తరకటూరు

వికీపీడియా నుండి
(తారకటూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తరకటూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,680
 - పురుషులు 1,858
 - స్త్రీలు 1,822
 - గృహాల సంఖ్య 1,083
పిన్ కోడ్ 521156
ఎస్.టి.డి కోడ్ 08671.

తరకటూరు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 521 156., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

ఘంటసాల, మొవ్వ, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 60 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. శ్రీ తుర్లపాటి ప్రసాదరావు అను దాత, ఈ పాఠశాలలో రు. 40 లక్షలతో నూతనంగా ఒక భవనం నిర్మించి వితరణగా అందించారు. [4]
  2. బెంగళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో 2016, జనవరి-19 నుండి 23 వరకు నిర్వహించనున్న దక్షిణ భారతదేశ స్థాయి వైద్య, విఙానిక సదస్సులో పాల్గొనడానికి ఈ పాఠశాల విద్యార్థుల బృందం ఎంపికైనది. [9]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

తరకటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పర్ణశాల ప్రాథమిక పాఠశాల, ఉత్తమ పాఠశాలగా ఎంపికైనది. [7]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

మొవ్వ మండలం మంత్రిపాలెం పంచాయతీ పరిధిలోని మాకులవాని పాలెం (గొల్లపాలెం) గ్రామం, కొంత భాగం గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయతీలోనికి వెళ్ళినది. దీనితో ఇరు పంచాయతీల ప్రతినిధుల నడుమ నలుగుతూ సమస్యల పరిష్కారంలో వివక్షతకు గురి అగుచున్నది. [8] 2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జిన్నాబత్తిన వెంకటేశ్వరరావు, సర్పంచ్‌గా ఎన్నికైనారు. [10]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ శ్రీ శ్రీ కాశి అన్నపుర్ణా సమెత విశ్వెశ్వరస్వామి (శివ) ఆలయము[మార్చు]

శ్రీ సీతారామాలయము[మార్చు]

శ్రీ చెన్నకేశవస్వామివారి దేవాలయం[మార్చు]

ఈ ఆలయములో, 2014, ఏప్రిల్-4వ తేదీన, శిఖర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, వేదమంత్రోచ్ఛారణల మధ్య, వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, గ్రామ ప్రజలతోపాటు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు గూడా అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయంలో మహా పూర్ణాహుతి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర విశేష పూజలు నిర్వహించారు. [3]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, స్వామివారి బ్రహ్మోసవాలు వైభవంగా నిర్వహించెదరు. [5]

సర్వమతసమాన ప్రతీకగా ఒక మస్జిద్, చర్చి కూడా ఈ ఊరిలో ఉన్నాయి.

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ప్రస్తుత కేరళ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటకశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ జి.కమలవర్ధనరావు , పర్ణశాలలో పెరిగినారు. వీరు 2017.జులై-27న ఈ గ్రామానికి సతీసమేతంగా విచ్చేసి, ఈ గ్రామాన్నీ, పర్ణశాల పాఠశాలనూ సందర్శించి, పాఠశాల విద్యార్థులతో కొంత సమయం గడిపినారు. [10]

గామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో, 250 ఎకరాల విస్తీర్ణంలో, ఆరున్నర మీటర్ల ఎత్తులో, ఒక వేసవి మంచినీటి జలాశయం ఏర్పాటు చేసారు. ఈ పథక నిర్మాణాన్ని 1989లో ప్రారంభించగా, 1994-సెప్టెంబరులో వినియోగంలోనికి వచ్చింది. దీని ద్వారా రోజుకు 35 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జలాశయం నుండి, ఆకుమర్రి పథకం ద్వారా గూడూరు, మచిలీపట్నం మండలాలలోని 58 గ్రామాలకూ మరియూ మంగినపూడి పథకం ద్వారా మచిలీపట్నం మండలంలోని 30 గ్రామాలకూ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇవిగాక, వేసవిలో మూడునెలలపాటు మచిలీపట్నం మరియూ పెడన పురపాలకసంఘాలకు మంనీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రకంగా తరకటూరు జలాశయం, ఇప్పటివరకు లక్షలాదిమంది ప్రజల దాహార్తిని తీర్చుచూ ఆదర్శంగా నిలుచుచున్నది. [6]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,680 - పురుషుల సంఖ్య 1,858 - స్త్రీల సంఖ్య 1,822 - గృహాల సంఖ్య 1,083
జనాభా (2001) -మొత్తం 3954 - పురుషులు 1979 -స్త్రీలు 1975 -గృహాలు 1010 -హెక్టార్లు 830

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-5; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-18; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,మార్చి-30; 4వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,మే-6; 8వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-5; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 24వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-31; 15వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2017,జులై-28; 16వపేజీ.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Tarakaturu". Retrieved 29 June 2016. External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=తరకటూరు&oldid=3207789" నుండి వెలికితీశారు