గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
Chairperson | అమిత్ చావ్దా |
ప్రధాన కార్యాలయం | రాజీవ్ గాంధీ భవన్, అహ్మదాబాదు |
యువత విభాగం | గుజరాత్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | గుజరాత్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం | |
కూటమి | Indian National Developmental Inclusive Alliance |
లోక్‌సభలో సీట్లు | 0 / 26
|
రాజ్యసభలో సీట్లు | 1 / 11
|
శాసనసభలో సీట్లు | 13 / 182
|
Election symbol | |
Website | |
INC Gujarat |
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ రాష్ట్ర శాఖ. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం దీని బాధ్యతలు. అలాగే స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక కూడా చేస్తుంది. శక్తిసిన్హ్ గోహిల్ పిసిసి అధ్యక్షుడు.[1] గుజరాత్‌లోని వివిధ పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలలో కాంగ్రెసుకు 1862 సీట్లు ఉన్నాయి.[2] పిసిసి కార్యాలయం అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లో ఉంది. ఇది గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏకైక ప్రధాన ప్రతిపక్షం. స్వతంత్ర రాష్ట్రంలో 1962 లో జరిగిన జరిగిన మొదటి ఎన్నికల నుండి ప్రతి గుజరాత్ శాసనసభ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పాల్గొంది.
చరిత్ర
[మార్చు]స్వాతంత్ర్యానికి పూర్వం
[మార్చు]గుజరాత్ పిసిసిని 1920 లో స్థాపించారు. దాని మొదటి అధ్యక్షుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. అతనే అత్యంత సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. గుజరాత్ పిసిసి భారత స్వాతంత్ర్య పోరాటంలో భారత జాతీయవాద ప్రచారాలను నిర్వహించింది. 1947లో స్వాతంత్ర్యం తర్వాత, స్థానిక, రాష్ట్ర ఎన్నికల ప్రచారాలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను స్వీకరించింది.
స్వాతంత్ర్యం తరువాత
[మార్చు]1962 లో స్వతంత్ర గుజరాత్‌లో పార్టీ తన మొదటి ఎన్నికల్లో జీవరాన్ మెహతా నాయకత్వంలో పోటీ చేసి, 113 స్థానాలతో బలమైన మెజారిటీ సాధించింది. హితేంద్ర దేశాయ్ నాయకత్వంలో 1967 లో పార్టీ అనేక స్థానాలను కోల్పోయినప్పటికీ సాధారణ మెజారిటీ సాధించింది. అయితే, ఎన్నికల తర్వాత హితేంద్ర దేశాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) శిబిరానికి ఫిరాయించాడు. ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1971 లో రాష్ట్రపతి పాలన విధించారు. అది 1972 ఎన్నికల వరకు కొనసాగింది. 1972 ఎన్నికలలో ఘనశ్యామ్ ఓజా నేతృత్వంలో కాంగ్రెస్, శాసనసభలో ఉన్న మొత్తం 168 సీట్లలో 140 గెలుచుకుంది. 1973 లో ఓజా స్థానంలో చిమన్‌భాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆర్థిక సంక్షోభాలు, ప్రజా జీవితంలో అవినీతికి వ్యతిరేకంగా 1973-74 లో నవనిర్మాణ ఆందోళనలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనల కారణంగా కేంద్రం, 1974 లో చిమన్‌బాయి పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. తదుపరి ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన విధించారు. 1975 లో, కొత్తగా జరిగిన ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 75 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ (O) కి చెందిన బాబుభాయ్ J. పటేల్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, 1976 లో రాష్ట్రపతి పాలనను విధించారు. ఆ తరువాత కాంగ్రెస్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 3 నెలల లోనే ఆ ప్రభుత్వం పడిపోయి, జనతాపార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1980 లో మాధవ్ సిన్హ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్, 140 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. సోలంకి ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ పొందింది. అతని ప్రభుత్వం 1985 లో అది మరింత మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 1990 ఎన్నికల్లో గుజరాత్ అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అత్యల్పంగా 33 సీట్లను సాధించింది. బీజేపీ - జనతాదళ్ కూటమి కాంగ్రెసును ఘోరంగా ఓడించింది. అయితే 1994 లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1995 ఎన్నికలలో, కాంగ్రెస్ మళ్లీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ గత ఎన్నికల కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. బిజెపి 121 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది. 2015 లో రాష్ట్రం లోని అనేక గ్రామీణ స్థానిక సంస్థల్లో బిజెపిని తుడిచిపెట్టి అధికారంలోకి వచ్చింది. చివరకు 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కొద్ది సీట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, బిజెపి సీట్ల సంఖ్యను 99 కి తగ్గించి, మంచి పురోగతి సాధించింది.
