Coordinates: 13°47′00″N 78°35′00″E / 13.7833°N 78.5833°E / 13.7833; 78.5833

గుర్రంకొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎బయటి లంకెలు: {{commons category|Gurramkonda}}
పంక్తి 75: పంక్తి 75:
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
{{commons category|Gurramkonda}}
*[https://www.youtube.com/watch?v=T8DIrOY5tA8 [[యూట్యూబ్]]లో గుర్రంకొండ కోట వీడియో]
*[https://www.youtube.com/watch?v=T8DIrOY5tA8 [[యూట్యూబ్]]లో గుర్రంకొండ కోట వీడియో]



02:59, 6 జనవరి 2018 నాటి కూర్పు


గుర్రంకొండ
—  మండలం  —
చిత్తూరు పటంలో గుర్రంకొండ మండలం స్థానం
చిత్తూరు పటంలో గుర్రంకొండ మండలం స్థానం
చిత్తూరు పటంలో గుర్రంకొండ మండలం స్థానం
గుర్రంకొండ is located in Andhra Pradesh
గుర్రంకొండ
గుర్రంకొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్రంకొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°47′00″N 78°35′00″E / 13.7833°N 78.5833°E / 13.7833; 78.5833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం గుర్రంకొండ
గ్రామాలు 10885
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,772
 - పురుషులు 21,710
 - స్త్రీలు 21,062
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.18%
 - పురుషులు 71.88%
 - స్త్రీలు 46.36%
పిన్‌కోడ్ 517297

గుర్రంకొండ కడప మరియు బెంగళూరు రహదారిలో ఉంది. గుర్రంకొండ మూస:Coor d.[1] సముద్రమట్టానికి 647 మీటర్ల (2125 అడుగుల) ఎత్తునగలదు. గుర్రంకొండ ఒక పర్యాటక ప్రదేశం. దీనికి చారిత్రకంగా జాఫరాబాదు అని కూడా పేరు ఉంది. కడప - బెంగళురు రహదారిలో ఉన్న ఈ గుర్రం కొండ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది ఆనాడే హిందూ, ముస్లిం సంస్కృతులకు నిలువుటద్దంగా వుండి మతసామరస్యాన్ని చాటిచెప్పింది[2].

గుర్రంకొండ కోట

గుర్రంకొండ గిరిదుర్గము. శత్రుదుర్భేద్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు కట్టించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్పకొండపై ఉంది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంది. నాలుగోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంది. కోటలో నలభైకి పైగా మసీదులు ఉండేవి. కానీ అవి శిధిలమైనవి. పర్షియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు. ఈ కోట 18వ శతాబ్దపు చివరలో కొన్నాళ్లు టిప్పూసుల్తాను ఆధీనంలో ఉంది. టిప్పూసుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు.[3] ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇచ్చట గల కోట చాలా ప్రసిద్ధమైనది. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది.

మక్బరా (ఖండ్రిగ)

గుర్రం కొండకు 3 కిమీల దూరంలో మక్బరా (ఖండ్రిగ) గ్రామం ఉంది. ఈ మక్బరాలోనే టిప్పు సుల్తాన్‌ మేనమామ, గుర్రం కొండ దుర్గం నవాబు అయిన మీర్‌ రజా అలీఖాన్‌ సమాధి ఉంది. ఈ సమాధి వలనే ఈ గ్రామానికి మక్బరా (సమాధి) అనే పేరు వచ్చింది. సమాధిపై ఉన్న పారశీక శాసనంలో ఈయన మరణించిన సంవత్సరం 1780గా సూచించబడింది. ఈ మక్బరా అరబిక్‌ శైలిలో రెండు అంతస్తులతో ఉంటుంది. మొదటి అంతస్తులో ఇతని కుటుంబ సభ్యుల సమాధులు వుండగా... రెండవ అంతస్తులో అలీఖాన్‌ సమాధి ఉంది. రెండవ అంతస్తులో సమాధి ఉన్న గుంబజ్‌ (గుమ్మటం) నిర్మాణం పూర్తిగా బీజాపూర్‌లోని గోల్‌ గుంబజ్‌ను పోలి వుండటమే కాకుండా గోల్‌ గుంబజ్‌ తరువాత స్థానాన్ని ఈ సమాధి ఆక్రమించి, రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రదేశాలన్నీ పురావస్తుశాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.

