ఉపకీచకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Death ok Kickaka.jpg
కీచకుని సంహరిస్తున్న భీముడు.

ఉపకీచకులు కీచకుడు లేదా సింహబలుని తమ్ములు.

మహాభారతంలోని విరాటపర్వంలో నర్తన శాలలో సైరంధ్రిని కోరిన కీచకుని భీముడు సంహరిస్తాడు. కావలి వాళ్ళ అరుపులు విని ఉపకీచకులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చారు. ద్రౌపది వారికి దగ్గరగా నిలబడి వారు ఏమి చేస్తున్నారో చూస్తూ ఉంది. ఆమెను చూసిన కీచకులు కోపంతో రెచ్చి పోయారు. తమ అన్న మరణానికి కారణం ఆమె అని అనుకున్నారు. ఒక్కసారిగా ద్రౌపది మీదకు దూకి ఆమెను పట్టుకున్నారు. దీని అందం చూసి మోహించే కీచకుడు మరణించాడు అంతటికీ కారణం ఈమే కనుక ఈమె ఇక బ్రతుక కూడదు. అన్న శవంతో చేర్చి కాల్చి వేయాలి " అని నిర్ణయించారు. ఉపకీచకులు ద్రౌపదిని ఈడ్చుకు వెళ్ళి కీచకుని శవంతో కట్టారు. అందరూ శ్మశానానికి బయలుదేరారు. అనుకోని ఈ పరిణామానికి ద్రౌపది కలత చెందింది. పాండవులను రక్షణ కోసం పద్దగా ఏడుస్తూ పిలిచింది. ద్రౌపది కేకలు భీముని చేరాయి. భీముడు ఆగ్రహోదగ్రుడై వారికంటే ముందుగా శ్మశానం చేరాడు. ఒక పెద్ద చెట్టును మొదలంటా పెకిలించి భుజంపై పెట్టుకుని ఉపకీచకుల రాకకై ఎదురు చూస్తున్నాడు. శ్మశానం చేరుకున్న ఉపకీచకులు భయంకరాకారంతో నిలబడి ఉన్న భీముని చూసి గంధర్వుడు వచ్చాడనుకుని భయపడి శవాన్ని అక్కడే వదిలి పారిపోయారు. భీముడు వారిని తరిమి తరిమి కొట్టి సంహరించాడు. ద్రౌపదిని విడిపించి తాను వడివడిగా వంటశాల చేరుకున్నాడు.

మూలాలు[మార్చు]

  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ: 58.