Jump to content

వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 7

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కన్ఫ్యూజన్

[మార్చు]

చంద్రకాంతరావు గారూ, నమస్తే. భారత స్వాతంత్రోద్యమము లేదా భారత స్వాతంత్ర్యోద్యమము. వీటిలో ఏది సరైనది. కన్ఫ్యూజన్ లో పడ్డాను. దయచేసి తెలుపండి. అహ్మద్ నిసార్ 16:09, 10 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే నిసార్ గారు, స్వాతంత్ర్యోద్యమమే సరైనది. ఎందుకంటే స్వాతంత్ర్యం పదం సరైనది కాని స్వాతంత్రం సరైనది కాదుకదా. ఈ రోజుల్లో కొందరు స్వాతంత్రం అనే సంక్షిప్తంగా వాడుతున్నారు కాని సరైన పదం మాత్రం స్వాతంత్ర్యమే. -- C.Chandra Kanth Rao-చర్చ 19:31, 10 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 19:41, 10 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల జాబితా

[మార్చు]
చంద్రకాంతరావు గారూ నమస్తే. డెప్త్ గురించి రచ్చబండలో తెలిపారు ధన్యవాదాలు. అలాగే వికీపీడియా:మొలకల జాబితా లో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ పేరు మూడు సార్లు రిపీట్ అయినది, వరుస సంఖ్య 248, 249, 250. కానీ ఈ వ్యాసం మొలక స్థాయి దాటిందనిపిస్తుంది. దీనిని మొలకల జాబితానుండి తొలగించవచ్చా? అహ్మద్ నిసార్ 19:42, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్తే నిసార్ గారు, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ 3 సార్లు రిపీట్ కావడానికి కారణం దారిమార్పులే కారణమనుకుంటా, అన్నవరం (బడంగి) కూడా వరుసగా రెండు (172, 173) సార్లు రిపీట్ అయింది. అలాగే ఆది నారాయణ రావు కూడా 400, 401, 405, 406 లలో నాలుగు సార్లు వచ్చింది. ఆలూరి భుజంగరావు 463, 466 రెండు సార్లు, ఉషా కిరణ్ మూవీస్ 669, 670 రెండు సార్లు, ఉస్తాద్ ఫయాజ్‌ ఖాన్ 673, 674 రెండు సార్లు, ఎ. ఎమ్. రాజా 693, 694, 695 మూడు సార్లు, ఎక్స్-రే 712, 713 రెండు సార్లు ఇలా చూస్తే చాలా వ్యాసాలునాయి. అంటే మొలకల జాబితాలో రిపీట్ అయినవి తొలిగిస్తే మొలకల సంఖ్య మనం అనుకుంటున్న దాని కంటే కూడా తగ్గుతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 20:20, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మొలకల జాబితాలో మొలక స్థాయిని దాటినవి తొలగించే అవసరం అంతగా లేదనుకుంటా, ఎందుకంటే మొలకల జాబితాను రెఫ్రెష్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అవి తొలిగిపోతాయి. దారిమార్పుల వల్ల రెండు కంటే అధికసార్లు వచ్చి వ్యాసాలు తొలగించడం మీఇష్టం. రిఫ్రెష్ చేయుముందు దీని ప్రోగ్రాంలో కొద్దిగా మార్పులు చేస్తే అవి కూడా తొలిగిపోతాయనుకుంటా.-- C.Chandra Kanth Rao-చర్చ 20:30, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ బాటు స్క్రిప్టులో ఏదో తప్పు దొర్లినట్టున్నది. అందుకే కొన్ని దారిమార్పులు ఒకటికంటే ఎక్కువసార్లు వచ్చాయి. అవి సరిచేస్తాను --వైజాసత్య 22:07, 15 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలు

[మార్చు]

చంద్రకాంతరావుగారూ నమస్తే, [వర్గం:వ్యాపారం], [వర్గం:వ్యాపారము], మరియు [వర్గం:వాణిజ్యం] గలవు. వీటిని అవసరరీత్యా ఏకం చేస్తే బాగుంటుందేమో, కొంచెం చెప్ప గలరు. లేదా వీటి గురించి మీరే ఒక చర్య గైకొనగలరు. అహ్మద్ నిసార్ 18:37, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే నిసార్ గారు, మీరు సూచించిన 3 వర్గాలు దాదాపు ఒకే అర్థంతో ఉన్నాయి. వర్గం:వ్యాపారంలో ఎలాంటి వ్యాసాలు లేవు కాబట్టి దాన్ని ఇప్పుడే నేను తొలిగించాను. ఇక అర్థశాస్త్రంలో ఉప వర్గంగా ఉన్న వర్గం:వాణిజ్యం లో వస్తువులు-->ఆయుధాలు ఉపవర్గంలో కత్తి, గద, ఆయుధం, బాణం తదితర అర్థశాస్త్రానికి సంబంధించని వ్యాసాలున్నాయి. అలాగే దేవతల ఆయుధాలు వర్గం, దుస్తులు వర్గం ఈ ప్రధాన వర్గం (అర్థశాస్త్రం)లో ఉండటం అవసరం లేదనుకుంటా. సమయమున్నప్పుడు వీటన్నింటినీ ఒక పట్టుపట్టడానికి ప్రయత్నిస్తా. శోధించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. వీలయితే మీరే సరిదిద్దండి.-- C.Chandra Kanth Rao-చర్చ 19:42, 18 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఓసారి పరికించండి

