Jump to content

వి.రామకృష్ణ

వికీపీడియా నుండి
(రామకృష్ణ (గాయకుడు) నుండి దారిమార్పు చెందింది)
వి.రామకృష్ణ
వి.రామకృష్ణ
జననంవి.రామకృష్ణ
ఆగష్టు 20, 1947
విజయనగరం
మరణంజూలై 16, 2015
వెంకటగిరి కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్
ఇతర పేర్లురామకృష్ణ
ప్రసిద్ధితెలుగు సినిమా నేపథ్య గాయకుడు
పిల్లలుఒక కుమారుడు, ఒక కుమార్తె
తండ్రిరంగసాయి
తల్లిరత్నం

వి.రామకృష్ణ, (విస్సంరాజు రామకృష్ణదాసు) ( 1947 ఆగష్టు 20- 2015 జూలై 16) ఇతను 1970 వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇతని ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని చిత్రాలు తాతామనవడు, భక్తతుకారాం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, శ్రీమద్‌విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, కరుణామయుడు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు.

అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ తొలుత చెన్నైలో స్థిరపడినా.. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితోపాటు.. తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బాలు విశేష ఆదరణ పొందాయి.

తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు.

జననం

[మార్చు]

రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20విజయనగరంలో జన్మించాడు. గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.[1]

1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్ లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2001లో నువ్వే కావాలి చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి.

మరణం

[మార్చు]

కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడిన.. వీరు 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

సినిమాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-19. Retrieved 2009-04-27.

బయటి లింకులు

[మార్చు]