వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు
|
ప్రధానబరి లోని వ్యాసాన్ని తొలగించాలా లేదా అనే చర్చ చేసే ప్రదేశం తొలగింపు కొరకు వ్యాసాలు (AfD). ఇక్కడ చేర్చిన వ్యాసాలను కనీసం ఒక వారం రోజుల పాటు చర్చించి, తొలగించాలని సముదాయం నిర్ణయిస్తే తొలగింపు విధానం ప్రకారం తొలగించడం గానీ, పేజీని ఉంచి, దాన్ని మెరుగుపరచడంగానీ, వేరే పేజీతో విలీనం చెయ్యడం గానీ, దారిమార్పుగా మార్చడంగానీ, కొన్న్నాళ్ళపాటు సంరక్షణలో ఉంచడంగానీ, వేరే వికీమీడియా ప్రాజెక్టుకు తరలించడం గానీ, వేరే పేరుకు తరలించడంగానీ, వేరే పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యడం గానీ, వాడుకరి ఉపపేజీగా మార్చడంగానీ, చేస్తారు.
ఏదైనా పేజీని తొలగింపుకు ప్రతిపాదించే ముందు ఏయే అంశాలను పరిశీలించాలో, ప్రపాదించే పద్ధతి ఏమిటో, ప్రతిపాదనపై చర్చ ఎలా జరపాలో ఈ పేజీ వివరిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు లింకులు ఇవ్వడంతో పాటు, దీనికే సంబంధించిన మరో రెండు రకాల పద్ధతులకు కూడా లింకులిస్తుంది. వికీపీడియా:త్వరిత తొలగింపు కు సవివరమైన హేతుబద్ధత దుశ్చర్య, విస్పష్టమైన చెత్త పేజీల ద్వారా ఇవ్వగా, వికీపీడియా:తొలగింపు ప్రతిపాదనను ఇతర తొలగింపుల కోసం వాడుతారు.
ఏదైనా వ్యాసాన్ని ఇక్కడ ప్రతిపాదించాలనుకుంటే, అందుకు అవసరమైన ప్రాతిపదికలను తొలగింపు విధానం వివరిస్తుంది. తొలగించే పద్ధతిని తొలగింపు పద్ధతి వివరిస్తుంది. ఏదైనా వ్యాసానికి తొలగింపుకు కావాల్సిన లక్షణాలున్నాయని మీకనిపిస్తే, మీకు తొలగింపుకు ప్రతిపాదించే పద్ధతి తెలిస్తే, కింది సూచనలను అనుసరించండి. పేజీని ప్రతిపాదించాలో వద్దో స్పష్టంగా మీరు నిర్ణయించుకోలేకపోతే, లేక మీకు ఈ విషయంలో సహాయం కావాల్సి ఉంటే, దీని చర్చాపేజీని గానీ, వికీపీడియా సహాయ కేంద్రాన్ని గానీ చూడండి. వికీపీడియాలో తొలగించేందుకు ప్రతిపాదించిన వ్యాసాల జాబితా ఇది. ఈ జాబితాలో కేవలం వ్యాసాలు మాత్రమే ఉండాలి. మరిన్ని వివరాలకు వికీపీడియా:తొలగింపు_పద్ధతి చూడండి
తాజా చేర్పులు
[మార్చు]ఈ క్రింది పుటలలోనే కాక ఇంకా ఈ పేజీలో చేరని చర్చా పేజీలను వర్గం:తొలగించవలసిన వ్యాసములు లో పరిశీలించండి.
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నేతకారుడు
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సాంకేతిక విజ్ఞానం
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆడియో ఇంజనీర్
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయ పార్టీ
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయాలు
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అట్టెం దత్తయ్య
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అంటరానివారు ఎవరు?
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సుంకర వాసిరెడ్డి
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కర్మంది వివరణం
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఏకోనపంచాశత్-ఉపపాతకములు
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విశ్వం పుట్టుక కి కారణం
- శిఖండి మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు
పాత చర్చలు
[మార్చు]పాత చర్చల కోసం -
- ప్రస్తుతం నడుస్తున్న భండారం: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-10 (తాజాగా ముగిసిన చర్చలను ఈ పేజీలో చేర్చండి)
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాత AFD ఉపపేజీల్లో జరిగిన చర్చలు ఈ పేజీని సృష్టించకముందు, గతంలో వికీపీడియా:Articles for deletion పేజీకి చెందిన ఉపపేజీల్లో తొలగింపు చర్చలు జరిగేవి. ఆ తరువాత ఆ పేజీని వాడడం మానేసాం. అప్పట్లో జరిగిన చర్చలను ఈ పేజీలో చూడవచ్చు.
