లెల్లగరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెల్లగరువు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 726
 - పురుషులు 368
 - స్త్రీలు 358
 - గృహాల సంఖ్య 231
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

లేళ్ళగరువు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో ఐదురోజులపాటు నిర్వహించు అమ్మవారి వార్షిక సంబరాలు, 2015, జూన్-3వ తేదీ బుధవారంనాడు, వైభవంగా ప్రారంభమైనవి. 5వతేదీ శుక్రవారంనాడు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలు 18 సంవత్సరాల తరువాత నిర్వహించుచుండటంతో, ప్రాధాన్యత సంతరించుకున్నవి. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన గ్రామస్థులంతా తరలిరావడంతో, గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకున్నది. గ్రామ ప్రారంభం నుండి, శివారు ప్రాంతం వరకు కట్టిన వేపాకు తోరణాలు, ఈ సంబరం ప్రాముఖ్యతను తెలుపుచున్నవి. ఈ సందర్భంగా, బుధవారం ఉదయం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. గంగానమ్మ, పోతురాజుల గెడల ఊరేగింపు నిర్వహించారు. కనకతప్పెటల కళాకారుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నవి. యువకులు వీటికనుగుణంగా నృత్యాలు చేస్తూ, కోలాహలంగా పాల్గొన్నారు. గ్రామస్థులు వారివారి ఇళ్ళముందు ముగ్గులువేసి, ఊరేగింపునకు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 6వ తేదీ శనివారంనాడు, ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. ఐదవరోజు, ఆఖరిరోజైన ఏడవతేదీ ఆదివారంనాడు, మొక్కుబడుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన వీధులలో అమ్మవారి బొమ్మ గీసి, జ్యోతి వెలిగించి, ప్రదక్షిణలు నిర్వహించుచూ విశేషపూజలు నిర్వహించారు. గ్రామ ప్రారంభం నుండి చివరి వరకు, రహదారులు రంగులతో నిండి ఉండటం, ఇళ్ళముందు వేపాకు దండలు కొట్టి, పొట్టేళ్ళ నుదుట పసుపు, కుంకుమలు పూసి ఉండటం, తదితర దృశ్యాలు, సంబరం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. [2]&[3]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, లెల్లగరువు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 890.[2] ఇందులో పురుషుల సంఖ్య 450, స్త్రీల సంఖ్య 440, గ్రామంలో నివాస గృహాలు 219 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 726 - పురుషుల సంఖ్య 368 - స్త్రీల సంఖ్య 358 - గృహాల సంఖ్య 231

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Lellagaruvu". Retrieved 29 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

[2] ఈనాడు అమరావతి; 2015, జూన్-4; 17వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, జూన్-8; 4వపేజీ.