ఎన్నికల పనితీరు
[మార్చు]శాసన సభ ఎన్నికలు
[మార్చు]Year | Seats contested | Seats won | Change in seats | Percentage of votes | Vote swing | Outcome |
---|---|---|---|---|---|---|
1962 | 154 | 113 / 154
|
113 | 50.84 | N/A | అధికారం |
1967 | 168 | 93 / 168
|
20 | 45.96 | 4.88 | అధికారం, later ప్రతిపక్షం |
1972 | 168 | 140 / 168
|
47 | 50.93 | 4.97 | అధికారం |
1975 | 182 | 75 / 182
|
65 | 40.70 | 10.23 | ప్రతిపక్షం, తరువాత కొద్ది కాలం అధికారంలోకి, మళ్ళీ ప్రతిపక్షం |
1980 | 182 | 141 / 182
|
66 | 51.04 | 10.34 | అధికారం |
1985 | 182 | 149 / 182
|
9 | 55.55 | 4.51 | అధికారం |
1990 | 182 | 33 / 182
|
116 | 30.74 | 24.81 | ప్రతిపక్షం, later అధికారం |
1995 | 182 | 45 / 182
|
12 | 32.86 | 2.12 | ప్రతిపక్షం, later అధికారం |
1998 | 182 | 53 / 182
|
8 | 34.85 | 1.99 | ప్రతిపక్షం |
2002 | 182 | 51 / 182
|
2 | 39.28 | 4.43 | ప్రతిపక్షం |
2007 | 173 | 59 / 182
|
8 | 38.00 | 1.28 | ప్రతిపక్షం |
2012 | 176 | 61 / 182
|
2 | 38.93 | 0.93 | ప్రతిపక్షం |
2017 | 179 | 77 / 182
|
16 | 41.44 | 2.57 | ప్రతిపక్షం |
2022 | 179 | 17 / 182
|
60 | 27.22 | 14.12 | ప్రతిపక్షం |
లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]సంవత్సరం. | శాసనసభ | సీట్లు గెలుచుకున్నారు. | సీట్ల మార్పు | ఓట్ల శాతం | ఓటు స్వింగ్ | ఫలితం. |
---|---|---|---|---|---|---|
1962 | 3వ లోక్‌సభ | 16 / 22
|
ఎన్/ఎ | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
1967 | 4వ లోక్‌సభ | 11 / 24
|
5 | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
1971 | 5వ లోక్‌సభ | 11 / 24
|
ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం | |
1977 | 6వ లోక్‌సభ | 10 / 26
|
1 | ఎన్/ఎ | ఎన్/ఎ | ప్రతిపక్షం |
1980 | 7వ లోక్‌సభ | 25 / 26
|
15 | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
1984 | 8వ లోక్‌సభ | 24 / 26
|
1 | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
1989 | 9వ లోక్‌సభ | 3 / 26
|
21 | ఎన్/ఎ | ఎన్/ఎ | ప్రతిపక్షం |
1991 | 10వ లోక్‌సభ | 5 / 26
|
2 | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
1996 | 11వ లోక్‌సభ | 10 / 26
|
5 | ఎన్/ఎ | ఎన్/ఎ | ప్రతిపక్షం, తరువాత UF కు బయటి నుండి మద్దతు |
1998 | 12వ లోక్‌సభ | 7 / 26
|
3 | ఎన్/ఎ | ఎన్/ఎ | ప్రతిపక్షం |
1999 | 13వ లోక్‌సభ | 6 / 26
|
1 | ఎన్/ఎ | ఎన్/ఎ | ప్రతిపక్షం |
2004 | 14వ లోక్‌సభ | 12 / 26
|
6 | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
