తెలుగు బాలసాహిత్యం
Appearance
(బాల సాహిత్యము నుండి దారిమార్పు చెందింది)
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
- 1812 : మొట్టమొదటి తెలుగు నిఘంటువు ప్రచురించబడింది.
- 1816: మొట్టమొదటి తెలుగు ముద్రణాలయం మద్రాసులో స్థాపించబడింది.
- 1818: సి. పి. బ్రౌన్ దొర గారి నిఘంటువు ప్రచురించబడింది.
- 1819: రావిపాటి గురుమూర్తి - "ద్వాత్రింశతి సాలభంజికలు", "విక్రమార్కుని కథలు" ప్రచురితమయ్యాయి.
- 1820: మద్రాస్ వెర్నాక్యులర్, స్కూల్ బుక్ పబ్లిషిగ్ సొసైటీ స్థాపన
- 1834: రావిపాటి గురుమూర్తి - "పంచతంత్ర కథలు" ప్రచురితం.
- 1842: గోపకవి "దాశరధి శతకము" ప్రచురితం.
- 1845: పూడూరు సీతారామశాస్త్రి పెద్దబాలశిక్ష ప్రచురితం.
- 1851: అద్దంకి సుబ్బారావు "తెలుగు వాచకము" ప్రచురితం.
- 1853: చిన్నయ సూరి "మిత్రభేదము" ప్రచురితం.
- 1855: బ్రౌన్ సంకలనం "తాతాచాఱ్లు కథలు" ప్రచురితం.
- 1856: పుడూరు సీతారామశాస్త్రి "నీతికథలు - చిత్ర కథలు" ప్రచురితం.
- 1861: "పరమానందయ్య శిష్యుల కథలు" ప్రచురితం.
- 1872: కందుకూరి వీరేశలింగం "నీతి ధిపిక (శతకం)" ప్రచురితం.
- 1873: కందుకూరి వీరేశలింగం "నీతికథామంజరి" ప్రచురితం.
- 1874: గజ్జెల రామానుజులు "స్త్రీ నీతి శాస్త్రము" ప్రచురితం.
- 1884: జనవినోదిని పత్రికలో పిల్లల పాటలు ప్రచురితం.
- 1905: "తెలుగు జానపద గేయాలు" ప్రచురితం
- 1908: పిల్లల రచనలు "వివేకవతి" పత్రికలో ప్రచురితం.
- 1909: "రేడియో అక్కయ్య" న్యాయపతి కామేశ్వరి జననం; గిడుగు సీతాపతి "చిలకమ్మ పెండ్లి", "రైలుబండి" పాటలు రచన. .
- 1912: వెంకట పార్వతీశ కవులు "బాలగీతావళి" ప్రచురితం.
- 1919: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పిల్లల పాటలు "అనసూయ" పత్రికలో ప్రచురితం.
- 1924: అడవి బాపిరాజు గారి అమ్మ పాటలు "భారతి"లో ప్రచురితం.
- 1925: వావికొలను సుబ్బారావు గారి తల్లి పిల్ల పాటలు "నవ్వులతోట" పత్రికలో ప్రచురితం.
- 1928: "గృహలక్ష్మి" పత్రికలో "బాల విజ్ఞానశాఖ" ప్రాంభించారు.
- 1929: ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలో పిల్లల కార్యక్రమాలు ప్రారంభం.
- 1931: చింతా దీక్షితులు "సూరి సీతి వెంకి" "భారతి"లో ప్రచురించబడినది.
- 1933: ఆండ్ర శేషగిరిరావు గారి "బాల భూమి" శీర్షిక ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురణ ప్రారంభమైనది.
- 1937: గుమ్మడిదాల దుర్గాబాయమ్మ - "Little Ladies of Brundavan" - మద్రాసులో మొదటి పిల్లల సంఘం స్థాపించబడింది. దుర్గాబాయి గారి "బాలానందం" కార్యక్రమాలు ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలో మొదలయ్యాయి.
- 1939: మద్రాసు ఆకాశవాణి కేంద్రంనుండి "రేడియో అన్నయ్య" న్యాయపతి రాఘవరావు "బాలల కార్యక్రమాలు" ప్రారంభించాడు.
