కంకతావ
కంకతావ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,141 |
- పురుషులు | 1,125 |
- స్త్రీలు | 1,016 |
- గృహాల సంఖ్య | 600 |
పిన్ కోడ్ | 521149 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
కంకటావ, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 149., ఎస్.టి.డి. కోడ్ = 08672.
- (kankata)
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు.
సమీప గ్రామాలు[మార్చు]
మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన.
సమీప మండలాలు[మార్చు]
మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు.
గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]
గుడ్లవల్లేరు, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 63 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న పి.వి.సుబ్రహ్మణ్యం అను విద్యార్థి తయారుచేసి, ప్రదర్శించిన "Railway Crossing Automatic Gate System" అను ఒక ప్రాజక్టు, ఇటీవల మైలవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైఙానిక ప్రదర్శనలో గెలుపొంది, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. [4]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గోళ్ళ శేషుకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ ఉమామహేశ్వరస్వామివారి దేవాలయం[మార్చు]
శ్రీ వేణుగోపాలస్వామివారి దేవాలయం[మార్చు]
శ్రీ వెంకటాచలస్వామివారి దేవాలయం[మార్చు]
ఈ దేవాలయాలలో స్వామివార్ల కళ్యాణమహోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల త్రయోదశి నుండి బహుళ విదియ వరకు (మే నెలలో), ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దెదరు. ఉత్సవాలలో భాగంగా పలు విశేష పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేసెదరు. ఇవిగాక, జగజ్యోతి, ఎదురుకోలు సన్నాహాలు, కళ్యాణమహోత్సవం, రథోత్సవం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి అలయం[మార్చు]
ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధపౌర్ణమి, సోమవారంనాడు, స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. [6]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో అమ్మవారి సంబరాన్ని, 2014, ఆగష్టు-2,3 తేదీలలో, రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. 2వ తేదీ శనివారం రాత్రి పోతురాజు గెడల ఊరేగింపు జరపగా, భక్తులు మరియూ యువకులు, పెక్కుసంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. ఆదివారం నాడు గ్రామంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించారు. పలువురు మహిళలు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి, నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా స్థానికులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులరాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం నిర్వహించిన అన్నసమారాధనకు విశేష స్పందన లభించింది. గ్రామంతోపాటు పరిసర గ్రామాలకు చెందిన వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
- ఈ గ్రామంలో, 2014, జూన్-13 రాత్రి, ఒక గ్రామస్థుడు తన ఇంటిపనుల నిమిత్తం తరలించుచున్న ఇసుకగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం లభ్యమైనది. [3]
- ఈ గ్రామాన్ని పార్లమెంటు ప్యానల్ స్పీకరైన శ్రీ కొనకళ్ళ నారాయణ, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై దత్తత తీసికొన్నారు. [5]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2513.[2] ఇందులో పురుషుల సంఖ్య 1289, స్త్రీల సంఖ్య 1224, గ్రామంలో నివాసగృహాలు 644 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 2,141 - పురుషుల సంఖ్య 1,125 - స్త్రీల సంఖ్య 1,016 - గృహాల సంఖ్య 600
మూలాలు[మార్చు]
- ↑ "కంకతావ". Retrieved 29 June 2016.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2014, మే-11; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-4; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-12; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015, మే-4; 16వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-22; 16వపేజీ.