Coordinates: 27°42′54″N 85°17′24″E / 27.71500°N 85.29000°E / 27.71500; 85.29000

స్వయంభూనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వయంభూనాథ్
स्वयम्भू स्तूप
స్వయంభూనాథ్ స్థూపం
మతం
అనుబంధంబౌద్ధం
ప్రదేశం
ప్రదేశంస్వయంభూనాథ్, ఖాట్మండు
దేశంనేపాల్
భౌగోళిక అంశాలు27°42′54″N 85°17′24″E / 27.71500°N 85.29000°E / 27.71500; 85.29000

స్వయంభూనాథ్ (స్వయంభూ స్థూపం) అనేది ఖాట్మండు నగరానికి పశ్చిమాన ఉన్న కొండపై ఉన్న పురాతన బౌద్ధ స్థూపం. దీనిని మంకీ టెంపుల్ అని కూడా అంటారు. బౌద్ధమతాన్ని అనుసరించే నెవార్ ప్రజలకి ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైన బౌద్ధ క్షేత్రం.[1] టిబెటన్ ప్రజలకు, టిబెటన్ బౌద్ధమత అనుచరులకు బౌద్ధనాథ్ తర్వాత ఇది ఏకైక ప్రదేశం. స్వయంభూనాథ్ ఆలయ ప్రాంగణంలో బౌద్ధ మందిరం, స్తంభం, మ్యూజియం, లైబ్రరీ ఉన్నాయి. ఈ  మందిరంలోని స్తంభానికి నాలుగు వైపులా బుద్ధుని కళ్ళను  చిత్రించారు. కొండ పైభాగంలో ఉన్న ఆలయానికి  చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. అవి 365  మెట్లు ఉన్నాయి. దక్షిణ పర్వత మార్గంలో  మినీ బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

చరిత్ర[మార్చు]

స్వయంభూ పురాణం ప్రకారం, ఖాట్మండు లోయ మొత్తం ఒక పెద్ద సరస్సు ఉండేది, అందులో ఒక  కమలం పెరిగింది (తనను తాను సృష్టించుకున్నది) కాబట్టి దీనికి స్వయంభు అని పేరువచ్చింది. స్వయంభూనాథ్ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయానికి వాయువ్య భాగంలో నివసించే కోతుల కారణంగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ కోతులను ప్రజలు పవిత్ర జంతువుగా భావిస్తారు. అక్కడి  ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్న మంజుశ్రీ అనే అతను ఆ సరస్సును దర్శించి అందరికి ఆ కొండను నివాస యోగ్యముగా మార్చాలని కొంచెం కొండా భాగంను కూల్చాడు.[2] అపుడు సరస్సు నుండి నీరు బయటికి పోయి ఆ సరస్సు పెద్ద కొండగా మారింది, కమలం స్తూపంగా మారింది. అతను జుట్టు పొడవుగా పెంచడం వలన, అతని తలలో పేలు పడ్డాయి. అతని  తలపై ఉన్న పేను అతని మరణం తర్వాత కోతులుగా మారాయి. నేపాల్‌లోని స్వయంభూనాథ్ ఆలయం ప్రాచీనమైన సాంస్కృతిక, సాంప్రదాయ బౌద్ధ ప్రదేశాలలో ఒకటి. గోపాల రాజవంశం ప్రకారం, స్వయంభూనాథ్ ఆలయం మనదేవర్ రాజు కాలంలో (సా.శ. 464 - 505), రాజు విరుషపదేవ పాలనలో, సా.శ. 5వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. అశోకుడు 3వ శతాబ్దంలో  బౌద్ధ విహారం స్థానంలో, స్మారక స్తంభాన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో అవి అంతరించిపోయాయి. స్వయంభూనాథ్ ఆలయం బౌద్ధ క్షేత్రం అయినప్పటికీ, హిందువులు కూడా దీనిని పవిత్ర స్థలంగా భావిస్తారు. చాలా మంది హిందూ రాజులు ఆలయాన్ని పునర్నిర్మించారు. ఖాట్మండు రాజు ప్రతాప మల్లార్ 17వ శతాబ్దంలో ఆలయానికి తూర్పున ఒక మెట్లదారిని నిర్మించాడు.1921 తర్వాత, 2010 మే లో స్వయంభూనాథ్ ఆలయ స్తంభం మళ్ళి నిర్మించారు. ఈ  స్తంభాన్ని 1500 సంవత్సరాల కాలంలో 15 సార్లు పునర్నిర్మించారు.[3] 2008లో యుఎస్  రాష్ట్రంలోని కాలిఫోర్నియాలో ఉన్న టిబెటన్ బౌద్ధ ఉద్యమం ద్వారా నిధులు సమకూర్చారు. బౌద్ధ దేవాలయానికి  20 కిలోల బంగారాన్ని ఉపయోగించి స్వయంభూ మందిరానికి బంగారు పూత పూయించారు. 2011 ఫిబ్రవరి 14న తెల్లవారుజామున 5 గంటలకు స్వయంభూ స్మారకం మండలంలోని ప్రతాపూర్ దేవాలయం అకస్మాత్తుగా పిడుగుపాటుకు గురైంది.[4] 2015 నేపాల్ భూకంపం కారణంగా బౌద్ధ దేవాలయ సముదాయం పాడయింది.[5]

