మధురాక్కర
Jump to navigation
Jump to search
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
మధురాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధురాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్నది. ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించినట్టు మనకు కనబడుతుంది. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.
పద్య లక్షణము
[మార్చు]- నాలుగు పాదములు ఉండును.
- ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.
ప్రాస
[మార్చు]- నియమము కలదు.
యతి
[మార్చు]- ప్రతి పాదమునందు 4వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
- మధురాక్కర
తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు
మూలాలు
[మార్చు]- ↑ "మధురాక్కర". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
- ↑ "మధురాక్కర ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.