[మార్చు]

చంద్రకాంతరావుగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 16:58, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులుగా ఇక్కడ జరిగిందేమిటో తెలియదు. గుట్టుచప్పుడు అనే మాటకు ఇక్కడ అర్థం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు, ఎప్పుడు, ఏమి చేసిననూ అంతా బహిర్గతమే, ఎవరికీ తెలియకుండా మార్పు చేయడం వీలుండదు. ఎలాంటి సందేశం లేకుండా మీరు మార్పులు చేసినందుకు కుమారరావు గారు ఆ దృష్టితో వ్రాసినట్లున్నారని బావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 20:34, 29 ఆగష్టు 2009 (UTC)

బొమ్మ లైసెన్సు

[మార్చు]

ఫైలు:Mahabubnagar Toorpu Kaman.JPG, ఫైలు:Ram Mandir, Mahabubnagar.JPG బొమ్మలకు లైసెన్సు వివరం వ్రాయడం మర్చిపోయినట్లున్నారు. ఒకమారు చూడగలరు --కాసుబాబు 18:20, 18 సెప్టెంబర్ 2009 (UTC)

అవును మరిచిపోయినట్లున్నాను. లైసెన్సు వివరాలు వెంటనే చేరుస్తాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:26, 18 సెప్టెంబర్ 2009 (UTC)

దుకాణాల పేర్లు

[మార్చు]

దుకాణాల పేర్లు (ప్రకటనల కోసం కానంతవరకూ) ఇస్తే ఆ ఊరి వ్యాపార వ్యవస్థ కూడా కొంత అవగాహన అవుతుంది. ఏమంటారు? (Navamoini 21:54, 11 అక్టోబర్ 2009 (UTC))

Navamoini గారు, ఏది ప్రకటన, ఏది ప్రకటన కాదు అనేది నిర్ణయించడం కష్టమే. అయితే నేను దుకాణాల పేర్లు తొలిగించినది ఈ విషయంలో కాదు. చిన్న పట్టణంలోనే వందలాది దుకాణాలుంటాయి. వాటన్నింటినీ తెవికీలో చేర్చడం సాధ్యం కాదు, ఏవో కొన్నింటినీ చేర్చిననూ అది పరిపూర్ణం కాదు. అంతేకాకుండా దుకాణాల పేర్లు చేర్చిననూ విజ్ఞానసర్వస్వంలో వాటి ఉపయోగం ఉండదు. పట్టణంలో పేరుపొందిన పరిశ్రమల గురించి, సంస్థల గురించి, థియేటర్ల గురించి, ప్రముఖ ఆసుపత్రుల గురించి చేర్చితే పర్వాలేదు. ఒక పట్టణం వ్యాసంలో పట్టణంలో పేరుపొందిన వాటినే చేర్చితే బాగుంటుంది. ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:55, 12 అక్టోబర్ 2009 (UTC)

వ్యాసము విస్తరించినందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాలు పొందు పరుస్తున్నాను. గమనింపగలరు.Kumarrao 10:19, 8 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఖాళీ విభాగాలు కాకుండా సమాచారం కూడా చేరిస్తే బాగుంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 18:51, 8 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
గుంటూరు ప్రముఖుల వ్యాసాలు వ్రాసి ఈ విషయముపై దృష్ఠి సారిస్తాను.Kumarrao 17:05, 15 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రయోగశాలని చెరచినందుకు క్షమించండి

[మార్చు]

వేదికని సృష్టించాలనే అత్యుత్సాహంతో ప్రయోగశాలని చెరచాను. దీనికి సంబంధించి నా మార్పులని రద్దు చేయమని, పాత ప్రయోగశాలని అలానే ఉంచమని వైజా సత్య గారిని కూడా సహాయం కోరాను. ఒక్కో లాగిన్ ఐడి కి ఒక్కో ప్రయోగశాల ఉంటుంది అని అపార్థం చేసుకోవటం మూలాన ఇలా జరిగింది. నిజానికి దాన్ని చెరిచే ఉద్దేశ్యం నాకు లేదు. sasi 04:10, 25 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వీరా గారు, ప్రయోగశాల ఉన్నది ప్రయోగాలు చేయడానికే. దీనిని చెరచినందుకు మీ మార్పులు రద్దుచేయాలని కోరుకొనే అవసరం లేదు. మీరు కాని ఎవరు కాని అందులో ఏమైనా ప్రయోగాలు చేసుకోవచ్చు. మీరు ప్రయోగాలు చేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రయోగశాలను ఏర్పాటుచేయాలనుకుంటే మీ సభ్యపేజీకి ఉపపేజీగా ప్రయోగశాలను ప్రారంభించవచ్చు కూడా. -- C.Chandra Kanth Rao-చర్చ 18:52, 25 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వేదిక:తెలుగు సినిమా కి ఒక రూపాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చే ప్రేరణతో ఈ వేదికను విజయవంతంగా నిర్వహించగలనని ఆశిస్తున్నాను. దయచేసి వేదిక:రాయలసీమకి కూడా రూపాన్ని ప్రసాదించవలసిందిగా మనవి. sasi 08:34, 27 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వీరాగారు, వేదిక:రాయలసీమ విషయంలో కొద్దిగా వేచిచూద్దాం. ఇప్పటికే వేదిక:ఆంధ్ర ప్రదేశ్ ఉంది. దానినే మనం ఎప్పటికప్పుడు తాజాకరణ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు ప్రస్తుతానికి దాన్ని పట్టించుకుంటే బాగుంటుంది. రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్‌లో భాగమే కదా మళ్ళీ రాయలసీమ వేదిక అవసరం ఇప్పటికైతే లేదనుకూంటా. ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకుండాం. అంతేకాకుండా ఒక సభ్యుడు రెండు వేదికలను చూడటం కష్టమే. అందులోని వ్యాసాలను, బొమ్మలను, వార్తలను, మీకు తెలుసా! విషయాలను ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. లేనిచో దానికి విలువ ఉండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:41, 27 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
సరే, వేచి చూద్దాం. sasi 03:25, 28 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వేదిక మూస గురించి

