Jump to content

భారతి (నటి)

వికీపీడియా నుండి

భారతి లేదా భారతీ విష్ణువర్ధన్ పలు తెలుగు, హింది, తమిళ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన సినీ నటీమణి.

భారతి
జననంభారతి
(1948-08-15) 1948 ఆగస్టు 15 (వయసు 76)
నివాస ప్రాంతంబెంగళూరు, కర్నాటక
వృత్తిచలనచిత్ర నటి
మతంహిందూ మతం
భార్య / భర్తవిష్ణువర్ధన్
పిల్లలుచందన, కీర్తి
తండ్రిరామచంద్ర రావ్
తల్లిభద్రావతి

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

భారతి కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఈమె కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను 1975 ఫిబ్రవరి 27బెంగుళూరులో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కీర్తి, చందన అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త : డా. విష్ణువర్ధన్ 2009 డిసెంబర్ 30 న మరణించాడు.

సినిమారంగం

[మార్చు]

ఈమె నాడోడి అనే తమిళ చిత్రంలో బి.సరోజాదేవికి అక్క పాత్రలో సినీరంగ ప్రవేశం చేసింది. 5 దశాబ్దాలుగా అనేక కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ఉంది. ఈమె ప్రముఖ సినీనటులైన రాజ్‌కుమార్, దిలీప్ కుమార్,శివాజీ గణేశన్,జెమినీ గణేశన్,ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ప్రేమ్‌ నజీర్, ఎం.జి.రామచంద్రన్, విష్ణువర్ధన్, మనోజ్ కుమార్, ఉదయకుమార్, శోభన్ బాబు, కృష్ణ,కాంతారావు, హరనాథ్,వినోద్ ఖన్నా, రాకేష్ రోషన్, అంబరీష్, అనంతనాగ్, చలం మొదలైన వారి సరసన నటించింది. ఈమె నటి మాత్రమే కాక గాయని, దర్శకురాలు కూడా. స్నేహితి (తమిళ సినిమా), నాగరహొళె (కన్నడ సినిమా) లలో పాటలు పాడింది. కన్నడ దర్శకుడు కె.ఎస్.ఎల్.స్వామి వద్ద అసోసియేట్ దర్శకురాలిగా కరుణె ఇల్లద కానూను, హులిహెజ్జె, మలయమారత మొదలైన సినిమాలకు పనిచేసింది.

భారతి నటించిన సినిమాల జాబితా

[మార్చు]