- మూసేసిన తొలగింపు కొరకు వ్యాసాల భండారాలు - 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,(కొత్తగా ముగిసిన చర్చలను ఈ పేజీల్లో ఏమీ చేర్చకండి)
ముగిసిపోయిన, ప్రస్తుతం జరుగుతున్న AfD చర్చల్లో వెతకండి
[మార్చు]- మతం అనే పేరు కలిగిన వ్యాసాల కోసం వెతకాలంటే, ఈ వెతుకు పెట్టెలో మతం అని ఇవ్వండి.
- క్రిష్ణారావు అనే పేరు శీర్షికలోనే ఉన్న పేజీల కోసం వెతికేందుకు intitle:క్రిష్ణారావు అని ఇవ్వండి.
- "మతం" అనే పేరు పాఠ్యంలో ఎక్కడైనా ఉండి, క్రిష్ణారావు అనే పేరు శీర్షికలో ఉండాలంటే మతం intitle:క్రిష్ణారావు అని ఇవ్వండి.
తొలగింపు చర్చలలో పాల్గొనడం
[మార్చు]వికీ మర్యాద
[మార్చు]- తొలగింపు చర్చల్లో పాల్గొనేవారికి వికీ మర్యాద, "కొత్తవారిని బెదరగొట్టకండి" గురించి తెలిసి ఉండాలి.
- ఇతర తొలగింపు పేజీలక్కూడా ఇది వర్తిస్తుంది.
- తొలగింపు కొరకు చర్చల్లో దాపరికమేమీ లేదు, అన్నీ బహిరంగమే. ఎన్వికీలో జరిగిన కొన్ని చర్చలు పత్ర్రికలక్కూడా ఎక్కిన సందర్భాలున్నాయి. [1][2] వికీపీడియాలో చేసే ఏ దిద్దుబాటుకైనా ఎలాంటి నాగరిక విధానాలను పాటిస్తారో అలానే ఇక్కడా పాటించండి.
- మీతో విభేదించిన వారిపై వ్యక్తిగత దాడులు చెయ్యకండి; వెటకారంగా మాట్లాడకండి, సంయమనం పాటించండి.
- జీవించి ఉన్న వ్యక్తులపై ఆధారాల్లేని ప్రతికూల వ్యాఖ్యలు చెయ్యకండి. వీటిని ఎవరైనా తొలగించవచ్చు.
- తొలగింపు చర్చలు మామూలు వోటింగు పద్ధతి లాగా కనిపించినప్పటికీ, ఇది అలా పనిచెయ్యదు. స్పందన కంటే స్పందనకు మద్దతుగా ఇచ్చిన ఔచిత్యము, రుజువులూ ఎంతో ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. అంచేత తొలగింపు చర్చను వోటింగు లాగా పెట్టకూడదు:
- తొలగింపు పేజీకి ట్యాలీ పెట్టెలు చేర్చకండి.
- తొలగింపు పేజీలోని వ్యాఖ్యలను అభిప్రాయాల వారీగా - ఉంచాలి/తొలగించాలి/ఇతరాలు - విడదీయకండి. అలా వర్గీకరిస్తే, చర్చ సాఫీగా జరక్కపోగా, వోట్ల లెక్కకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది.
- తొలగింపు చర్చల గురించి వాడుకరులకు సందేశాలు పంపకండి. దాని వలన వాళ్ళు మీ అభిప్రాయానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. కానీ వ్యాసం తొలగింపును మీరు ప్రతిపాదిస్తూ ఉంటే , ఆ వ్యాసానికి తోడ్పడిన వాళ్ళకు మైత్రీపూర్వక సందేశాన్ని పంవచ్చు.
- ఒకే రకమైన అనేక వ్యాసాలను ప్రతిపాదించదలచుకుంటే, అన్నిటినీ కలిపి ఒకే ప్రతిపాదన చెయ్యవచ్చు. దీంతో చర్చలో రిపిటీషనుండదు. వాటిపై చర్చించే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కూడా. అయితే, సంబంధం లేని వ్యాసాలను కట్టగట్టరాదు.
- చర్చ జరుగుతూండగా వ్యాసాన్ని తరలించకూడగనే నియమమేమీ లేనప్పటికీ, అలా తరలిస్తే అనవసరమైన తికమకకు దారితీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చర్చను అనుసరించడాం కూడా ఇబ్బందవుతుంది.
చర్చలో పాల్గొనడం
[మార్చు]ఒక వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్ని హేతుబద్ధంగా చర్చించే స్థలం. భిన్నాభిప్రాయాలుంటాయి. కానీ తర్కబద్ధంగా ఉంటూ, సరైన ఆధారాలతో కూడిన వాదనలకు మిగత వాటికంటే ఎక్కువ విలువ ఉంటుందిక్కడ. వ్యాసం వికీ విధానాలకు అనుకూలమో వ్యతిరేకమో చెప్పకుండా సంబంధం లేని వాదన చెయ్యడం, ఆధారాలు చూపడం వంటివి చేసే వాడుకరులకు నిర్మాణాత్మక చర్చ గురించి, చర్చా విషయం పైననే కేంద్రీకరించిన వాదన గురించీ మరోసారి సూచన లివ్వడం తప్ప మరి చేసేదేమీ లేదు. కానీ, అలాంటి నిరాధారమైన వాదనలు, కంటెంటు మార్గదర్శకాలను పట్టించుకోకపోవడం వంటివి కొనసాగిస్తే, చర్చను అడ్డుకోవడంగా భావించాలి. ఇలా అడ్డుకోవడం కొనసాగిస్తే, ఇంగ్లీషు వికీలో లాగా వివాద పరిష్కార విధానం తెలుగు వికీలో లేదు కాబట్టి, అప్పటి వరకూ చర్చలో పాల్గొనని నిర్వాహకులు కలుగ జేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి.
