జి.ఎం.సి.బాలయోగి
(జి.యమ్.సి.బాలయోగి నుండి దారిమార్పు చెందింది)
గంటి మోహనచంద్ర బాలయోగి | |
---|---|
జననం | జి.ఎం.సి.బాలయోగి 1951-10-01 యెదురులంక,తూర్పు గోదావరి జిల్లా |
మరణం | 2002-03-03 కువ్వడలంక ,కృష్ణా జిల్లా |
మరణ కారణం | హెలికాప్టరు ప్రమాదం |
పదవి పేరు | పార్లమెంట్ సభ్యుడు |
పదవీ కాలం | 1998-03-24 : 2022-03-03 లోక్‌సభ స్పీకర్ |
భార్య / భర్త | విజయకుమారి |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు , గంటి హరీష్ మాధుర్ |
తండ్రి | గన్నయ్య |
తల్లి | సత్యమ్మ |
గంటి మోహనచంద్ర బాలయోగి, (1951 అక్టోబరు 1-2002 మార్చి 3) ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్.[1]
జననం
[మార్చు]బాలయోగి 1945, అక్టోబరు 1 న తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామంలో గంటి యెదురుగన్నయ్య, సత్యమ్మ దంపతులకు ఒక దళిత రైతు కుటుంబంలో జన్మించాడు.[1] ఇతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహం చేసుకున్నాడు.ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.
మరణం
[మార్చు]2002,మార్చి 3న భీమవరం నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపం వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపంలోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదంలో బాలయోగి మరణించాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లాపరిషత్ అధ్యక్షుడు
- 1991లో - 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
- 1996 - 1998 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
- 1998 - 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
- 1998 - మార్చి 24 - 2002, మార్చి 3 లోక్‌సభ స్పీకర్
- 1999 - 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
అంతకు ముందువారు పి.ఎ.సంగ్మా |
భారత లోక్‌సభ స్పీకర్లు 1998–2002 |
తరువాత వారు మనోహర్ జోషి |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Former Speakers -GMC Balayogi". Retrieved 2021-07-21.
ఇతర లింకులు
[మార్చు]వర్గాలు:
- లోక్‌సభ స్పీకర్లు
- 1945 జననాలు
- 10వ లోక్‌సభ సభ్యులు
- 12వ లోక్‌సభ సభ్యులు
- 13వ లోక్‌సభ సభ్యులు
- 2002 మరణాలు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- హెలికాప్టర్ ప్రమాద మరణాలు
- తెలుగువారిలో న్యాయవాదులు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు
- తూర్పు గోదావరి జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- విమాన ప్రమాదాల్లో మరణించినవారు