వరంగల్ శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానపద గాయకులు శంకర్‌
కునమల్ల శంకర్‌, సంధ్య
జననంశంకర్‌
వరంగల్ జిల్లా
మరణం7 ఏప్రిల్ 2005
వరంగల్ కుమార్ పల్లి.
నివాస ప్రాంతంవరంగల్ శంకర్‌
ఇతర పేర్లుగాయకులు శంకర్‌
వృత్తిప్రభుత్య పాఠశాలలో టీచర్
ప్రసిద్ధిఓరుగల్లు ప్రముఖ,జానపద సినీ నేపథ్య గాయకుడు.
భార్య / భర్తకునమల్ల సంధ్యారాణి
పిల్లలుఒక అమ్మయి, ఒక అబ్బాయి.

వరంగల్ శంకర్‌ ప్రముఖ తెలుగు జానపద, సినీ నేపథ్య గాయకుడు.

బాల్యం, వృత్తి జీవితం[మార్చు]

హన్మకొండ జిల్లా, కుమార్ పల్లిలో శంకర్‌ జన్మించాడు. బాల్యమంతా కుమార్ పల్లి, హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య గాయకుడుగా ఆర్.నారాయణమూర్తి సినిమాలలో శంకర్‌ అనేక పాటలు పాడారు. దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్రసైన్యం భూపోరాటానికి అజ్యం పోసింది. చుండూరు సంఘటనను చిత్రీకరించిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ తరువాత వచ్చిన సినిమాలలో అడవి దివిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, ఊరు మనదిరా, ఒరేయ్ రిక్షా సినిమాలలో ”మా కంపేనీకీ జీతాలు పెరిగినయి” ”బండెనెక బండి కట్టి పదహారు బండ్లు కట్టి” లాంటి ఎంతో ప్రజాదరణ పొందినవి. తెలుగు సినిమా గాయకుడు.వందేమాతరం శ్రీనివాస్, చిత్రతో శంకర్‌ అనేక పాటలు పాడారు. వరంగల్ శంకర్‌, జానపద సినీ నేపథ్య గాయకుడైదీకొండ సారంగపాణి కి సమకాలికుడు.[1].

వివాహం[మార్చు]

1990 నుండి సహచర గాయకుడూ సారంగపాణితో వందలాది వేదికలపై, క్యాసెట్లలో జానపద గేయాలు ఆలపించిన కునమల్ల సంధ్య కు, శంకర్‌కు ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.

ప్రజాదరణ పొందిన పాటలు[మార్చు]

వరంగల్ శంకర్ పాడిన కోడిబాయి లచ్చమ్మది, జబ్బకు తుపాకీ, రారండి పోదాము, దళిత పులులు, ఊరు మనదిర, ఏకో నారాయణ, వంటి జానపద, సినిమా గేయాలు ఉరుతలుగించగా శంకర్ విరచిత ‘మియ్యారు గుర్రాలు.. మాయారు గుర్రాలు’ అనే పాటతో ఎన్నో సంస్థలు ఆయనకు బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తమ జానపద బాణీలతో వరంగల్లు కీర్తిని చాటిన శంకర్ రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి, ప్రేక్షకుల్ని పరవశింపజే ఎన్నో సంస్థల నుండి అవార్డుల్ని అందుకున్నారు. 1988 నుండి జిల్లా కళాకారులతో వేదికలపై, క్యాసెట్లలో జానపద గేయాలు ఆలపించి నిర్వహిస్తూనే అవార్డులు అందుకున్నారు.

బిరుదులు[మార్చు]

నిర్విరామ కృషికి, దీక్షాదక్షతలను గుర్తించిన అనేక సంస్థలు ఆయన్ను ఆహ్వానించి ఎన్నో సంస్థలు ఆయనకు ”గానకోకిలా” ”జానపదకోకిలా” బిరుదు ఇచ్చి గౌరవించాయి

విజయవాడ కళాపరిషత్ వారి పురస్కారం ఓరుగల్లు కోకిలా, బిరుదులనిచ్చి సత్కారం చేశాయి.

ఆశయం[మార్చు]

తెలుగు జానపద గేయాలకు పూర్వప్రాభవం తీసుకురావడం.

మరణం[మార్చు]

శంకర్‌ 2005 ఏప్రిల్ 7న వరంగల్లో గుండెపోటుతో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "హోరెత్తిన తెలం'గానం'". Sakshi. 2014-01-20. Retrieved 2020-08-19.

బయటి లింకులు[మార్చు]