వాడుకరి చర్చ:Bhamidipalli v raghavarao
Bhamidipalli v raghavarao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
{{ #if: | |
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 03:27, 12 ఆగష్టు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!
మరింత సమాచారం కోసం వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల " |}
వికిపీడియాలో ఆర్టికల్ గురించి
[మార్చు] సహాయం అందించబడింది
—Bhamidipalli v raghavarao (చర్చ) 17:21, 5 సెప్టెంబరు 2016 (UTC)
నేను 'సరికొత్త సమాచారం' వార పత్రిక ఇదే పేరుతో వెబ్ సైట్ నడుపుతున్నాను. రాజమహేంద్రవరం ప్రముఖులు , హిస్టారికల్ ప్రదేశాలు గురించి రాయాలని వుంది. వీరేశలింగం టౌన్ హాలు గురించి కొద్దిసేపటి క్రితం రాసాను. నాకు ఈ పేజీ గురించి పూర్తిగా తెలీదు. ఎలా అనుసరించాలి చెప్పండి అలాగే గూగుల్ ట్రాన్స్ లేట్ టైపు చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అలా చేయవచ్చా--Bhamidipalli v raghavarao (చర్చ) 17:21, 5 సెప్టెంబరు 2016 (UTC) bv raghavarao
- భమిడిపాటి రాఘవరావుగార్కి స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీరు నడుపుతున్న సరికొత్త సమాచారం పత్రిక చూసాను. బాగుంది. మీరు మీకు తెలిసిన విషయాలను వికీపీడియాలో వ్యాసాలు రాయవచ్చు. రాజమహేంద్రవరం ప్రముఖులు, చారిత్రిక ప్రదేశాల గూర్చి వ్యాసాలను సృష్టించి రాయండి. కానీ మీరు చేర్చిన విషయం ఏ మూలం నుండి గ్రహించారో ఆయా విషయం చివర రాయాలి. మీరు మీ కృషిని కొనసాగించండి. ఏదైనా సహాయం అవసరమైతే తెలియజేయండి. విధానాలు తెలిసిన సభ్యులు సహకరిస్తారు.
- మీరు గూగుల్ ట్రాన్స్ లేటర్ టూల్ ద్వారా కాపీ పేస్టు చేసినట్లయితే ఆ వ్యాసంలోని వాక్యాలు కృత్రిమంగా ఎవరూ అర్థం చేసుకోని విధంగా అనువదింపబడతాయి. మీరు ఆ వ్యాసాన్ని తగురీతిలో శుద్ధి చేయవలసి ఉంటుంది.
- మూలాలను చేర్చే విధానం: మీరు "వినాయకచవితి" అనే వ్యాసంలో మీ పత్రిక లోని వినాయక చవితి పరమార్థం అనే విభాగం చేర్చాలనుకున్నారనుకుందాం. అందులోని కొన్ని వాక్యాలను చేర్చి చివర మీ పత్రిక మూలాన్నుంచాలి. పత్రికలలో వచ్చిన వ్యాసాన్నంతా యదాతథంగా కాపీ పేస్టు చేయరాదు. కాపీహక్కుల ఉల్లంఘనకు వస్తుందని గమనించాలి. కొన్ని ముఖ్యమైన వాక్యాలను చేర్చాలి. ఉదాహరణకు, వినాయక చవితి వ్యాసంలో మీరు మీ పత్రికలో గల వ్యాసంలో "వినాయక చవితికి ఉపయోగించే ఆకులలో చాలా విశేష ఔషథ గుణాలు ఉన్నాయి." అనే వాక్యం చేర్చారనుకుందాం దానిని ఈ క్రిందివిధంగా మూలాన్ని చేరుస్తూ టైప్ చేయాలి.
వినాయక చవితికి ఉపయోగించే ఆకులలో చాలా విశేష ఔషథ గుణాలు ఉన్నాయి.<ref>[http://sarikothasamacharam.com/20th-issue-2016-september-2/ వినాయకచవితి- పరమార్థం - సరికొత్త సమాచరం పత్రిక -5-9-2015]</ref>
పేజీని భద్రపరచిన తరువాత ఆ వాక్యం ఈ క్రింది విధంగా కనబడుతుంది.