AfD చర్చల్లో అనుసరించే కొన్ని సంప్రదాయాలు:
- సాధారణంగా వాడుకరులు తాము సూచించే చర్యలను బొద్దు పాఠ్యంలో రాస్తారు. ఉదాహరణకు, "ఉంచాలి", "తొలగించాలి", "విలీనం చెయ్యాలి", "దారిమార్పుగా చెయ్యాలి", "ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి" -ఇలాగ. ఈ AfD లను లెక్కించే కొన్ని బాట్లు, పరికరాలూ ఇలా బొద్దుగా ఉన్న పాఠ్యాన్నే లెక్కలోకి తీసుకుంటాయి. అంచేత ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం.
- మీ వ్యాఖ్యలను, అభిప్రాయాలనూ బులెట్ పాయింట్లుగా రాయండి (అంటే,
*
తో మొదలవ్వాలి). చివర్లో సంతకం చెయ్యండి. వేరే వాడుకరికి సమాధానం ఇస్తూంటే వారి అభిప్రాయం కిందనే తగినన్ని*
గుర్తులు పెట్టి మీ సమాధానం రాయండి. - మీరు వ్యాసపు సృష్టికర్తా, మేజరు పాఠ్యాన్ని సమర్పించిన రచయితా, లేక వ్యాసంపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉన్నారా అనే విషయాన్ని రాయండి.
- మీ అభిప్రాయం చెప్పేముందు వ్యాసాన్ని ఒకమారు చూడండి. ప్రతిపాఅదకులు ఇచ్చ్చిన సమాచారం మీద్ మాత్రమే ఆధారపడి మీ అభిప్రాయం ఏర్పరచుకోకండి. పరిస్థితిని అర్థం చేసుకునేందుకు వ్యాసపు చరితం కూడా సాయపడవచ్చు. అలాగే ఇంతకు ముందు రాసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలను చూడండి. వాటిలో మీకు ఉపయోగపడే సమాచారం ఉండవచ్చు.
పాల్గొనేటపుడు, కింది విషయాలను గమనించండి:
- చర్చ వోటింగు కాదు; ఏ చర్య తీసుకోవాలో, దాన్ని సమర్ధించే వాదనలతో సహా, చర్చలో ప్రతిపాదించండి.
- మీ వాదనలో వ్యాసం వికీ విధానాలను అనుసరిస్తుందో/అతిక్రమిస్తుందో రాయడమే కాదు "ఎలా" అనుసరిస్తుందో/అతిక్రమిస్తుందో రాయండి.
- మీ వాదనకు మద్దతుగా బహుళ ఖాతాలను వాడడం నిషిద్ధం. అలాంటి వాడుకరులు శాశ్వత నిషేధానికి గురవుతారు.
- తొలగింపును ప్రతిపాదించినవారు మళ్ళీ తమ అభిప్రాయాన్ని రాయనక్కరలేదు. ఎందుకంటే ప్రతిపాదించినప్పుడే "తొలగించాలి" అని వారు తమ అభిప్రాయాన్ని చేప్పేసినట్లే.
- పరస్పర వ్యతిరేక అభిప్రాయాలను చెప్పకండి. ఒకవేళ మీ తొలి అభిప్రాయాన్ని మార్చుకుంటే, గతంలో మీరు రాసినదాన్ని కొట్టేసి దాని పక్కనే మళ్ళీ రాయండి.
- కొత్త వాడుకరులు, నమోదు కాని వాడుకరుల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తారు. కానీ అవి సదాశయంతో లేవని భావిస్తే వాటిని పట్టించుకోకపోవచ్చు. AfD ప్రతిపాదన కంటే ముందే నమోదైన వాడుకరులు ఇచ్చే అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఉంటుంది.
ప్రతిపాదిన వ్యాసాన్ని ఉంచెయ్యడం, తొలగించడం, దారిమార్పు చెయ్యడం వగైరాల్లో ఉచితమైన దాన్ని చెయ్యడానికి సలహా ఇచ్చేందుకు కొన్ని పద్ధతులున్నాయి. వాటిలో కొన్ని:
- తొలగింపును సమర్ధించే వాదన ఇలా ఉంటుంది: తొలగింపు విషయ ప్రాముఖ్యత గురించినదైతే.. సందర్భోచితంగా "నిర్ధారించుకునే సౌకర్యం లేదు", "మౌలిక పరిశోధన", "విషయ ప్రాముఖ్యత లేదు" వంటి కారణాలను చెప్పవచ్చు. వ్యాసం జీవించి ఉన్న వ్యక్తి గురించి అయితే, విషయ ప్రాముఖ్యత లేదన్న సంగతిని వీలైనంత మృదువుగా చెప్పాలి.
