క్రా దాదీ జిల్లా
క్రా దాడీ | |
---|---|
Coordinates (న్యూ పాలిన్, అరుణాచల్ ప్రదేశ్): 28°04′19″N 95°19′30″E / 28.072°N 95.325°E | |
Country | India |
State | అరుణాచల్ ప్రదేశ్ |
Division | అరుణాచల్ పశ్చిమం |
Headquarters | జామిన్ |
Government | |
• Lok Sabha constituencies | అరుణాచల్ పశ్చిమం |
విస్తీర్ణం | |
• Total | 2,202 కి.మీ2 (850 చ. మై) |
Elevation | 2,060 మీ (6,760 అ.) |
జనాభా (2011) | |
• Total | 22,290 |
• జనసాంద్రత | 10/కి.మీ2 (26/చ. మై.) |
Demographics | |
• Literacy | 44% |
Time zone | UTC+05:30 (IST) |
క్రా దాడీ జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక జిల్లా. ఇది 2015 ఫిబ్రవరి 7న కురుంగ్ కుమే జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది.[1]
చరిత్ర
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ (జిల్లాల పునర్వ్యవస్థీకరణ) (సవరణ) బిల్లు కింద క్రా దాడీ జిల్లా ఏర్పాటుకు 2013 మార్చి 21 న ఆమోదం లభించింది.[2] క్రా దాడీ జిల్లాను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి నాబమ్ తుకి 2015 ఫిబ్రవరి 7 న 19 వ జిల్లాగా ప్రారంభించారు.[1]
పరిపాలన
[మార్చు]పాలిన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమీన్ ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. దీని పరిధి జమిన్ (డామిన్ అని కూడా పిలుస్తారు), తాలి అనే రెండు శాసలసభ నియోజకవర్గాలు పరిధిలో విస్తరించి ఉంది. ఆ జిల్లా పరిధిలో ఎనిమిది ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరం నుండి సవ్యదిశలో, పిప్సోరాంగ్, తాలి, చంబాంగ్, పాలిన్, యాంగ్టే, తారక్,లాంగ్డి, గాంగ్టే.[1]
దీనికి ఉత్తరాన చైనాతో టిబెట్ అంతర్జాతీయ సరిహద్దు, తూర్పున ఎగువ సుబన్సిరి జిల్లా, దక్షిణాన దిగువ సుబన్సిరి జిల్లా,ఆగ్నేయంలో పాపుమ్ పరే జిల్లా, పశ్చిమాన కురుంగ్ కుమే జిల్లా ఉన్నాయి. పాలియా పాలిన్ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న జిల్లాలో ఒక ఉప విభాగం ఉంది. దీనిని అదనపు ఉప కమిషనర్ నిర్వహిస్తాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Arunachal Pradesh carves out new district". The Times of India. 9 February 2015.
- ↑ "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.