గుంతకల్లు మండలం
గుంతకల్లు | |
— మండలం — | |
అనంతపురం పటములో గుంతకల్లు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గుంతకల్లు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°10′01″N 77°22′01″E / 15.166915°N 77.366981°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండల కేంద్రం | గుంతకల్లు |
గ్రామాలు | 19 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,59,535 |
- పురుషులు | 80,867 |
- స్త్రీలు | 78,668 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 65.03% |
- పురుషులు | 76.03% |
- స్త్రీలు | 53.69% |
పిన్కోడ్ | 515801 |
గుంతకల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,59,535 - పురుషులు 80,867 - స్త్రీలు 78,668, అక్షరాస్యత - మొత్తం 65.03% - పురుషులు 76.03% - స్త్రీలు 53.69%, పిన్ కోడ్ 515801
మండలంలోని పట్టణాలు[మార్చు]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- తిమ్మనచర్ల
- కసాపురం
- సంగాల
- దోసలుడికి
- గుండాల
- అమీన్‌పల్లి
- కొంగనపల్లి
- శంకరబండ
- ఓబులాపురం
- వై.టి.చెరువు
- పాత కొత్తచెరువు
- నక్కనదొడ్డి
- తిమ్మాపురం
- గుంతకల్లు (గ్రామీణ)
- దోనిముక్కల
- నెలగొండ
- దంచర్ల
- నాగసముద్రం
- అయ్యవారిపల్లి
మండలంలోని దేవాలయాలు[మార్చు]
మండలానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఇదే మండలానికి చందిన కసాపురం గ్రామంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా పేరుపొందింది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటోలు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వం గుంతకల్లు నుండి కసాపురముకి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల ఆంజనేయస్వామి వెలసినాడు. నేట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కసాపురం ఆలయ 'వ్యూ' కనిపిస్తుంది. కసాపురం నుండి గుంతకల్లుకు వెళ్ళే దారిలో శనీశ్వరుని ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది.