కరక్కాయ

వికీపీడియా నుండి
కరక్కాయ
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: మాగ్నోలియోఫైటా
Class: Magnoliopsida
Order: మిర్టేలిస్
Family: Combretaceae
Genus: టెర్మినేలియా
Species: T. chebula
Binomial name
'టెర్మినాలియా చెబుల్లా
Retz.

కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాలవలె వస్తాయి. ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషద జాతికి చెందిన మొక్క. కరక్కాయత్రిఫలాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

విషయ సూచిక

లక్షణాలు [మార్చు]

  • నలుపు గోధుమ రంగు బెరడుతో పెరిగే పెద్ద వృక్షం.
  • అండాకారం నుండి విపరీత అండాకారం గల సరళ పత్రాలు.
  • శాఖాయుతమైన కంకులలో అమరిన ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు పుష్పాలు.
  • నొక్కులున్న ఆకుపచ్చతో కూడిన పసుపురంగు ఫలాలు.

దగ్గును తగ్గించే కరక్కాయ[1] [మార్చు]

  • దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం తాగిస్తుంటారు. కరక్కాయలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలురకాల జబ్బులను నయం చేస్తాయి. గొంతులోని శ్లేష్మాన్ని హరించి కంఠ సమస్యలను నివారిస్తుంది. అందుకే ప్రతి తెలుగింట్లో కచ్చితంగా కరక్కాయ ఉంటుంది.

ఔషధ గుణాలు[2] [మార్చు]

కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలం మొదలనవి ఉంటాయి. అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు.

ఉపయోగాలు [మార్చు]

  • కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సమాన భాగం బెల్లంతోగాని, అర టీస్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
  • కరక్కాయలు, పిప్పళ్లు, సౌవర్చలవణం వీటిని సమానంగా తీసుకొని విడివిడిగా పొడిచేసి, అన్నీ కలిపి నిల్వచేసుకొని మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
  • పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండు ద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
  • అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైన బలంతో ఉన్నవారు ఆహారానికి గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని, శొంఠి చూర్ణాన్ని సమభాగాలుగా కలిపి టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు నీళ్లతో తీసుకోవాలి.
  • కరక్కాయలు, పిప్పళ్లు, శొంఠి వీటిని త్రిసమ అంటారు. వీటిని సమాన భాగాలుగా చూర్ణంగాచేసి తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా అతి దప్పిక నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
  • కరక్కాయ చూర్ణాన్ని, వేపమాను బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి రెండుపూటలా తీసుకుంటే ఆకలి పెరగటంతోపాటు చర్మంమీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇనె్ఫక్షన్లు, తామరచర్మ రోగాలూ వీటన్నిటినుంచీ ఉపశమనం లభిస్తుంది.
  • అజీర్ణం, ఆమ దోషం, అర్శమొలలు, మలబద్ధకం సమస్యలతో రోజువారీగా కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
  • అధిక లాలాజలస్రావంతో ఇబ్బందిపడేవారు కరక్కాయ చూర్ణాన్ని భోజనం తరువాత అర టీ స్పూన్ మోతాదుగా అర కప్పు నీళ్లతోగాని, చెంచాడు తేనెతోగాని కలిపి తీసుకోవాలి.
  • వికృతి చెందిన త్రిదోషాలను తిరిగి సమస్థితికి తెచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలంటే కరక్కాయ, సైంధవ లవణం, పిప్పళ్లు, శొంఠి ఈ నాలుగింటి చూర్ణాలనూ సమాన భాగాలు కలిపి నిల్వచేసుకొని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున నీళ్లతో జారుడుగా కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఈ ఔషధ యోగం ఆకలిని, అరుగుదలను ఏక కాలంలో వృద్ధిపరుస్తుంది.
  • కరక్కాయలను నేతిలో వేయించి దంచి పొడిచేయాలి. దీనిని సమాన భాగం బెల్లంతోనూ, సమాన భాగం పిప్పళ్ల చూర్ణంతోనూ కలిపి మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే అరుగుదల పెరిగి అర్శమొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది, మూలవ్యాధి వల్ల మలబద్ధకం ప్రాప్తించినట్లైతే కరక్కాయల చూర్ణాన్ని తెల్లతెగడ వేరు చూర్ణం, శుద్ధిచేసిన నేపాళం గింజల చూర్ణంతో కలిపి పావు టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇది ఉగ్ర ఔషధం. జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర స్థాయిలో విరేచనాలవుతాయి.
  • మసిలే గోమూత్రంలో కరక్కాయలను వేసి ఉడికించి అరబెట్టి, దంచి పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం అర టీ స్పూన్ మోతాదుగా లేదా ఎవరి బలాన్నిబట్టి వారు మోతాదును నిర్ణయించుకొని గాని, తేనెతో కలిపి తీసుకుంటే మొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది.
  • కరక్కాయల చూర్ణాన్ని, బెల్లాన్ని కలిపి భోజనానికి ముందు చెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పైల్స్ తగ్గుతాయి.
  • పైల్స్‌వల్ల మలద్వారం వద్ద దురద తయారై ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా సమాన భాగం బెల్లంతో కలిపి ఉండచేసి తినాలి.
  • అర్శమొలలు మొండిగా తయారై ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణం, బెల్లం సమంగా కలిపి అర చెంచాడు మోతాదులో వాడాలి. తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఇలా రెండు పూటలా చేయాలి.
  • కరక్కాయలు, వెల్లుల్లి ఒక్కోటి ఒక్కో భాగం గ్రహించాలి. నల్లేరు తీగ చూర్ణం 2 భాగాలు గ్రహించాలి. వీటిని కలిపి నిల్వచేసుకొని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సైంధవ లవణం, నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే అర్శమొలలు ఎండిపోయి పడిపోతాయి.
  • కరక్కాయలు, నల్ల ద్రాక్ష వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ముద్దుచేసి గాని లేదా ఎండబెట్టి, పొడిచేసి గాని పూటకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు, పెరుగుదలలు, దీర్ఘకాలపు జ్వరం వంటివి తగ్గుతాయి.
  • కరక్కాయ చూర్ణాన్ని అర టీ స్పూన్ చొప్పున సమాన భాగం తేనెతో కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగటంతోపాటు కడుపునొప్పి, ఆమాతిసారం వంటివి తగ్గుతాయి.
  • కరక్కాయ చూర్ణాన్ని ముచ్చటి మాత్రలో తేనెతో కలిపి అవసరానుసారం మూడునాలుగుసార్లు తీసుకుంటే వాంతులు, వికారం వంటివి సమసిపోతాయి.

సూచికలు [మార్చు]

యివి కూడ చూడండి [మార్చు]

Wiktionary-logo-en.png
కరక్కాయ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=కరక్కాయ&oldid=809897" నుండి వెలికితీశారు