1977 తమిళనాడు శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1977 తమిళనాడు శాసనసభ ఎన్నికలు

← 1971 1977 జూన్ 10 1980 →

మొత్తం 234 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం
వోటింగు61.58%
  First party Second party
 
Leader ఎం.జి.రామచంద్రన్ ఎం.కరుణానిధి
Party ఏఐడిఎమ్‌కె డిఎమ్‌కె
Alliance ఏఐడిఎమ్‌కె కూటమి N/A
Leader's seat అరుప్పుకోట్టై అన్నా నగర్
Seats won 144 48
Seat change Increase142 Decrease136
Popular vote 57,34,692 42,58,771
Percentage 33.52% 24.89%
Swing కొత్త పార్టీ Decrease23.69%

  Third party Fourth party
 
Leader జి కె మూపనర్ పి.రామచంద్రన్
Party కాంగ్రెస్ జనతా పార్టీ
Alliance కాంగ్రెస్ కూటమి N/A
Leader's seat పోటీ చెయ్యలేదు పోటీ చెయ్యలేదు
Seats won 32 10
Seat change Increase24 Decrease 11
Popular vote 3,491,390 28,51,884
Percentage 20.40% 16.67%
Swing Increase 19.46% Decrease 21.27%

1977 ఫలితాల మ్యాప్

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

రాష్ట్రపతి పాలన
Nonpartisan

ముఖ్యమంత్రి

ఎం.జి.రామచంద్రన్
ఏఐడిఎమ్‌కె

తమిళనాడు ఆరవ శాసనసభ ఎన్నికలు 1977 జూన్ 10 న జరిగాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) తన ప్రత్యర్థి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)ని ఎన్నికల్లో ఓడించింది. ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ సినీ నటుడూ ఐన ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె, డిఎంకె, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి), జనతా పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ జరిగింది. అంతకుముందు 1972లో, ఎంజిఆర్‌కు, డిఎంకె నాయకుడు ఎం. కరుణానిధికీ మధ్య విభేదాలు తలెత్తడంతో ఎంజిఆర్, డిఎంకె నుండి బహిష్కృతుడై ఎఐఎడిఎంకెను స్థాపించాడు. 1976 జనవరి 31 న MISA కి సహకరించడం లేదంటూ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. కరుణానిధి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరా గాంధీతో విభేదించి, జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 1980, 1984 లో జరిగిన రెండు ఎన్నికలలోనూ గెలిచి 1987లో మరణించే వరకు MGR ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఈ ఘనత కారణంగా, ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావడానికి ఎంజీఆర్ ఒక ప్రేరణగా మారాడు. అప్పటి తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ 1983లో ఎంజీఆర్‌ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత, ఎన్నికల రాజకీయాల్లో MGR సాధించిన విజయాలను మరే ఇతర నటుడూ తిరిగి సృష్టించలేకపోయారు.

నేపథ్యం[మార్చు]

ద్రవిడ మున్నేట్ర కజగంలో చీలిక[మార్చు]

MGR తో సహా అనేక మంది ప్రభావవంతమైన నాయకుల నిష్క్రమణ కారణంగా ఏర్పడిన అనేక చీలికల కారణంగా డీఎంకే క్రమంగా బలహీనపడింది. భారత జాతీయ కాంగ్రెస్ (INC)తో సన్నిహిత సంబంధంలో ఉన్న MGR, ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసిన విస్తృతమైన అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రజాదరణ మరింత బలహీనపడింది. 1971 ఎన్నికలకు ముందు ద్రవిడ మున్నేట్ర కజగంలో చీలికలు మొదలయ్యాయి. కరుణానిధి నాయకత్వానికి తీవ్రమైన ముప్పుగా భావించిన కేఏ మథియాళగన్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించారు. సత్యవాణి ముత్తు అనే దళిత నాయకురాలు 1972లో పార్టీలోని దళిత సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని పేర్కొంటూ పార్టీని విడిచిపెట్టి, తజ్తపత్తోర్ మున్నేట్ర కజగంను స్థాపించారు. అవినీతి, నియంతృత్వ ప్రవర్తన కారణంగా పార్టీ నాయకత్వంపై ఎమ్‌జియార్ దాడి చేసినందుకు గాను క్రమశిక్షణా చర్యగా అతన్ని 1972 అక్టోబరు 10 న పార్టీ నుండి బహిష్కరించారు. అతను ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే కొత్త పార్టీని స్థాపించాడు. 1973లో జరిగిన దిండిగల్ ఉప ఎన్నికలో ఏఐఏడీఎంకే విజయం సాధించింది VR నెదుంచెజియన్‌తో పాటు కొంతమంది సీనియర్ పార్టీ నాయకులు ద్రవిడ మున్నేట్ర కజగం నుండి విడిపోయి, 1977 మార్చిలో మక్కల్ ద్రవిడ మున్నేట్ర కజగంను స్థాపించారు. [1]

