Jump to content

లింగాల (కల్లూరు)

అక్షాంశ రేఖాంశాలు: 17°09′20″N 80°30′45″E / 17.155556°N 80.5125°E / 17.155556; 80.5125
వికీపీడియా నుండి
(నేతి లింగాల నుండి దారిమార్పు చెందింది)

లింగాల ఖమ్మం జిల్లా లోని కల్లూరు మండలం లోని ఓ గ్రామం.[1].

లింగాల
—  రెవిన్యూ గ్రామం  —
ముద్దు పేరు: నేతి లింగాల
లింగాల is located in తెలంగాణ
లింగాల
లింగాల
అక్షాంశరేఖాంశాలు: 17°09′20″N 80°30′45″E / 17.155556°N 80.5125°E / 17.155556; 80.5125
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం కల్లూరు
ప్రభుత్వం
 - Type గ్రామ పంచాయితి
 - సర్పంచి వేపూరి ఝాన్సీలక్ష్మి(కమ్మ)
పిన్ కోడ్ 507209
ఎస్.టి.డి కోడ్ 08761
వెబ్‌సైటు: http://www.khakallurlingalgp.appr.gov.in/

ఇప్పుడు అందరూ లింగాల అనే పిలుస్తున్నప్పటికినీ ఈ గ్రామం అసలు పేరు నేతి లింగాల. ఇది కల్లూరు నుండి మధిర దారిలో ఆరు కిలోమీటర్ల తరువాత వస్తుంది.

నాగార్జునసాగర్ కాలువ వచ్చిన తరువాత పాడిపంటలు పొంగి పొరలిన రోజుల్లో, ఇప్పటిలాగా ఇన్ని పాల డెయిరీలూ, ఇన్ని పాల వ్యాపార క్యానులు లేని కారణంగా ఇక్కడి వారు నెయ్యి తీసి ఆ నెయ్యిని అమ్మేవారు, అందుకనే ఈ గ్రామాన్ని నేతి లింగాల అని పిలుస్తారు. కానీ ఇప్పుడు మాత్రము పాలనే వివిధ డెయిరీలకు అమ్ముతున్నారు.

గ్రామపంచాయితీ

[మార్చు]

ఆదాయ వ్యయములు

[మార్చు]

04, 2013 నుండి ఆదాయం 1,77,206 లు కలుపుకొని మొత్తం 2,87,587 రూపాయలు కలవు మరియూ వ్యయం 2,15,274 రూపాయలు .

2013 పంచాయితీ ఎన్నికలు

[మార్చు]

విజేత: కాంగ్రేసు మద్దతిచ్చిన అభ్యర్థి., వేపూరి ఝాన్సీలక్ష్మి (కమ్మ).

ఈ ఎన్నికలు లింగాల గ్రామ చరిత్రలో చెప్పుకొదగ్గవి, ఒకటి మొదటినుంచి గెలుపొందుతూ వస్తున్న కమ్యూనిష్టు పార్టీ ఎన్నికలనుంచి వైదొలగి తెలుగుదేశానికి మద్దతు తెలపడం, రెండవది ఈసారి సర్పంచ్ పదవి ఓపెన్ క్యాటగిరిలో కమ్మ కులస్తులు పోటీపడి ఖర్చు పెట్టడం ఇరువైపులా రమారమి 20 లక్షల పైచిలుకు ఖర్చు పెట్టారని భాగొట్టా .

రాజకీయాలు ప్రధాన రాజకీయ పార్టీలు : భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు (సి.పి.యం), తెలుగుదేశం, కాంగ్రెస్, వై.స్.ఆర్ కాంగ్రెస్.

విశేషం : ఈ ఊరిలో గ్రామ పంచాయతి ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటివరకు ఊరు ప్రెసిడెంట్ గా కమ్యూనిస్ట్ పార్టీ నే గెలుపొందుతూ ఉంది, 2013 లో కమ్యూనిష్టులు తెలుగుదేశానికి మద్దతిచ్చారు

శాసన సభ నియోజక వర్గం : సత్తుపల్లి.

[మార్చు]

పార్లమెంటరీ నియోజక వర్గం : ఖమ్మం.

[మార్చు]

విద్యా సౌకార్యం

[మార్చు]
  1. రెండు ప్రాథమిక పాఠశాలలు.
  2. పిండి బడి అని ఒక పాఠశాల ఉంది ( అంగణ్ వాడి ).
  3. దాదాపుగా అందరు ప్రాథమిక విద్య కోసం కల్లూరు వెళ్తుంటారు.
  4. విద్యకి బాగా విలువనిచ్చే గ్రామం.

ఇతర సదుపాయాలు

[మార్చు]
  1. ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఇది ఊరి త్రాగు నీటికి ఉపయోగిస్తున్నారు .
  2. ఒక ప్రయివేటు మినరల్ వాటర్ ప్లాంటు ఉంది,ఇప్పుడు అందరు ఈ నీటినే వాడుతున్నారు ( 15 లీటర్ల క్యాను ధర 5 రూపాయలు).

మతాలు, దేవాలయాలు ముఖ్యమైన/ప్రధాన మతాలు : హిందువులు, క్రిస్టియన్లు.

దేవాలయాలు

[మార్చు]
  1. రామాలయం,వీరభద్రుడి గుడి,ముత్యాలమ్మ గుడి ముఖ్యమైన హిందూ దేవాలయాలు ... కొన్ని దేవాలయాలు ఊరి పొలాల్లో ఉన్నాయి.
  2. క్రిస్టియన్‌లకుకు మూడు చర్చ్ లు ఉన్నాయి ( మాలపల్లిలో రెండు, హరిజనవాదడలో ఒకటి ) .

