Jump to content

నిఖిల్ సిద్ధార్థ

వికీపీడియా నుండి
(నిఖిల్ నుండి దారిమార్పు చెందింది)
నిఖిల్ సిద్దార్థ

నిఖిల్ సిద్దార్థ
జన్మ నామంనిఖిల్ సిద్దార్థ
జననం (1985-06-01) 1985 జూన్ 1 (వయసు 39)
Indiaహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ఇతర పేర్లు "బేగంపేట బోయ్"
భార్య/భర్త డాక్టర్ పల్లవి (m.2020)
పిల్లలు ఒక అబ్బాయి (జ. ఫిబ్రవరి 2024) [1]
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
యువత
స్వామిరారా

నిఖిల్ సిద్దార్థ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు.

నేపధ్యము

[మార్చు]

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో జూన్ 1 1985న జన్మించాడు. బేగంపేటలోని హైదరబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బేగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.[3] ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు[4].

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[5] హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశంలో విడుదల కంటే ముందుగా టాలీవుడ్లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[6]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్. యువత, వీడు తేడా చిత్రాలలో నటించాడు.[7] అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.[8]

రాజకీయ జీవితం

[మార్చు]

నిఖిల్ సిద్ధార్థ 2024 మార్చి 29న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరాడు.[9]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2003 సంబరం చిన్న పాత్ర
2006 హైదరాబాద్ నవాబ్స్ అతిథి పాత్ర[10]
2007 హ్యాపీ డేస్ రాజేష్
2008 అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అంకిత్
యువత బాబు
2010 కళావర్ కింగ్ రాజేష్
ఓం శాంతి తేజా
ఆలస్యం అమృతం రామ్
2011 వీడు తేడా 'కత్తి' శీను
2012 డిస్కో డిస్కో
2013 స్వామిరారా[11][12] సూర్య
2014 కార్తికేయ (సినిమా) కార్తికేయ కుమారస్వామి
2015 సూర్య వర్సెస్ సూర్య సూర్య
2015 శంకరాభరణం గౌతం
2016 ఎక్కడికి పోతావు చిన్నవాడా అర్జున్
2017 కేశవ కేశవ
2018 కిరాక్‌ పార్టీ కృష్ణ కన్నడ చిత్రం కిరిక్ పార్టి పునర్నిర్మాణం
2019 అర్జున్ సురవరం అర్జున్ Remake of Kanithan Directed by T.N. Santhosh
2022 కార్తికేయ 2 కార్తికేయ "కార్తీక్" కుమారస్వామి
18 పేజెస్ శివ
2023 స్పై [13]
2024 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nikhil Siddartha | తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్.. ఫొటో వైర‌ల్-Namasthe Telangana". web.archive.org. 2024-02-21. Archived from the original on 2024-02-21. Retrieved 2024-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". Archived from the original on 2 May 2019. Retrieved 2 May 2019.
  3. http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms
  4. [1]
  5. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
  6. Nikhil (Happy days) interview - Telugu cinema actor
  7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". Archived from the original on 6 మే 2019. Retrieved 2 May 2019.
  8. The Hindu Business Line : Small films hold their own in Telugu film industry
  9. TV9 Telugu (29 March 2024). "టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నారా లోకేశ్‌". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. http://www.youtube.com/watch?v=fDk6wyuQsGE
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-21. Retrieved 2013-04-04.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-04. Retrieved 2013-04-04.
  13. "Massive action block being shot for Nikhil Siddhartha's pan-India film 'SPY'".