Jump to content

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
దస్త్రం:FSSAI logo.png
సంస్థ అవలోకనం
స్థాపనం 5 సెప్టెంబర్ 2008 (5 సెప్టెంబర్ 2008)[1]
అధికార పరిధి భారతదేశం
ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/లు రాజేష్ భూషణ్, IAS[2], చైర్మన్
ఎస్ గోపాలకృష్ణన్, IAS [3], చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
Parent Agency ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) (Food Safety and Standards Authority of India (FSSAI) భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, భారతదేశంలో ఆహార భద్రత, ప్రమాణాలకు బాధ్యత వహిస్తుంది, ఇందులో చైర్ పర్సన్, 22 మంది సభ్యులు ఉంటారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వినియోగదారులు, వ్యాపారులు, ఉత్పత్తిదారులు, పెట్టుబడిదారులు అందరూ ఒకే సంస్థతో కార్యకలాపాలను నిర్వహించడానికి, దేశంలో స్థాపించారు[4].

చరిత్ర

[మార్చు]

భారత ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన స్వయంప్రతిపత్తి సంస్థ, 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' కింద ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు చేయబడింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార భద్రత నియంత్రణ, పర్యవేక్షణ ద్వారా ప్రజారోగ్యాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి బాధ్యత వహిస్తుంది, భారతదేశంలో ఆహార వ్యాపారాల పనితీరును నియంత్రించడానికి పర్యవేక్షిస్తుంది. ఆహార పదార్థాల సంస్థలు, పంపిణీ దారులు (డిస్ట్రిబ్యూటర్లు), రిటైలర్లు, స్టోరేజీ హౌస్ లు అందరూ సంస్థ నుంచి వ్యాపారాలకు తమ లైసెన్స్ పొందడం తప్పనిసరి.[5]

విధులు

[మార్చు]
ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ శాకాహార(వెజ్) , మాంసాహార (నాన్-వెజ్) గుర్తులు (లేబుల్స్).

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారతదేశంలో ఆహార పదార్థాల అమ్మకం, ప్యాకేజింగ్ లేదా నిల్వ కోసం ప్రమాణాలను కలిగి ఉన్న ప్రధాన ప్రభుత్వ సంస్థ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006కు అనుగుణంగా వివిధ మార్గదర్శకాలు, ప్రమాణాలను తెలియచేస్తుంది. సంస్థ బాధ్యతలు ఈ విధంగా ఉన్నాయి.[6]

  • ఆహార భద్రత, అవగాహనకు సంబంధించిన నియమనిబంధనలను వివరించడం.
  • అర్హత కలిగిన ఆహార వ్యాపారాలకు ఆహార లైసెన్సులు మంజూరు చేయడం.
  • ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ల కొరకు ప్రక్రియలు,నిబంధనలను రూపొందించడం
  • కొత్త పాలసీలను రూపొందించడంల, భారత ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడం.
  • ఆహార పదార్థాలలోని కలుషితాలకు సంబంధించిన డేటాను సేకరించడం.
  • ఆహార రంగం లేదా ఆహార సరఫరా లో జరిగే ప్రమాదాలను గుర్తించడం.
  • ఫుడ్ ప్రాసెసింగ్ లేదా తయారీ సంస్థ(మాన్యుఫాక్చరింగ్ కు) సంబంధించిన వాటిని చూడటం.
  • ప్రజలకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో సమస్యలను గుర్తించడానికి,,హెచ్చరిక చేయడం,ఆహార భద్రత, ఆహార ప్రమాణాల గురించి సాధారణ అవగాహనను ప్రోత్సహించడం.
  • ఆహార వ్యాపారాల్లో నిమగ్నమైన లేదా పాల్గొనాలని భావించే వ్యక్తుల కొరకు శిక్షణా కార్యక్రమాలను ఇవ్వడం,ఆహారం, పారిశుధ్యం, ఫైటో శానిటరీ ప్రమాణాల కొరకు అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాల అభివృద్ధికి దోహదం చేయడం. వంటివి ఉన్నాయి.

ప్రాంతీయ కార్యాలయాలు

[మార్చు]

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రస్తుతం 4 ప్రాంతీయ కార్యాలతో తన పరిపాలను కొనసాగిస్తుంది.[7]

న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, లడఖ్, జమ్మూ & కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల పర్యవేక్షణ

ముంబై లో ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, దాదర్ నగర్ హవేలీ, డామన్ దీవులు ప్రాంతాల పర్యవేక్షణ

చెన్నై ప్రధాన కార్యాలయం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్రపాలితలు పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాల పర్యవేక్షణ

కోల్ కాతా కార్యాలయం తో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం (గౌహతి ప్రాంతీయ కార్యాలయం) ప్రాంతాల పర్యవేక్షణ.

రిజిస్ట్రేషన్

[మార్చు]
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన వ్యాపారదారుడు.

ఆహార ఉత్పత్తి వ్యాపారాన్ని నడపడానికి ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం. ఆహార ఉత్పత్తులను తయారు చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం కొరకు వ్యాపార సంస్థలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్, లైసెన్స్ ఒకేవిధంగా ఉంటాయి, వినియోగ దారులు ఆధారపడగల నాణ్యత, స్వచ్ఛత ,ఇతర ముఖ్యమైన కారకాలను ధృవీకరిస్తుంది లైసెన్స్, రిజిస్ట్రేషన్ కొరకు సంస్థ ఆన్లైన్ ( అంతర్జాలం).లో దరఖాస్తు ( అప్లై) చేయవలెను[8].

మూలాలు

[మార్చు]
  1. "Enforcement of FSS Act" (PDF). FSSAI. Archived from the original (PDF) on 18 January 2013. Retrieved 2 April 2012.
  2. "Authority of FSSAI".
  3. "FSSAI".
  4. Team, DataFlair (2021-11-26). "What is FSSAI?". DataFlair (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-16.
  5. "The Food Safety And Standards (Amendment) Bill 2020: A milestone In The History Of Indian Food Safety". Food Safety Mantra Blog (in ఇంగ్లీష్). Retrieved 2022-12-16.
  6. "FSSAI License in India - Benefits, Types, Documents". Corpbiz (in ఇంగ్లీష్). Retrieved 2022-12-16.
  7. "FSSAI". fssai.gov.in. Retrieved 2022-12-16.
  8. "FSSAI Food License | FSSAI Registration Online in India". foodlicenceonline.com. Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.