వినాయక చవితికి ఉపయోగించే ఆకులలో చాలా విశేష ఔషథ గుణాలు ఉన్నాయి.[1]
ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 04:30, 10 సెప్టెంబరు 2016 (UTC)
ఫోటోల అప్ లోడ్ గురించి
[మార్చు] సహాయం అందించబడింది
—Bhamidipalli v raghavarao (చర్చ) 05:08, 10 సెప్టెంబరు 2016 (UTC)
శ్రీ వెంకటరమణ గారికి కృతజ్ఞతలు ...అయ్యా మీరు బానే చెప్పారు. ఫోటోలు పెట్టాలంటే ఎలాగ , కొన్ని ఫోటోలు అప్ లోడ్ అవ్వడం లేదు. ఎన్ని ఫోటొలు పెట్టవచ్చు . ఇక వీడియో లింక్ లు ఇవ్వ వచ్చా .
ఫోటోలను అప్ లోడ్ చేసే విధానం
[మార్చు]- మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
- మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
- అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
- ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
- మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
- ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
- ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే లో క్లిక్ చేయండి.
- తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
- తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.
ఏ విధమైన సహాయం కావలసి వస్తే సంప్రదించండి.--కె.వెంకటరమణ⇒చర్చ 05:17, 10 సెప్టెంబరు 2016 (UTC)
ఎన్ని చిత్రాలను చేర్చాలి
[మార్చు]ఒక చిన్న వ్యాసానికి అనేక చిత్రాలను చేర్చితే బాగుండదు. అవసరాన్ని బట్టి చిత్రాలను చేర్చాలి. మహాత్మా గాంధీ గురించి కామన్స్ లో ప్రస్తుతం 90 చిత్రాలున్నాయి. అన్ని చిత్రాలను వ్యాసంలో చేర్చలేము కదా! ముఖ్యమైన ఆ వ్యాసానికి తగిన చిత్రాలను చేర్చి వ్యాసం క్రింది భాగంలో {{commonscat|Mohandas K. Gandhi}} అనే మూసను చేర్చితే వ్యాసం చివర కుడివైపున
మహాత్మా గాంధీ యొక్క కామన్స్ లో ఉన్న చిత్ర వర్గం కనబడుతుంది. చిత్రాలను శోధించేవారు ఆ లింకును సందర్శిస్తారు. ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 05:35, 10 సెప్టెంబరు 2016 (UTC)
వీడియో లింకులు
[మార్చు]వికీపీడియాలో వీడియో లింకుల గూర్చి Video links వ్యాసం సందర్శించంది.--కె.వెంకటరమణ⇒చర్చ 05:38, 10 సెప్టెంబరు 2016 (UTC)
ఆధారాలు ఎలా
[మార్చు] సహాయం అందించబడింది
అయ్యా వెంకట రమణ గారు , మాఇంటి పేరు భమిడిపల్లి . భమిడిపాటి కాదు ... భమిడిపాటి రాధాకృష్ణ గారి గురించి కూడా రాస్తాను. కొంతమంది ప్రముఖుల కు సంబంధించి వివరాలు సేకరించి రాస్తే వాటికి , లింక్ లు , ఆధారాలు ఎలా చూపాలి .. చెప్పగలరు—Bhamidipalli v raghavarao (చర్చ) 05:11, 10 సెప్టెంబరు 2016 (UTC)
