Jump to content

చలం (నటుడు)

వికీపీడియా నుండి
చలం
జననం
కోరాడ సింహా చలం 18,మే, 1929
వృత్తినటుడు
జీవిత భాగస్వామిరమణ కుమారి, శారద (విడాకులు)

చలం ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[1] 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సింహాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. దాసి సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, సహాయ నటునిగా, చిత్ర నిర్మాతగా రాణించాడు. నటి శారదను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరి నారాయణరావు ఈయనను ప్రోత్సహించాడు.

కెరీర్

[మార్చు]

1952లో లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి చిత్రంలో రెండవ కథానాయకుడిగా సినీ రంగంలో ప్రవేశించాడు చలం. ఈ చిత్రం విజయం సాధించింది. అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అమర్ నాథ్ నిర్మించిన నా చెల్లెలు చిత్రంలో రెండో కథానాయకుడిగా నటించాడు. బబ్రువాహన చిత్రంలో ఎన్. టి. ఆర్, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, రాజసులోచన వంటి నటులతో టైటిల్ రోల్ (బబ్రువాహనుడు) పోషించాడు. సారంగధర చిత్రంలో ఎన్. టి. ఆర్, భానుమతి, రంగారావు తో కలిసి నటించాడు.

చిత్ర సమాహారం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వైట్ల, కిషోర్ కుమార్. అభినందన మందారమాల స్వర్ణయుగంలో నటరత్నాలు. హైదరాబాదు: నవోదయ. pp. 133–134. Archived from the original on 2019-02-26. Retrieved 2019-02-26.

బయటి లింకులు

[మార్చు]