Jump to content

అగర్ మాళ్వా జిల్లా

వికీపీడియా నుండి
(అగార్ నుండి దారిమార్పు చెందింది)
అగర్ మాళ్వా జిల్లా
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
ముఖ్యపట్టణంఅగర్
తహసీళ్ళు04
విస్తీర్ణం
 • మొత్తం2,785 కి.మీ2 (1,075 చ. మై)
Time zoneUTC+05:30 (IST)
Websitehttp://agarmalwa.mp.gov.in/

అగర్ మాల్వా జిల్లా 2013 ఆగస్టు 16 న మధ్య ప్రదేశ్ 51 వ జిల్లాగా మారింది. షాజాపూర్ జిల్లా నుండి కొంత భాగాన్ని విడదీసి ఈ జిల్లాను ఏర్పరచారు. అగర్ పట్టణం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

చరిత్ర

[మార్చు]

ఇది సింధియా సంస్థానంలో ఒక విభాగంగా ఉండేది. వారి రాజభవనాలు కొన్ని ఇప్పటికీ కోర్టు గాను, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు గానూ ఉపయోగిస్తున్నారు. అనుకూలమైన శీతోష్ణస్థితి, నీటి లభ్యత కారణంగా గతంలో కంటోన్మెంట్ ప్రాంతంగా ఉండేది. ఇది 1956 వరకు భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత మధ్య భారత్ రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉండేది. 2013 ఆగస్టు 16 నుండి అగర్ మాళ్వా మధ్యప్రదేశ్ లోని 51 వ జిల్లా అయింది. షాజాపూర్ జిల్లా నుండి అజర్, బదోడ్, సుస్నర్, నల్ఖేడా తహసిల్స్‌ను విడదీసి, ఈ జిల్లాను ఏర్పరచారు.[1]

భౌగోళికం

[మార్చు]

జిల్లా పశ్చిమ భాగం అగర్ పీఠభూమిలో భాగం.బడోద్ పట్టణానికి పశ్చిమాన ఒక కొండ ప్రాంతం ఉంది. ఉత్తర-దక్షిణ దిశల్లో చెల్లాచెదురుగా కొండలు విస్తరించి ఉన్నాయి. మధ్యలో కొండలు ఉండటం వలన నీటి పారుదల సరళిని ప్రభావితం చేసింది. ఈ కొండల ఎత్తు సముద్ర మట్టం నుండి 500 - 545 మీటర్లు మధ్య ఉంటుంది.

దుధాలియా, కచోల్ లు జిల్లాలో పశ్చిమాన ప్రవహించే ప్రధానమైన వాగులు. ఇవి కొండల్లో ఉద్భవించి పడమటి వైపు పారుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రధానమైన జీవనది ఛోటీ కాళి సింధ్ జిల్లా పశ్చిమ సరిహద్దులో ఉత్తరం వైపుగా ప్రవహిస్తోంది.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

అగర్ మాళ్వా జిల్లాలో అగర్ మాళ్వా డివిజన్, సుస్నర్ డివిజన్ అనే రెండు ఉప విభాగాలు, [2] అగర్ మాళ్వా, బదోడ్, సస్నర్, నల్ఖేడా అనే నాలుగు తాలూకాలూ ఉన్నాయి. [3]

మూలాలు

[మార్చు]
  1. "History of Agar Malwa district". Retrieved 7 October 2019.
  2. "Agar-Malwa becomes MP's 51st district". 14 August 2013. Archived from the original on 6 November 2013.
  3. "Collectorate".

వెలుపలి లంకెలు

[మార్చు]