ఎమర్జెన్సీ[మార్చు]

1975 జూన్ లో ప్రకటించబడిన ఎమర్జెన్సీకి తమిళనాడులో మిశ్రమ స్పందన లభించింది. అవినీతి ఆరోపణల కారణంగా సొంత ఇబ్బందులను ఎదుర్కొన్న డిఎంకె ప్రభుత్వంతో జయప్రకాష్ నారాయణ్ అనుబంధం ఏర్పరచుకోవడాంతో తమిళనాడులో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి పెద్దగా మద్దతు లభించలేదు. జయప్రకాష్ నారాయణ్ ఇందిరా గాంధీ చర్యలను తిరస్కరించినప్పటికీ, డిఎంకెతో అనుబంధం కారణంగా కె. కామరాజ్‌కు మద్దతుగా రాలేదు. జూన్ 27న డిఎంకె ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎమర్జెన్సీని అనవసరమైనది, అప్రజాస్వామికమైనదిగా పేర్కొంది. అనేక రాష్ట్రవ్యాప్త సమావేశాలలో పార్టీ నాయకులు దాన్ని ఖండించారు. అత్యవసర నిబంధనలు, సెన్సార్‌షిప్‌లు ఇతర రాష్ట్రాల మాదిరిగా తమిళనాడులో ఖచ్చితంగా అమలు కాలేదు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీకి మద్దతునిస్తూనే ఉన్నాయి. MG రామచంద్రన్ ఇందిరా గాంధీకి తన మద్దతునిచ్చేందుకు ఢిల్లీకి కూడా వెళ్లాడు. ఈ పరిస్థితుల్లో 1976 జనవరి 31 న భారత ప్రభుత్వం కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దుచేసింది.

కామరాజ్, రాజాజీ ల మరణం[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) నాయకుడు కామరాజ్ 1975లో మరణించాడు. ఆయన మరణించే వరకు భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) వర్గం తమిళనాడులో స్థిరపడలేదు. అతని మరణం తరువాత, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) ఒక పార్టీగా దాని గుర్తింపును కోల్పోయింది. GK మూపనార్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో సభ్యులు ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు. [2] మిగిలిన వారు ద్రవిడ మున్నేట్ర కజగంతో చేరకూడదని నిర్ణయించుకుని, జనతా పార్టీలో చేరారు. చాలా వరకు వారు పార్టీ పట్ల నిబద్ధత కనబరచలేదు.[3] 1972లో సి.రాజగోపాలాచారి మరణం తర్వాత స్వతంత్రపార్టీ తన అధికారాన్ని కోల్పోయి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందులో చాలామంది సభ్యులు కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో చేరారు . [4]

సంకీర్ణాలు[మార్చు]

ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తో పొత్తు పెట్టుకుంది, అయితే INC(I), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) లు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, జనతా పార్టీ (జేఎన్‌పీ) ఒంటరిగా పోటీ చేశాయి. ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పికె మూకియా తేవర్‌కు మద్దతుగా ఉసిలంపాటి నియోజకవర్గంలో ఎఐఎడిఎంకె ఏ అభ్యర్థిని నిలబెట్టలేదు. అదేవిధంగా వాణియంబాడి నియోజకవర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అభ్యర్థి ఎం. అబ్దుల్ లతీఫ్‌కు అన్నాడీఎంకే కూడా మద్దతు ఇచ్చింది. ఈ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పొత్తులు జరిగాయి – అన్నాడిఎంకె నేతృత్వంలోని ఎఐఎడిఎంకె-ఐఎన్‌సి-సిపిఐ సంకీర్ణం, డిఎంకె నేతృత్వంలోని డిఎంకె-ఎన్‌సిఓ-జెఎన్‌పి-సిపిఎం సంకీర్ణం. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలరోజుల్లోనే ఈ కూటములు విడిపోయాయి.[5]