- వ్యాసాన్ని ఉంచెయ్యాలని మీరు భావిస్తే, తొలగింపు ప్రతిపాదనకు చూపించిన కారణాలను సరిచేస్తూ, వ్యాసంలో దిద్దుబాట్లు చెయ్యండి. విశ్వసనీయ మూలాలను వెతికి, మంచి, విశేష వ్యాసాలను ఉదాహరణలుగా చూపి మీ వాదనను చెప్పవచ్చు. మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచే ప్రయత్నం చెయ్యవచ్చు. ప్రతిపాదనలో చూపిన కారణాలను సరిచేస్తూ వ్యాసాన్ని మెరుగు పరిస్తే, ప్రతిపాదకులు తమ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి. ఆ తరువాత నిర్వాహకులు ప్రతిపాదనను మూసేస్తారు. ప్రతిపదకులు అలా చెయ్యకపోతే, వారి చర్చాపేజీలో ఆ సంగతిని గుర్తు చెయ్యాలి.
- వ్యాసాన్ని అయోమయ నివృత్తి పేజీ గానో, వేరే వ్యాసానికి దారిమార్పు గానో ఉంచాలని భావిస్తే, దాన్నే ప్రతిపాదించండి. అలాంటి సందర్భాల్లో తొలగింపును రికమెండు చెయ్యవద్దు.
వ్యాసాల తొలగింపును ప్రతిపాదించడం
[మార్చు]ప్రతిపాదించే ముందు: గమనింపులు, ప్రత్యామ్నాయాలు
[మార్చు]వ్యాసపు తొలగింపును ప్రతిపాదించే ముందు కింది వాటిని అనుసరించండి:
- అ. విధానాలను, మార్గదర్శకాలనూ చదివి అర్థం చేసుకోండి
- వికీపీడియా తొలగింపు విధానం: ఇది తొలగించేందుకు ఉండాల్సిన కారణాలను, తొలగింపుకు ప్రత్యామ్నాయాలను, తొలగింపు పద్ధతులనూ సూచిస్తుంది.
- తొలగింపు చర్చలకు సహకరించే నాలుగు ప్రధాన మార్గదర్శకాలు, విధానాలు: విషయ ప్రాముఖ్యత, నిర్ధారత్వం, మూలాలు, ఏది వికీపీడియా కాదు
- ఆ. కిందివాటిని పరిశీలించండి
- వ్యాసం - సత్వర తొలగింపు, తొలగింపు ప్రతిపాదన, సత్వర స్థాపన అంశాల పరిధిలోకి రాదని నిర్ధారించుకోండి.
- నిర్ధారకత్వం, విషయ ప్రాముఖ్యత వంటి సందేహాలుంటే, సరైన మూలాల కోసం శోధించండి. ("ఈ" చూడండి.)
- వ్యాస చరితాన్ని చూడండి. గతంలో దుశ్చర్యలు, తప్పులతడక భాష వాడకం వంటివి జరిగాయేమో గమనించండి.
- వ్యాసపు చర్చాపేజీ చూడండి. ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న అభ్యంతరాలను ఈసరికే లేవనెత్తి ఉన్నారేమో చూడండి.
- ఇక్కడికి లింకున్న పేజీలు లింకును నొక్కి, ఈ వ్యాసాన్ని వికీపీడియాలో ఎలా ఉదహరిస్తున్నారో గమనించండి.
- భాషాంతర లింకులను పరిశీలించండి. ఇతర భాషల్లో మరింత మెరుగైన వ్యాసాలున్నాయేమో గమనించండి.
- ఇ. వ్యాసాన్ని తొలగించకుండా మెరుగుపరచే మార్గముందేమో పరిశిలించండి
- మామూలు సవరింపుల ద్వారా వ్యాసంలోని దోషాలను సవరించగలిగితే, దాన్ని తొలగింపుకు ప్రతిపాదించరాదు.
- వ్యాసాన్ని ఈమధ్యే సృష్టించి ఉంటే, దాన్ని అభివృద్ధి చేసేందుకుగాను ఆయా రచయితలకు తగినంత సమయమివ్వండి.
