కప్పలదొడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కప్పలదొడ్డి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కట్టా మునీశ్వరరావు
జనాభా (2011)
 - మొత్తం 3,142
 - పురుషులు 1,555
 - స్త్రీలు 1,587
 - గృహాల సంఖ్య 889
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

కప్పలదొడ్డి, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 366. ఎస్.టి.డి.కోడ్=08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం:- గ్రామములో అంగనవాడీ కేంద్రం భవన నిర్మాణానికి గ్రామానికి చెందిన దాత శ్రీ గుత్తి సోమయ్య ఐదు సెంట్ల స్థలాన్ని వితరణగా అందించగా, భవన నిర్మాణనికి 2016,అక్టోబరు-11, దసరా నాడు శంకుస్థాపన నిర్వహించినారు. [9]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

శ్రీ కట్టా మునీశ్వరరావు[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కట్టా మునీశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కారిచర్ల భాస్కరరావు ఎన్నికైనారు. [2] ఈ గ్రామ సర్పంచ్ శ్రీ మునేశ్వరరావు 100% మరుగుదొడ్లు నిర్మించి ప్రత్యేకతను చాటిన సర్పంచిగా వినుతికెక్కినారు. వీరు పలు సదస్సులలో తాను అనుసరించిన విధానాన్ని వివరించారు. 2016,మే-2న హైదరాబాదులో, Water aid about Rapid Action learning Unit of Andhrapradesh, లండనుకు చెందిన డా. రాబర్ట్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో గూడా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంలో తాను పాటించిన విధానం అయిన ఖర్చు తదితర అంశాలపై ప్రసంగించి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయుచున్న ప్రియ సంస్థ ప్రతినిధులు, తదితరులు గూడా పాల్గొన్నారు. [7] స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 2016,సెప్టెంబరు-30న ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనడానికి, ఈ గ్రామ సర్పంచి శ్రీ కట్టా మునేశ్వరరావ్యుకు ఆహ్వానం అందినది. ఈ సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సహా పలు కేంద్రమంత్రులు పాల్గొనుచున్నారు. ఈ సమావేశానికి దేశం మొత్తం నుండి జిల్లాకొక సర్పంచికి ఆహ్వానం పంపగా కృష్ణాజిల్లా నుండి వీరికి ఆ ఆహ్వానం లభించినద్ఫి. ఈ గ్రామములో నూటికి నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ఈయన అనుసరించిన విధానం అందరూ అనుసరించదగ్గదని, ఈ గ్రామాన్ని సందర్శించిన కేంద్రప్రభుత్వ ప్రతినిధులు తెలియజేసినారు. ఈ అంశంపై ఇప్పటికే ఈయన హైదరాబాదుతో సహా పలు ప్రాంతాలను సందర్శించి తను అనుసరించిన విధానాలను తెలియజేసినారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు, 2017,ఫిబ్రవరి-9 నుండి నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, 10వ తేదీ శుక్రవారం రాత్రి ఆశ్లేష నక్షత్ర యుక్త వృశ్చికలగ్నమందు నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో, రాష్ట్రంనలుమూలల నుండి వచ్చిన దేవాంగులు, భక్తులు వేలాదిమంది పాల్గొన్నారు. అమ్మవారు జ్యోతిస్వరూపంలో దర్శనమిచ్చినారు. జ్యోతి ఊరేగింపులో అమ్మవారిని దర్శించుకొనడానికి భక్తులు పోటీపడినారు. 12వతేదీ ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు అమ్మవారి గ్రామోత్సవం కన్నులపండువగా సాగినది. [10]&[11]

శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, సీతారాములు, శేషశయన విష్ణుమూర్తి, గోవింద విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2013,డిసెంబరు-9,సోమవారం ఉదయం, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాశాంతి యగ్నం, విశేషపూజలు జరిపించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. కప్పలదొడ్డి గ్రామానికి చెందిన శ్రీ బొమ్మిశెట్టి శివనాగప్రభు, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసించారు. వీరు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం ఎం.బి.య్యే. అదువుచున్నారు. వీరు పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో బహమతులు అందుకున్నారు. తాజాగా వీరు చెన్నైలోని ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయంలో జరుగనున్న అఖిల భారత అంతర్ విశవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటను టోర్నమెంటులో పాల్గొంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం జట్టుకి కెప్టెనుగా ఎంపికైనారు. [4]
  2. ఈ గ్రామంలో శ్రీ కొసనం శ్యామలయ్య, కోటసుబ్బమ్మ దంపతులు ఒక అతి సాధారణ కుటుంబనికి చెందిన వారు. వీరి కుమారుడు శ్రీ కొసనం రామమూర్తి, ఎం.బి.బి.ఎస్. చదివి ఆఫ్రికా ఖండంలోని "లిబియా" అను దేశంలో 15 సంవత్సరాలనుండి వైద్యులుగా సేవలందించుచున్నారు. లిబియాలో అంతర్యుద్ధం జరుగుచున్నందువలన, 2015,16వ తేదీనాడు, అక్కడ తీవ్రవాదులు వీరిని బందీగా పట్టుకున్నారు. [5]
  3. కప్పలదొడ్డి గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి ప్రభుకుమార్, త్వరలో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించు అఖిల భారత విశ్వవిద్యాలయాల బాల్ బాడ్మింటన్ పోటీలకు ఎన్నికై తన సత్తా చాటినాడు. మన దేశంలోని 80 విశ్వవిద్యాలయాలు పాల్గొంటున్న ఈ పోటీలలో, ఇతడు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించుచున్నాడు. చిన్నప్పటినుండి అనేక పోటీలలో పాల్గొంటున్న ఇతడు గతంలో పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధించాడు. [6]

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011)- మొత్తం 3,142- పురుషుల సంఖ్య 1,555- స్త్రీల సంఖ్య 1,587- గృహాల సంఖ్య 889

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3372.[2] ఇందులో పురుషుల సంఖ్య 1637, స్త్రీల సంఖ్య 1735, గ్రామంలో నివాసగృహాలు 850 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "కప్పలదొడ్డి". Retrieved 29 June 2016. Cite web requires |website= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా, 2013,అక్టోబరు-16; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా, 2013,డిసెంబరు,10; 4వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-17; 10వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-19; 6వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-23; 15వపేజీ. [7] ఈనాడు కృష్ణా 2016,మే-4; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016,సెప్టెంబరు-30; 3వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2016,అక్టోబరు-13; 5వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2017,ఫిబ్రవరి-9; 5వపేజీ. [11] ఈనాడు కృష్ణా; 2017,ఫిబ్రవరి-14; 5వపేజీ.