[మార్చు]

ఖుషి చిత్రంలో తెలుగు సినిమా వేదిక మూసని ఉంచాను. వేదికకు మీరు వాడిన భక్త పోతన చిత్రాన్నే మూసకి కూడా వాడాను. అది మరీ చిన్నది గా కనబడకుండా ఉంది. దీని పై మీ అభిప్రాయం? సరైన చిత్రం ఉంటే అన్ని తెలుగు సినిమా వ్యాసాలలోనూ ఈ మూస పెట్టవచ్చును గదా? దీనికి మీ వద్ద ఏదయినా ఆటోమేటిక్ ప్రోగ్రాం కలదా, లేదంటే ప్రతి వ్యాసానికీ వెళ్ళి మ్యానువల్ గా మూస ఉంచవలసిందేనా? తెలుపగలరు. వీర శశిధర్ జంగం 08:23, 30 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా వేదిక మూసలో చిత్రం మీ ఇష్ట ప్రకారమే చేయండి. (నాకు సినిమాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతగా లేదు) మూసను అతికించే పనిని మ్యానువల్‌గా చేసే అవసరం లేదు, బాటుద్వారా దీనిని తేలికగా చేయవచ్చు. వైజాసత్యగారు ఈ పని చేయగలరు. కాని ప్రతి సినిమా పేజీలో వేదిక మూస అవసరం ఉండదనుకుంటా. తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రధాన పేజీలలో మరియు తెలుగుసినిమాలకు చెందిన అన్ని వర్గాలలో దీన్ని చేర్చవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:34, 30 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వేదికలో మరిన్ని మూసలు చేర్చండి

[మార్చు]
  • వార్తలు, మీకు తెలుసా కాకుండా తెలుగు సినిమా వేదిక లో మరేవైనా మూసలని చేర్చవచ్చునా? దయచేసి చేర్చగలరు. వాటిలో పాయింట్లను నేను నింపుతాను.
  • వేదిక:తెలుగు సినిమా/వార్తలు లో తెలుగు సినిమా వ్యాసం అని కనబడుతోంది. దీనిని సరి చేయవలసింది గా మనవి.

వీర శశిధర్ జంగం 12:04, 3 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా చేర్చవచ్చు. ఈ వారం/పక్షం/మాసం సినిమా కథ, ఈ వారం/పక్షం/మాసం బయోగ్రఫి (నటుడు/నటి/దర్శకుడు/.....ల జీవితచరిత్ర.), ఈ వారం.పక్షం/మాసం బొమ్మ (నటుటు/నటి?దర్శకుడు/......ల బొమ్మ) ఇలా చేర్చడానికి అవకాశం ఉంది. వీలునుబట్టి వారం/రెండువారాలు/నెలకోసారి మార్పులు చేస్తూ ఉంటే బాగుంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 18:57, 4 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాల గురించి

[మార్చు]

