అమీన్‌గావ్
అమీన్‌గావ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°07′N 91°24′E / 26.11°N 91.40°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
భాష | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 781031 |
Vehicle registration | ఏఎస్ 02 |
అమీన్‌గావ్, అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఉత్తర గువహాటిలో ఉంది. గువహాటి మెట్రోపాలిటన్ నగర విస్తరణ వల్ల అమింగావ్ ప్రాంతం అనేక పెద్ద ప్రాజెక్టులకు నిలయంగా మారింది.
భౌగోళికం
[మార్చు]అమీన్‌గావ్ పట్టణం 26°11′0″N 91°40′0″E / 26.18333°N 91.66667°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 31 మీటర్ల (102 అడుగుల) ఎత్తులో ఉంది.[1]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, అమీన్‌గావ్ పట్టణ జనాభా 8,855 మంది ఉండగా, ఇందులో 4,561 మంది పురుషులు, 4,294 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 995 ఉండగా, ఇది మొత్తం జనాభాలో 11.24% గా ఉంది. పట్టణ స్త్రీ పురుష నిష్పత్తి 941 ఉండగా, రాష్ట్ర సగటు 958 కంటే తక్కువగా ఉంది. బాలబాలికల నిష్పత్తి 839 ఉండగా, అస్సాం రాష్ట్ర సగటు 962 తో పోలిస్తే తక్కువగా ఉంది. పట్టణ అక్షరాస్యత 80.33% కాగా, రాష్ట్ర సగటు 72.19% కంటే కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 86.27% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 74.11%గా ఉంది.
అమీన్‌గావ్ పట్టణంలో మొత్తం 2,037 గృహాలకు ఉన్నాయి. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నగర పరిపాలన సాగుతోంది. ఇది త్రాగునీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ స్థానిక సంస్థలకు అధికారం ఉంది.[2]
మతాలు
[మార్చు]అమీన్‌గావ్ పట్టణ జనాభాలో 95.83% హిందువులు, 3.83% ముస్లింలు, 0.20% క్రైస్తవులు, 0.07% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.06% ఇతరులు ఉన్నారు.[2]
రవాణా
[మార్చు]అమీన్‌గావ్ పట్టణం మీదుగా 31వ జాతీయ రహదారి వెళుతుంది. అమింగావ్ పట్టణానికి గువహాటి రైల్వే స్టేషను, కమాఖ్యా జంక్షన్ రైల్వే స్టేషను సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు. దీనికి సమీప విమానాశ్రయం గువహాటిలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ http://www.fallingrain.com/world/IN/3/Amingaon.html Map and weather of Amingaon
- ↑ 2.0 2.1 "Amin Gaon Census Town City Population Census 2011-2020 | Assam". www.census2011.co.in. Retrieved 2020-12-23.