Jump to content

మిస్ మీనా (నాటకం)

వికీపీడియా నుండి
మిస్ మీనా
మిస్ మీనా నాటికంలోని దృశ్యం
రచయితరాజీవ్ కృష్ణన్ (మిస్ మీనా - తమిళ నాటకం)
దర్శకుడుచంద్రశేఖర్ ఇండ్ల
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘీక నాటకం
నిర్వహణథియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), రంగస్థల కళలశాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం

మిస్ మీనా తెలుగు సాంఘీక నాటకం. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) తయారుచేసిన ఈ నాటకానికి నాటక రచయిత, దర్శకుడు, నటుడు చంద్రశేఖర్ ఇండ్ల దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ది విజిట్ అనే ఇంగ్లీష్ నాటకానికి అనుసరణగా తమిళనాడుకు చెందిన రాజీవ్ కృష్ణన్ రూపొందించిన మిస్ మీనా అనే తమిళ నాటకం దీనికి మాతృక. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నాటకం దాదాపు 110 ప్రదర్శనలు ఇచ్చింది.[1]

2013, జనవరి 20న మిమిక్రి సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ జన్మదిన వేడుకల సందర్భంగా హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మొదటి ప్రదర్శన జరిగింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో (హైద్రాబాద్, ఒంగోలు, నరసరావుపేట, గుంటూరు, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మిర్యాలగూడెం, వైజాగ్, శ్రీకాకుళం, తెనాలి, కందులూరు, అదిలాబాద్, రేపల్లె, కొండపల్లి) ప్రదర్శించి, 2014 మార్చి 23 నాటికి 83 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది.[2][3]

సంక్షిప్త కథ

[మార్చు]

తుమ్మలపెంట ఊరంతా మేళతాళాలతో మిస్ మీనాకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. తమ ఊరిలో పుట్టి పెరిగిన ఒక సాధారణమైన పిల్ల దేశం గర్వించే కథానాయికగా గుర్తింపుపొంది, పదిహేనేళ్ల తర్వాత మళ్లీ తమ గ్రామానికి వస్తోంది. ఆవిడ దయ ఉండాలే గాని తమ కష్టాలన్నీ తీరిపోతాయని వారి ఆశ. మీనా వస్తుంది. అందరి కష్టాలు తీరుస్తానంటుంది. తన ఆత్మకథనే ఆధారంగా చేసుకొని అదే ఊరిలో సినిమా చిత్రీకరణ కూడా చేస్తుంది. "అయితే నాదో చిన్న కోరిక ! తీరుస్తారా ?" అంటూ గ్రామ ప్రజలంతా నిశ్చేష్టులయ్యే కోరిక ఒకటి కోరుతుంది. తుమ్మలపెంట ప్రజానీకం ఆమె కోరిక తీరుస్తారా ! లేదా ! అన్నది నాటక ఇతివృత్తం.

నిర్మాణం

[మార్చు]

నాటకాల పట్ల అభిరుచి ఉన్న 124 మంది యువతని పరీక్షించి, అందులోంచి పదిమందిని వివిధ పాత్రలకు ఎంపిక చేశారు. వారికి రెండు నెలలు శిక్షణ ఇప్పించారు. శిక్షణ, ప్రదర్శనకాలంలో వారికి నెలకి రూ. 15 వేల గౌరవ వేతనం ఇచ్చారు.

నటీనటులు

[మార్చు]

తెలుగు నాటకరంగంలో ఆసక్తి కలిగిన యువకులకు ఈ నాటకంలో నటించడానికి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) లో శిక్షణ ఇచ్చారు. వారితో ఈ నాటకాన్ని ఎన్నో ప్రాంతాల్లో ప్రదర్శించారు.

  • మిస్ మీనా (హీరోయిన్) గా అశ్వినీ శ్వేత, పల్లవి, జయశ్రీ నాయుడు
  • నాటకాల నటరాజ్ (హీరో) గా పవన్ రమేష్
  • శ్రీను (విలన్) గా ప్రవీణ్ కుమార్
  • ఉప్పలపాటి సత్యనారాయణ (సర్పంచ్) గా శ్రీనివాస్
  • కె.వి. పంతులు (పూజారి) గా వికాస్ చైతన్య
  • సలీం (పోలీస్) గా జ్ఞాన ప్రకాష్, సుధాకర్
  • నరసింహం (పోస్ట్ మాన్) గా సాయి కిరణ్
  • చిట్టితల్లిగా సాయి లీల
  • నిర్మల (టీచర్) గా పద్మశ్రీ
  • సూరి (టైలర్) గా నిఖిల్ జాకబ్
  • బుచ్చిబాబు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: చంద్రశేఖర్ ఇండ్ల
  • దర్శకత్వ పర్యవేక్షణ: రాజీవ్ కృష్ణన్
  • సంగీతం: ఎజిల్ మతి
  • నృత్యం: గిరీష్ చంద్ర
  • ప్రాజెక్ట్ ఎక్ష్జిక్యూటీవ్, లైటింగ్: షేక్ జాన్ బషీర్