శ్వేత సౌధం వ్యాసంలో మూలాలుగా ఈనాడు పత్రికలో వచ్చిన శీర్షిక ను మూలంగా పేర్కొన్నాను. ఇలా ఇవ్వకూడదా? ఇది ఏ నిబంధనకు విరుద్ధం? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరు. —రవిచంద్ర (చర్చ) 17:32, 26 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలను పేర్కొనడానికి ముఖ్యఉద్దేశ్యం వ్యాసం మన సొంతంగా, ఊహాజనితం కాదు అనే కాకుండా ప్రామాణిక గ్రంథాలనుండి సేకరించిన సమాచారం ఈ వ్యాసంలో ఉంది అని చెప్పడానికి. సాధారణంగా మూలాలను ప్రామాణిక గ్రంథాలనుంచి ఇవ్వవలసి ఉంటుంది. కాని దురదృష్టవశాత్తూ తెలుగులో ఉన్నతమైన ప్రామాణిక గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. అందుబాటులో ఉన్నవారందరూ ఇక్కడ పనిచేయడం లేదు. ప్రామాణిక గ్రంథాలకు ISBN కోడ్ తో పాటు సాధారణంగా కాపిరైట్ హక్కు ఉంటుంది. అలాంటి గ్రంథాల నుంచి కొన్ని వ్యాసాలను తీసుకొని వ్యాసాలలో రెపరెన్సుగా పేర్కొంటే వ్యాసం చదివేవారికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా రచించిన వారికి గుర్తింపు ఉంటుంది. ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి మాత్రం సాధారణంగా వార్తాపత్రికలపైనే ఆధారపడిఉండవలసి వస్తుంది. వార్తాపత్రికల నుండి వర్తమాన సంఘటనలు కాకుండా వార్తపత్రికలలో ప్రముఖులు వ్రాసిన ఆర్టికల్స్‌ నుండి కొన్ని వాక్యాలను కూడా తీసుకొంటూ పత్రికపేరు, ఆర్టికల్ రచయిత పేరు రెపరెన్స్‌లో చూపే వీలుంది. కాని చిన్నపిల్లల కోసం వస్తున్న హాయ్ బుజ్జీ శీర్షిక నుండి విజ్ఞాన సర్వస్వంలో వాక్యాలు తీసుకున్నట్లు వ్రాస్తే మనం చులకనవుతాం. మనం కేవలం కాపీరాయుళ్ల మాదిరిగానే మిగిలిపోతాము. దీనికి సంబంధించి నిబంధనల గురించి చెప్పలేను కాని నైతికంగా ఆలోచించినా ఇది బాగుండదు. ఇలా అవకాశం ఇస్తే రేపు కొందరు రెండవ తరగతి, మూడవ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి కూడా సమాచారం వ్యాసాలలొ చేర్చినట్లు రెఫరెన్స్ ఇవ్వవచ్చు. ఇది వరకు బ్లాగుల నుంచి కాపీ చేసిన సమాచారానికి కూడా నేను ఒప్పుకోలేను. వ్యాసాలలొ ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, అవి ఎంతవరకు ప్రామాణికం అన్నదే ప్రధానము. రెఫరెన్సులు లేకున్నా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు, అలాంటి వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి, కాని ఇచ్చే రెఫరెన్సులు ఆలోచించి ఇస్తే చాలు. నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, ఇంకనూ చెప్పే అవసరం లేదనుకుంటా. నిన్న నార్మాన్ బోర్లాగ్ వ్యాసంలో కూడా నేను చేసిన మార్పులను గమనించే ఉంటారు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:46, 26 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
అంటే శ్వేత సౌధం, నార్మన్ బోర్లాగ్ అనే వ్యాసాలు అసలు వికీలో లేకుండా ఉండడం కన్నా ఏదో కొంత సమాచారం ఉంటే బాగుంటుందని భావించి అలా అంశాన్ని వికీకరించి వ్యాసాలుగా చేర్చడం జరిగింది.దీని వరకు మీకు అభ్యంతరాల్లేవనుకుంటాను. కానీ మూలాల విషయంలో మీరు చెప్పినది సబబుగా తోస్తున్నది కాబట్టి ఇక నుంచి అలానే చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు. —రవిచంద్ర (చర్చ) 19:17, 26 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు పైన రెండవసారి చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నాను. వ్యాసాలను చేర్చడంలో ఎక్కడి విషయాలైననూ చేర్చవచ్చు. అసలు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి విషయాలను సేకరిస్తున్నారనేది తెలుసుకోవడం కష్టసాధ్యమే. నేను మూలాల గురించే చెప్పాను కాని వ్యాససమాచరం వృద్ధిచేయడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకుంటే ప్రామాణిక గ్రంథాలతో పోలిస్తే చిన్నపిల్లలకు ఉద్దేశించిన వ్యాసాలలో వాక్యాల కూర్పులో తేడా ఉంటుంది. విజ్ఞాన సర్వస్వంలో చేర్చేటప్పుడు కొద్దిగా వాక్యశైలిని మారిస్తే సరిపోతుంది. సమాచారం చేర్చడంతో పొరపాటు లేదు ఎందుకంటే ఆ వ్యాసాలలోని సమాచారం ప్రత్యేకంగా ఎవరూ తయారుచేసినది కాదు, అలాంటి సమాచారం ప్రామాణిక గ్రంథాలలో కూడా ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:49, 28 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ధన్యవాదాలు

[మార్చు]

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:43, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మంత్రుల పేజీలు

[మార్చు]

