ముక్కొల్లు (గూడూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్కొల్లు (గూడూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,020
 - పురుషులు 1,024
 - స్త్రీలు 996
 - గృహాల సంఖ్య 582
పిన్ కోడ్ 521332
ఎస్.టి.డి కోడ్ 08672

ముక్కొల్లు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామంలో 2017,మార్చ్-16 నుండి 18 వరకు పరిశోధనలు జరిపిన చరిత్ర పరిశోధకులు, ఈ గ్రామంలో బౌద్ధ స్థూప అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రాములోని ఊరచెరువులో త్రవ్వకాలు నిర్వహించగా, అక్కడ తెల్ల సున్నపురాయితో చేసిన శివలింగాన్ని గుర్తించారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇటుకల కట్టడం ఉండేదని గ్రామస్థులు చెప్పగా అక్కడ త్రవ్వి చూడగా, పురాతన కాలంనాటి ఇటుకలను గురించారు. [8]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 59 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు, వరుసగా 4 సంవత్సరాల నుండి, 100% ఉత్తీర్ణత సాధించుచున్నారు. ఒక విద్యార్థి ఐ.ఐ.ఐ.టిలో ప్రవేశం పొందినాడు. [7]

ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ సుందరరామయ్య, 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. [7]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం:- ఈ కేంద్రం ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్ధం ఒక గోదాము నిర్మించుచున్నారు. [6]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలోని ముఖమండపం, కాకతీయ నిర్మాణశైలిలో ఉన్నదని చరిత్ర పరిశోధకుల ఉవాచ. [8]

శ్రీ మహంకాళి తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, 2015,మార్చ్-4,5 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దినారు. తొలిరోజు బుధవారం సాయంత్రం నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గంగానమ్మ గుడి వద్ద దీపారాధన చేసిన అనంతరం, మహంకాళమ్మ అమ్మవారికి దీపారాధన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలలో, అమ్మవారి జీవిత చరిత్ర కథ చెప్పడం, ఊరేగింపు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. [2]

ఈ ఆలయ పునర్నిర్మాణానికి, 2015,జూన్-12వ తేదీ శుక్రవారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాత శ్రీ చందన నాగేశ్వరరావు, రు. 10 లక్షలు అందించగా, దేవాదాయశాఖవారు మరియొక రు.20 లక్షలు సమకూర్చారు. [4]

శ్రీ రామమందిరం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ మందిరంలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలను, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఒక యాగశాలను ఏర్పాటుచేసి, 30వ తేదీ శనివారంనాడు, పలు హోమపూజలు నిర్వహించారు. 31వ తెదీ ఆదివారంనాడు, విగ్రహ ప్రతిషృహ సందర్భంగా, తెల్లవారుఝామునుండియే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాన్ని, పలువురు వేదపండితుల ఆధ్వర్యంలో, ఉదయం 8-24 గంటలకు, వేదమంత్రోచ్ఛారణలమధ్య, శ్రీరామ, సీతా, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవోపేతంగా నివహించారు. పీఠారోహణం, కళాన్యాసం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించెనారు. అనంరరం శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు, గ్రామస్థులతోపాటు, పరిసర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, ప్రత్యేకపూజలు చేసారు. [3]

ఈ ఆలయంలో నూతన విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2015,జూన్-15వ తేదీ సోమవారంనాడు, ఈ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించ్నారు. పూజలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహించారు. [5]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2262.[2] ఇందులో పురుషుల సంఖ్య 1123, స్త్రీల సంఖ్య 1139, గ్రామంలో నివాస గృహాలు 573 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 2,020 - పురుషుల సంఖ్య 1,024 - స్త్రీల సంఖ్య 996 - గృహాల సంఖ్య 582

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Mukkollu". Retrieved 29 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-6; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,మే-30 & జూన్-1; 4వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,జూన్-13; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,జూన్-16; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-3; 5వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-16; 5వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2017,మార్చ్-19; 5వపేజీ.