గ్రాండ్ ట్రంక్ రోడ్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రాండ్ ట్రంక్ రోడ్డు
ఉత్తరాపథం, సడక్-ఎ-ఆజం, షా రాహ్-ఎ-ఆజం, బాద్షాహీ సడక్, లాంగ్ వాక్[a]
మార్గ సమాచారం
పొడవు3,655 కి.మీ.[2] (2,271 మై.)
Existedసా.పూ. 322 కు ముందు–present
Historyమౌర్యులు, సూర్, మొగలులు, బ్రిటిషు భారతదేశం
Time period16 వ శతాబ్దం–ఇప్పటి వరకు
సాంస్కృతిక ప్రశస్తిభారత ఉపఖండ చరిత్ర, దక్షిణాసియా చరిత్ర
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరటెక్నాఫ్, బంగ్లాదేశ్
పశ్చిమ చివరకాబూల్, ఆఫ్ఘనిస్తాన్
ప్రదేశము
Major citiesకాక్స్ బజార్, చిట్టగాంగ్, ఫెని, ఢాకా, రాజ్‌షాహి, కోల్‌కతా, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, అలీగఢ్, ఢిల్లీ, సోనీపత్, పానిపట్, కర్నాల్, అంబాలా, లూఢియానా, జలంధర్, అమృత్‌సర్, లాహోర్, గుజ్రన్‌వాలా, రావల్పిండి, పెషావర్, జలాలాబాద్, కాబూల్
గ్రాండ్ ట్రంక్ రోడ్డు మార్గం

గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఆసియాలోని పురాతనమైన, పొడవైన ప్రధాన రహదారులలో ఒకటి. దీన్ని గతంలో ఉత్తరాపథం అని, సడక్-ఏ-ఆజం అని షా రాహ్-ఏ-ఆజం అని బాద్షాహీ సడక్ అనీ లాంగ్ వాక్ అనీ అనేవారు.[1] కనీసం 2,500 సంవత్సరాలుగా[3] ఇది మధ్య ఆసియాను భారత ఉపఖండంతో కలిపింది. ఇది దాదాపు 3,655 కి.మీ. (2,271 మై.) పొడవున ఉంటుంది.[2] బంగ్లాదేశ్ - మయన్మార్ సరిహద్దు లోని టెక్నాఫ్ నుండి [4][5] బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్, ఢాకా, భారతదేశంలో కోల్‌కతా, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, ఢిల్లీ, అమృత్‌సర్, లాహోర్, పాకిస్తాన్‌లోని రావల్పిండి, పెషావర్ ల మీదుగా పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ వరకు వెళ్తుంది.[6][1]

గ్రాండ్ ట్రంక్ రహదారిని సా.పూ. 3వ శతాబ్దంలో ఉత్తరాపథం అనే పురాతన మార్గంలో నిర్మించారు.[7] దీనిని గంగా ముఖద్వారం నుండి భారతదేశపు వాయవ్య సరిహద్దు వరకు విస్తరించింది. అశోకుని ఆధ్వర్యంలో ఈ రహదారికి మరిన్ని మెరుగుదలలు జరిగాయి. పాత మార్గాన్ని షేర్ షా సూరి సోనార్‌గావ్, రోహ్తాస్‌ల గుండా వెళ్ళేలా మార్చాడు.[7][8] రహదారి ఆఫ్ఘన్ వైపున మహమూద్ షా దురానీ పునర్నిర్మించాడు.[9][7] 1833, 1860 మధ్య బ్రిటిషర్లు ఈ రహదారిని గణనీయంగా పునర్నిర్మించారు.[10]

శతాబ్దాలుగా, ఈ రహదారి ఈ ప్రాంతంలోని ప్రధాన వాణిజ్య మార్గాలలో ఒకటిగా పనిచేసింది. ప్రయాణాలు, తంతు సమాచారాలు రెండింటినీ సులభతరం చేసింది. నేటి భారత ఉపఖండంలో రవాణా కోసం గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఇప్పటికీ ఉపయోగించబడుతోంది. ఈ రహదారి భాగాలను విస్తరించి, జాతీయ రహదారి వ్యవస్థలో చేర్చారు.[11]