చంద్రకాంత రావు గారూ, మంత్రుల గురించి ఎవరో బయటికి లింకులిస్తూ ఏక వాక్య వ్యాసాలు రాసినా వాటికి ప్రాధాన్యత ఉందని భావించడం చేత కొద్ది సమాచారం అనే మూస ఉంచి కొంచెం సమయం ఇద్దామనుకున్నాను. ఇప్పుడే తొలగించేయడం ఓకేనంటారా? --రవిచంద్ర (చర్చ) 17:27, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరో బయటి వ్యక్తులు వారి వెబ్‌సైట్ ప్రచారం కోసం లింకులు మాత్రమే ఇచ్చారు. మీరు చాలా కొద్ది సమాచారం అని మూస పెట్టారు. అసలు అందులో ఒక్క ముక్క సమాచారం కూడా లేదు. నా అసలు ఉద్దేశ్యం లింకును తొలిగించడం, ఎందుకంటే తెవికీ వెబ్‌సైట్ల ప్రచార వేదిక కాదు. లింకులు తొలిగిస్తే మిగిలేది కేవలం మూసనే కదా! కాబట్టి పేజీనే తొలిగించాను. ఏ మాత్రం సమాచారం లేని పేజీలు ఉండటం బాగుండదు, కావాలంటే సమాచారం సేకరించి మళ్ళీ పేజీ సృష్టించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. C.Chandra Kanth Rao-చర్చ 17:35, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సదరు అజ్ఞాత వాడుకరి తమ వెబ్ సైట్ ప్రచారం కోసమే అలా వ్యాసాలు సృష్టించి లంకెలిచ్చారని నాకూ అర్థమైంది. కాకపోతే కొత్త వారు కదా! ఒక్క రోజు అవకాశం ఇచ్చి అప్పుడు ఎటువంటి సమాచారం చేర్చకపోతే తొలగిద్దామనుకున్నాను. అసలే వికీ నిర్వాహకులు నిరంకుశంగా వ్యవహరిస్తుంటారు అనే అపవాదు ఉండనే ఉంది కదా. అలాంటి అవకాశం వారికి ఇవ్వకూడదని నా ఆలోచన అంతే. —రవిచంద్ర (చర్చ) 17:47, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
అసలు తెవికీలో సభ్యుడే కాని వ్యక్తి ఎవరో వారి స్వంత ప్రచారం, వెబ్‌సైట్ల ప్రచారం, వ్యక్తిగత సమాచారం ఇలా చేర్చుకుంటూపోతే దానికీ మనం అవకాశం ఇస్తూ ఉంటే నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. అదే సభ్యుడు ఇంతకు క్రితం ఒక గ్రామవ్యాసంలో అనవసర విషయాలు చేర్చగా నేను తొలిగించాను, ఈ రోజు మళ్ళీ ఆ దిద్దుబాటును రద్దుచేయగా మీరు నావరకు తీసుకువచ్చారు. అసలు ఏ మాత్రం ఉంచడం సాధ్యపడని పేజీలను వెంటనే తొలిగించడమే బాగుంటుంది. సమాచారం ఉన్న పేజీలను చర్చ లేకుండా నేనెప్పుడూ తొలిగించలేను. ఒక్క పదం కూడా సమాచారం లేదు కాబట్టి చర్చ కూడా అవసరం లేదనుకుంటా. ఆ పేజీలలో ఆ సభ్యుడు సమాచారం చేర్చగలడనే నమ్మకం అస్సలు లేదు. పోనీ మనమైనా సమాచారం చేర్చుదామంటే బిజీగా ఉన్నాము. ఆ తరువాత మర్చిపోతాము, ఆ ఖాళీ పేజీలు అలాగే ఉంటాయి. ఇది అందరికీ అనుభమైనదే కదా! ఇక వికీ నిర్వాహకుల గురించి కొందరు చెప్పిన మాటలు అస్సలు పట్టింకోనవసరం లేదు-- C.Chandra Kanth Rao-చర్చ 18:03, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గుంటూరు ప్రముఖులు

[మార్చు]

చంద్రకాంతరావు గారు, మీరు ఉదహరించిన పేర్లలో కొన్ని వ్యాసాలు వ్రాస్తున్నాను. చూడగలరు.Kumarrao 17:03, 15 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది. సమయం దొరికినప్పుడల్లా నేనూ వాటిని విస్తరించడానికి ప్రయత్నిస్తాను. C.Chandra Kanth Rao-చర్చ 17:33, 16 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.Kumarrao 15:34, 28 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
నేను పెమ్మసాని నందస్వామిదురై కొండలస్వామి నాయుడు‎ అనే వ్యాసము వ్రాశాను. చిన్న పొరపాటు జరిగింది. పేరులో "కొండలరాయస్వామి" అని ఉండాలి. ఈ తప్పు ఎలా సరి చేయాలి? Kumarrao 17:42, 9 ఆగష్టు 2010 (UTC)
వ్యాసం పేరు మార్పు చేయడానికి పేజీ తరలింపు చేస్తే సరిపోతుంది. మీరు సూచించిన విధంగా నేను పేరులో మార్పు చేశాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:05, 9 ఆగష్టు 2010 (UTC)

బాటుద్వారా తేలికగా చేయలంటే ఎలా?

[మార్చు]

బాటుద్వారా అక్షరదోషాలు లేకుండా తేలికగా చేయలంటే ఎలా.... నాకు కొంచం వివరంగా తెలుపగలరు....--జయంత్ కుమార్ 12:51, 30 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు అంటే యంత్రం ద్వారా (ప్రొగ్రామింగ్) మార్పులు చేయడం. ఒకే పనిని పదేపదే చేయడం, అనేక వ్యాసాలలో ఒకే రకమైన మార్పులను/చేర్పులను చేయడం, మూసలను, వర్గాలను వ్యాసాలలో అతికించడం లాంటి పనులు మానవప్రయత్నం కంటె బాటు ద్వారా చాలా తేలిగగా చేయవచ్చు. దీనికై కొత్తగా బాటు అభ్యరిత్వాన్ని పొందవలసి ఉంటుంది. లేదా ఇప్పటికే బాటు అక్కౌంటు ఉన్న వైజాసత్య గారికి తెలిపితే సమయం ఉన్నప్పుడు మార్పులను చేయగలరు. బాటు గురించి మరిన్ని వివరాలకు చూడండి: వికీపీడియా:బాటు -- సి. చంద్ర కాంత రావు - చర్చ 19:22, 31 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
 ఇకపై పదాలను మాత్రమే కాకుండా మొత్తం వ్యాసంలో ఉన్న అక్షర దోషాలను సరిదిద్దుతాను. --జయంత్ కుమార్ 13:08, 10 ఆగష్టు 2010 (UTC)


