కళ్యాణ్ రామ్ కత్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణ్ రామ్ కత్తి
Kalyam Ram Kathi poster.jpg
దర్శకత్వంమల్లికార్జున్
రచనవక్కంతం వంశీ, ఎం.రత్నం
నిర్మాతనందమూరి కళ్యాణ్ రామ్
నటవర్గంనందమూరి కళ్యాణ్ రామ్,
కోట శ్రీనివాసరావు,
చంద్రమోహన్
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంసర్వేశ్ మురారి
కూర్పుగౌతం రాజు
సంగీతంమణిశర్మ
పంపిణీదారులుయన్.టి.ఆర్. ఆర్ట్స్
దేశంభారతదేశం భారతదేశం
భాషతెలుగు

కళ్యాణ్ రామ్ కత్తి 12 నవంబరు 2010 న విడుదలైన తెలుగు చిత్రం. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, సనా ఖాన్, షామ్, శరణ్య మోహన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. ఈ కథను వక్కంతం వంశీ రాయగా, మల్లికార్జున్ స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అభిమన్యు తరువాత కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. సనా ఖాన్ తొలి సినిమా. తన సోదరి తప్పిపోయినప్పుడు, హింసాత్మక వైపు వెళ్ళే ఒక ఫుట్ బాల్ ఆటగాడి కథ ఇది. [1]

సినిమా విడుదలకు ముందే, చిత్ర దర్శకుడు నమోదు చేసిని సినిమా పేరుకు సంబంధించి ఒక వివాదం జరిగింది. రవితేజ హీరోగా గుణశేఖర్ తీసిన సినిమాకు కత్తి అని పేరు పెట్టుకోగా, టైటిల్‌ను కత్తి నుండి కళ్యాణ్ రామ్ కత్తిగా మార్చారు, ఆ తరువాత గుణశేఖర్ టైటిల్‌ను వదులుకున్నాడు.[2][3] ఈ సినిమా పరాజయం పొందింది.[4]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. మయూరి ఆడియో పాటలు విడుదల చేసింది. ఆడియో విడుదల కార్యక్రమం 2010, నవంబరు 6న తాజ్ బంజారా హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, జానకిరాం, తారక రత్న, షామ్, కోటా శ్రీనివాసరావు, సన ఖాన్, మల్లికార్జున్, గౌతంరాజు, వక్కంతం వంశీ, ఆర్పీ పట్నాయక్, శ్రీవాస్, రఘుబాబు విచ్చేసారు.[5]

కళ్యాణ్ రామ్ కత్తి
మణిశర్మ స్వరపరచిన పాటలు
విడుదల2010
రికార్డింగు2010
సంగీత ప్రక్రియపాటలు
నిడివి19:08
రికార్డింగ్ లేబుల్మయూరి ఆడియో
నిర్మాతమణిశర్మ
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "జై జై రామ్ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  విజయ్ యేసుదాస్ 4:18
2. "ఏమి దెబ్బరో (రచన: రామజోగయ్య శాస్త్రి)"  ఖుషి మురళి 4:01
3. "నాటు కోడి కూర (రచన: బండారు దానయ్య)"  హేమచంద్ర, గీతా మాధురి 4:06
4. "ఏమవుతుంది గుండెలో (రచన: బాలాజీ)"  శ్రీరామచంద్ర 4:15
5. "థీమ్ ఆఫ్ కళ్యాణ్ రామ్" (వాయిద్యం)  02:28
19:08

మూలాలు[మార్చు]

  1. "Interview with Kalyan Ram Nandamuri". Idlebrain.com.
  2. "NTR's grandson, director in title". Times of India.
  3. "Gunasekhar gives up his 'Kathi' title". Times of India.
  4. "Why Kalyan Ram gave 3rd chance to him?". Tupaki.com.
  5. "Kathi music success function". Idlebrain.com.

బయటి లింకులు[మార్చు]