ప్రస్తుత N1, ఫెని (చిట్టగాంగ్ నుండి ఢాకా), N4 & N405 (ఢాకా నుండి సిరాజ్‌గంజ్), N507 (సిరాజ్‌గంజ్ నుండి నాటోర్ వరకు), N6 (నేటోర్ నుండి రాజ్‌షాహి నుండి భారతదేశంలోని పూర్నియా వైపు ; NH 12 (పూర్ణియా నుండి బక్కాలి), NH లతో సమానంగా ఉంటుంది. 27 (పూర్నియా నుండి పాట్నా), NH 19 (కోల్‌కతా నుండి ఆగ్రా), NH 44 (ఆగ్రా నుండి న్యూ ఢిల్లీ, పానిపట్, కర్నాల్, అంబాలా, లూథియానాల మీదుగా జలంధర్) NH 3 (జలంధర్ నుండి అత్తారి, భారతదేశంలోని అమృత్‌సర్ నుండి పాకిస్తాన్‌లోని లాహోర్ వైపు) వాఘా మీదుగా ; N-5 (లాహోర్, గుజ్రాన్‌వాలా, గుజరాత్, లాలాముసా, ఖరియన్ , జీలం, రావల్పిండి, పెషావర్, ఖైబర్ పాస్ ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్ వైపు), AH1 (టోర్ఖం - జలాలాబాద్ నుండి కాబూల్) ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న రహదారులన్నీ గ్రాండ్ ట్రంక్ రహదారిలో భాగాలే.

చరిత్ర

[మార్చు]

పురాతన కాలాలు

[మార్చు]

బౌద్ధ సాహిత్యం, మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాల్లోను మౌర్య సామ్రాజ్యానికి ముందూ కూడా గ్రాండ్ ట్రంక్ రహదారి ఉనికి కనిపిస్తుంది. దీనిని ఉత్తరాపథం అనీ, "ఉత్తర రహదారి" అనీ అంటారు. ఈ రహదారి, భారతదేశంలోని తూర్పు ప్రాంతాన్ని మధ్య ఆసియాలో ఖొరాసన్ రోడ్డు టెర్మినస్‌ను కలుపుతుంది.[12]

మౌర్య సామ్రాజ్యం

[మార్చు]

ఆధునిక గ్రాండ్ ట్రంక్ రహదారికి పూర్వగామి అయిన రహదారిని చంద్రగుప్త మౌర్య చక్రవర్తి నిర్మించాడు. పర్షియన్ రాయల్ రోడ్డు [13] (మరింత ఖచ్చితంగా, దాని తూర్పు విస్తరణ, మీడియా నుండి బాక్ట్రియా వరకు నడిచే గ్రేట్ ఖురాసన్ రోడ్) నుండి ప్రేరణ పొందింది. సా.పూ. 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యం సమయంలో, భారతదేశం, పశ్చిమ ఆసియా, బాక్టీరియా ప్రపంచంలోని అనేక ప్రాంతాల మధ్య వాణిజ్యం ప్రధానంగా వాయవ్య నగరాలైన తక్షశిల, పురుషపుర ల గుండా జరిగేది. తక్షశిలకు, మౌర్య సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలతో చక్కటి రోడ్ల సౌకర్యం ఉండేది. మౌర్యులు ఈ పురాతన రహదారిని తక్షశిల నుండి పాటలీపుత్ర వరకు నిర్వహించారు. చంద్రగుప్త మౌర్యుడు ఈ రహదారి నిర్వహణను పర్యవేక్షించేందుకిఉ ఏకంగా ఒక సైన్యాన్నే ఏర్పాటు చేసాడని మౌర్య ఆస్థానంలో పదిహేనేళ్లు గడిపిన గ్రీకు దౌత్యవేత్త మెగస్తనీస్ చెప్పాడు. ఎనిమిది దశల్లో నిర్మించబడిన ఈ రహదారి పురుషపుర, తక్షశిల, హస్తినాపురం, కన్యాకుబ్జ, ప్రయాగ, పాట్లీపుత్ర, తామ్రలిప్త నగరాలను కలుపుతూ సుమారు 2,600 కిలోమీటర్లు (1,600 మై.) పొడవున నడుస్తుంది.[9]