కన్నడ

[మార్చు]
సంవత్సరము చిత్రము పాత్ర దర్షకత్వం తారాగణం
1966 ఎమ్మె తమ్మణ్ణ బి.ఆర్.పంతులు రాజ్ కుమార్
1966 దుడ్డే దొడ్డప్ప బి.ఆర్.పంతులు రమేశ్
1966 మధుమాలతి మధుమాలతి ఎస్.కె.ఎ.చారి రాజ్ కుమార్, ఉదయకుమార్
1966 లవ్ ఇన్ బెంగళూరు కల్యాణ్ కుమార్ కల్యాణ్ కుమార్
1966 సంధ్యారాగ ఎస్.కె.భగవాన్, ఎ.సి.నరసింహమూర్తి రాజ్ కుమార్
1967 గంగె గౌరి గంగె బి.ఆర్.పంతులు రాజ్ కుమార్, లీలావతి
1967 బీది బసవణ్ణ బి.ఆర్.పంతులు రాజ్ కుమార్, వందనా
1967 రాజశేఖర మంగళ జి.వి.అయ్యర్ రాజ్ కుమార్, వందనా
1967 రాజదుర్గద రహస్య ఎ.సి.నరసింహమూర్తి రాజ్ కుమార్
1968 అమ్మ బి.ఆర్.పంతులు రాజ్ కుమార్, ఎం.వి.రాజమ్మ, పండరీబాయి
1968 మనస్సాక్షి గౌరి ఎస్.కె.ఎ.చారి రాజ్ కుమార్, షావుకారు జానకి, శైలశ్రీ
1968 నానే భాగ్యవతి టి.వి.సింగ్ ఠాకూర్ కల్యాణ్ కుమార్, మైనావతి
1969 గృహలక్ష్మి విజయసత్యం జయంతి, రమేశ్
1969 గండొందు హెణ్ణారు బి.ఆర్.పంతులు రాజ్ కుమార్
1969 చదురంగ ఎన్.సి.రాజన్ రాజాశంకర్, ఉదయకుమార్, చంద్రకళ
1969 మేయర్ ముత్తణ్ణ సిద్ధలింగయ్య రాజ్ కుమార్, బి.వి.రాధ
1969 శివభక్త శ్రీనివాస్ ఉదయకుమార్
1970 అళియ గెళెయ బి.ఆర్.పంతులు గంగాధర్
1970 బాళు బెళగితు సిద్ధలింగయ్య రాజ్ కుమార్, జయంతి
1970 భలే జోడి సునీతా వై.ఆర్.స్వామి రాజ్ కుమార్, బి.వి.రాధ
1970 శ్రీకృష్ణ దేవరాయ చిన్నా బి.ఆర్.పంతులు రాజ్ కుమార్, జయంతి
1970 హసిరు తోరణ మీనా టి.వి.సింగ్ ఠాకూర్ రాజ్ కుమార్
1970 రంగమహల్ రహస్య విజయ్ శ్రీనాథ్, బి.వి.రాధ
1971 కులగౌరవ పెకేటి శివరాం రాజ్ కుమార్, జయంతి
1971 తాయి దేవరు సిద్ధలింగయ్య రాజ్ కుమార్
1971 శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సత్యభామ కె.ఎస్.ఎల్.స్వామి రాజ్ కుమార్, బి.సరోజా దేవి
1971 నమ్మ సంసార సిద్ధలింగయ్య రాజ్ కుమార్, బి.వి.రాధ, రాజాశంకర్
1972 జగ మెచ్చిద మగ హునసూరు కృష్ణమూర్తి రాజ్ కుమార్
1972 జన్మ రహస్య ఎస్.పి.ఎన్.కృష్ణ రాజ్ కుమార్
1972 జీవన జోకాలి గీతప్రియ గంగాధర్
1972 బంగారద మనుష్య లక్ష్మి సిద్ధలింగయ్య రాజ్ కుమార్
1972 హృదయ సంగమ బెళ్ళి/చంద్ర రాశి బ్రదర్స్ రాజ్ కుమార్
1973 బిడుగడె వై.ఆర్.స్వామి రాజ్ కుమార్, కల్పన
1973 మనె బెళగిద సొసె ప్రసాద్ విష్ణువర్ధన్
1973 దూరద బెట్ట గౌర సిద్ధలింగయ్య రాజ్ కుమార్
1973 స్వయంవర వై.ఆర్.స్వామి రాజ్ కుమార్
1974 అణ్ణ అత్తిగె ఎం.ఆర్.విఠల్ విష్ణువర్ధన్
1974 ఒందే రూప ఎరడు గుణ విష్ణువర్ధన్, చంద్రకళ