చంద్ర కాంత్ గారు... నేను చేసిన "గ్రామపంచాయితి" అనే పదమును తెలియక మార్పు చేసి నందుకు చింతిస్తున్నాను. ఇక పై మార్పు చేయను. ఏమైన అక్షర దోషాలు ఉండే వ్యాసాల యెక్క వివరాలు ఒకే సారి(చిటెకె) తెలుసుకొవాలి ఎలానొ తెలియజేయ గలరు. --జయంత్ కుమార్ 05:39, 18 ఆగష్టు 2010 (UTC)

మీరు అక్షరదోషాలను సరిచేయాలని అనుకోవడం, చేసే ప్రయత్నం చాలా బాగుంది, నేను మెచ్చుకుంటాను. అదే సమయంలో కొన్ని తెలియక తప్పులు జరుగుతున్నాయి. మొన్న లోకసభ పదానికి లోక్‌సభగా మార్పు చేయడం వల్ల చాలా వ్యాసాలలో లింకులు తెగిపోయాయి. లింకులలో ఉన్న పదాలను మార్చినప్పుడు లింకులు తెగిపోవడం అనే విషయం మీకు తెలియకపోవచ్చు. లింకులోని పదాలను మారిస్తే వాటికి కొత్తగా దారిమార్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బాటుద్వారా సాధ్యమయ్యే అక్షరదోషాల సవరణకు నేను సూచనలిచ్చాను. గ్రామపంచాయతిని విడదీసినందుకు తెలియజేశాను. కొన్ని పదాలను అలాగే ఉంచిననూ విడదీసిననూ పెద్దగా అర్థం మారకపోవచ్చు కాబట్టి ఉన్న పదాలను అలాగే ఉంచితే బాగుంటుంది. ఏదో ఒకచోట అంటే పొరపాటు జరిగిందనుకోవాలి, ప్రతిచోట అలాగే ఉంటే మార్పుచేసేటప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. నేను అందరి మార్పులను గమనిస్తున్నాను కాబట్టి మీ మార్పులను పరిశీలించి సూచనలు ఇస్తున్నాను. నా సూచనలు పాటిస్తున్నందుకు సంతోషమే. ఇక మీరు అడిగిన సందేహం విషయానికి వస్తే అక్షరదోషాలు ఉండే వ్యాసాలను కనుగొనడానికి ఎలాంటి సాధనము లేదు. దాదాపుగా అన్ని వ్యాసాలలో (మొలకలు మినహా) అక్షరదోషాలు ఉండడం మామూలే, పెద్ద వ్యాసాలలో ఈ సంఖ్య పెరగవచ్చు. కొత్తసభ్యులు రచించే వ్యాసం లేదా వ్యాసభాగాలలో అక్షరదోషాలు బాగానే ఉంటాయి. మీరు ఉపయోస్తున్న శోధన పద్దతిద్వారా అక్షరదోషాలు కొంతవరకు పట్టవచ్చు. ఆ వ్యాసాలలో ఆ పదాలనే కాకుండా మొత్తం వ్యాసం పరిశీలించి అక్షరదోషాలు సరిచేస్తే వ్యాసం చక్కగా తయారౌతుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:20, 18 ఆగష్టు 2010 (UTC)
చంద్ర కాంత్ గారు మీ యొక్క సలహాలకు సుచనకు నా యెక్క ధన్యవాదములు. నేను చాలా వరుకు అక్షర దోషలున్న పదాలను వికీపీడియా:భాషాదోషాల పట్టికలో చేర్చుతున్నాను. ఈ మధ్య నేను చాలా వరుకు మెత్తం వ్యాసం యెక్క అక్షర దోషాలను సరిదిద్దుతున్నాను.--జయంత్ కుమార్ 06:05, 19 ఆగష్టు 2010 (UTC)

తెలుగు అంకెలు ఈ వికీపీడియా లో ఎందుకు ఉండకుడదు? దయచేసి మీరు మార్చిన క్రమ సంక్య ను ఆంగ్ల అంకెల స్థానములో తెలుగు అంకెలు మాత్రమే చేర్చాలి. అభినందనలతో--Ranjithsutari 10:21, 19 ఆగష్టు 2010 (UTC)

