భీమ్లా నాయక్
భీమ్లా నాయక్ | |
---|---|
దర్శకత్వం | సాగర్ కె.చంద్ర |
స్క్రీన్ ప్లే | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
దీనిపై ఆధారితం | సచీ దర్శకత్వం వహించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మలయాళం సినిమా రీమేక్ |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం | పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నిత్య మేనన్ ఐశ్వర్య రాజేష్ |
ఛాయాగ్రహణం | రవి కె. చంద్రన్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 25 ఫిబ్రవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భీమ్లా నాయక్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జనవరి 12న[1] కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడి ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో[2] విడుదలైంది.[3][4] ఈ సినిమా మార్చి 25 నుంచి ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.[5] ఈ సినిమా బిజు మేనన్, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన అయ్యప్పనుం కోషియుం అనే మలయాళ సినిమాకు పునర్నిర్మాణం.
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమా షూటింగ్ 2021 జనవరి 25న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు.[6] జనవరి 26 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[7] ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా 2021 మార్చి చివర్లో షూటింగ్‌ను వాయిదా వేసి, జూలై 12 నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.[8] ఈ సినిమాలోని ‘సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ టైటిల్ సాంగ్ పాటను 2021 సెప్టెంబరు 2న విడుదల చేశారు.[9] భీమ్లా నాయక్ ట్రైలర్‌ను 2022 ఫిబ్రవరి 21న విడుదల చేసి[10], ప్రీ రిలీజ్ వేడుకను ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రత్యేక అతిథిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలోహైదరాబాద్, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 23న నిర్వహించారు.[11] ఈ చిత్రం పది రోజుల్లో ₹167 కోట్ల గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని వసూలు చేసింది.[12]
నటీనటులు
[మార్చు]- పవన్ కళ్యాణ్ - భీమ్ల నాయక్[13]
- రానా దగ్గుబాటి - డేనియల్ శేఖర్, రిటైర్డ్ ఆర్మీ అధికారి[14][15]
- నిత్య మేనన్
- సంయుక్త మీనన్[16]
- బ్రహ్మానందం [17]
- సముద్రఖని
- మురళి శర్మ
- బ్రహ్మాజీ
- తనికెళ్ల భరణి
- రావు రమేశ్
- రఘుబాబు
- అజయ్
- శత్రు
- కాదంబరి కిరణ్
- సంజయ్ స్వరూప్
- నర్రా శ్రీను
- మౌనికా రెడ్డి[18]
- పమ్మి సాయి
- రవివర్మ
- లక్ష్మణ్ మీసాల
- ఎం.ఎస్.చౌదరి
- రామచంద్రరాజు
- అయ్యప్ప శర్మ
- కాదంబరి కిరణ్
- తేజ కాకుమాను
అతిధి పాత్రల్లో
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
- మాటలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్
- దర్శకత్వం: సాగర్ కె చంద్ర[19]
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్ [20][21]
- ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
- సమర్పణ : పివివి ప్రసాద్
థియేట్రికల్ ట్రైలర్(లు)
[మార్చు]ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ మొదట 2022 ఫిబ్రవరి 21 న విడుదల అయ్యింది.[22] అయితే ట్రైలర్ ఆశించినంత రంజుగా లేదని, ముఖ్యంగా తమన్ నేపథ్యసంగీతం చప్పగా ఉందని, త్రివిక్రం మార్కు డైలాగులు వినపడలేదని ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు వెల్లువెత్తాయి.[23] ఈ స్పందనను పరిగణ లోకి తీసుకొన్న చిత్ర సాంకేతిక వర్గం 2022 ఫిబ్రవరి 23 న మెరుగైన నేపథ్య సంగీతం, పోరాట సన్నివేశాలు, త్రివిక్రం మార్కు డైలాగులతో రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు.[24][25][26]
పాటల జాబితా
[మార్చు]1: అంత ఇష్టమేందయ్య , గానం.చిత్ర
2: ఓ సందమామ
3: బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్
4: లాలా భీమ్లా
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 August 2021). "పవన్-రానా మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఇదే". Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
- ↑ 10TV (25 February 2022). "హిందీలో రిలీజ్ కాని భీమ్లా నాయక్.. కారణం ఇదే! | Hindi Version Of Bheemla Nayak Film Not Releasing In Theatres" (in telugu). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ V6 Velugu (15 January 2022). "భీమ్లా నాయక్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్" (in ఇంగ్లీష్). Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Bheemla Nayak Review: Pawan Kalyan and Rana deliver breathtaking performances". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-25. Retrieved 2022-03-03.
- ↑ Andhra Jyothy (18 March 2022). "ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.!". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ 10TV (21 December 2020). "రానా - పవన్ సినిమా ప్రారంభం" (in telugu). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Indian Express (25 January 2021). "Pawan Kalyan-Rana Daggubati film goes on the floor" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
- ↑ The Times of India (6 July 2021). "PSPK Rana Movie: Pawan Kalyan to resume the film shooting from July 12?" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
- ↑ Eenadu (2 September 2021). "Happy Birthday Pawan Kalyan: వినరా సాంబ... భీమ్లా నాయక్ వచ్చేశాడు..! - telugu news bheemlanayak title song out now". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
- ↑ HMTV (21 February 2022). "భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ TeluguTV9 Telugu (23 February 2022). "ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన భీమ్లానాయక్ప్రీరిలీజ్ ఈవెంట్". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Bheemla Nayak Closing Collections Worldwide" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-06. Retrieved 2022-04-05.[permanent dead link]
- ↑ Eenadu (23 February 2022). "అయ్యప్పనుమ్ కోషియుమ్ Vs భీమ్లా నాయక్.. ఎవరు ఏ పాత్రలు చేశారంటే?". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
- ↑ Namasthe Telangana (20 September 2021). "డేనియల్ శేఖర్ ఆగయా". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
- ↑ TV9 Telugu (29 July 2021). "Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (3 October 2021). "రానా జోడీగా సంయుక్త మీనన్ ఖాయం". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ 10TV (8 December 2021). "భీమ్లాలో బ్రహ్మానందం." (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ TV5 News (25 February 2022). "భీమ్లా నాయక్ లో పవన్ పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!" (in ఇంగ్లీష్). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (28 February 2022). "పవన్ మాటలు బాధ్యత పెంచాయి". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ The Times of India (15 July 2021). "Ravi K Chandran to replace Prasad Murella as the cinematographer of 'PSPK Rana Movie'? - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
- ↑ Andrajyothy (13 November 2021). "'భీమ్లా నాయక్': సినిమాటోగ్రాఫర్‌కు పవన్ అభినందనలు". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ Entertainments, Sithara (21 February 2022). "Bheemla Nayak Official Trailer". youtube.com. Retrieved 24 February 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ DN, Sindujaa (24 February 2022). "Bheemla Nayak's Second Trailer: Repair Well Done!!". indiaherald.com. Retrieved 24 February 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Entertainments, Sithara (23 February 2022). "#BheemlaNayak Release Trailer | Pawan Kalyan, Rana Daggubati | Trivikram | SaagarKChandra | ThamanS". youtube.com. Retrieved 24 February 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ .com, Mirchi9 (23 February 2022). "Trailer Talk 2: Hits It Out Of The Park". mirchi9.com. Retrieved 24 February 2022.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ Chanti, Rajitha (23 February 2022). "Bheemla Nayak New Trailer: భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే." tv9telugu.com. Retrieved 24 February 2022.
- CS1 maint: unrecognized language
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2022 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 2022 తెలుగు సినిమాలు
- మలయాళ సినిమా పునర్నిర్మాణాలు
- పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు