Jump to content

రోజర్ ఫెడరర్

వికీపీడియా నుండి
(రోజర్ ఫెదరర్ నుండి దారిమార్పు చెందింది)
రోజర్ ఫెడరర్

రోజర్ ఫెడరర్ (Roger Federer) స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 1981, ఆగస్ట్ 8 వ తేదీన స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జన్మించాడు. 2004, ఫిబ్రవరి 2 నుంచి వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు.[1] టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఫెదదర్ ఒకడు.[2] ఇతడు ఇప్పటి వరకు 20 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 6 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 8 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 5 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ 1 సారి గెలుపొందినాడు. డబుల్స్‌లో కూడా ఇప్పటి వరకు 8 టైటిళ్ళను సాధించాడు.

బాల్యం

[మార్చు]

రోజర్ ఫెడరర్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో 1981 ఆగస్టు 8 న జన్మించాడు.[3] చిన్నతనంలో ఫుట్‌బాల్ క్రీడలో మంచి ప్రావీణ్యం సంపాదిచాడు. ఫుట్‌బాల్ ఆటలో మంచి ప్రొఫెషనల్ ఆటగాడు కావాలని అనుకున్నప్పటికీ టెన్నిస్ వైపు దృష్టిసారించి రాకెట్ చేతపట్టాడు.

క్రీడాజీవితం

[మార్చు]

6 సంవత్సరాల ప్రాయంలోనే ఫెడరర్ టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు.[4] 9 సంవత్సరాల వయస్సులో గుంపు పాఠాలు వినడానికి హాజరయ్యేవాడు. మరో సంవత్సరం గడిచే నాటికి వారం వారం ప్రైవేటు కోచింగ్ వెళ్ళడం ఆరంభించాడు. 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఫుట్‌బాల్ ఆట కూడా ఆడేవాడు. అదే సమయంలో టెన్నిస్ మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నాడు.[5] 14 ఏళ్ళ వయస్సులో టెన్నిస్‌లో జాతీయ చాంపియన్ అయ్యాడు. 1998లో ఫెడరర్ వింబుల్డన్ జూనియర్ టైటిల్ సాధించాడు. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళినాడు.

2001 : ఫెడరర్ మిలాన్‌లో మొదటి ఏటిపి టోర్నమెంటులో నెగ్గినాడు. ఫిబ్రవరిలో జరిగిన డేవిస్ కప్‌లో 3 మ్యాచులలో నెగ్గి అమెరికాపై విజయం సాధించడంలో తన దేశానికి తోడ్పడ్డాడు. అదే ఏడాది వింబుల్డన్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు ప్రవేశించాడు. నాల్గవ రౌండ్‌లో 4 సార్లు డిఫెండింగ్ చాంపియన్ అయిన పీట్ సంప్రాస్‌ను ఓడించాడు.

2002 : ఫెడరర్ తన తొలి ఏటిపి మాస్టర్స్ సీరీస్‌లో ప్రవేశించి ఫైనల్లో ఆండ్రీ అగస్సీ చేతిలో పరాజయం పొందినాడు. ఆ తరువాత హాంబర్గ్‌లో ఏ.ఎం.ఎస్. ఫైనల్స్ గెలుపొందినాడు. డేవిస్ కప్‌లో కూడా రెండు మ్యాచ్‌లను గెల్చాడు.

2003 : 2003లో ఫెడరర్ పురుషుల టెన్నిస్‌లో టాప్ ర్యాంకింగ్‌ను సవాలు చేసాడు. ఇదే ఏడాది తన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పోరాటాన్ని ఆరంభించాడు. నాలుగవ రౌండ్‌లో పరాజయం పొందిననూ ఆ తరువాత మార్సెల్లీ, దుబాయిలలో జరిగిన హార్డ్‌కోర్ట్ టోర్నమెంట్లలో విజయం సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన క్లే కోర్ట్ టోర్నమెంటులో కూడా విజయం సాధించాడు. ఆ తరువాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. జూలైలో హాలేలో జరిగిన టోర్నమెంటులో గెలుపొందినాడు. లండన్‌లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్‌ను గెల్చి తన క్రీడా జీవితంలోనే తొలి గ్రాండ్‌స్లాం టైటిల్ సాధించాడు. ఈ టోర్నమెంటులో అతడు కోల్పోయినది ఒకేఒక్క సెట్టు మాత్రమే. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ వలె 4 వ రౌండ్‌లోనే పరాజయం పొందినాడు.