కోట నిర్మాణం

విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విజయనగర పాలకులు గుర్రం కొండ దుర్గాన్ని నిర్మించారు. అయితే హైదర్‌ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్‌ మహారాష్ట్ర నుండి ఈ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు. దాదాపు నాలుగు వందల సంవత్సరాల కిందట నిర్మింపబడి, చరిత్ర ప్రసిద్ధి గాంచి, శత్రుదుర్భేద్యమైన ఈ కోటను ఆ తరువాత గోల్కొండ సుల్తానుల హయాంలో పునర్నిర్మించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్ప కొండపై ఉంది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంటుంది. నాలు గోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంది. కోటలో నల భైకి పైగా మసీదులు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి శిథిలమైనవి. పర్షియాలోని కిర్మాన్‌ నుండి వచ్చిన హజ్రత్‌ షా కమాల్‌ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతం లోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు.ఈ కోట 18వ శతాబ్దం చివరలో టిప్పు సుల్తాన్‌ ఆధీనంలో ఉన్న కాలంలో... ఆయన ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు. ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇక్కడి కోట చాలా ప్రసిద్ధమైనది. ఈ కోటలో గల ‘రంగినీ మహల్‌’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

కోట విశేషాలు

సందర్శకులకు మొదటగా... తొలి ప్రహరీగోడ, దాని తరువాత కందకం కనిపిస్తాయి. దుర్గానికి తూర్పు వైపున ఉన్న ఏనుగుల చెరువు (హాతీ తలాబ్‌) లోంచి ఈ కందకంలోకి నీటిని నింపి శత్రు సైన్యాల ముట్టడి నుండి దుర్గాన్ని రక్షించుకునేవారట. కందకం దాటితే రెండవ ప్రహరీ గోడ, దానిలోపలే దుర్గం ఉంది. ఈ దుర్గం అతి ఎత్తయిన కొండ (గుర్రం కొండ) కు చుట్టూ నిర్మింపబడింది. కొండపైకి వెళ్లడానికి ఒకే ఒక మార్గం ఉంది. మిగిలిన మూడువైపులా రాకపోకలు సాగించడానికి వీలులేకుండా సహజసిద్ధమైన ఏర్పాట్లున్నాయి. ఉత్తరం వైపు మినహా మిగిలిన మూడు వైపులా కొండ ఏకశిలారూపంలో నిట్టనిలువనా ఉండడంతో మానవమాత్రులెవ్వరూ ఈ మూడు వైపుల నుండి కొండపైకి ఎక్కడానికి వీలుపడదు. కొండపైకి వెళ్లడానికి ఉత్తరం వైపు విశాలమైన రాతి మెట్లు నిర్మించారు. మెట్ల మీదుగా పైకి వెళితే మధ్యలోనే ప్రధాన ద్వారం దాటాలి. 25 అడుగుల ఎత్తులో రాతితో నిర్మింపబడిన ప్రధాన ద్వారంపై కనిపించే శంఖు, విష్ణుచక్రాల గుర్తులను బట్టి మొదట ఈ దుర్గాన్ని హిందూరాజులు నిర్మించారన్న విషయం తెలుస్తోంది. కొండకు దిగువ భాగంలో నవాబు నివాసమందిరమైన రంగినీ మహల్‌ (రంగ మహల్‌) సందర్శకులను విశేషంగా ఆకట్టుకుం టోంది. రంగినీ మహల్‌ ముఖ భాగం వైపు నుండి చూస్తే రెండు అంతస్తులతోనూ ఉండి సందర్శకులను ఆశ్చర్యచకి తులను చేస్తోంది. పై అంతస్తులో ఒక విశాలమైన హాలు, రెండు అలంకరణ గదులు, ఆరు స్నానపు గదులు నిర్మించి ఉన్నాయి. ఆనాటి భవన నిర్మాణ చతురతకు ఇదో నిదర్శనం. అయితే నేడు రంగినీ మహల్‌ ఎదురుగా ఉన్న అనేక పెద్ద భవనాలు పూర్తిగా కూలిపోయి శిథిలాలమయంగా ఉంది. ఓ పక్కగా గల వంటగది పైకప్పు కూలిపోయి మొండి గోడలతో వుండగా, నవాబు ఉపయోగించే గుర్రపు బగ్గీ కోసం నిర్మించిన పోర్టికో నేటికీ దృఢంగా, చెక్కు చెదరకుండా ఉంది.