- 1940:
- మొదటి బాలల పత్రిక "బాలకేసరి" ప్రారంభం - సంపాదకుడు - మేడిచర్ల ఆంజనేయమూర్తి.
- "భారతి"లో గిడుగు సీతాపతి బాలానందం అనే పిల్లల శీర్షిక ప్రారంభించాడు.
- మద్రాసులో "ఆంధ్ర బాలానంద సంఘం" స్థాపన.
- 1941: న్యాయపతి రాఘవరావు "బాల" అనే పిల్లల మాసపత్రికను ప్రారంభించాడు.
- 1946: చక్రపాణి చందమామ పత్రికను ప్రారంభించాడు.
- 1949:
- చింతా దీక్షితులు "లక్కపిడతలు"కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు లభించింది.
- బాలమిత్ర, "పాపాయి" అనే పిల్లల పత్రికలు ప్రారంభం.
- 1951: న్యాయపతి రాఘవరావు అధ్వర్యంలో HMV కంపెనీవారు పిల్లల పాటల రికార్డులు విడుదల చేశారు.
- 1952:
- విజయవాడలో "తెలుగు బాలరచయితల సంఘం" ప్రారంభం.
- మద్రాసులో "తెలుగు బాలల మహాసభ" నిర్వహణ.
- పాటిబండ మాధవశర్మ సంపాదకత్వంలో "బాలప్రభ" మాసపత్రిక ఆరంభం.
- 1953:
- కోవెలమూడి సూర్యప్రకాశరావు సినిమా బాలానందం విడుదల.
- కర్నూలులో తెలుగు బాలల మహాసభ.
- "బొమ్మరిల్లు" మాసపత్రిక ప్రారంభం.
- 1955:
- బొమ్మరిల్లు (కవిరావు, పిల్లల బొమ్మల భారతం (మాగంటి బాపినీడు, లక్కపిడతలు (చింతా దీక్షితులు) - భారత ప్రభుత్వ అవార్డు పొందాయి.
- మద్రాసులో గల బాలానంద సంఘం వారు సంచార గ్రంథాలయం (Mobile Library) ను ప్రారంభించారు.
- భారత ప్రభుత్వం బాలల చలనచిత్ర సమితి (Children's Film Society) ను ప్రారంభించింది.
- "బాలల విజ్ఞాన సర్వస్వం" తెలుగులో ప్రచురించబడింది. (పూర్తిగా),
- గుంటూరులో "బాలానంద సంఘం" నెలకొల్పబడింది.
- 1956:
- గుంటూరులో తెలుగు బాలల మహాసభలు జరిగినవి.
- బాలానందం అనే వార పతరిక ప్రారంభించబడింది.
- బడిగంట (న్యాయపతి రాఘవరావు), బాలానందం (గిడుగు సీతాపతి) లకు భారత ప్రభుత్వ అవార్డులు లభించినవి.
- బంగారు పిలక (చింతా దీక్షితులు), "ముద్దుపాప" (వేజాండ్ల సాంబశివరావు) లకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించినవి.
- 'బాల సాహిత్య శిక్షణా శిబిరం' రాజమండ్రిలో నెలకొల్పబడింది.
- 1957:
- నటరాజ రామకృష్ణ వ్రాసిన "నర్తన బాల"కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- హైదరాబాద్ లో "తెలుగు బాలల మహాసభలు" జరిగినవి.
- 1958:
- "బాలప్రభ" అనే మాసపత్రిక ప్రారంభించబదినది.
- బి.వి.నరసింహారావు వ్రాసిన "పాలబడి పాటలు", వారణాశి సుబ్రహ్మణ్యం వ్రాసిన "జంతు ప్రపంచం ఏనుగు" లకు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- 1959:
- ఆవంచ లక్ష్మణరావు వ్రాసిన "చిలుకమ్మ చుట్టాలు"కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- ఉప్పల సత్యనారాయణాచార్య వ్రాసిన " గంగావతరణం" నకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించి.
- 1960: ఆకాశం (విస్స అప్పారావు), బొమ్మల గౌతమ బుద్ధుడు (వేదుల కామేశ్వరరావు), జంతు ప్రపంచం (ఎస్.ఎల్.నరసింహారావు) లకు భారత ప్రభుత్వ అవార్డులు వచ్చాయి.