నిర్మాణ శైలి[మార్చు]

స్వయంభూనాథ్ పైకప్పు గోళాకారలో ఉండి  మొత్తం విశ్వాన్ని సూచిస్తుంది. మందిరం పైకప్పు మధ్యలో ఉన్న స్తంభానికి నాలుగు వైపులా బుద్ధుని కళ్ళు చిత్రించబడి ఉంటాయి.[6] అందులో ఒక కన్ను జ్ఞానాన్ని, ఇంకొక కన్ను కరుణను సూచిస్తాయి. పంచభుజాకారంలో ఉన్న పోర్టికో ద్వారాలకు నాలుగు వైపులా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. స్తంభం పైభాగంలో ఉన్న 13 శిఖరాలు బౌద్ధ హోదాను పొందేందుకు 13 దశలను సూచిస్తాయి. స్తంభానికి నాలుగు వైపులా పంచ బుద్ధుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. స్థూపాల పునాదిలో బుద్ధుల విగ్రహాలు కూడా ఉన్నాయి. పంచ బుద్ధులలో రూపక కోణంలో బుద్ధుడు ఉన్నాడు. అవి వైరోచన (ఆలయానికి అధిపతి మధ్యలో), అక్షోభ్య (తూర్పు వైపు), రత్న సంభవ (దక్షిణానికి అభిముఖంగా), అమితాభ (పశ్చిమానికి ఎదురుగా), అమోఘసిద్ధి (ఉత్తరం వైపు). ఇక్కడ ప్రతి ఉదయం తెల్లవారకముందే వందలాది మంది బౌద్ధ (వజ్రయాన), హిందూ యాత్రికులు కొండపైకి  మెట్లు ఎక్కి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉన్న రెండు సింహాలను దర్శించి, స్తూపం చుట్టూ  ప్రదక్షిణలు చేస్తారు.

పండుగలు[మార్చు]

బుద్ధ పూర్ణిమ, ఫిబ్రవరి-మార్చి నెలలో వచ్చే లూజర్ పండుగ ప్రత్యేకమైనవి. ఆగస్టు-సెప్టెంబరు నెలలలో వచ్చే కున్లా పండుగను వర్షాకాలం తర్వాత జరుపుకుంటారు.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "About Swayambhunath Temple Nepal - History, Opening Hours". www.travelogyindia.com. Retrieved 2021-12-08.
  2. Shaha, Rishikesh (1992). Ancient and medieval Nepal. New Delhi: Manohar. ISBN 81-85425-69-8. OCLC 29405220.
  3. Gutschow, Niels (1997). The Nepalese caitya : 1500 years of Buddhist votive architecture in the Kathmandu Valley. David N. Gellner. Stuttgart: Menges. ISBN 3-930698-75-7. OCLC 38029358.
  4. Centre, UNESCO World Heritage. "Lightning damages Pratapur Temple of Kathmandu Valley World Heritage site, Nepal". UNESCO World Heritage Centre. Retrieved 2021-12-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Kundu, Bhaskar; Vissa, Naresh Krishna; Gahalaut, V. K. (2015-12-23). "Influence of anthropogenic groundwater unloading in Indo-Gangetic plains on the 25 April 2015 Mw 7.8 Gorkha, Nepal earthquake". Geophysical Research Letters. 42 (24): 10, 607–10, 613. doi:10.1002/2015gl066616. ISSN 0094-8276.
  6. "ReligionFacts.com: Just the facts on the world's religions". religionfacts.com. Archived from the original on 2021-12-08. Retrieved 2021-12-08.

వెలుపలి లంకెలు[మార్చు]