డోడెకేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోడెకేన్
Skeletal formula of dodecane
Skeletal formula of dodecane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball and stick model of dodecane
పేర్లు
Preferred IUPAC name
Dodecane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [112-40-3]
పబ్ కెమ్ 8182
యూరోపియన్ కమిషన్ సంఖ్య 203-967-9
డ్రగ్ బ్యాంకు DB02771
కెగ్ C08374
వైద్య విషయ శీర్షిక n-dodecane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:28817
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య JR2125000
SMILES CCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1697175
జి.మెలిన్ సూచిక 201408
ధర్మములు
C12H26
మోలార్ ద్రవ్యరాశి 170.34 g·mol−1
స్వరూపం Colorless liquid
వాసన Gasoline-like to odorless
సాంద్రత 0.7495 g mL−1 at 20 °C[2]
ద్రవీభవన స్థానం −10.0 to −9.3 °C; 14.1 to 15.2 °F; 263.2 to 263.8 K
బాష్పీభవన స్థానం 214 to 218 °C; 417 to 424 °F; 487 to 491 K
log P 6.821
బాష్ప పీడనం 18 Pa (at 25 °C)[3]
kH 1.4 nmol Pa−1 kg−1
వక్రీభవన గుణకం (nD) 1.421
స్నిగ్ధత 1.34 mPa s
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−353.5–−350.7 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−7901.74 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
490.66 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 376.00 J K−1 mol−1
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము hazard.com
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H304
GHS precautionary statements P301+310, P331
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
205 °C (401 °F; 478 K)
విస్ఫోటక పరిమితులు 0.6%
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

నార్మల్ డోడెకేన్ (n-dodecane)అనేది 12 కార్బనులను కల్గిన,సరళ హైడ్రోకార్బన్ గొలుసు కల్గిన ఆల్కేన్ సమూహానికి చెందిన హైడ్రోకార్బన్.n-డోడెకేన్ కిరోసిన్ మరియు కొన్ని జెట్ ఇంధనాలలో ప్రధాన భాగం, మరియు దాని పైరోలిసిస్ అధ్యయనం జెట్ ఫ్యూయల్ పైరోలైసిస్‌ను అర్థం చేసుకోవడానికి ఒక నమూనాగా ఉపయోగించ బడుతుంది.[4][5]N-డోడెకేన్ స్పష్టమైన రంగులేని ద్రవం.[6]ఇది జింగిబర్ అఫిసినల్ (అల్లం)తో సహా వివిధ మొక్కల ముఖ్యమైన/ఆవశ్యక నూనెల నుండి వేరుచేయబడింది.ఇది మొక్కల మెటాబోలైట్(జీవ క్రియ) పాత్రను కలిగి ఉంటుంది.[7]డోడెకేన్ అనేది కామెల్లియా సినెన్సిస్, అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్ మరియు ఇతర జీవులలో లభించే ఒక సహజ ఉత్పత్తి.డోడెకేన్ యొక్క రసాయనిక సూత్రంC12H26. N-డోడెకేన్, బైహెక్సిల్ లేదా CH3-[CH2]10-CH3 అని కూడా పిలుస్తారు, ఆల్కేన్స్ అని పిలువబడే కర్బన సమ్మేళనాల తరగతికి చెందినది.N-డోడెకేన్ సగటున, నల్ల వాల్‌నట్‌లలో (జగ్లన్స్ నిగ్రా) అత్యధిక శాతం లో కనుగొనబడింది.[8]

ఐసోమరులు(సమాంగాలు)[మార్చు]

355 డోడెకేన్ ఐసోమర్‌లు ఉన్నాయి.[9]

భౌతిక ధర్మాలు[మార్చు]

డోడెకేన్ సాధారణం గా ద్రవరూపంలో వున్న ఆల్కేన్.అంతేకాదు రంగులేని ద్రవం.[10] ఇది మండే స్వాభావం ఉన్న హైడ్రోకార్బన్.(NTP, 1992). ఇది అదృవ(non polar)ద్రావణి.నీటిలో కరగదు.[10]