తెలుగు వికీపీడియాలో ఆంగ్ల అంకెలు ఎందుకని మంచి సందేహం వెలిబుచ్చారు. తెవికీలో ఆంగ్ల అంకెలే కాకుండా ఆంగ్ల పదాలు కూడా చాలా ఉన్నాయి. తెవికీ ముఖ్యలక్ష్యం లేదా ఉద్దేశ్యం తెలుగుభాషలో వ్యాసాలు రచించి తెలుగు ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచడం మాత్రమే. దీనికై వాడుకలో ఉన్న తెలుగు పదాలను, అంకెలను మాత్రమే తెవికీ ఉపయోగిస్తుంది. మీరు చెప్పినట్లు ఆంగ్ల అంకెలను కాకుండా తెలుగు అంకెలను మాత్రమే ఉపయోగిస్తే వాటిని ఎంతమంది తెలుగు వ్యక్తులు అర్థంచేసుకుంటారన్నది సందేహాస్పదమే. తెలుగు ప్రజానీకం అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా అందరూ అర్థంచేసుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి తయారవుతున్న తెలుగు విజ్ఞానసర్వస్వములో సాధ్యమైనంతవరకు అందరికీ అర్థమయ్యే భాషను మరియు శైలిని ఉపయోగిస్తూ, వాడుకలో ఉన్న పదాలను, అంకెలను మాత్రమే వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా తెలుగు పుస్తకాలు, తెలుగు ప్రసార మాధ్యమాలు (టెలివిజన్, వార్తాపత్రికలలో) తదితర చోట్ల తెలుగు అంకెలను కాకుండా ఆంగ్ల అంకెలను మాత్రమే వాడుచున్నారనే విషయం మీకు తెలుసు. కాబట్టి తెవికీ కూడా వాటి ప్రకారమే ముందుకుపోవల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే తెవికీ తెలుగు సమాజంలో మార్పులు తేవడానికి కాకుండా వాడుకలో ఉన్న శైలినే ఉపయోగిస్తూ తెలుగు సమాజానికి అందుబాటులో ఉండడం. ఇదివరకు ఆర్టీసి వారు బస్సులపై అంకెలు కూడా తెలుగులో ఉండాలని హటాత్తుగా నిర్ణయించి, అమలుపరిచి విమర్శలకు గురయ్యారు. బస్సు అంటే గుర్తుకొచ్చింది, ఇది కూడా ఆంగ్లపదమే. ఇలాంటివి తెలుగులో చాలా ఉన్నాయి, వాడుకలో మనం ఆ పదాలనే ఉపయోగిస్తున్నాము కాబట్టి తెవికీలో అలానే రాస్తున్నాం. రైలుకు, బల్బుకు అచ్చ తెలుగు పదం రాస్తే వాటిని ఎందరు అర్థం చేసుకుంటారన్నది మీకు చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న పద్దతిలో మార్పు వచ్చి, క్రమక్రమంగా తెలుగు ప్రజలు కూడా తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నప్పుడు తెవికీ కూడా తప్పకుండా తెలుగు అంకెలను వాడుతుంది. ఆ మార్పు వస్తుందని కోరుకుందాం. కాని ఆ మార్పు మొదట తెలుగు సమాజంలో రావాలి, అంతేకాని తెవికీలో కాదు. మరో విషయం మీరు తెలుగు అంకెలు టైపు చేశారు కదా, అసలు తెవికీ ఎడిట్ పేజీలో ఆ సదుపాయమే లేదు. ఎందుకనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:15, 19 ఆగష్టు 2010 (UTC)
మీ వాదన చూస్తువుంటే, నాకు చాల నవువస్తుంది( అంటే ఫాన్నీగా అనిపిస్తుంది). మిమల్ని సమర్ధించాలి ( అంటే సపోర్ట్ చేయాలి) అనిపించినా మిమల్ని వ్యతిరేకించక(అంటే ఆపోజ్ చేయక) తపటము లేదు. Well ఏది ఏమైనపటికి(అంటే whatever) ఇకడ తెలుగు వికీపీడియాను ఆర్టీసి లేదా ప్రసార మాధ్యమాల(టెలివిజన్, వార్తపత్రికల)తో పోల్చకుండా తెవికి లాంటి ఇతర ప్రాజెక్టులు అంటే హిందీ, ఉరుదు, గుజరాతి, కన్నడ వంటి వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులతో పోల్చుకుంటే అసలు సమస్య ఏంటో అర్ధమవుతుంది.
మాధ్యమాలు(వార్తాపత్రికలు) అంటే గురుతుకు వచ్చింది ఒకసారి వార్తాపత్రికవారు వై.ఎస్.అర (ఆపటి ముఖ్యమంత్రిని)ని తెలుగు బాషపై మీ అభిప్రాయము చెపమంటే "I love my teలుగు బాషా" అని ఆనాడు. తన మత్రుబాషను ప్రేమిస్తున్నాను అని తెలుగులో చేపలేక పోయాడు అని అదే వార్తపత్రికవారు విమర్శించారు.