ఇతరులు

[మార్చు]

ఈ నాటకానికి ఆచార్య అనంతకృష్ణన్ (డీన్, యస్.యన్. స్కూల్), డా. ఎన్.జె. బిక్షు (హెడ్, థియేటర్ ఆర్ట్స్), రాజీవ్ వెలిచేటి (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), డా. పెద్ది రామారావు (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), నౌషాద్ (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), బిజు శ్రీథరన్, శివ ప్రసాద్, రాంమోహన్ తదితరులు నటీనటులకు శిక్షణ ఇచ్చారు. నాటక ప్రదర్శన నిర్వాహణ బాధ్యతను ఎస్.ఎం. బాషా (ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్) స్వీకరించగా, ప్రణయ్‌రాజ్ వంగరి (ప్రాజెక్ట్ అసిస్టెంట్) సహకారం అందించాడు.

ప్రదర్శనల పట్టిక

[మార్చు]
సం. తేది స్థలం ఊరు జిల్లా
1 10.01.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
2 11.01.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
3 12.01.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
4 20.01.2013 డా. నేరెళ్ల వేణుమాధవ్ కళా వేదిక హన్మకొండ వరంగల్
5 21.01.2013 తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల (2 pm) కరీంబాద్ వరంగల్
6 21.01.2013 నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (7 pm) హన్మకొండ వరంగల్
7 22.01.2013 కాకతీయ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హసన్ పర్తి వరంగల్
8 23.01.2013 బి.హెచ్.ఇ.ఎల్ కమ్యూనిట్ హాల్ హైదరాబాద్ హైదరాబాద్
9 24.01.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
10 26.01.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
11 28.01.2013 ఆంధ్రజ్యోతి ప్రెస్ హైదరాబాద్ హైదరాబాద్
12 30.01.2013 చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ హైదరాబాద్
13 02.02.2013 రైజ్ కళాశాల (11 am) ఒంగోలు ప్రకాశం
14 02.02.2013 ఎన్.టి.ఆర్. కళాపరిషత్ (7 pm) ఒంగోలు ప్రకాశం
15 03.02.2013 రంగస్థలి నరసరావుపేట గుంటూరు
16 04.02.2013 వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు గుంటూరు
17 05.02.2013 సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాల (11 am) చేబ్రోలు గుంటూరు
18 05.02.2013 ఆర్.వి.ఆర్. & జె.సి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (7 pm) చోడవరం గుంటూరు
19 06.02.2013 భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మం ఖమ్మం
20 07.02.2013 కళాభారతి సాహితి సాంస్కృతిక సంస్థ సత్తుపల్లి ఖమ్మం
21 08.02.2013 భద్రాద్రి కళాభారతి భద్రాచలం ఖమ్మం
22 09.02.2013 కొత్తగూడెం క్లబ్ కొత్తగూడెం ఖమ్మం
23 13.02.2013 గోల్డెన్ త్రెషోల్డ్ నాంపల్లి హైదరాబాద్
24 21.02.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
25 22.02.2013 ఎ.ఎస్.ఎన్. మహిళా కళాశాల తెనాలి గుంటూరు
26 23.02.2013 శ్రీరామ రూరల్ ఎడ్యూకేషన్ ఇన్సిట్యూషన్స్ చిలుమూరు గుంటూరు
27 24.02.2013 వంగా అప్పిరెడ్డి పురవేదిక మున్నంగి గుంటూరు
28 26.02.2013 అరవింద ఉన్నత పాఠశాల కుంచనపల్లి గుంటూరు
29 27.02.2013 విజ్ఞాన్ యూనివర్సటీ వడ్లమూడి గుంటూరు
30 01.03.2013 సిద్ధార్ధ అకాడెమీ విజయవాడ కృష్ణా
31 02.03.2013 హనుమంతరాయ గ్రంథాలయం విజయవాడ కృష్ణా
32 04.03.2013 ఆనంద్ కళాక్షేత్రం (11 am) రాజమండ్రి తూర్పు గోదావరి
33 04.03.2013 ఉషా స్కూల్ (7 pm) రాజమండ్రి తూర్పు గోదావరి
34 08.03.2013 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సటీ హైదరాబాద్ హైదరాబాద్