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C12H26
అణు భారం 170.335 గ్రా/మోల్
సాంద్రత 0.8± గ్రా/సెం. మీ3[11]
మరుగు స్థానం 216.1±3.0°C [11]
ద్రవీభవన ఉష్ణోగ్రత -9.55°C[12]
వక్రీభవన గుణకం 1.422[11]
ఫ్లాష్ పాయింట్ 71.1±0.0 °C[11]
బాష్పీకరణ ఉష్ణశక్తి 43.4±0.8కిలో జౌల్స్/మోల్
స్వయం జలన ఉష్ణోగ్రత 203°C (397°F)[13]

ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఈథర్, అసిటోన్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్లలో బాగా కరుగుతుంది.వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది తీవ్రమైన పొగను మరియు చికాకు కలిగించే పొగలను విడుదల చేస్తుంది.[14][15]

రసాయన చర్యలు[మార్చు]

దహన చర్య[మార్చు]

డోడెకేన్ ను ఆక్సిజన్ తో మండించినపుడు కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరచును,అంటె కాక చర్య పలితంగా ఉష్ణశక్తి వెలువడును.ఈ ఉష్ణ శక్తిని యాంత్రిక చలన శక్తిగా లేదా ఇతర పదార్ధాలను వేడి చెయుటకు ఉపయోగిస్తారు.

C12H26 + 18.5 O2 → 12 CO2 + 13 H2O + ఉష్ణశక్తి

తాపవిచ్ఛేదన(pyrolysis)[మార్చు]

ఒక పదార్థం వియోగం చెందటానికి ఆక్సిజన్ రహిత వాతవరణంలొ అధిక ఉష్ణొగ్రత వద్ద వేడిచెసి,వియోగ పలిత పదార్థాలను పొందటం జరుగును. పైరోలిసిస్ అనేది పదార్ధాలను వాటి ఉష్ణ వియోగం సులభతరం చేయడానికి సాపేక్షంగా జడ వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలకు లోబడి చేసే ప్రక్రియగా నిర్వచించవచ్చు. [16]

  • ఉదాహరణకు డోడెకేన్ ను 450°Cతో,4 MPa(మెగా పాస్కల్)వత్తిడి వద్ద తాపవిచ్ఛేదన చేసినచోఉత్పత్తి చేయబడిన ద్రవాలు సరళ శృంఖల పారాఫిన్, సరళ శృంఖల ఒలేఫిన్, సైక్లిక్ పారాఫిన్, సైక్లిక్ ఒలేఫిన్, ఒక బెంజీన్/టొల్యూన్/క్సిలీన్ (BTX) మిశ్రమం మరియు నాఫ్తలీన్‌గా విభజించబడ్డాయి.[17]పై ప్రక్రియలో లోహ ఫోం మీద శోషింపబడిన కర్బనం/కార్బన్ ను ఉత్ప్రేరకం గా ఉపయోగించారు.
  • డోడెకేన్ (కిరోసిన్ ఆయిల్ యొక్క ఒక భాగం) ప్లాటినం, పల్లాడియం లేదా నికెల్ యొక్క ఉత్ప్రేరక చర్యలో 973 K ఉష్ణోగ్రతకు వేడి చేయడం ద్వారా హెప్టేన్ మరియు పెంటేన్ మిశ్రమాన్ని పైరోలిసిస్ ఉత్పత్తులుగా ఇస్తుంది.[18]
  • n-డోడెకేన్ యొక్క తాపవిచ్ఛేదనాని జెట్-ప్రేరేపిత రియాక్టర్‌లో 793 నుండి 1093 K ఉష్ణోగ్రతల వద్ద, 1 మరియు 5 సెకన్ల మధ్య నివాస సమయాలు మరియు వాతావరణ పీడనం వద్ద అధ్యయనం చేయగా, ప్రతిచర్య యొక్క ఉత్పత్తులు ప్రధానంగా హైడ్రోజన్, మీథేన్, ఈథేన్, 1,3 బ్యూటాడిన్ మరియు 1-ఆల్కీన్, ఈథీన్ నుండి 1-అన్‌డెకిన్ వరకు ఏర్పడినవి.అధిక ఉష్ణోగ్రతలు మరియుఎక్కువ చర్యసమయాల వలన ఎసిటిలీన్, అలీన్, ప్రొపైన్, సైక్లోపెంటెన్, 1,3-సైక్లోపెంటాడైన్ మరియు నాఫ్తలీన్ ద్వారా బెంజీన్ నుండి పైరీన్ వరకు అరోమాటిక్ సమ్మేళనాలు కూడా ఏర్పడం గమనించబడ్డాయి.[19]