2009 | 15వ లోక్‌సభ | 11 / 26
|
1 | ఎన్/ఎ | ఎన్/ఎ | అధికారం |
2014 | 16వ లోక్‌సభ | 0 / 26
|
11 | 32.9 | ఎన్/ఎ | ప్రతిపక్షం |
2019 | 16వ లోక్‌సభ | 0 / 26
|
32.11 | 0.79 | ప్రతిపక్షం |
ఆఫీసు బేరర్లు
[మార్చు]పేరు | విభాగం/పదవి | శాఖ | మూలం |
---|---|---|---|
శక్తిసిన్హ్ గోహిల్ | రాష్ట్ర అధ్యక్షుడు | N/A | [3] |
రఘు శర్మ | రాష్ట్ర ఇంచార్జి | N/A | [4] |
జెన్నీ తుమ్మర్ | రాష్ట్ర మహిళా విభాగం చీఫ్ | మహిళా గుజరాత్ కాంగ్రెస్ | [5] |
డాక్టర్ మనీష్ దోషి | ప్రధాన ప్రవాహం | ప్రధాన ప్రతినిధి, కన్వీనర్ | [6] |
మన్హర్ పటేల్ | ప్రధాన ప్రవాహం | ప్రతినిధి | [7] |
జునేద్ పటేల్ | చైర్మన్ | మైనారిటీ విభాగం సోషల్ మీడియా | [8] |
వర్కింగ్ ప్రెసిడెంట్లు
[మార్చు]- అంబరీష్ డెర్
- హిమ్మత్‌సింగ్ పటేల్
- ఇంద్రవిజయ్‌సింహ గోహిల్
- జిగ్నేష్ మేవానీ
- కదిర్ పిర్జాదా
- రుత్విక్ మక్వానా
- లలిత్ కాగరత [3]
అధ్యక్షుల జాబితా
[మార్చు]సంవత్సరం | అధ్యక్షుడు |
---|---|
2004 - 2005 | BK గాధ్వి |
2006 - 2008 | భరతసింహ మాధవసింహ సోలంకి |
2008 - 2011 | సిద్ధార్థ్ పటేల్ |
2011 - 2015 | అర్జున్ మోద్వాడియా |
2015 - మార్చి 2018 | భరతసింహ మాధవసింహ సోలంకి |
మార్చి 2018 - 6 డిసెంబర్ 2021 | అమిత్ చావ్డా |
6 డిసెంబర్ 2021 - 9 జూన్ 2023 | జగదీష్ ఠాకూర్ |
9 జూన్ 2023 - ప్రస్తుతం | శక్తిసిన్హ్ గోహిల్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Congress Party PCC Presidents - Indian National Congress". Archived from the original on 1 April 2019.
- ↑ "BJP Dominates, AAP Impresses Again In Local Gujarat Polls". NDTV. Retrieved 2022-09-20.
- ↑ 3.0 3.1 "Congress Party PCC Presidents". Indian National Congress (in ఇంగ్లీష్). Retrieved 2022-09-20.
- ↑ "Gujarat Congress in-charge Raghu Sharma lashes out at Hardik Patel". Business Standard India. 2022-06-01. Retrieved 2022-09-20.
- ↑ "Gujarat: Jenny Thummar appointed Mahila Congress chief". The Indian Express (in ఇంగ్లీష్). 2022-03-28. Retrieved 2022-11-11.
- ↑ "Congress picks new Gujarat unit chief, LoP". 3 December 2021.
- ↑ "Gujarat School Declares Hindutva as the National Religion, Devanagari as the National Script". NewsClick (in ఇంగ్లీష్). 2022-01-28. Retrieved 2022-03-10.
- ↑ "પેટ્રોલ – ડીઝલ થી લઇ રાંધણ ગેસ નો ભાવ વધારો સામાન્ય થી લઈ ધનવાનો ને અસર કરે છે:- જુનેદ પટેલ". Gramin Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-25.