- నేను మీ ఇంటిపేరును సరిగా పరిశీలించలేదు. క్షంతవ్యుణ్ణి. మీరు ఏ ప్రముఖుని వ్యాసమైన చేర్చాలనుకుంటే ఆ వ్యక్తి గురించి ఉన్న నోటబిలిటీ ఉన్న వివిధ పుస్తకాల లింకులను కూడా చేర్చవచ్చు. గూగుల్ లో శోధించి ఆయన గూర్చి వివిధ పత్రికలలొ వచ్చే ఆర్టికల్స్ నుండి వాక్యాలను సేకరించి వాటి మూలాలను కూడా చేర్చవచ్చు. మరింత సమాచారానికి ఈ లింకు చూడండి.--కె.వెంకటరమణ⇒చర్చ 05:27, 10 సెప్టెంబరు 2016 (UTC)
మీరు వికీపీడియా:మూలాలను పేర్కొనడం వ్యాసం చూడండి.--కె.వెంకటరమణ⇒చర్చ 05:31, 10 సెప్టెంబరు 2016 (UTC)
వీరేశలింగం టౌన్ హాల్
[మార్చు]వీరేశలింగం టౌన్ హాల్ వ్యాసం సృష్టించినందులకు ధన్యవాదాలు. ఒక పేరాగ్రాప్ ప్రారంభించినపుడు ముందు స్పేస్ ఇవ్వకండి. ఒకవేళ యిస్తే అది బాక్స్ లో కనబడుతుంది. అందులో విభాగాలు కావలసి వస్తే ఉదాహరణకు "టౌన్ హాల్ విశేషాలు" అనే విభాగం చేర్చదలిస్తే ==టౌన్ హాల్ విశేషాలు== అని ప్రారంభించాలి. అప్పుడు సేవ్ చేసిన తదుపరి ఉప విభాగంగా కనబడుతుంది. మూలాలను చేర్చేటప్పుడు ప్రతీ మూలానికి <ref> మూలం </ref> ట్యాగ్స్ ను ఉపయోగించండి. వ్యాసం చివర "మూలాలు" అనే విభాగాన్ని చేర్చి అందులో {{మూలాలజాబితా}} అనే మూసను చేర్చాలి. అప్పుడు మీరు చేర్చిన మూలాలన్నీ అక్కడికి చేరుతాయి. సంఖ్య మరియు బిందు జాబితాలకోసం # మరియు * అనే గుర్తులను ఉంచండి. మరిన్ని సాంకేతిక ఫార్మాటింగ్ అంశాలను ఎడిట్ చేస్తున్న పేజీలో పై వైపున చూడవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 06:38, 10 సెప్టెంబరు 2016 (UTC)
చిత్రాలను చేర్చండి
[మార్చు]మీరు రాసిన వీరేశలింగం టౌన్ హాల్ యొక్క చిత్రాలను అప్ లోడ్ చేసి వ్యాసంలో చేర్చగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 09:37, 10 సెప్టెంబరు 2016 (UTC)
సందేహం
[మార్చు]- ఫోటోలు, సొంత పేజీ గురించి, కొంచెం వివరంగా చెప్పగలరు.
- వెంకటరమణ గారు మీతో పరిచయం ఆనందం కలిగిస్తోంది. మీరు అందించిన వివరాలు కొంచెం అర్ధం అయ్యాయి. అయితే తెలుగులో కొడుతుంటే కొన్ని పదాలు పడడం లేదు. అందుకే గూగుల్ ట్రాన్స్ లేషన్ లో కొడ్తున్నాను. ఇక్కడే నేరుగా టైపు చేయాలంటే ఏం చేయాలి?
- ఇక వీరేశలింగం ఆర్టికల్ ఆమోదం అయిందా. ఫోటోలు తర్వాత పెట్టవచ్చా? ఇక నా పేరుతొ పేజీ వస్తుందా? ఎప్పుడు? ఎలా?