అందరికీ అర్థమయ్యే భాషను మరియు శైలిని ఉపయోగిస్తూ, వాడుకలో ఉన్న పదాలను, అంకెలను మాత్రమే వాడవలసి ఉంటుంది అంటే మరి పైన పేరుకోన వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులలో కూడా ఎందుకు ఈ పదతి పాటించడములేదు. మీరు చేపినటు "ప్రస్తుతం ఉన్న పద్దతిలో మార్పు వచ్చి, క్రమక్రమంగా తెలుగు ప్రజలు కూడా తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నప్పుడు తెవికీ కూడా తప్పకుండా తెలుగు అంకెలను వాడుతుంది" అన్నారు కానీ వికీపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు, లేదా వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు. కాబటి దయచేసి మిగతా వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులతో సమానముగా మత్రుబాష లోని తెలుగు అంకెలను మాత్రమే వాడవలెను. అభినందనలతో--Ranjithsutari 18:05, 19 ఆగష్టు 2010 (UTC)
మీకు ఇతర వికీపీడీయాలలో పనిచేసిన అనుభవం ఉండవచ్చు కాని తెవికీ గురించి తెలుసుకోవాల్సిన అవరం ఉంది. నేను చెప్పినది నా వాదన అనుకుంటున్నారు అంతేకాకుండా నా వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం అని అనుకొని పొరపడుతున్నారు. అది కానేకాదు నేను చెప్పినది తెవికీ అభిప్రాయమే. నేను భవిష్యత్తును చూసి జోస్యం చెప్పే అవసరం నాకు లేదు. భవిష్యత్తులో అలా జరిగినప్పుడు మాత్రమే తెవికీలో అలాంటి మార్పు వస్తుందని సూచనప్రాయంగా చెప్పాను, అది సరైనదే. ఏ వ్యవస్థ అయినా సరే సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మారవలసిందే. అంతేకాని తెవికీనే మొదట మార్పులకు వత్తిడి చేయదు. ఇతర సోదర వికీపీడియాలతో తెవికీని పోల్చే అవసరం లేదు అక్కడి నియమాలు అక్కడ వర్తిస్తే, మన నియమాలు మాకు వర్తిస్తాయి. వారు అలా చేస్తున్నారని మేము కూడా అలానే చేయాలని అనుకోవడం బాగుండదు, ఆ అవసరం కూడా లేదు. నేను ప్రసార మాధ్యమాలను, ఆర్టీసిని ఉటంకించడం సరైనదే (అది తెలుగు అంకెలకు సంబంధించిన విషయమే మరి). ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆర్టీసి వారే బస్సుపై తెలుగు అంకెలను వెనక్కి తీసుకున్నప్పుడు తెలుగు అంకలపై తెలుగు ప్రజలకు ఎంత అవగాహన ఉందో ఊహించవచ్చు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అంతకు ముందునుంచే తెవికీ ఇదే అభిప్రాయంపై ఉంది. వార్తాపత్రికలలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరిపైనే చేసిన విమర్శలు మాకు అవసరం లేదు. ప్రసార మాధ్యామాల సాధారణ భాష గుంచి మాత్రమే చెప్పాను. . సి. చంద్ర కాంత రావు - చర్చ 18:37, 19 ఆగష్టు 2010 (UTC)
తెలుగు ప్రజానీకం కోసం తయారవుతున్న తెవికీని తెలుగు సమాజం, తెలుగు ప్రసార మాధ్యమాలు, తెలుగు ప్రాంతపు సంఘటనలతోనే పోల్చుకోవాలి కాని కన్నడ, గుజరాతీ, హిందీ, ఉర్దూ వికీల గురించి పోల్చడమెందుకు? (అవి సోదర వికీ ప్రాజెక్టులయినా సరే) అక్కడి పద్దతులు కొన్ని నచ్చితే తీసుకోవచ్చు అంతేకాని తెలుగు అంకెలకు సంబంధించి ఇది వర్తించదు. కర్ణాటకలో, గుజరాత్‌లో ఆయా భాషల అంకెల వినియోగం ప్రజలలో ఉండవచ్చునేమో ! ఆ ప్రాంతానికి సంబంధించి అది సరైనప్పుడు ఈ ప్రాంతానికి కూడా ఆ పద్దతే సరైనదని అనుకోలేము. ఆయా భాషలలో వారి అంకెల వినియోగం లేకున్ననూ వారెందుకు ఉపయోగిస్తున్నారనేది అక్కడే తేల్చుకోవాలి. తెలుగు భాషలో అంకెల వినియోగం ఎందుకు లేదన్నది తెవికీకి సంబంధం లేని ప్రశ్న. తెలుగు ప్రజలందరూ వాటినే ఉపయోగించాలని తెవికీ బలవంతం చేయదు. ఉన్న పరిస్థితులను అనుగుణంగా తెవికీ నడుచుకుంటుంది, మార్పులకు అనుగుణంగా తెవికీ కూడా మారుతుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:43, 19 ఆగష్టు 2010 (UTC)

ప్రముఖులు

[మార్చు]

చంద్రకాంతరావు గారూ, మునిపల్లె వెంకటరామారావు , మొదలి నాగభూషణం శర్మ , పులుపుల వెంకట శివయ్య , పిల్లుట్ల హనుమంతరావు, జొన్నలగడ్డ రామలింగయ్య , వేమూరి రాధాకృష్ణశాస్త్రి , గాదె చిన్నపురెడ్డి , తుమ్మల బసవయ్య, చదలవాడ పిచ్చయ్య , బోయపాటి నాగేశ్వరరావు గార్ల వివరాలు నాకు దొరకడం లెదు. ఓపిక చేసుకొని వీరి గురించి వ్రాయగలరు.Kumarrao 11:01, 12 అక్టోబర్ 2010 (UTC)