సోలో బ్రతుకే సో బెటర్
సోలో బ్రతుకే సో బెటర్ | |
---|---|
దర్శకత్వం | సుబ్బు |
రచన | సుబ్బు |
నిర్మాత | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్, విజయ నరేష్ |
ఛాయాగ్రహణం | వెంకట్ సి దిలీప్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | తమన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 25 డిసెంబర్ 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సోలో బ్రతుకే సో బెటర్, 2020 డిసెంబరు 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో[1] సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్, విజయ నరేష్ ముఖ్యపాత్రల్లో నటించగా, తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2020, మే 1న విడుదలకావాల్సి ఉంది,[2] కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[3] 2020, డిసెంబరు 25న జీ స్టూడియోస్ సంస్థ ద్వారా థియేటర్లలో విడుదలయింది.[4][5]
నటవర్గం
[మార్చు]- సాయి ధరమ్ తేజ్ (విరాట్)
- నభా నటేష్ (అమృతం)
- రాజేంద్ర ప్రసాద్
- రావు రమేశ్ (విరాట్ మామ)
- వెన్నెల కిశోర్ (గోవింద్)
- నరేష్
- అజయ్
- కల్పలత
- సత్య (విరాట్ స్నేహితుడు)
- కళ్యాణి నటరాజన్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: సుబ్బు
- నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
- సంగీతం: తమన్
- ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్
- కూర్పు: నవీన్ నూలి
- నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
- పంపిణీదారు: జీ స్టూడియోస్
నిర్మాణం
[మార్చు]తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమాను చేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర యూనిట్ ప్రకటించింది. 2019, అక్టోబరు 7న జరిగిన చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు చిత్రబృందం హాజరయింది.[6][7]
చిత్రీకరణ
[మార్చు]2019, నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయింది.[8] విశాఖపట్నం లోని కైలాసాగిరి ప్రాంతంలో 20 రోజులకు పైగా చిత్రీకరణ జరిగింది.[9] ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతంలలో 15 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. అర్మాన్ మాలిక్ పాడిన "నో పెళ్ళి" పాట మొదటగా 2020 మే 25న విడుదలైంది. వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి ఈ పాట ప్రమోషనల్ వీడియోలో కనిపించారు. సిద్ శ్రీరామ్ పాడిన "హే ఇది నేనేనా" పాట రెండవ పాటగా 2020 ఆగస్టు 25న విడుదల చేశారు.[10] నకాష్ అజీజ్ పాడిన "అమృతా" పాట మూడవ పాటగా 2020, అక్టోబరు 15న విడుదల చేశారు.[11] విశాల్ దాద్లానీ పాడిన "సోలో బ్రతుకే సో బెటర్" పాట చివరి పాటగా 2020, డిసెంబరు 11న విడుదల చేశారు.[12]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నో పెళ్ళి (రచన: రఘురాం)" | రఘురాం | అర్మాన్ మాలిక్ | 3:08 |
2. | "హేయ్ ఇది నేనేనా (రచన: రఘురాం)" | రఘురాం | సిద్ శ్రీరామ్ | 4:15 |
3. | "అమృత (రచన: కాసర్ల శ్యామ్" | కాసర్ల శ్యామ్ | నకాష్ అజీజ్ | 3:28 |
4. | "సోలో బ్రతుకే సో బెటర్ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విశాల్ దాదాన్లీ | 3:00 |
మొత్తం నిడివి: | 13:51 |
మార్కెటింగ్
[మార్చు]2019, నవంబరు 11న న సింగిల్స్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది.[13] 2020, ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా "సోలో బ్రతుకే సో బెటర్ థీమ్" అనే థీమ్ వీడియో విడుదల చేయబడింది.[14] 2020, డిసెంబరు 25న జీ స్టూడియోస్ ద్వారా థియేటర్లలో విడుదలయింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Chowdhary, Y. Sunita (9 March 2020). "Puri Jagannadh is an inspiration for 'Solo Brathuke So Better', says director Subbu". The Hindu. Retrieved 25 December 2020.
- ↑ "Sai Dharam Tej film going as Expected". Tollywood. 9 March 2020. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 25 December 2020.
- ↑ "Shootings to resume first, releases can wait". telugucinema.com. 1 May 2020. Retrieved 25 December 2020.
- ↑ 4.0 4.1 "Solo Brathuke So Better to release on Dec 25". Telugu Cinema. Retrieved 25 December 2020.
- ↑ Arikatla, Venkat (18 November 2020). "Solo Brathuke So Better: A ray of hope for theaters". greatandhra.com. Retrieved 25 December 2020.
- ↑ "Sai Dharam Tej and Nabha Natesh team up for 'Solo Brathuke So Better'". The Times of India. 7 October 2019. Retrieved 25 December 2020.
- ↑ "Sai Dharam Tej starrer Solo Brathuke So Better goes on floors". The Indian Express. 7 October 2019. Retrieved 25 December 2020.
- ↑ "Solo Brathuke So Better: Shooting of Sai Dharam Tej starrer kicks-off on International Men's Day". The Times of India. 19 November 2019. Retrieved 25 December 2020.
- ↑ "Sai Dharam Tej plays the lead role and the shooting has been continuing in Vizag". The Financial Express. 11 February 2019. Retrieved 25 December 2020.
- ↑ "Solo Brathuke So Better – Hey Idi Nenena Lyric | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S – YouTube". www.youtube.com. Retrieved 25 December 2020.
- ↑ "Solo Brathuke So Better – Amrutha Lyric | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S". youtube.com. Retrieved 25 December 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Solo Brathuke So Better – Title Track Lyric | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S". youtube.com. 11 December 2020. Retrieved 25 December 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Happy Singles Day: 'Solo Brathuke So Better' First Look". The Times of India. 11 November 2019. Retrieved 25 December 2020.
- ↑ "Solo Brathuke So Better Theme Video: Sai Dharam Tej pledges everyone to stay single". The Times of India. 13 February 2020. Retrieved 25 December 2020.
ఇతర లంకెలు
[మార్చు]- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2020 తెలుగు సినిమాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు