వాడుకరి చర్చ:Dhurjati1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Dhurjati1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Dhurjati1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 09:02, 5 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:54, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రాల ఎక్కింపు గురించి మీ సందేహం[మార్చు]

ధూర్జటి గారూ, బొమ్మలను అప్‌లోడు చెయ్యడంలో సహాయం కావాలని మీరు అడిగినదాన్ని ఇప్పుడే చూసాను. మీ సందేహాలు తీరాయో లేదో తెలీదు గానీ, మీరు ఒక బొమ్మను ఎక్కించడం మాత్రం గమనించాను. ఇకపై మీకు సహాయం ఏమైనా అవసరమైతే, నా చర్చ పేజీలో రాయండి, చూసిన వెంటనే నేను చెయ్యగలిగిన సాయం చేస్తాను. వేరే ఎక్కడ రాసినా కూడా ఫరవాలేదు.. కానీ అప్పుడు [[వాడుకరి:Chaduvari]] అని రాసి నా పేజీకి లింకు ఇవ్వాలి. అలా లింకు ఇస్తే మీరు ఎక్కడ రాసినా "ఫలానా వారు నీ సాయం కోరారు" అని నాకు నోటిఫికేషను వస్తుంది. నా చర్చ పేజీలో రాస్తే మాత్రం అలా లింకు ఇవ్వనక్కర్లేదు. ఆటోమాటిగ్గా నోటిఫికేషను వచ్చేస్తుంది. ఉంటానండి. __ చదువరి (చర్చరచనలు) 15:28, 9 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఫొటోల పోటీలో పనులు ఎలా చెయ్యాలనే విషయమై కొంత సాయం మీకు పద్ధతులు పేజీలో దొరుకుతుంది, చూడండి.__ చదువరి (చర్చరచనలు) 15:33, 9 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022[మార్చు]

నమస్కారం

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.

మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]