కోరుకొల్లు (కలిదిండి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Korukollu pnchayiti office.jpg

కోరుకొల్లు, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 343., ఎస్.టి.డి.కోడ్ = 08677.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

ఈ గ్రామం హైదరాబాదు నుండి 400, విజయవాడ నుండి 80, భీమవరం నుండి 30, కైకలూరు నుండి 15 కిలోమీటర్ల దూరములోనున్నది.

సమీప గ్రామాలు[మార్చు]

కోరుకొల్లు గ్రామానికి చుట్టుపక్కల ఆవకూరు, కలిదిండి, భాస్కరరావుపెట, ఏలూరుపాడు, ముదినేపల్లి, బంటుమిల్లి, సింగరాయకొండ గ్రామాలున్నాయి.

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, బంటుమిల్లి, మండవల్లి,ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

 1. హైదరాబాదు,, భీమవరం, విజయవాడ, కైకలూరు మొదలగు ప్రదేశాలనుండి కోరుకొల్లుకు బస్సు సౌకర్యము ఉంది.
 2. సమీప రైల్వే స్టేషను = కైకలూరు.
 3. సమీప విమానాశ్రయము = విజయవాడ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

 1. ఈ పాఠశాలలో చదువుచున్న గరికిముక్కుల సంధ్య అను విద్యార్థిని, 2015,డిసెంబరు-10వ తేదీనుండి 12వ తేదీవరకు కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి జావెలిన్ థ్రో పోటీలలో అండర్-17 విభాగంలో పాల్గొని, ద్వితీయస్థానం సాధించి, జాతీయస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనది. ఈమె త్వరలో నిర్వహించు జాతీయస్థాయి క్రీడ పోటీలలో పాల్గొంటుంది. [4]
 2. బెంగళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో 2016,జనవరి-19 నుండి 23 వరకు నిర్వహించనున్న దక్షిణ భారతదేశ స్థాయి వైద్య,విఙానిక సదస్సులో పాల్గొనడానికి ఈ పాఠశాల విద్యార్థుల బృందం ఎంపికైనది. [6]

ఇతర పాఠశాలలు[మార్చు]

 • క్రాంతి రెసిడెన్షియల్ పాఠశాల (కృష్ణా కాన్వెంట్)
 • కేరళ కాన్వెంట్
 • మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
 • మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, కోరుకల్లు బ్రాంచి.
 • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కోరుకల్లు -II.
 • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, బొబ్బిలిగూడెం.
 • మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, కొత్తమల్లపల్లి.
 • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, చైతన్యపురం.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సినిమా హాళ్లు[మార్చు]

కోరుకల్లు జలాశయం
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం

శ్రీవెంకటేశ్వర థియేటర్

అంతర్జాలము (INTERNET)[మార్చు]

Maa computer world

క్రీడలు[మార్చు]

గ్రామంలో క్రికెట్ అత్యంత ప్రాచుర్యమైన క్రీడ. పిల్లలు ఉన్నత పాఠశాల ఆటస్థలంలో ఆడతారు. చుట్టుపక్కల ప్రాంతంలో కోరుకొల్లు క్రికెట్ జట్టు ఫాస్టు బౌలింగ్, బ్యాటింగ్ కు పేరిందినది.

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

పంటపొలాలకు నీరు అందజేయటానికి గ్రామంలో మూడు కాలువలున్నాయి.

గ్రామ పంచాయతీ[మార్చు]

కోరుకల్లులో ఉన్న దర్శనీయ స్థలాలు/ప్రార్ధనా ప్రదేశాలు[మార్చు]

బల్లమ్మ గుడిలో కొలువుతీరిన గ్రామదేవత బల్లమ్మ
 1. దేవి దేవాలయం (ఈ గుడికి అనుసంధానంగా 3 గుడులు ఉన్నాయి)
 2. కృష్ణుడి గుడి
 3. శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి
 4. శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి:- ప్రతి సంవత్సరం వేంకటేశ్వర కళ్యాణము ఘనంగా జరుపుతారు.
 5. శ్రీ కృష్ణాశ్రమం
 6. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం:- ఈ ఆలయం చాలా ప్రసిద్ధిచెందిన ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సుమారు 80 సంవత్సరాల క్రితం, ఆలయ సమీపంలోని కోనేరులో సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు స్వయంభూగా వెలసినట్లు పూర్వీకులు చెపుతారు. సర్పాకారంతో, మూడు పడగలతో, రాగి ప్రతిమతో స్వామివారు వెలసినారని భక్తులు విశ్వసిస్తారు. అనంతరం భక్తులు, గ్రామస్థుల సహకారంతో, శ్రీ చన్నంశెట్టి రామయ్య, సీతమ్మ దంపతులు ధర్మకర్తలుగా 1934 లో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి ఉత్వవలను వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలకు కలిదిండి, ముదినేపల్లి మండలాలకు చెందిన వేలాదిమంది భక్తులు ఈ ఆలయనికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. [5]
 7. పాత రామాలయం (యాదవ పాలెం)
 8. రామాలయం (యాదవపాలెం)
 9. అయ్యప్ప స్వామి దేవాలయం
 10. శ్రీ సీతారాముల గుడి
 11. ఆంజనేయస్వామి దేవాలయం
 12. గ్రామదేవత బళ్ళమ్మ తల్లి:- బళ్ళమ్మ తల్లి దేవస్థాన పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2014,మార్చి-8, శనివారం నాడు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ విజయ నామ సంవత్సరం, ఫాల్గుణమాసం, రోహిణీ నక్షత్ర యుక్త వృషభ లగ్నమందు, ఉదయం 10-58 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కనులపండువగా నిర్వహించారు. మద్యాహ్నం ఆరువేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఈ గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్క గ్రామాలైన ఆవకూరు,, కొచ్చెర్ల, సానాలరుద్రవరం, వేమవరప్పాడు తదితర గ్రామాలనుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి, బళ్ళమ్మ తల్లిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [2]
 13. R.C.M. Church
 14. C.S.I. Church