2004 : ఫెదరర్‌కు 2004 అత్యంత ఫలప్రథమైన సంవత్సరంగా చెప్పవచ్చు.[6] ఈ సంవత్సరంలో 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళతో పాటు పలు ఇతర సింగిల్స్ టైటిళ్ళు కైవసం చేసుకున్నాడు. మొదట ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మారట్ సఫిన్‌ను ఓడించి 2004లో తొలి గ్రాండ్‌స్లాం సాధించాడు. దీనితో ప్రపంచ నెంబర్ 1 గా ఉన్న ఆండీ రోడిగ్‌ను వెనక్కి నెట్టి తను ఆ స్థానాన్ని పొందినాడు. అప్పటి నుంచి వరుసగా ఇన్ని వారాలు గడిచిననూ ఫెదరర్ నెంబర్ 1 స్థానాన్ని వదలలేడు. వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆండీ రోడిగ్ పైనే ఫైనల్లో విజయం సాధించాడు. ఆ తరువాత అమెరిక ఓపెన్‌లో ల్యూటన్ హెవిట్ పై గెలిచి టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం 3వ రౌండ్ వరకు మాత్రమే వెళ్ళగలిగాడు.

2005 : 2005లో 2 గ్రాండ్‌స్లాంలు సాధించి మరో రెండింటిలో సెమీఫైనల్స్ వరకు చేరినాడు. మొదటగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో సఫిన్ చేతిలో 5 గంటలపాటు జరిగిన పోరులో పరాజయం పొందినాడు.[7] ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సెమీఫైనల్లో నాదల్ చేతిలో ఖంగుతిన్నాడు. ఆ తరువాత వింబుల్డన్ లో ఆండీ రోడిగ్‌ను ఓడించి టైటిల్ సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో కూడా ఆండ్రీ అగస్సీని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 15 టోర్నమెంట్లలో పాల్గొని 11 టైటిళ్ళు సాధించాడు.

2006 : 2006లో కూడా ఫెదరర్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగితా అన్ని గ్రాండ్ స్లాంలు అతని ఖాతాలో వచ్చాయి. ఆస్త్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో మార్కొస్ బాగ్దాటిస్ను ఓడించి టైటిల్ పొందగా, వింబుల్డన్‌లో రాఫెల్ నాదల్‌ను పరాజయం చేసి టైటిల్ 4 వ సారి సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో ఆండీ రోడిక్‌ను ఓడించి 3వ సారి టైటిల్ పొందినాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ చేతిలో దెబ్బతిన్నాడు.

2007 : 2007లో కూడా ఫెదరర్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించి మరో దానిలో ఫైనల్స్ వరకు వెళ్ళినాడు. ఈ విధంగా ఒకే సంవత్సరంలో 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించడం ఫెదరర్‌కు ఇది 3 వ పర్యాయం. 2004, 2006లో వలె ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగితా అన్ని గ్రాండ్‌స్లాంలు అతని ఖాతాలో చేరినవి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో ఫెర్నాండో గొంజాలెజ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టోర్నమెంటులో ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా టైటిల్ సాధించి 1980లో జాన్ బోర్గ్ తరువాత ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[8] వింబుల్డన్‌లో రాఫెల్ నాదల్‌ను పరాజయం చేశాడు. అమెరిక ఓపెన్‌లో నొవాక్ డొకోవిక్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్ళి 2006లో వలె రాఫెల్ నాదల్ చేతిలో ఓడిపోయాడు.

2008 : 2008లో తొలి గ్రాండ్‌స్లాం టోర్నమెంటు అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళినాడు. సెమీస్‌లో నోవాక్ జోకోవిచ్ చేతిలో 7-5, 6-3, 7-6 (5) స్కోరుతో పరాజయం పొందినాడు.

రికార్డులు

[మార్చు]
  • జాన్ బోర్గ్ నెలకొల్పిన 5 వరుస వింబుల్డన్ టైటిళ్ళ రికార్డును సమం చేసాడు.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా 4 టైటిళ్ళు సాధించాడు.
  • వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉండి కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు పూర్వం జిమ్మీ కానర్స్ 160 వారాలపాటు నెంబర్‌వన్ గా ఉన్నాడు. మహిళలలో స్టెఫీ గ్రాఫ్ 186 వారాలపాటు నెంబర్‌వన్‌గా ఉండి రికార్డు నెలకొల్పింది.
  • ఇప్పటీకి 302 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉనాడు.
  • 20 మాస్టర్ 1000 టైటిళ్ళు సాధింఛిన రికార్డును సమం చేసాడు.
  • 7 వింబుల్డన్ టైటిళ్ళను,5 అమెరికన్ టైటిళ్ళను సాధించాడు.
  • అన్ని మాస్టర్ 1000 టైటిళ్ళు ఫైనల్ చేరి కొత్త రికార్డు సృష్టించాడు.

సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు

[మార్చు]
Year Championship Opponent in Final Score in Final
2003 వింబుల్డన్ టెన్నిస్ ఆస్ట్రేలియా మార్క్ ఫిలిప్పోసిస్ 7-6, 6-2, 7-6
2004 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ Russia మారట్ సఫిన్ 7-6, 6-4, 6-2
2004 వింబుల్డన్ టెన్నిస్ (2వ సారి) యు.ఎస్.ఏ ఆండీ రోడిక్ 4-6, 7-5, 7-6, 6-4
2004 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ ఆస్ట్రేలియా ల్యూటన్ హెవిట్ 6-0, 7-6, 6-0
2005 వింబుల్డన్ టెన్నిస్ (3వ సారి) యు.ఎస్.ఏ ఆండీ రోడిక్ 6-2, 7-6, 6-4
2005 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) యు.ఎస్.ఏ ఆండ్రీ అగస్సీ 6-3, 2-6, 7-6, 6-1
2006 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) సైప్రస్ మార్కొస్ బాగ్దాటిస్ 5-7, 7-5, 6-0, 6-2
2006 వింబుల్డన్ టెన్నిస్ (4వ సారి) స్పెయిన్ రాఫెల్ నాదల్ 6-0, 7-6, 6-7, 6-3
2006 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) యు.ఎస్.ఏ ఆండో రోడిక్ 6-2, 4-6, 7-5, 6-1
2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) చిలీ ఫెర్నాండో గొంజాలెజ్ 7-6, 6-4, 6-4
2007 వింబుల్డన్ టెన్నిస్ (5వ సారి) స్పెయిన్ రాఫెల్ నాదల్ 7-6, 4-6, 7-6, 2-6, 6-2
2007 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి) సెర్బియా నోవక్ డొకోవిక్ 7-6, 7-6, 6-4
2008 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (5వ సారి) United Kingdom ఆండీ murray 6-4, 7-5, 6-1
2009 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ Sweden రాబిన్ సోడర్లింగ్ 6-1, 7-6, 6-4
2009 వింబుల్డన్ టెన్నిస్ (6వ సారి) యు.ఎస్.ఏ ఆండీ రోడిక్ 5-7, 7-6,7-6, 3-6, 16-14
2010 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి) United Kingdom ఆండీ murray 6-4, 6-3, 7-6
2012 వింబుల్డన్ టెన్నిస్ (7వ సారి) యు.ఎస్.ఏ andy murry 4-6, 7-5,7-6, 6-3, 6-4
2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (5వ సారి) స్పెయిన్ రాఫెల్ నాదల్ 6-3, 3-6, 6-1, 3-6, 6-3

సింగిల్స్‌లో ఫలితాల విశ్లేషణ

[మార్చు]
టోర్నమెంటు 1998 1999 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 2009 2010 2011 కేరీర్ గెలుపు వాటా విజయాలు-ఓటమిలు
గ్రాండ్‌స్లాంలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ A LQ 3R 3R 4R 4R W SF W W SF F W SF 3 / 9 41-6
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ A 1R 4R QF 1R 1R 3R SF F F F W QF F 0 / 9 26-9
వింబుల్డన్ టెన్నిస్ A 1R 1R QF 1R W W W W W F W QF QF 5 / 9 38-4
అమెరిక ఓపెన్ టెన్నిస్ A LQ 3R 4R 4R 4R W W W W W F SF SF 4 / 8 38-4
విజయాల వాటా 0 / 0 0 / 2 0 / 4 0 / 4 0 / 4 1 / 4 3 / 4 2 / 4 3 / 4 3 / 4 0 / 1 12 / 35 N/A
గెలుపు-ఓటములు 0-0 0-2 7-4 13-4 6-4 13-3 22-1 24-2 27-1 26-1 5-1 N/A 143-23
ఒలింపిక్ క్రీడలు
ఒలింపిక్ క్రీడలు NH NH SF NH NH NH 2R NH NH NH 0 / 2 5-3
క్రీడాజీవితం గణాంకాలు
సంవత్సరం 1998 1999 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 Career
ఆడిన టొర్నమెంట్లు 3 14 28 22 25 23 17 15 17 16 1 N/A 180
టైటిళ్ళు 0 0 0 1 3 7 11 11 12 8 0 N/A 53
రెండోస్థానం 0 0 2 2 2 2 0 1 4 4 0 N/A 17
విజయాల శాతం 40% 43% 55% 70% 73% 82% 93% 95% 95% 88% N/A 80%
సంవత్సరం అంతానికి ర్యాంకు 301 64 29 13 6 2 1 1 1 1 N/A N/A

A = టోర్నమెంటులో పాల్గొనలేడు
WR = విజయాల శాతం
NH = నిర్వహించలేదు
LQ = అర్హత డ్రాలో ఓటమి.

మూలాలు

[మార్చు]
  1. "Federer sets record as number one" (in English). CNN. 2007.{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  2. * "Roddick: Federer might be greatest ever". The Associated Press. 2005-07-03. Retrieved 2007-03-02.
  3. "Profile". rogerfederer.com. Archived from the original on 2007-07-11. Retrieved 2007-07-19.
  4. Federer, Roger (September 2004). "Fanletter September 2004" (PDF). Archived from the original (PDF) on 2009-09-26. Retrieved 2007-06-30.
  5. "Life as a Junior". Archived from the original on 2007-03-31. Retrieved 2007-06-20.
  6. Niebuhr, Keith. "America's love affair with Federer lies ahead". St. Petersburg Times. Retrieved 2007-06-21.
  7. "Safin stuns Federer in epic semi". BBC Sport/Tennis. 2005-01-27. Retrieved 2007-06-21.
  8. "Bjorn Borg-Tennis Hall of Fame". Archived from the original on 2007-02-27. Retrieved 2007-06-21.