- 22 ఏళ్ళ నుంచి జర్నలిస్టుగా ఉన్న నేను వీకీపీడియాలో పేజీ సృష్టించుకోగలనా? --16:37, 10 సెప్టెంబరు 2016 Bhamidipalli v raghavarao (చర్చ|రచనలు)
సమాధానం
[మార్చు]- వ్యాసాలలో మీ యొక్క స్వంతంగా తీసిన చిత్రాలను కామన్స్ లో ఎక్కించాలి. కామన్స్ లో చిత్రం అప్‌లోడ్ అయిన తదుపరి చిత్రం యొక్క వివరాలను ఆ వ్యాసంలో చేర్చవచ్చు. ఆ చిత్రాలను [[File:Example|250px|right|చిత్రం వివరం]] అని వ్యాసంలో మీకు కావలసిన విభాగంలో చేర్చితే మీకు కావలసిన చిత్రం కనబడుతుంది.
- మీయొక్క వాడుకరి పేజీలో మీయొక్క వివరాలను మీరే చేర్చవచ్చు. వాడుకరి పేజీలో మీ యొక్క బయోగ్రఫీని మీరే వ్రాసుకోవచ్చు.
- తెలుగులో అక్షరాలు టైప్ కానప్పుడు cntrol+M ఒత్తితే లిప్యంతరీకరణ ఏక్టివేట్ అయి తెలుగు అక్షరాలను సులువుగా నేరుగా టైప్ చేయవచ్చు.
- సరైన మూలాలు ఉన్నప్పుడు ఆ వ్యాసం మంచి వ్యాసం అవుతుంది. కనుక వీరేశలింగం టౌన్ హాల్ సరియైన వ్యాసమే.
- మీరు లాగిన్ అయిన తరువాత వెంటనే ఎర్ర లింకుతో మీ పేరు కనవడిన మీ వాడుకరి పేజీ వాడుకరి:Bhamidipalli v raghavarao అని ఉంటుంది. దానిని ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను మీరే చేర్చవచ్చు.
- మీరు ఎవరి గురించి అయినా మూలాలు లభిస్తే వ్యాసాలు వ్రాయవచ్చు. కానీ మీరు నోటబిలిటీ ఉన్న వ్యక్తి అయినా మీయొక్క పేజీని వ్యాసంగా మీరు సృష్టించకూడదు. సరియైన మూలాలు లభిస్తే యితర వాడుకరులు మీయొక్క వ్యాసాన్ని సృష్టిస్తారు. మీ గురించి వార్తాపత్రికల, అంతర్జాల మూలాలెమైనా ఉంటే తెలియజేయండి. మీ గురించి వ్యాసం వ్రాయగలము.--కె.వెంకటరమణ⇒చర్చ 04:55, 11 సెప్టెంబరు 2016 (UTC)
ఫొటొ గురించి
[మార్చు]అయ్యా , వీరెశలింగం టౌన్ హలు ఫొటొ అప్ లొడ్ చెసాను ఒకసారి ఎలా వచ్చిందొ ఒకసారి పరిశీలించగలరు. అది పాత ఫొటొ. కమిటీ వాళ్ళ దగ్గర సంపాదించాను. వ్యాసం లొ అప్ లొడ్ అయ్యిందా? ఇక మెల్లిగా వికీలొనె కొదుతున్నాను, కొన్ని అక్షరాలు సరిగ్గా రాలెదు అది ఎలాగొ చెప్పండి సంతంకం అంటున్నారు అది ఎలా? ఇలాగెనా--Bhamidipalli v raghavarao (చర్చ) 16:45, 17 సెప్టెంబరు 2016 (UTC)
- రాఘవరావుగారూ, మీరు అప్‌లోడ్ చేసిన వీరేశలింగం టౌన్ హాల్ కామన్స్ లో అప్‌లోడ్ అయినది. దానిని File:Town hal.jpg గా అప్‌లోడ్ చేసారు. దీనిని వీరేశలింగం టౌన్ హాల్ వ్యాసంలో [[File:Town hal.jpg|right|250px|thumb|వేరేశలింగం టౌన్‌హాల్]] అని చేర్చితే ఆ చిత్రం వ్యాసంలో చేరుతుంది. మీరు సరిగ్గానే తెలుగు టైపింగ్ నేర్చుకున్నారు. ఏవైనా పదాల టైపింగులో కష్టమనిపిస్తే సహాయాన్ని అభ్యర్థించండి. మీరు సంతకం సరిగ్గానే చేసారు. మీరు మరిన్ని ప్రముఖుల వ్యాసాలను తెవికీకి అందించాలని మా ఆకాంక్ష.--కె.వెంకటరమణ⇒చర్చ 07:26, 18 సెప్టెంబరు 2016 (UTC)
