కవిరాజవిరాజితము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

కవిరాజ విరాజిత వృత్తము:ఈ వృత్తమున కు ప్రతి పాదములో ఒక న గణము ను దాని పిదప ఆఱు జ ఉంటూ, తారువార ఒక వ గణము ఉండవలయును.... రామ్

కవిరాజవిరాజితం[మార్చు]

కమల దళంబుల కైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖ ప్రభలున్
సమధిక వృత్తకుచంబులు నొప్పగ శైలరసర్తు విశాల యతిన్
సముచితనాన్విత షడ్జలగంబు లజానుగఁ బాడిరి చక్రధరున్
రమణులు సొం పలరం గవిరాజ విరాజితమున్ బహు రాగములన్,

గణ విభజన[మార్చు]

కవిరాజవిరాజిత వృత్త పాదము నందు గణవిభజన
III IUI IUI IUI IUI IUI IUI IU
కమల దళంబు లకైవ డిఁజెన్న గుకన్ను లుజారు ముఖప్ర భలున్


(1'న', 6 'జ', 1 'వ' గణాలు)

లక్షణములు[మార్చు]

కవిరాజవిరాజితం వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు
23
ప్రతిపాదంలోని గణాలు: న, జ, జ, జ, జ , జ, జ, వ
యతి : ప్రతిపాదంలోనూ 8 వ, 14వ, 20వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు

ఉదాహరణ 1:[మార్చు]

పోతన తెలుగు భాగవతంలో వాడిన కవిరాజవిరాజితం వృత్త పద్యాల సంఖ్య: 3

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/బలరాముని ఘోషయాత్ర|(భా-10.2-489-కవి.)
చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచిత పుణ్యు నగణ్యునిఁ జం
దన ఘనసార పటీర తుషార సుధా రుచికాయు విధేయు సుధా
శనరిపుఖండను సన్మణిమండను సారవివేకు నశోకు మహా
త్మునిఁ గని గోపిక లోపిక లేక యదుప్రభు ని ట్లని రుత్కలికన్.