నౌపడా
స్వరూపం
నౌపడా నౌపాడ |
|
---|---|
— పట్టణం — | |
Country | India |
రాష్ట్రం | Odisha |
జిల్లా | నౌపడా |
Time zone | IST (UTC+5:30) |
Vehicle registration | OD-26 |
నౌపడా, ఒడిషా రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. దీన్ని నౌపాడ అని కూడా అంటారు. ఇది నౌపడా జిల్లాకు కేంద్రం. 1993 మార్చి 27 న అవిభక్త కలాహండి జిల్లా నుండి నౌపడా జిల్లా ఏర్పాటైంది. ఇది ఒడిశా పశ్చిమ సరిహద్దులో ఉంది. జిల్లా భాషాపరంగా, సాంస్కృతికంగా ఒడిషాలో భాగం. ఇది భారతదేశంలోని అత్యంత వెనకబడ్డ జిల్లాలలో ఒకటి.
జనాభా
[మార్చు]నౌపడా జనాభా 6,10,382. జనాభాలో పురుషుల సంఖ్య 3,01,962, స్త్రీ జనాభా 3,08,420 మంది ఉన్నారు. జనాభాలో అక్షరాస్యుల సంఖ్య 2,99,383 అని అంచనా. అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని స్పష్టమైంది.
ఆసక్తికరమైన ప్రదేశాలు
[మార్చు]నౌపడా నుండి 18 కి.మీ. దూరంలో ఉన్న పటోరా లోని యోగేశ్వర్ దేవాలయం దాని పురాతన శివలింగానికి ప్రసిద్ధి చెందింది.[1] కొత్త ఆలయ నిర్మాణానికి గుల్షన్ కుమార్ సహకరించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Patora Jogeswar Temple". Odishatravels.com. 2012. Retrieved 17 May 2012.
The Linga of Lord Siva (Sibalinga) is pretty old, dating back to 6th century
- ↑ "Tourism :: Photo Gallery". nuapada.nic.in. 2012. Archived from the original on 8 April 2012. Retrieved 17 May 2012.
The help of cassette king late Gulshan Kumar is significant.