- వ్యాసంపై మీకున్న అభ్యంతరాలను దాని చర్చాపేజీలోను, ప్రధాన రచయితల వద్దా, సంబంధిత వికీప్రాజెక్టులోను లేవనెత్తండి. వ్యాసంలో మీ సందేహాలను సూచించే ట్యాగును పెట్టండి. తద్వారా, ఆయా రచయితలు తగు దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- వ్యాస విషయానికి అంత ప్రాముఖ్యత లేదనుకుంటే, సంబంధిత వ్యాసంలో దీన్ని విలీనం చెయ్యడమో, వేరే వ్యాసానికి దారిమార్పు చెయ్యడమో చెయ్యండి. మరీ ముఖ్యంగా, వ్యాసపు పేరు కోసం ఎక్కువగా అన్వేషిస్తారని అనిపించినపుడు.
- ఈ. నోటబిలిటీయే ప్రధాన సమస్య అయితే, మరిన్ని మూలాల కోసం వెతకండి
- కనీసం గూగుల్లోను, గూగుల్ బుక్స్‌లోనూ వెతకండి. గూగుల్ న్యూస్, గూగుల్ స్కాలర్ లలోనూ వెతకొచ్చు.
- ఎక్కడా మూలాలు దొరక్కపోతే, ప్రతిపాదనకు ముందు తీసుకోవాల్సిన కనీసపు చర్యలు తీసుకున్నట్లే. అయితే, ఈ అన్వేషణలో మూలాలు దొరికినంత మాత్రాన ఆ వ్యాసపు తొలగింపు ప్రతిపాదన చెయ్యకూడదని అర్థం కాదు. ఆయా మూలాలు సరిపోవనిపిస్తే, లేదా ఆ మూలాలు వ్యాసవిషయాన్ని లీలామాత్రంగా మాత్రమే స్పృశిస్తున్నాయనిపిస్తే, వ్యాసపు తొలగింపు ప్రతిపాదన చేసెయ్యవచ్చు.
- సరిపడినన్ని మూలాలున్నాయని మీకు అనిపిస్తే, సదరు మూలాలు ప్రస్తుతం వ్యాసంలో లేవన్న ఉద్దేశంతో తొలగింపుకు ప్రతిపాదించడం సబబు కాదు. దాని బదులు మీరే ఆయా మూలాలను వ్యాసంలో తగిన చోట్ల చేర్చవచ్చు. కనీసం మూలాలు కావాలన్న మూసనైనా ఉంచండి.
ఒక్క పేజీని తొలగింపుకు ప్రతిపాదించడం ఎలా
[మార్చు]వ్యాసాలను, వాటి చర్చ పేజీలనూ తొలగింపుకు ఎలా ప్రతిపాదించాలో ఈ విభాగం వివరిస్తుంది.
లాగినై ఉన్న వాడుకరి మాత్రమే II, III అంచెలను పూర్తి చెయ్యగలరు.. మీరు నమోదై లేకపోతే, మొదటి అంచెను పూర్తి చేసి, వ్యాసపు చర్చా పేజీలో తొలగింపు సమర్ధనను రాసి, మిగతా పనిని పూర్తిచెయ్యవలసినదిగా ఇతరులను అభ్యర్ధించవచ్చు.
- పేజీల తొలగింపును ప్రతిపాదించాలంటే మీరు లాగినై ఉండాలి. అజ్ఞాతంగా చేస్తే, ప్రతిపాదన చేస్తూండగా మధ్యలో ఆగిపోతారు.
- ఒకటి కంటే ఎక్కువ పేజీల తొలగింపును ప్రతిపాదించేందుకు, ఒకటికంటే ఎక్కువ పేజీల తొలగింపును ప్రతిపాదించడం చూడండి.
- ఒకే పేజీ తొలగింపును ప్రతిపాదించేందుకు, ట్వింకిల్ వాడొచ్చు, లేదా కింది పద్ధతిని అనుసరించవచ్చు:
I. | వ్యాసంలో తొలగింపు మూసను పెట్టండి.
|
II. | వ్యాసపు తొలగింపు చర్చ పేజీని తయారుచెయ్యండి.
వ్యాసంలో పైన చేరిన AfD పెట్టెలో AfD పేజీలోని తొలగింపు చర్చకు లింకు ఏర్పడుతుంది.
లేదా
|
III. | Notify users who monitor AfD discussion.
|
ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలను తొలగింపుకు ప్రతిపాదించడం
[మార్చు]కొన్నిసార్లు ఒకద నికొకటి సంబంధమున్న అనేక వ్యాసాలుండవచ్చు. ఈ వ్యాసాలన్నిటినీ తొలగించాలని మీకు అనిపించవచ్చు. అలాంటివాటన్నిటినీ తొలగింపు కోసం మూకుమ్మడిగా ప్రతిపాదించవచ్చు. అయితే, ముందు ఒకదాన్ని ప్రతిపాదించి, చర్చా ధోరణిని, ఫలితాన్నీ బట్టి మిగతా వాటిని గుంపుగా ప్రతిపాదించవచ్చు.