ఉపయోగాలు[మార్చు]

  • డోడెకేన్ ద్రావకం వలె, సేంద్రీయ సంశ్లేషణలో, జెట్ ఇంధన పరిశోధనలో, స్వేదనం చేజర్‌గా మరియు రబ్బరు మరియు పేపర్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది.[20]
  • పారాఫిన్ ఉత్పత్తులుతయారీ లోను, లూబ్రికెంట్ ఆయిల్ సంకలితం గాను ఉపయోగిస్తారు.[21]

దుష్పలితాలు[మార్చు]

అగ్ని ప్రమాదం[మార్చు]

  • ఈ రసాయనం మండే స్వభావం కలిగిన ద్రవం.అందువలన తగినంత గాలి మరియు నిప్పు లేదా నిప్పు రవ్వల సంపర్కంలొ డోడెకేన్ ఆవిర్లు మండి అగ్ని ప్రమాదం జరిగె అవకాశం వున్నది.[22]
  • వేడి మరియు ఓపెన్ మంట నుండి డోడెకేన్ ను దూరంగా ఉంచాలి.

అరోగ్య సమస్యలు[మార్చు]

  • కళ్ళలో పడిన,కళ్ళ మీద పడిన,కళ్ళు మండి చికాకు కల్గిస్తుంది.అలాగే చర్మం పైపడిన ,చర్మం లోని కొవ్వు,నూనె తొల్గింపబడి,చర్మం పొడిబారి పోవును.చర్మం మంటగా అనిపిస్తుంది.[22]
  • శ్లేష్మ పొరలకు చికాకు కలిగించవచ్చు.[22]

ఇవికూడా చదవండి[మార్చు]

ఆల్కేన్

బయటి విడియో లంకె[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "n-dodecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 4 January 2012.
  2. "Dodecane".
  3. "Dodecane".
  4. Pyrolysis of Hydrocarbons:Serban C. Moldoveanu, in Pyrolysis of Organic Molecules (Second Edition), 2019
  5. "n-Dodecane". sciencedirect.com/. Retrieved 2024-04-22.
  6. National Toxicology Program, Institute of Environmental Health Sciences, National Institutes of Health (NTP). 1992. National Toxicology Program Chemical Repository Database. Research Triangle Park, North Carolina.
  7. "dodecane". ebi.ac.uk. Retrieved 2024-04-22.
  8. "N-Dodecane". hmdb.ca. Retrieved 2024-04-22.
  9. "Illustrated Glossary of Organic Chemistry". chem.ucla.edu. Retrieved 2024-04-22.
  10. 10.0 10.1 "N-DODECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-22.
  11. 11.0 11.1 11.2 11.3 "Dodecane". chemspider.com. Retrieved 2024-04-22.
  12. "n-Dodecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-22.
  13. National Fire Protection Association; Fire Protection Guide to Hazardous Materials. 14TH Edition, Quincy, MA 2010, p. 325-54
  14. Lewis, R.J. Sr. (ed) Sax's Dangerous Properties of Industrial Materials. 11th Edition. Wiley-Interscience, Wiley & Sons, Inc. Hoboken, NJ. 2004., p. 1544
  15. "Dodecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-22.
  16. "What is Pyrolysis?". byjus.com. Retrieved 2024-04-22.
  17. "Endothermic Cracking of n-Dodecane in a Flow Reactor using Washcoated Activated Carbon on Metal Foam". pubs.acs.org. Retrieved 2024-04-22.
  18. "Pyrolysis Of Alkanes". byjus.com. Retrieved 2024-04-22.
  19. "Thermal decomposition of n-dodecane: experiments and kinetic modelin" (PDF). arxiv.org. Retrieved 2024-04-22.
  20. "Hazardous Substances Data Bank (HSDB)". pubchem.ncbi.nlm.nih.go. Retrieved 2024-04-22.
  21. Verschueren, K. Handbook of Environmental Data on Organic Chemicals. Volumes 1-2. 4th ed. John Wiley & Sons. New York, NY. 2001, p. 1017
  22. 22.0 22.1 22.2 "N-DODECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-22.
"https://te.wikipedia.org/w/index.php?title=డోడెకేన్&oldid=4194922" నుండి వెలికితీశారు