సీట్ల కేటాయింపులు[మార్చు]

ఏఐఏడీఎంకే ఫ్రంట్[మార్చు]

నం. పార్టీ ఎన్నికల చిహ్నం నాయకుడు సీట్లు
1. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం MG రామచంద్రన్ 200
2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జి. రామకృష్ణన్ 20
3. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పికె మూకయ్య తేవర్ 1
నమోదుకాని పార్టీ, దీని అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు
4. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఖాదర్ మొహిదీన్ 1

†: ఫార్వర్డ్ బ్లాక్ 6 నియోజకవర్గాల్లో పోటీ చేసింది, అయితే PKM తేవర్ పోటీ చేసిన ఉసిలంపట్టి నియోజకవర్గంలో మాత్రమే అన్నాడీఎంకే మద్దతు ఇచ్చింది.

కాంగ్రెస్ ఫ్రంట్[మార్చు]

నం. పార్టీ ఎన్నికల చిహ్నం నాయకుడు సీట్లు
1. భారత జాతీయ కాంగ్రెస్ GK మూపనార్ 198
2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తా. పాండియన్ 32

డిఎంకె[మార్చు]

నం. పార్టీ ఎన్నికల చిహ్నం నాయకుడు సీట్లు
1. ద్రవిడ మున్నేట్ర కజగం ఎం. కరుణానిధి 230

జనతా పార్టీ[మార్చు]

నం. పార్టీ ఎన్నికల చిహ్నం నాయకుడు సీట్లు
1. జనతా పార్టీ పి. రామచంద్రన్ 233

ఓటింగు, ఫలితాలు[మార్చు]

ఎన్నికల పోలింగ్ 10 జూన్ 1977న జరిగింది. మొత్తం 61.58% పోలింగ్ నమోదైంది.

కూటమి వారీగా ఫలితాలు[మార్చు]

పార్టీల ఆధారంగా ఫలితాల ఎన్నికల మ్యాప్. రంగులు ఎడమ వైపున ఉన్న ఫలితాల పట్టికపై ఆధారపడి ఉంటాయి
e • d {{{2}}}
Alliance/Party Seats won Change Popular Vote Vote % Adj. %
AIADMK+ alliance 144 +142 5,734,692 33.5%
AIADMK 130 +130 5,194,876 30.4% 35.4%
CPI(M) 12 +12 477,835 2.8% 33.0%
FBL 1 35,361 0.2% 62.0%
IND 1 26,620 0.2% 42.9%
DMK 48 -136 4,258,771 24.9%
DMK 48 -136 4,258,771 24.9% 25.3%
Congress alliance 32 +24 3,491,490 20.4%
INC 27 +27 2,994,535 17.5% 20.8%
CPI 5 -3 496,955 2.9% 20.4%
Janata 10 +10 2,851,884 16.7%
JNP 10 +10 2,851,884 16.7% 16.8%
Others 1 -7 751,712 4.4%
IND 1 -7 751,712 4.4%
Total 234 17,108,146 100%
  1. G.G. Mirchandani. 320 Million Judges. Abhinav publications. pp. 124–126. ISBN 8170170613.
  2. "G.K. Moopanar passes away". The Hindu. 31 August 2001. Archived from the original on 27 September 2004. Retrieved 15 February 2010.
  3. Atul Kohli (1990). Democracy and discontent: India's growing crisis of governability. Cambridge University Press. pp. 166–167. ISBN 0521396921.
  4. Ramakrishnan, T. (25 December 2007). "Remembering a phenomenon". The Hindu. Archived from the original on 27 December 2007. Retrieved 15 February 2010.
  5. (26 January 1980). "Moment of Truth for MGR". Economic and Political Weekly.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]