నా పరిచయం రాసిన చోట
[మార్చు]మీరు వీరేసశలింగం ఫొటో అప్ లోడ్ చేశారు చూసాను. కాని నా పరిచయం రాసాను సరిపొతుందా. ఇక అక్కడ నా ఫొటో అప్ లోడ్ అవుతుందా అది ఎలా అప్ లోడ్ చేయాలి. కేటగిరీ అడిగిన చోట అసలు ఎమి రాయాలొ తెలియడం లేదు. ఎలాగో చెప్పరూ..--రాఘవీయం 08:45, 18 సెప్టెంబరు 2016 (UTC)
- మీరు కామన్స్ లో చేర్చిన చిత్రాన్నే నేను వీరేశలింగం టౌన్‌హాల్ వ్యాసంలో చేర్చాను. మీరు కామన్స్ లో అప్ లోడ్ అయిన తదుపరి "ఈ దస్త్రాన్ని వికీలలో ఉపయోగించడానికి, ఈ పాఠ్యాన్ని పేజీ లోనికి కాపీచెయ్యండి:" అనే బాక్సులో గల విషయాన్ని కాపీచేసి సంబంధిత వ్యాసంలో పేస్టు చేసినట్లయితే ఆ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. మీ యొక్క వివరాలను మీ యొక్క వాడుకరిపేజీలో సంగ్రహంగా చేర్చారు. ఇంకా ఏవైనా వివరాలు ఉంటే చేర్చుకోవచ్చు. పై విధంగానే పోటో అప్‌లోడ్ చేసినపుడు కేటగిరీ విభాగంలో "wikipedians" అని చేర్చండి.--కె.వెంకటరమణ⇒చర్చ 09:05, 18 సెప్టెంబరు 2016 (UTC)
మూలాలు
[మార్చు]మీరు రాసిన రాజమండ్రి దేవీచౌక్ బాగుంది. వ్యాసంలో చిత్రాలు చేర్చినందులకు ధన్యవాదాలు. వ్యాసం చివర "మూలాలు" అనే విభాగం ==మూలాలు== గా చేర్చి అందులో {{మూలాలజాబితా}} అనే మూసను చేర్చి భద్రపరచండి. మూలాలు అనేకం ఉండవచ్చు. మీరు వ్యాసం లొ విభాగంలో <ref>[http://godavarisakshi.com/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%80%E0%B0%9A%E0%B1%8C%E0%B0%95%E0%B1%8D%E2%80%8C-%E0%B0%95%E0%B0%BF%E0%B0%9F%E0%B0%95%E0%B0%BF/ భక్తులతో దేవీచౌక్ కిటకిట]</ref> అని చేర్చి తరువాత భద్రపరిస్తే మూలాల విభాగంలోనికి "భక్తులతో దేవీచౌక్ కిటకిట" అనే లింకు చేరుతుంది. ప్రయత్నించండి. --కె.వెంకటరమణ⇒చర్చ 10:52, 8 అక్టోబరు 2016 (UTC) చరవాణి:8008423323
రత్నం బాల్ పెన్ వర్క్స్
[మార్చు]నమస్కారం రాఘవరావు గారూ. రత్నం బాల్ పెన్ వర్క్స్ వ్యాసం చాలా బాగుంది. తెవికీలో నేను చూసిన గొప్ప ఒరిజినల్ వ్యాసాల్లో ఇదొకటి. ఈ వ్యాసాన్ని సమర్పించినందుకు ధన్యవాదాలు. ఈ వారపు వ్యాసం గాను, విశేష వ్యాసం గానూ దీన్ని అభివృద్ధి చెయ్యవచ్చు. కొన్ని సూచనలు - మూలాలు చేర్చాలి. జాలంలో చూస్తే మూలాలు దొరికాయి, వాటిని చేర్చవచ్చు. ఈ విషయంలో నన్నూ ఓ చెయ్యి వెయ్యమంటే వేస్తాను. మరింత సమాచారం దొరికితే వ్యాసాన్ని విస్తరించవచ్చు. ఫొటోలు పెడితే బాగుంటుంది. గాంధీజీ రాసిన ఉత్తరం ఇప్పటికీ వారిదగ్గర ఉందట గదా.., దొరికితే ఆ ఫొటో కూడా పెట్టవచ్చు. వీలైతే పరిశీలించండి. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను.. వ్యాసం పేరు బాల్ పెన్ వర్క్స్ ఆని ఎందుకు పెట్టారు, రత్నం పెన్ వర్క్స్ అని పెట్టవచ్చు కదా? __చదువరి (చర్చ • రచనలు) 05:58, 14 అక్టోబరు 2016 (UTC)