చంద్రగుప్తుని మార్గాన్ని పురాతన "ఉత్తరాపథం"పై లేదా పాణిని పేర్కొన్న ఉత్తర రహదారిపై నిర్మించారు. అశోక చక్రవర్తి తన శాసనంలో, చెట్లను నాటడం, ప్రతి అర కోసు దూరం లోను బావులు నిర్మించడం, అనేక "నిమిషధాయాలు" గురించి నమోదు చేసాడు. వీటిని తరచుగా ప్రయాణికులకు మార్గంలో విశ్రాంతి గృహాలుగా అనువదించారు. కనిష్క చక్రవర్తి ఉత్తరాపథాన్ని నియంత్రించాడు.[7][14][15]

సూరి, మొఘల్ సామ్రాజ్యాలు

[మార్చు]

మధ్యయుగంలో సూర్ సామ్రాజ్య పాలకుడు షేర్ షా సూరి 16వ శతాబ్దంలో చంద్రగుప్తుని రాజమార్గాన్ని మరమ్మత్తు చేయడం మొదలుపెట్టాడు. పాత మార్గాన్ని సోనార్‌గావ్, రోహ్తాస్‌ల వద్ద మరింతగా మార్చాడు. దాని వెడల్పు పెరిగింది, సరాయ్ నిర్మించారు, కోస్ మినార్‌లు, బావోలిల సంఖ్య పెరిగింది. హైవేలోని కొన్ని విభాగాల పక్కన తోటలు కూడా నిర్మించారు. సరాయ్ వద్ద ఆగిన వారికి ఉచితంగా ఆహారం అందించారు. అతని కుమారుడు ఇస్లాం షా సూరి బెంగాల్ వైపు వెళ్లే దారిలో మొదట షేర్ షా సూరి నిర్మించిన ప్రతి సరాయ్‌కి మధ్య అదనంగా మరొక సరాయ్‌ని నిర్మించాడు. మొఘలులు మరిన్ని సరాయ్‌లు నిర్మించారు. జహంగీర్ తన పాలనలో సరాయ్‌లన్నిటినీ కాల్చిన ఇటుకలు, రాతితో నిర్మించాలని శాసనం జారీ చేశాడు. లాహోర్, ఆగ్రాల మధ్య వెడల్పాటి ఆకులుండే చెట్లను నాటించాడు. అతను రహదారుల మార్గంలో ఉన్న నీటి వనరులపై వంతెనలను నిర్మించాడు.[7][16] ఈ మార్గాన్ని సూరి "సడక్-ఎ-అజం" అని, మొఘలులు "బాద్షాహి సడక్" అనీ పిలిచేవారు. [17]

బ్రిటిషు సామ్రాజ్యం

[మార్చు]
బ్రిటిషు భారతదేశంలో అంబాలా కంటోన్మెంట్ నుండి ఒక దృశ్యం.

1830 లలో ఈస్టిండియా కంపెనీ వాణిజ్య, పరిపాలనా ప్రయోజనాల కోసం మెటల్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్డు అని పిలిచే ఈ రహదారిని కలకత్తా నుండి ఢిల్లీ మీదుగా కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఒక్కో మైలుకు 1000 పౌండ్ల ఖర్చుతో పునర్నిర్మించారు.

ఫోస్టర్, రుడ్యార్డ్ కిప్లింగ్‌ లతో సహా అనేక సాహిత్య రచనలలో ఈ రహదారి ప్రస్తావన ఉంది. కిప్లింగ్ ఈ రహదారిని ఇలా వర్ణించాడు: "చూడండి! మళ్ళీ చూడండి! చుమర్లు, బ్యాంకర్లు, టింకర్లు, మంగళ్ళు, బనియాలు, యాత్రికులు - కుమ్మరులు కూడా - ప్రపంచమే వెళుతూ, వస్తూ ఉంది. ఇది నాకు ఒక నదిలా తోస్తోంది. నేను ఆ నది లోంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన దుంగ లాగా అనిపిస్తోంది. నిజంగానే గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఒక అద్భుతమైన దృశ్యం. ఇది భారతదేశంలో పదిహేను వందల మైళ్ల దూరం రద్దీ లేకుండా నడుస్తుంది - ప్రపంచంలో మరెక్కడా లేని జీవమున్న నది ఇది."[18]

భారత గణతంత్రం

[మార్చు]

భారతదేశంలో ఈ రహదారి వెంబడి ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల జాబితాను "ఉత్తరాపథం, బాద్షాహి సడక్, సడక్-ఎ-ఆజం, బాన్హో, గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంట ఉన్న ప్రదేశాలు" పేరిట 2015లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాకు సమర్పించారు.[1] గ్రాండ్ ట్రంక్ రోడ్డు లోని భారతీయ విభాగాలు భారతదేశంలోని జాతీయ రహదారులలోని NH 19, NH 112, NH 44 తో సమానంగా ఉంటాయి.