గంపగుత్తగా ప్రతిపాదించదగ్గ వ్యాసలకు ఉదాహరణలు:
- ఓకే రకమైన పాఠ్యముండి, కొద్ది తేడాలతో శిర్షికలు కలిగిన వ్యాసాలు
- ఒకే రచయిత రాసిన మస్కా (hoax) వ్యాసాలు
- ఒకే రచయిత రాసిన స్పాము వ్యాసాలు
- ఒకే రకమైన ఉత్పత్తులపై రాసిన వ్యాసాల శ్రేణి
గుర్తుంచుకోండి..
- మీకు కచ్చితంగా తెలియకపోతే, గంపగుత్తగా ప్రతిపాదించకండి.
- వ్యాసాలన్నీ ప్రతిపాదన సమయంలోనే గుది గుచ్చాలి. చరచ మొదలయ్యాక చేర్చకండి.
వ్యాసాలను తొలగింపు కోసం గుదిగుచ్చడం ఎలా:
I. II. III. |
మొదటి వ్యాసాన్ని ప్రతిపాదించండి.
పైన చూపిన I నుండి III అంచెలను అనుసరించండి. |
IV. | అదనపు వ్యాసాలను ప్రతిపాదించండి.
ఆ వ్యాసాలన్నింటిలోనూ పైన, కింది మూసను చేర్చండి:
NominationName స్థానంలో తొలగించాల్సిన మొట్టమొదటి పేజీ పేరును ఉంచండి - ప్రస్తుత పేజీ పేరును కాదు. అంటే, ప్రతిపాదించిన మొదటి వ్యాసం ఏదో ఒక వ్యాసం అయితే, PageName స్థానంలో ఏదో ఒక వ్యాసం ఉంచండి. ఇదివరకటి లాగానే దిద్దుబాటు సారాంశంలో "AfD: తొలగింపు కొరకు ప్రతిపాదించాను" అని రాయండి. దిద్దుబాటును చిన్న మార్పుగా గుర్తించవద్దు. పేజీని భద్రపరచండి. ఇదే పద్ధతిని మిగతా అన్ని వ్యాసాలకూ పాటించండి. (If the article has been nominated before, use {{subst:afdx}} instead of {{subst:afd1}}, and replace "NominationName" with the name of the page plus a note like "(second nomination)" for a second nomination, etc. See Template talk:Afdx for details.) |
V. | Add the additional articles to the nomination.
మొదటి వ్యాసపు తొలగింపు చర్చ పేజీ,
దిద్దుబాటు సారాంశంలో, తొలగింపు కోసం వ్యాసాలను గుత్తగా చేరుస్తున్నారని రాయండి. |
AFD ని సృష్టించడం
[మార్చు]నమోదైన వాడుకరులు ఈ మూసను వాడి వ్యాసపు తొలగింపును ప్రతిపాదించవచ్చు:
ఈ రకంగా చేస్తే, మీ ప్రతిపాదనను AFD లాఅగ్ పేజీలో చేర్చాల్సి ఉంటుంది.
ట్వింకిల్ ను వాడి కూడా ఈ పని చెయ్యవచ్చు. మీ అభిరుచులు పేజీలో ట్వింకిల్‌ను చేతనం చేసుకోవచ్చు. అక్కడ "ఉపకరణాలు" ట్యాబును నొక్కి, ట్వింకిల్ చెక్‌మార్కును సెలెక్టు చేసి భద్రపరచండి. మరింత సమాచారం కోసం వికీపీడియా:Twinkle/doc చూడండి.
ప్రతిపాదించాక: సంబంధమున్న ప్రాజెక్టులకు, వాడుకరులకూ తెలపండి
[మార్చు]AfD లో చర్చ కొరకు ప్రతిపాదిస్తే సరిపోతుంది. అయితే ప్రతిపాదకులు వ్యాసంతో సంబంధమున్న వారికి తెలియజేయాలనుకోవచ్చు. కాన్వాసింగు లాంటివి చెయ్యకుండా తెలియజేయవచ్చు.
వికీపీడియాలో పెద్దగా అనుభవం లేని వాఅడుకరులను కూడా చర్చలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు గాను, మీ సందేశాల్లో పొడిఅక్షరాలు (ఎబ్రీవియేషన్లు) వాడకండి. సంబంధిత విధానాలు, మార్గదర్శకాలకు లింకులివ్వండి. AfD చర్చాపేజీకి కూడా లింకివ్వండి. ఏదైనా వ్యాసాన్ని సత్వర తొలగింపుకు ప్రతిపాదించదలచుకుంటే అందుకు తగ్గ కారణాలను ఇవ్వండి. పేజీ శీర్షికను చూడగానే తెలిసిపోతోంటే తప్ప, ఆ వ్యాసం దేని గురించో కూడా రాయండి.
- Deletion sorting
Once listed, deletion discussions can, optionally, also be transcluded into an appropriate deletion sorting category, such as the ones for actors, music, academics, or for specific countries. Since many people watch deletion sorting pages for subject areas that particularly interest them, including your recent AfD listing on one of these pages helps attract people familiar with a particular topic area. Please see the the complete list of categories.
- Notifying related WikiProjects
WikiProjects are groups of editors that are interested in a particular subject or type of editing. If the article is within the scope of one or more WikiProjects, they may welcome a brief, neutral note on their project's talk page(s) about the AfD.
- Notifying substantial contributors to the article
While not required, it is generally considered courteous to notify the good-faith creator and any main contributors of the articles that you are nominating for deletion. One should not notify bot accounts, people who have made only insignificant 'minor' edits, or people who have never edited the article. To find the main contributors, look in the page history or talk page of the article and/or use Duesentrieb's ActiveUsers tool or Wikipedia Page History Statistics. Use {{subst:AfD-notice|article name|AfD discussion title}}
.
At this point, you've done all you need to do as nominator. Sometime after seven days has passed, someone will either close the discussion or, where needed, "relist" it for another seven days of discussion. (The "someone" must not be you the nominator, but if you want to see how it's done see the next section.)
ప్రతిపాదనను వెనక్కితీసుకోవడం
[మార్చు]ప్రతిపాదన విషయంలో మీరు మనసు మార్చుకుంటే దాన్ని వెనక్కు తీసుకోవచ్చు. దీనికి కారణం, చర్చలో కొత్త విషయాలు వెలుగులోకి రావడం గావచ్చు, మరే కారణం చేతనైనా మీ ప్రతిపాదన పొరపాటని మీకే అనిపించి ఉండవచ్చు. వెనకి తీసుకోవడం వలన ఇతర వాడుకరుల సమయం ఆదా అవుతుంది.
వెనక్కి తీసుకునేందుకు చర్చకు పైభాగాన ఉన్న ప్రతిపాదన స్టేట్‌మెంటుకు కింద, "ప్రతిపాదకులు వెనక్కి తీసుకున్నారు" అనే నోటీసు పెట్టండి. కొద్దిగా వివరణ ఇచ్చి, సంతకం చెయ్యండి.
తొలగింపును వేరెవరూ సమర్ధించి ఉండకపోతే, మీరే చరచ్ను ముగించవచ్చు. వేరేవరైనా సమర్ధించి ఉంటే, మరెవరినైనా చరచను ముగించమని మీరు కోరవచ్చు.
తొలగింపు చర్చను ముగించడం ఎలా
[మార్చు]- సాధారణంగా తొలగింపు చర్చ వారం పాటు జరగాలి.
- నిర్ణయం వోట్ల సంఖ్యపై ఆధారపడి ఉండదు. తార్కికమైన, సరైన కారణాలతో కూడుకున్న, విధానాలపై ఆధారపడిన వాదనలపై ఆధారపడి ఉంటుంది.
- చర్చలో పాల్గొనని నిర్వాహకుడు చర్చపై ఉంచాలా , తొలగించాలా , విలీనం చెయ్యాలా , దారిమార్పు చెయ్యాలా , ట్రాన్స్‌వికీ చెయ్యాలా అనే నిర్ణయం తీసుకుంటారు.
- సముదాయంలో మంచి పేరు ఉన్న వికీపీడియను, నిర్వాహకుడు కాకపోయినా, చర్చలో పాల్గొనకపోతే, నిర్ణయం తీసుకోవచ్చు.
- చర్చలో పాల్గొన్న వారంతా ఉంచాలనే అభిప్రాయాన్ని ప్రకటించినపుడు, తొలగింపును ప్రతిపాదించిన వ్యక్తి, మధ్యలోనే దాన్ని ఉపసంహరించుకోవచ్చు, వ్యాసాన్ని ఉంచాలనే నిర్ణయం తీసుకుని. అలా చెయ్యడం చర్చను దారిమళ్ళించి, అర్ధంతరంగా ముగించినట్లు కాదు.
- చర్చ ఒక స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతే ఒక అభిప్రాయానికి రాలేదు అని ప్రకటించి, వ్యాసాన్ని యథాస్థితిలో ఉంచెయ్యవచ్చు. లేదా వ్యాసాన్ని తిరిగి చరచ్కు పెట్టవచ్చు.
- కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో - త్వరితంగా ఉంచెయ్యడం, త్వరితంగా తొలగించడం, నిర్ణయం ఎలా ఉండబోతోందో సందేహాతీతంగా, విస్పష్టంగా ముందే తెలిసిపోయినప్పుడు - చర్చను గడువుకు ముందే ముగించవచ్చు.
- నిర్ణయంపై అభిప్రాయాలను నిర్ణయం ప్రకటించిన వాడుకరి చర్చ పేజీలో ముందు వెల్లడించాలి. అక్కడ సరైన సమాధానం దొరక్కపోతే వికీపీడియా:తొలగింపు సమీక్ష వద్ద అప్పీలు చెయ్యవచ్చు.
నిర్ణయాన్ని అమలు చేసే పద్ధతి
[మార్చు]తొలగింపు చర్చ, చర్చాపేజీలో సరిపడినన్ని రోజులు ఉన్న తరువాత చర్చను ముగించేటపుడు పాటించవలసిన పద్ధతి ఇది:
- చర్చను పరిశీలించి, ముగింపు పలికేందుకు చాలా సమయం పట్టేట్టైతే, ముందు ఉపపేజీలో పైన {{ముగిస్తున్నాం}} మూసను పెట్టండి. దీనివలన మీరు ముగింపు చేస్తూ ఉండగా మరొకరు దిదుబాటు చేసి దిద్దుబాటు ఘర్షణ తలెత్తకుండా ఉంటుంది.
- చర్చపై ఆధారపడి, మార్గదర్శకాలు వాడి వ్యాసాన్ని ఉంచాలో తొలగించాలో, సంబంధిత చర్చ, ఉప పేజీలను తొలగించాలో లేదో నిర్ణయించండి.
- {{ముగిస్తున్నాం}} మూసను చేర్చి ఉంటే దాన్ని తీసెయ్యండి.
- చర్చా ఉపపేజీలో పైన అడుగున కింది పాఠ్యాన్ని చేర్చండి. (ఈ రెండూ కలిసి చర్చ ముగిసినట్టు సూచిస్తూ, దాని చుట్టూ ఒక ఒక మసక పెట్టెను సృష్టిస్తాయి. (కింది ఉదాహరణ చూడండి.) శీర్షం మూస, ముగింపు ఫలితం పై విభాగపు శీర్షానికి పైకి చేరతాయి, దాని కిందకు కాదు.
- పైన:
- {{subst:వ్యాతొలపైన}} '''ఫలితం'''. ~~~~
- అడుగున:
- {{subst:వ్యాతొలకింద}}
- పైన:
- నిర్ణయం తొలగించడమే అయితే, వ్యాసాన్ని తొలగించండి. (ఇది ఆటోమాటిగ్గా తొలగింపు లాగ్ లో నమోదవుతుంది.) "తొలగింపుకు కారణం" పెట్టెలో చర్చకు లింకు ఇవ్వడం మరువకండి. (అంటే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వ్యాసం]] అని రాయాలి). సముచితమైతే వ్యాసపు చర్చాపేజీని, సంబంధిత ఉపపేజీలను కూడా తొలగించండి. "ఇక్కడికి లింకున్న పేజీలు" లింకును నొక్కి దారి మార్పులు ఏమైనా ఉంటే తొలగించండి. ఆ శీర్షికతో వ్యాసమనేది ఉండకూడని పక్షంలో, దానికున్న అన్ని లింకులను తీసెయ్యండి. అయితే, వ్యాసానికి దాని తొలగింపు ప్రతిపాదనకు ఉన్న లింకును మాత్రం తీసెయ్యరాదు.
- నిర్ణయం 'ఉంచెయ్యడం అయితే, (విస్తృత ఏకాభిప్రాయం లేదు, దారిమార్పు, విలీనం వంటివైనా సరే), వ్యాసంలోని తొలగింపు మూసను తీసేసి, వ్యాసపు చర్చాపేజీలో తొలగింపు చర్చ ఉపపేజీకి లింకును పెట్టండి.
- పేజీ దారిమార్పుగా మారితే, మెలికెల దారి మార్పులు లేకుండా చూడండి.
- చర్చ విస్తృత ఏకాభిప్రాయానికి రాకపోతే, మామూలుగానైతే వ్యాసాన్ని ఉంచాలి. భవిష్యత్తులో అయోమయం లేకుండా ఉండేందుకుగాను, నిర్ణయంతోపాటు ఈ విషయాన్ని సూచించాలి.
- ఆ తరువాత, తొలగింపు చర్చ ఉపపేజీని ఈ పేజీలో పైనున్న తాజా చేర్పులు అనే విభాగం నుండి తీసేసి, పాత చర్చలు విభాగంలో చూపించిన "ప్రస్తుత పాత చర్చల పేజీ" లోకి చేర్చండి.
ఉదాహరణ
[మార్చు]చర్చను ముగించాక, పేజీ ఇలా కనబడుతుంది:
ఇవి కూడా చూడండి
[మార్చు]- వర్గం:Proposed deletion (Note that this is under the separate Wikipedia process వికీపీడియా:Proposed deletion rather than Articles for Deletion.)
- వర్గం:తొలగింపు కొరకు వ్యాసాలు మూసలు
- An editor can use {{Db-u1}} to make a user request for starting the process of deleting certain pages from their userspace.
- Sortable table of open AfDs
మూలాలు
[మార్చు]- ↑ "The battle for Wikipedia's soul", The Economist, Mar 6th 2008.
- ↑ Seth Finkelstein,"I'm on Wikipedia, get me out of here", The Guardian, September 28 2006.
"At Wikipedia, contentious decisions are made by a process of elaborate discussion culminating in administrative fiat. Deletions go through a comment period. The process is not a vote, but the result forms a recommendation to the administrators."
తా