అయ్యా నమస్కారం ,
మీ కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు. మూలాలకు సంబంధించి ఆయా పేపర్ లలొ పడిన తేదీలకోసం చూస్తున్నా, ఒకవేళ మీకు తెలిస్తే పెట్టండి. ఇక గాంధి గారి లెఖ ఫొటొ పెట్టాను, కానీ కాపీరైట్ అనే మెసెజ్ ఇచ్చి తొలగించారు. ఇప్పటికీ నాకు అలా ఎందుకు తీసారొ అర్ధం కాలేదు. దీని గురించి కెవిఆర్.లోహిత్ గారిని సందేహం అడిగాను. ఇంకా బదులు రాలేదు. బాల్ పెన్ వర్క్స్ అని ఎందుకు పెట్టానంటె వాళ్ళతో ఎక్కువ అనుబంధం వుంది. పైగా రెందు షాపులు ఎదురెదురుగానే వుంటాయి. మార్చాలంటె మార్చవచ్చు. అయినా చాలా కొత్తగా వుంది. ఎది రాస్తె ఇబ్బందొ అని అనిపిస్తొంది. మరొసారి ధన్యవాదాలు. --రాఘవీయం 06:59, 14 అక్టోబరు 2016 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
స్వాగతం
[మార్చు]రాఘవరావు గార్కి నమస్కారములు. తెవికీలోకి నాలుగు సంవత్సరాల తరువాత తిరిగి ప్రవేశించినందుకు స్వాగతం. మీ కృషిని మరలా కొనసాగించండి. ఏదైనా సందేహాలుంటే తెలియజేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:18, 10 ఆగస్టు 2022 (UTC)
ఫోటోలు చేర్చడంలో సహాయం
[మార్చు]నేను చాలారోజుల విరామం తర్వాత వికీలో పునః ప్రవేశించా .. రాయడం రాస్తున్నాను కానీ, ఫోటోలు అప్ లోడ్ చేయడం రావడం లేదు .. నేను ఫోటోలు ఎవరికైనా మెయిల్ లో పంపిస్తే వ్యా సంలో పెట్టించగలరా —రాఘవీయం 06:44, 20 ఆగస్టు 2024 (UTC)
సహాయం అందించబడింది
—రాఘవీయం 06:44, 20 ఆగస్టు 2024 (UTC) {{వాడుకరి:Bhamidipalli v raghavarao|రాఘవీయం]] గారూ, మీరు పోటోలు చేర్చేటప్పుడు అవి మీ స్వంత ఫోటోలు అయితే ఈ క్రింది సూచనల ప్రకారం కామన్స్ లో ఎక్కించండి. దానిని వికీ వ్యాసాలలో వాడుకోవచ్చు.
కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం
[మార్చు]- మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
- మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
- అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
- ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
- మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
- ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
- ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే లో క్లిక్ చేయండి.
- తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
- తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 04:29, 10 అక్టోబరు 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున