ప్రభ (నటి)

వికీపీడియా నుండి
(కోటి సూర్య ప్రభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రభ (కోటి సూర్య ప్రభ)(23,మే1961) తెలుగు సినీ నటీ, కూచిపూడి నర్తకి.ఈమె సుబ్రహ్మణ్యం, రమణమ్మ దంపతులకు 23,మే1961లో తెనాలి లో జన్మించారు.

జన్మనామం:-కోటి సూర్యప్రభ

జన్మించిన తేదీ:-23,మే1961.

ఇతర పేర్లు:-ప్రభ,జయప్రభ.

తల్లిదండ్రులు:-సుబ్రమణ్యం,రమణమ్మ

భర్త:-రమేష్

వృత్తి:-నటి,క్లాసికల్ డాన్సర్

కాలం:-1974నుండి ప్రస్తుతం.

ప్రస్థానం

[మార్చు]

ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది.[1] దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు[2]. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది[3].

చిత్ర సమాహారం

[మార్చు]

అవార్డులు

[మార్చు]
  1. నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు - వేగుచుక్కలు (2003)

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-03-21.
  2. http://www.idlebrain.com/movie/archive/eventlist2.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-21.
  4. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభ_(నటి)&oldid=4319465" నుండి వెలికితీశారు