1975 కావేరి హెచ్.ఎన్.రెడ్డి రాజేశ్
1975 భాగ్యజ్యోతి జ్యోతి కె.ఎస్.ఎల్.స్వామి విష్ణువర్ధన్, శుభ
1975 దేవర గుడి సుచిత్రా ఆర్.రామమూర్తి విష్ణువర్ధన్, రాజేశ్, మంజుళ
1976 మక్కళ భాగ్య కె.ఎస్.ఎల్.స్వామి విష్ణువర్ధన్
1977 దేవరె దిక్కు రాంగోపాల్, ప్రమీళా జోషాయ్
1977 నాగరహొళె ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు విష్ణువర్ధన్
1978 ప్రతిమా ప్రతిమా విష్ణువర్ధన్
1978 మధుర సంగమ లలితాంబికె అనంత్ నాగ్, రాధ, విష్ణువర్ధన్
1979 మానిని కె.ఎస్.సేతుమాధవన్ లోకేశ్, ఆరతి, విష్ణువర్ధన్
1979 సందర్భ అపర్ణ అనంత్ నాగ్, విష్ణువర్ధన్, కల్పన
1980 చిత్రకూట గౌరిసుందర్ కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్
1980 రహస్య రాత్రి టి.వి.సింగ్ ఠాకూర్ విష్ణువర్ధన్
1980 బంగారద జింకె భాగి కె.ఎస్.నాగాభరణ విష్ణువర్ధన్, ఆరతి
1982 పెద్ద గెద్ద భార్గవ విష్ణువర్ధన్, ద్వారకీశ్, ఆరతి, జయమాల, కాంచన
1983 క్రాంతియోగి బసవణ్ణ అక్కమహాదేవి కె.ఎస్.ఎల్.స్వామి అశోక్, ఆరతి, మంజుళ
1984 ఋణముక్తళు గోదా ఎస్.ఆర్.పుట్టణ్ణ కణగాల్ సుందర్ కృష్ణ అరస్, రామకృష్ణ
1986 ఎల్లా హెంగసరింద రాజేశ్
1986 తవరు మనె విజయ్ కల్యాణ్ కుమార్, రాజేశ్
1986 మనెయే మంత్రాలయ భార్గవ అనంత్ నాగ్
1986 నమ్మూర దేవతె రేణుకా ప్రసాద్ చరణ్ రాజ్, వినోద్ కుమార్, భవ్య
1987 అంతిమ తీర్పు ఎ.టి.రఘు అంబరీశ్, గీతా
1987 తాళియ ఆణె డి.రాజేంద్ర బాబు టైగర్ ప్రభాకర్
1987 న్యాయక్కె శిక్షె భారతి పి.శ్రీనివాస్ చరణ్ రాజ్, అంబిక
1987 ప్రేమ కాదంబరి బి.మల్లేశ్ అంబరీశ్, లక్ష్మి
1987 బంధ ముక్త కె.వి.రాజు టైగర్ ప్రభాకర్
1987 సంప్రదాయ మాస్టర్ హిరణ్ణయ్య ఉపాసనె సీతారం
1987 హొస మేడం ఆనంద్ ముఖ్యమంత్రి చంద్రు
1988 శాంతినివాస భార్గవ అనంత్ నాగ్
1989 ముత్తినంథా మనుష్య సాయిప్రకాశ్ టైగర్ ప్రభాకర్
1989 యుధ్ధకాండ కె.వి.రాజు రవిచంద్రన్, పూనం ధిల్లోన్
1990 మత్సర భావనా కె.వి.జయరామ్ అంబరీశ్, రజని
1990 బణ్ణద గెజ్జె వైజయంతి ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు రవిచంద్రన్, అమల
1995 దొరె శివరాజ్ కుమార్, రుచితా ప్రసాద్
2003 ప్రీతి ప్రేమ ప్రణయ శారదాదేవి కవితా లంకేశ్ అనంత్ నాగ్
2005 మహారాజ సాయిప్రకాశ్ సుదీప్, అశోక్
2006 కల్లరళి హూవాగి టి.ఎస్.నాగాభరణ విజయ్ రాఘవేంద్ర, అంబరీశ్, అనంత్ నాగ్, సుమలత
2006 తననం తననం కవితా లంకేశ్ గిరీశ్ కార్నాడ్, రమ్య, శ్యాం, రక్షితా
2012 క్రేజిలోక కవితా లంకేశ్ రవిచంద్రన్

