నాగం జనార్ధన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి ఆ తర్వాత ''తెలంగాణ నగారా సమితి''ని ఏర్పాటు చేశాడు. 2013 జూన్ 3న హైదరాబాదులో జరిగే బహిరంగ సమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరారు.[2][3] నాగం జనార్ధన్ రెడ్డి 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. బిజెపి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన అ పార్టీకి రాజీనామా చేసి 2018 ఏప్రిల్ 25న న్యూఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నాగం జనార్దన్‌రెడ్డి 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యాడు .[4]

నాగం జనార్ధన్ రెడ్డి 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించగా, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబరు 31న తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాడు.[5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • రాష్ట్ర మంత్రివర్గంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.
  • తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు.

ఎన్నికల చరిత్ర

[మార్చు]
ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాగర్‌కర్నూల్ తెలుగుదేశం పార్టీ వంగా నారాయణ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ ఓటమి
1985 గెలుపు
1994 వంగా మోహన్ గౌడ్ గెలుపు
1999 కూచుకుల్ల దామోదర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి గెలుపు
2004 57,350 తెలంగాణ రాష్ట్ర సమితి 55,901 గెలుపు
2009 68,026 భారత జాతీయ కాంగ్రెస్ 61,433 గెలుపు
2012^ స్వతంత్ర అభ్యర్థి గెలుపు
2018 తెలంగాణ శాసనసభ భారత జాతీయ కాంగ్రెస్ 48,139 మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 102,493 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (29 March 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 04-06-2013
  3. Sakshi (29 October 2023). "కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  5. Sakshi (31 October 2023). "కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్‌ రెడ్డి". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.


బయటిలింకులు

[మార్చు]