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

ముఖ్యంగా వరి, రొయ్యలు పండిస్తారు.

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారము వ్యవసాయము.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ప్రముఖ కుటుంబాలు[మార్చు]

తోట,శిరింగి,యాళ్ళ,పంతగాని, చెన్నంశెట్టి,వట్టూరి,నున్న,గమిడి,తలారి,తోకల,గంగుల,దొడ్ద్దాకుల,మీగడ,బోయి,ఛేబోన,నల్లిబోయిన,నాగనబోయిన,బుసనబోయిన,బొమ్నబోయిన,కేసిరెడ్డి,వలవల,జల్లురి,నామన,

కోరుకల్లుకు చెందిన ప్రముఖ వ్యక్తులు[మార్చు]

 • చన్నమశెట్టి పాండురంగారావు, కైకలూరు మాజీ శాసనసభా సభ్యుడు
 • చన్నమశెట్టి మురళీకృష్ణ, కలిదిండి మాజీ మండల ప్రెసిడెంట్
 • వలవల వెంకట రామారావు, కలిదిండి మాజీ మండల ప్రెసిడెంట్
 • చన్నమశెట్టి కోదండ రామయ్య, కలిదిండి ZPTC
 • తోట పాండురంగారావు, కోరుకొల్లు మాజీ పంచాయతి మెంబరు
 • నున్న వీర రాఘవులు, కోరుకొల్లు మాజీ పంచాయతి మెంబరు, PACS డైరెక్టర్.
 • నున్న సుబ్రహ్మణ్యం, టి.డి.పి.ప్రధాన కార్యదర్శి.
 • నల్లిబోయిన పాండు రంగమ్మ, కోరుకొల్లు మాజీ MPTC
 • గంగుల సూరిబాబు, కోరుకొల్లు మాజీ MPTC
 • నల్లిబోయిన పాండురంగా రావు, కోరుకొల్లు MPTC
 • తలారి వీరుల్లు, కోరుకొల్లు పంచాయతి మెంబర్
 • బిరుదుగడ్డ కిరణ్ కుమార్, M.D. of Maaa computer world

గ్రామంలోని విశేషాలు[మార్చు]

 1. ఈ గ్రామం నుండి చాలా మంది ప్రజలు హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ మొదలైన పట్టణాలతో పాటు అమెరికాలాంటి విదేశాలకు కూడా వలస వెళ్ళారు.
 2. భారతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఆధ్వర్యంలో, హైదరాబాదులో 2014, సెప్టెంబరు-10 నుండి 13వ తేదీ వరకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వివిధ పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విఙాన యాత్రకు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు చెందిన, ఎంపికచేసిన అభ్యుదయ మహిళా రైతులు విచ్చేసారు. కృష్ణాజిల్లా నుండి, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మా) నేతృత్వంలో పన్నెండు మంది మహిళా రైతులు ఈ వైఙ్నానిక యాత్రలో పాల్గొన్నారు. వీరిలో కలిదిండి మండలానికి చెందిన ఇద్దరు మహిళా రైతులు, ఉత్తమ ప్రదర్శన కనబరచారు. వీరిలో ఒకరు కోరుకొల్లు గ్రామానికి చెందిన శ్రీమతి నల్లిబోయిన పాండురంగమ్మ కాగా ఇంకొకరు వెంకటాపురం గ్రామానికి చెందిన శ్రీమతి సానబోయిన అనంతలక్ష్మి. ఆధునిక వ్యవసాయంపై తమకున్న అవగాహన, పరిఙానాన్ని సదస్సులో పదిమందికీ వీరు వివరించారు. వీరి ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ పరిశోధనా సంస్థ డైరెక్టరు శ్రీ హెచ్.డి.థాయ్, వీరిద్దరికీ ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలను అందజేసినారు. వీటితోపాటు రజతపతకం గూడా స్వంతంచేసుకొని, ప్రదర్శన మొత్తానికీ వీరు ఆదర్శంగా నిలిచారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,333 - పురుషుల సంఖ్య 4,065 - స్త్రీల సంఖ్య 4,268 - గృహాల సంఖ్య 2,372

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8543.[2] ఇందులో పురుషుల సంఖ్య 4291, స్త్రీల సంఖ్య 4252, గ్రామంలో నివాసగృహాలు 2125 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Korukollu". Retrieved 7 July 2016. External link in |title= (help)
 2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-9, 15వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-27; 9వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-15; 16వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-16; 8వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-31; 15వపేజీ.