35 10.03.2013 సురభి కాలనీ శేర్ లింగంపల్లి హైదరాబాద్
36 16.03.2013 అగ్రికల్చర్ కాలేజీ బాపట్ల గుంటూరు
37 17.03.2013 ఆరుబయట రంగస్థలం జొన్నలగడ్డ కృష్ణా
38 20.03.2013 త్యాగరాయ గానసభ చిక్కడపల్లి హైదరాబాద్
39 21.03.2013 త్యాగరాయ గానసభ చిక్కడపల్లి హైదరాబాద్
40 25.03.2013 జవహార్ లాల్ నెహ్రూ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇబ్రహింపట్నం హైదరాబాద్
41 27.03.2013 మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ మిర్యాలగూడ నల్లగొండ
42 28.03.2013 సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మౌంట్ ఒపెరా హైదరాబాద్
43 04.04.2013 స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం విశాఖపట్నం
44 05.04.2013 ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం విశాఖపట్నం
45 06.04.2013 బాలాజీ కళామందిర్ శ్రీకాకుళం శ్రీకాకుళం
46 07.04.2013 ఆరుబయట రంగస్థలం కొత్తపాలెం విశాఖపట్నం
47 08.04.2013 సాగర్ ఓపెన్ ఎయిర్ థియేటర్ విశాఖపట్నం విశాఖపట్నం
48 09.04.2013 సి.ఆర్.సి. ఖాటన్ పరిషత్ రావులపాలెం తూర్పు గోదావరి
49 10.04.2013 హిందూ యువజన సంఘం ఏలూరు పశ్చిమ గోదావరి
50 11.04.2013 కొండవీటి కళాపరిషత్ లింగారావుపాలెం పశ్చిమ గోదావరి
51 12.04.2013 నిర్మల్ విద్యానికేతన్ కందులూరు ఒంగోలు
52 13.04.2013 లయన్స్ క్లబ్ ఆకివీడు పశ్చిమ గోదావరి
53 14.04.2013 అభ్యుదయ కళాపరిషత్ పెద్దాపురం కృష్ణా
54 18.04.2013 తెలంగాణ థియేటర్ & మీడియా రిపర్టరీ అదిలాబాద్ అదిలాబాద్
55 24.04.2013 శ్రీకారం & రోటరీ కళాపరిషత్ మార్టూరు ప్రకాశం
56 25.04.2013 కళ్యాఱ మండపం ఉప్పలపాడు ప్రకాశం
57 26.04.2013 కార్తీక మహోత్సవ కమిటీ కారుమూరు గుంటూరు
58 28.04.2013 రసాలయ కళాసమితి రేపల్లె గుంటూరు
59 30.04.2013 ఆర్.కె.ఎమ్. స్కూల్ ఉయ్యూరు కృష్ణా
60 01.05.2013 సుంకర - టి. కృష్ణ నాగార్జున కళాసమితి కొండపల్లి కృష్ణా
61 03.05.2013 కాసరనేని సదాశివరావు కళాసమితి గుంటూరు గుంటూరు
62 13.05.2013 పొన్నురు కళాపరిషత్ పొన్నురు గుంటూరు
63 15.05.2013 ఆరుబయట రంగస్థలం దుర్గి గుంటూరు
64 21.07.2013 టి.జి.వెంకటేష్ కళాసమితి కర్నూలు కర్నూలు
65 29.07.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
66 30.08.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
67 07.09.2013 గురుభక్ష్ సింగ్ హాల్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్
68 24.09.2013 నల్గొండ జూనియర్ కళాశాల నల్గొండ నల్గొండ
69 30.08.2013 విద్వాన్ జూనియర్ కళాశాల నల్గొండ నల్గొండ
70 30.08.2013 గౌతమి మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ నల్గొండ

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hindu, Friday Review (26 July 2013). "New dawn for theatre". The Hindu (in Indian English). Neeraja Murthy. Archived from the original on 4 November 2013. Retrieved 10 September 2020.
  2. ఈనాడు, ఈతరం (18 May 2013). "కుర్రకారు...నాటకాల జోరు!". Archived from the original on 27 December 2016. Retrieved 6 August 2016.
  3. సూర్య, నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌ (February 5, 2013). "ఆద్యంతం రక్తి కట్టించిన 'మిస్‌మీనా' నాటక ప్రదర్శన". Retrieved 6 August 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]