తెలుగు

[మార్చు]
సంవత్సరము చిత్రము పాత్ర దర్షకత్వం తారాగణం
1967 అగ్గిదొర బి.వి.శ్రీనివాస్ కాంతారావు
1967 పట్టుకుంటే పదివేలు ఎం.మల్లికార్జునరావు చలం, గీతాంజలి
1968 కలసిన మనసులు కమలాకర కామేశ్వర రావు శోభన్ బాబు
1968 గోవుల గోపన్న సి.ఎస్.రావు అక్కినేని నాగేశ్వర రావు, రాజశ్రీ
1968 నిన్నే పెళ్ళాడుతా ఉమా బి.వి.శ్రీనివాస్ నందమూరి తారక రామారావు
1968 బంగారు గాజులు సి.ఎస్.రావు అక్కినేని నాగేశ్వర రావు, విజయ నిర్మల
1968 మన సంసారం సి.ఎస్.రావు శోభన్ బాబు
1968 లక్ష్మీనివాసం వి.మధుసూధనరావు శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు, అంజలీదేవి
1968 అర్ధరాత్రి పి.సాంబశివరావు జగ్గయ్య
1969 సిపాయి చిన్నయ్య శోభ జి.వి.ఆర్.శేషగిరిరావు అక్కినేని నాగేశ్వరరావు, కె.ఆర్.విజయ
1970 జై జవాన్ డి.యోగానంద్ అక్కినేని నాగేశ్వర రావు
1970 అఖండుడు వి. రామచంద్రరావు కృష్ణ
1971 అందం కోసం పందెం ఎ.శేషగిరిరావు కాంతారావు, కాంచన
1971 అందరికి మొనగాడు ఎం.మల్లికార్జునరావు కృష్ణ
1971 నా తమ్ముడు కె.ఎస్.ప్రకాశరావు శోభన్ బాబు
1972 చిట్టి తల్లి హరనాథ్
1973 నేరాము శిక్ష్ కె.విశ్వనాథ్ కృష్ణ
1974 ఆడపిల్లల తండ్రి కె.వాసు కృష్ణంరాజు
1974 అనగనగా ఒక తండ్రి సి.ఎస్.రావు కృష్ణంరాజు
1974 అమ్మ మనసు కె.విశ్వనాథ్ జయంతి, చలం
1974 జీవిత రంగం కృష్ణంరాజు
1974 ముగ్గురు అమ్మాయిలు కె.ప్రత్యగాత్మ చంద్రకళ, ప్రమీల
1974 తులసి కె.బాబూరావు కృష్ణంరాజు, కల్పన
1974 హారతి పి.లక్ష్మీదీపక్ కృష్ణంరాజు,శారద
1975 కథానాయకుని కథ డి.యోగానంద్ నందమూరి తారక రామారావు, వాణిశ్రీ
1975 పుట్టింటి గౌరవం పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణంరాజు, శుభ
1975 కొత్త కాపురం పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ
1975 పండంటి సంసారం పి.చంద్రశేఖరరెడ్డి భానుమతి
1975 సౌభాగ్యవతి పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ,శారద
1976 పెళ్ళాడే బొమ్మ చక్రవర్తి రంగనాథ్
1976 వధూవరులు విజయబాబు చంద్రమోహన్, గిరిబాబు
1977 మనస్సాక్షి పి.సాంబశివరావు కృష్ణ
1990 ప్రేమ యుద్ధం ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు అక్కినేని నాగార్జున,అమల
1994 సరిగమలు క్రాంతి కుమార్ వినీత్,రంభ

హింది

[మార్చు]
సంవత్సరము చిత్రము పాత్ర దర్శకత్వం తారాగణం
1967 మెహ్రబాన్ గీతా శాంతిస్వరూప్ ఎ.భీంసింగ్ సునిల్ దత్, నూతన్
1968 సాధు ఔర్ సైతాన్ విద్యా శాస్త్రి ఎ.భీంసింగ్ మహమూద్
1970 ఘర్ ఘర్ కి కహాని సీమా ట్.ప్రకాశ్ రావ్ రాకేశ్ రోశన్
1970 పూరబ్ ఔర్ పశ్చిమ్ గోపి మనోజ్ కుమార్ మనోజ్ కుమార్, సాయిరా బాను
1970 మస్తానా శారద ఎ.సుబ్బరావ్ వినోద్ ఖన్న, పద్మిని
1971 దునియా క్యా జానె సి.వి.శ్రీధర్ ప్రేమేంద్ర, అనుపమ
1971 సీమ చమకి సురేంద్ర మోహన్ రాకేశ్ రోశన్, సిమి గరెవాల్
1971 హం తుం ఔర్ వొ ఆరతి శివకుమార్ వినోద్ ఖన్న, అరుణా ఇరాని
1972 ఆంఖ్ మిచోలి శివకుమార్ రాకేశ్ రోశన్
1972 సబ్ కా సాథి చిత్రా ఎ.భీంసింగ్ వినోద్ ఖన్న, సంజయ్ ఖాన్, రాఖి
1974 కుంవారా బాప్ రాధ మహమూద్ వినోద్ మెహ్ర, మహమూద్
1987 ఉత్తర్ దక్షిణ్ ప్రభాత్ ఖన్న రజని కాంత్, జాకి శ్రాఫ్, మాధురి దీక్షిత్
1990 ఇజత్ దార్ సుజాత కె.బప్పయ్య దిలిప్ కుమార్, గోవింద, మాధురి దీక్షిత్
1992 ఖేల్ కామిని/శారద రాకేశ్ రోశన్ మాలా సిహ్నా, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్
1994 ఆవొ ప్యార్ కరె అంజలి రవీంద్ర పీపట్ సైఫ్ అలి ఖాన్, శిల్పా శెట్టి

తమిళు

[మార్చు]
సంవత్సరము చిత్రము పాత్ర దర్షకత్వం తారాగణం
1966 ఎంగ పాప బి.ఆర్.పంతులు రవిచంద్రన్
1966 చంద్రోదయం కె.శంకర్ ఎం.జి.రామచంద్రన్, జయలలిత
1966 నాడోడి బి.ఆర్.పంతులు ఎం.జి.రామచంద్రన్, బి.సరోజా దేవి
1966 నమ్మ వీట్టు లక్ష్మి బి.ఆర్.పంతులు ఎ.వి.ఎం.రాజన్, ముత్తురామన్, వాణిశ్రీ
1967 తంగా తంబి ఫ్రాంసిస్ రామనాథ్ రవిచంద్రన్, వాణిశ్రీ
1967 దైవ సెయల్ ఎం.జి.బాలు ముత్తురామన్
1967 నాన్ యార్ తెరియుమా వి.ఎన్.రమణన్ జైశంకర్
1967 వాలిభ విరుంధు మురసోళి మారన్ రవిచంద్రన్
1968 ఉయ్రింద మనిదన్ కృష్ణం-పంజుం శివాజీ గణేశన్, షావుకారు జానకి, శివకుమార్
1968 నిమిరిందు నిల్ దేవన్ రవిచంద్రన్
1968 పూవుం పుట్టుమ్ దాదా మిరాసి ఎ.వి.ఎం.రాజన్, ముత్తురామన్, జ్యోతిలక్ష్మి
1969 తంగ సురంగం టి.ఆర్.రామణ్ణ శివాజి గణేశన్
1969 నాంగు కిలాడిగళ్ ఎల్.బాలు జైశంకర్
1969 నిల్ గవని కాదలై సి.వి.రాజేంద్రన్ జైశంకర్
1970 స్నేహితై జి.రామకృష్ణన్ జెమిని గణేశన్
1971 అవళుక్కెండ్రు ఒరు మనమ్ సి.వి.శ్రీధర్ జెమిని గణేశన్, కాంచన, ముత్తురామన్
1971 మీండుం వాళ్వెన్ టి.ఎన్.బాలు రవిచంద్రన్
1972 అన్నమిట్ట కై ఎం.కృష్ణన్ నాయర్ ఎం.జి.రామచంద్రన్, జయలలిత
1972 ఉనక్కుం ఎనక్కుం ఎన్.ఎస్.మణియం జైశంకర్
1973 పొణ్ వాండు ఎన్.ఎస్.మణియం జైశంకర్, ఉషానందిని, శుభ, జయచిత్ర
1977 నీ వాళ వేండుం ఎ.భీమ సింగ్ రవిచంద్రన్, సుమిత్రా
1990 ఉరుది మొళి ఆర్.వి.ఉదయకుమార్ ప్రభు, షివకుమార్, గీతా

మలయాళం

[మార్చు]
సంవత్సరము చిత్రము పాత్ర దర్షకత్వం తారాగణం
1969 పడిచ కళ్ళన్ ఎం.కృష్ణన్ నాయర్ ప్రేమ్‌ నజీర్
1975 కబిని నది చువన్నప్పొళ్ రవీంద్రన్, శాలిని
1991 సాంత్వనం సిబి మలయాళి నెడుముడి వేణూ, రేఖా,సురేశ్ గోపి, మీన
1993 దేవాసురం ఐ.వి.శశి మోహన్ లాల్
1995 అచ్చన్ కొంబత్తు అమ్మ వరంపత్తు పార్వతి ఐ.వి.శశి మురళి
1997 ఒరు యాత్రా మొళి ఎం.శంకర్ శివాజీ గణేశన్, మోహన్ లాల్
1998 నక్షత్రతారాట్టు ఎం.శంకర్ కుంచకొ బొబన్, శాలిని
1998 వర్ణపకిట్టు ఐ.వి.శశి కుంచకొ బొబన్, శాలిని
2000 నరసింహం శాజి కైలాస్ మోహన్ లాల్
2001 కరుమాడికాట్టన్
2003 మళతుళ్ళికిలుక్కమ్ శారద, దిలీప్, నవ్యా నాయర్

[1]

మూలాలు

[మార్చు]
  1. Bharathi, IMDb, retrieved 2008-01-15