- 1961:
- బిడ్డల చేతిపనులు (కె.ఎస్.నరసింగాచారి), పరమాణుకథ (ఎ.వి.యస్.రామారావు) లు భారత ప్రభుత్వ అవార్డులు పొందాయి.
- హైదరాబాద్ లో "బాల సాహిత్య శిక్షణా శిబిరం" జరిగింది.
- 1962:
- నర్తనసీమ (నటరాజ రామకృష్ణ), అంతరిక్ష విజ్ఞానం (ఎ.వియస్.రామారావు), బాలప్రపంచం (మసూనా) లు భారత ప్రభుత్వ అవార్డులు పొందాయి.
- "చంద్రభాను" అనే మాసపత్రిక ప్రారంభించబడింది.
- 1963:
- "విశ్వరహస్యం" (ఎ.వియస్.రామారావు) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- అల్లరి గోపి అద్భుత యాత్ర ( వసమూర్తి) నకు దక్షిణ భారత భాషా పుస్తక అవార్డు లభించిది.
- "బాలరాజ్యం" అనే మాసపత్రిక ప్రారంభించబడింది.
- "బాల సాహిత్య మాల" ప్రచురించబడింది.
- 1964:
- "బాలానందం" మాసపత్రిక ప్రారంభం.
- పగలు రాత్రి (డి.కన్యకుమారి) నకు భారత ప్రభుత్వ అవార్డు వచ్చింది.
- 1965:
- "రఘపతి" మాసపత్రిక ప్రారంభం.
- విజ్ఞానలోకం (వెలగ వెంకటప్పయ్య), బాలాభిరామం ( మిరియల రామకృష్ణ) లకు దక్షిణ భారత దేశ పుస్తక అవార్డు లభించింది.
- బాలలబొమ్మల నెహ్రూ (బి.సూర్యనారాయణ మూర్తి) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- బాలల భవన్ హైదరాబాదులో ఏర్పాటు.
- 1966:
- బంగారు నడిచిన బాట (కలువకొలను సదానంద) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- చిట్టి ముత్యాలు (గంగరాజు సుశీలాదేవి), యువరాజు (కె.రామలక్ష్మి) లు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులను పొందాయి.
- ఆంధ్ర బాలనంద సంఘం వారు పిల్లలకు రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు.
- 1967:
- నర్తనసీమ (నటరాజు రామకృష్ణ) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- గేయఖండావళి (జె.రాఘవమ్మ), నేటి విద్యార్థి (కె.యస్.వెంకటరమణ) లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
- 1968:
- స్వతంత్ర భారతి ( వెక్కలంక లక్ష్మిపతిరావు) కి భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- మూడుమొగ్గలు ( ఎ.లక్ష్మిరమణ) కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
- 1969:
- కుంకుమరేఖ (కోడూరి లీలావతి, ప్రకృతి వింతలు (గిడుగు విశాలాక్షి) లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
- "పసిడిబాల" మాసపత్రిక ప్రారంభం.
- 1970: '
- రంగు రంగుల రత్న దీపాలు ( మిరియాల రామకృష్ణ) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- "ఆనందబాల", "బాలప్రపంచం" మాసపత్రిక ప్రారంభం.
- అనంతంలో అంతం (కంచి రమాదేవి), ఆంధ్ర దేశ యాత్ర ( యసం సుశీలాదేవి) లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
- 1972:
- చంద్రలోక యాత్ర (ఎ.వి.యస్.రామారావు) నకు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- "బొమ్మరిల్లు" మాసపత్రిక ప్రారంభం.
- 1973: "గాలిలో ప్రయాణం" (రెడ్డి రాఘవయ్య) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- 1974:
- యాగ్లీకం (సీత) కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
- "వసంతబాల", "పాలవెల్లి" మాసపత్రిక ప్రారంభం.
- అఖిల భారత తెలుగు బాలల ఉత్సవం (All India Telugu Children Festival ) హైదరబాదులో ఏర్పాటు చేయబడింది.
- ఆకాశాన్ని చూద్దాం ( ఎ.వి.యస్.రామారావు) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- 1975:
- తెలుగు దూరదర్శన్ (టెలివిజన్) కార్యక్రమాలు హైదరాబాద్ లో ప్రారంభించబడినవి.
- బాల విజ్ఞాన కథానిధి ( ఎ.వి.యస్.రామారావు) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
- బంగారుతల్లి (పాలంకి వెంకట రామచంద్రమూర్తి) నకు ఆంధ్రా అవార్డు లభించింది.
- "జ్యోతి" వారపత్రిక ప్రారంభం.
- "బుజ్జాయి" మాసపత్రిక ప్రారంభం.
- " చందమామ" పత్రిక వ్యవస్థాపకులు "చక్రపాణి" గారి అస్తమయం.
- 1976:
- "ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ" ప్రభుత్వ సంస్థగా హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
- "దయ్యాల మేడ" ( కంచి రమాదేవి) కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
- 1977:
- ఆంధ్రప్రదేశ్ బాలల మహాసభలు ప్రారంభించబడినవి.
- "బాల", "బేడి", "స్నేహబాల", "కంపక్" మాసపత్రికల ప్రారంభం.
- ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారి డాక్యుమెంట్ విడుదల.
- న్యాయపతి రాఘవరావు గారికి సన్మానం.
- 1978:
- "బాలచంద్రిక", "ప్రమెద", "బాలభారతి", "మా బడి", పాఠశాల మాసపత్రికల ప్రారంభం.
- పి.తిరుమలరావు, బి.వి.నరసింహారావు, పాలంకి, ఇల్లిందుల సరస్వతి లకు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ తరపున " బాలబందు" బిరుదు ప్రదానం.
- న్యాయపతి రాఘవరావు, కామెశ్వరి గార్లు ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ యిచ్చిన "బాలబందు" అవార్డు తిరస్కరణ.
- 1979:
- "బాలవాణి" మాసపత్రిక ప్రారంభం.
- "విద్యాబాల" త్రైమాసిక పత్రిక ప్రారంభం
- డాక్టరేట్ డిగ్రీ కొరకు "బాల గేయ సాహిత్యం" పై ఎం.కె.దేవకి గారు వ్రాసిన పరిశోధనా వ్యాసం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నకు సమర్పణ.
- బాలల గేయాలు రికార్డు చేయబదినవి.
- "మనచుట్టూ ఉన్న వింతమొక్కలు" (కొత్త శేషాద్రి) నకు భారత ప్రభుత్వ అవార్డు.
- 1980:
- "బాలబంధు" బిరుదం కొరకు ఎంపికైన ఏడిద కామేశ్వరరావు, శ్రీకాంతాం కృష్ణారావు.
- "బాలజ్యోతి" మాసపత్రిక ప్రారంభం.
- సేకరించిన బాలల సాహిత్యాన్ని ప్రచురించిన అకాడమీ.
- తెలుగు బాలల సాహిత్య అవార్డు పొందిన వెలగ వెంకటప్పయ్య.
- కె.సభా అస్తమయం.
- మూలం: బాల సాహితి వికాసం (డాక్టరేట్ పరిశోధన, ఆంధ్రా విశ్వవిద్యాలయం, 1977-1980), వెలగ వెంకటప్పయ్య 1982.: సిద్దార్థ పబ్లిషర్స్, విజయవాడ.
మూలాలు
[మార్చు]- బాల సాహితి - తెలుగులో బాలల సాహిత్యం - వెలగా వెంకటప్పయ్య రచన - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- www.avkf.org లో వెలగా వెంకటప్పయ్య రచనలు
- http://www.anandbooks.com/Shaik-Abdul-Hakimm-Janiలో బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని బాలసాహితీ రచనలు.
- బాలసాహిత్యం ఘట్టాలు
- https://www.amazon.in/dp/B07QFF14Y8/ref=cm_sw_r_cp_apa_i_gotrFbKMA4TS8 బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని రచనలు on Amazon
- https://jsnbooks.com/search?search=Shaik%20Abdul%20Hakeem%20Jani Archived 2021-09-20 at the Wayback Machine బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని రచనలు