నాడు / నేడు

[మార్చు]
  1. ఒకప్పుడు పాడి దిగుబడి చాలా బాగా ఉండేది, ఖమ్మం జిల్లాలోనే మొదటి స్థానం / ఇప్పుడు పాడి దిగుబడి బాగా తగ్గిపోయింది (పశుగ్రాసం ధరలు పెరిగిపోవడం, చాకిరికి తగ్గ గిట్టుబాటు కాక పోవడం ముఖ్య కారణాలు.

వ్యవసాయం

[మార్చు]

ఈ గ్రామం ప్రధానంగా వ్యవసాయాధార గ్రామం. ఇక్కడ అనుబంధంగా ఒక రైస్ మిల్లు ఉంది. ఈ గ్రామానికి మూడువైపులా వాగులు ఉన్నాయి. అవి - ముచ్చారం వాగు, చెన్నూరు వాగు, పీతురు వాగు. ఈ గ్రామం పరిధిలో మూడు చెరువులు ఉన్నాయి. గొల్లకుంట, కొత్త చెరువు. ఇదే కాకుండా ఈ గ్రామస్తులకు పాయపూరు చెరువు, చండ్రుపట్ల చెరువు, యరబోయినపల్లి చెరువు క్రింద కూడా భూములు ఉన్నాయి. ఈ గ్రామంలో చాలా మామిడితోటలు కూడా ఉన్నాయి.

అబివృద్ది కార్యక్రమాలు:

[మార్చు]
  1. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అదనపు భవన నిర్మాణం.
  2. ఇటీవల ప్రభుత్వ పశువైద్యశాల మంజూరు అయింది ( నిర్మింఛటానికి ఇంకా స్థలం కెటాయించలేదు).

ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యక్తులు

[మార్చు]
  1. కట్టా వెంకటేశ్వర రావు,

జిల్లా ఉత్తమ రైతుగా 2006 సంక్రాంతి రోజున రాష్ట్రమంత్రి కొనేరు రంగారావు, జిల్లా కలెక్టర్ చేతులమీదుగా సన్మానించారు . శ్రీ వరి, వినూత్న వ్యవసాయం వీరి ప్రత్యేకత . 2014లొ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆహ్వానించగా హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిధ్యాలయంలో నేటి వ్యవసాయం .. సాగులో మెళుకువలు గురించి ప్రసంగించారు .

కులాలు

[మార్చు]
కమ్మ,వైశ్య,పద్మశాలి,కుమ్మరి,మాల,మాదిగ,కమ్మరి,యాదవ, రజక

వృత్తులు

[మార్చు]
వ్యవసాయం, వడ్రంగి.పాడి, గొర్రెల పెంపకం

ఇంటిపేర్లు

[మార్చు]

కమ్మ వారి ఇంటిపేర్లు

[మార్చు]

కట్టా, మద్దినేని, మానుకొండ, మట్టూరి, చావా, మచ్ఛా, హనుమంతు, దేవరపల్లి, బొడేంపూడి, నండూరి, భాగం, వాసిరెడ్డి, బొడపాటి, చెరుకూరి, సామినేని, వేపూరి, తాళ్ళూరి, వడ్లమూడి, గుర్రం, కిలారు, పరుఛూరు,చిగులూరి,మాడఫాటి

వైశ్య వారి ఇంటిపేర్లు

[మార్చు]

మిట్టపల్లి

కుమ్మరి వారి ఇంటిపేర్లు

[మార్చు]

బాడిస

మాల వారి ఇంటిపేర్లు

[మార్చు]

బీరవెల్లి,తాళ్ళ,మేకల,అల్లు,వేము,భీమాల,వాడపల్లి,మద్దెల,జుపూడి,మరసకట్ల

మాదిగ వారి ఇంటిపేర్లు

[మార్చు]

జుంజునూరు, కత్తి

యాదవ వారి ఇంటిపేర్లు

[మార్చు]

రాచబంటి

రజక వారి ఇంటిపేర్లు

[మార్చు]

మునిగంటి

వడ్రంగి వారి ఇంటిపేర్లు

[మార్చు]

పతకముడి

చరిత్ర

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఎక్కువగా సొంత ద్విఛక్ర వాహనాలనే వాడుతుంటారు, చుట్టుపక్కన ముఖ్య కేంద్రాలైనా మధిర,కల్లూరు,తిరువూరు,ఖమ్మం,తల్లాడ,వైరా లాంటి నగరాలకు వీటినే ఉపయొగిస్తుంటారు .

జనాభా

[మార్చు]

సుమారు 1500 నుండి 1800 వరకు ఉండవచ్చు

ఇతరత్రా

[మార్చు]
  1. పాతూరు సెంటరులో రెండు డబ్బా కొట్లుంటాయి, ఒక దానిలో ఉదయం పలహారం దొరుకుతుంది, టీ రాత్రివరకు దొరుకుతుంది, మద్యం ఎప్పుడూ అమ్ముతారు (బెల్టు షాపు).
  2. ఒక హేర్ కటింగ్ షాపుకూడా ఉంది .

సంప్రదించుటకు

[మార్చు]
గ్రామ కార్యదర్శి :సి.హెచ్.రామకృష్ట
గ్రామ సర్పంచ్ : వేపూరి ఝాన్సీలక్ష్మి(కమ్మ)

తపాలా చిరునామా

[మార్చు]
లింగాల గ్రామం,
ఎర్రబొయినపల్లి పొస్ట్,
కల్లూరు మండలం,
ఖమ్మం జిల్లా,తెలంగాణ
పిన్ కొడ్ : 507209

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు

[మార్చు]