రాచరిక వ్యవస్థకు నిలువుటద్దం

గుర్రం కొండ ఆ రోజుల్లో ఒక బలమైన దుర్గానికి కేంద్రమై, ఓ వెలుగు వెలిగింది. రెండు వందల సంవత్సరాలపాటు రాచరిక పాలనా వ్యవస్థకు కేంద్రంగా, జాగీరుగా, వ్యాపార వాణిజ్యాలకు, జమిందార్ల నిలయంగా ఉండేది. గుర్రం కొండ చరిత్రను ఒకసారి అవలోకిస్తే గుర్రం కొండ దుర్గానికి సంబంధించి తద్వారా దానితో ముడిపడి ఉన్న ఇతర పెద్ద సామ్రాజ్యాల చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు పర్యాటకుల స్మృతిపథంలో మెదులుతాయి.

వెల్లివిరిసిన మతసామరస్యం

కోట లోపల నిర్మింపబడిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, వినాయక ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, రెండు మసీదులు, మూడు దర్గాలు ఉండడం నాటి మతసామరస్యానికి, హిందూ, ముస్లిం ఐక్యతను చాటిచెబుతోంది. నెయ్యి గది, వైద్యశాల, ధాన్యపు గదులు అన్నీ నేడు శిథిలావస్థలో ఉన్నాయి. గుర్రం కొండ దుర్గానికి పడమర వైపున ఉన్న మక్బరా (పవిత్ర సమాధి) దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

రోడ్డు మార్గము

గుర్రం కొండకు వెళ్లాలంటే... బెంగుళురు నుంచి అయితే మదన పల్లె, వాల్మీకి పురం, కలకడ, మార్గాల లోనూ... కడప నుంచి అయితే రాయచోటి మార్గంలోనూ... తిరుపతి నుంచి అయితే తిరుపతి - బెంగుళురు హైవేలో వాల్మీకి పురం వరకు ప్రయాణించి ఆ తరువాత అక్కడి నుండి గుర్రం కొండ చేరుకోవచ్చు.

మండలంలోని పట్టణములు

  • గుర్రంకొండ

మండలంలోని గ్రామాలు

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 42,772 - పురుషులు 21,710 - స్త్రీలు 21,062
అక్షరాస్యత (2011) - మొత్తం 59.18% - పురుషులు 71.88% - స్త్రీలు 46.36%

రవాణ సదుపాయములు

గుర్రంకొండకు 10 కి.మీ లోపు రైలు సదుపాయము లేదు. తిరుపతి రైలే స్టేషను 102 కి.మీ దూరములో ఉంది. దగ్గరలోని ఇతర రైల్వే స్టేషనులు. మదనపల్లి, 17 కి.మీ. వాయల్పాడు 18 కి.మీ., తుమ్మనగుట్ట 26 కి.మీ.,రైల్వే స్టేషనులు. గుర్రంకొండ బస్ స్టేషనుతో చించపర్తి, అంగళ్లు కలకడ బస్ స్టేషన్లతో అనుసంధానము చేయ బడి బస్సులు నడుస్తున్నవి.[4]

విద్యా సంస్థలు

  1. ప్రభుత్వ జూనియర్ కళాశాల,
  2. న్యూ శ్రీవాణి హై స్కూలు,
  3. జిల్లాపరిషత్ హై స్కూలు.,
  4. విశ్వభారతి స్కూలు

మూలాలు

  1. Falling Rain Genomics.Gurramkonda
  2. http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=122570
  3. The Coins of Haidar Alī and Tīpū Sultān By John Robertson Henderson
  4. "http://www.onefivenine.com/india/villag/Chittoor". Retrieved 19 June 2016. {{cite web}}: External link in |title= (help)

బయటి లంకెలు