సెఫాలజిస్టులు కొన్నిసార్లు GT రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని "GT రోడ్డు బెల్ట్" అంటారు. కొన్నిసార్లు ఎన్నికల సందర్భంలో దీన్ని గుజరాత్ రహదారి అని కూడా అంటారు. ఉదాహరణకు, హర్యానాలో ఎన్నికల సమయంలో అంబాలా నుండి సోనిపట్ వరకు జిటి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతంలో 28 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒక కులం లేదా వర్గ ఆధిపత్యం లేదు. దీనిని "హర్యానా జిటి రోడ్డు బెల్ట్" అని అంటారు.[19][20]

నగరాల మధ్య దూరాలు

[మార్చు]

గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. The road was known as Uttarapatha during the Mauryan period (16th Century), Sadak-e-Azam or Shah Rah-e-Azam (The Great Road) during Suri period (1540-1556 CE), as Badshahi Sadak (King's Road) during Mughal by Sher Shah period and as the Grand Trunk Road or Long Walk during the British period.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Sites along the Uttarapath, Badshahi Sadak, Sadak-e-Azam, Grand Trunk Road". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Retrieved 2018-12-26.
  2. 2.0 2.1 The Atlantic: "India's Grand Trunk Road"
  3. UNESCO, Caravanserais along the Grand Trunk Road in Pakistan
  4. Steel, Tim (1 January 2015). "A road to empires". Dhaka Tribune. Retrieved 2016-07-19.
  5. Jhimli Mukherjee Pandey (15 September 2015). "Cuisine along G T Road". The Times of India. Calcutta. Retrieved 2016-07-19.
  6. Khanna, Parag. "How to Redraw the World Map". The New York Times. ISSN 0362-4331. Retrieved 2016-07-19.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Vadime Elisseeff, p. 159-162, The Silk Roads: Highways of Culture and Commerce
  8. Farooqui Salma Ahmed, p. 234, A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century
  9. 9.0 9.1 K. M. Sarkar (1927). The Grand Trunk Road in the Punjab: 1849-1886. Atlantic Publishers & Distri. pp. 2–. GGKEY:GQWKH1K79D6.
  10. David Arnold (historian); Science, technology, and medicine in colonial India (New Cambr hist India v.III.5) Cambridge University Press, 2000, 234 pages p. 106
  11. Singh, Raghubir (1995). The Grand Trunk Road: A Passage Through India (First ed.). Aperture Books. ISBN 9780893816445.
  12. Sanjeev, Sanyal (2012-11-15). Land of the Seven Rivers: A Brief History of India's Geography (in ఇంగ్లీష్). Penguin Random House India Private Limited. pp. 72–73, 103. ISBN 9788184756715.
  13. Benjamin Walker, p. 69, Hindu World: An Encyclopedic Survey of Hinduism. In Two Volumes. Volume II M-Z
  14. "Grand Trunk Road since Pre Mahabharata Times; Here are Evidences". 20 April 2020.
  15. "Grand Trunk Road: Uttarapatha, The Silk Route of India". 26 August 2021.
  16. Romila Thapar (2002). Early India: From the Origins to AD 1300. University of California Press. p. 263. ISBN 0-520-23899-0. The Mauryas had built a Royal Highway from Taxila to Pataliputra, a road that was almost continuously rebuilt in some approximation to the original during the period of Sher Shah, the Mughals and the British. The British referred to it as the Grand Trunk Road.
  17. Anu Kapur, p. 84, Mapping Place Names of India
  18. A description of the road by Kipling, found both in his letters and in the novel Kim.
  19. NuNu BJP on a strong footing in northern districts, Hindustan Times, 30 March 2016.
  20. Haryana assembly elections: BJP counts on strategy, The Times of India, 6 October 2019.