పంచచామరము
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| స్రగ్ధర, మహాస్రగ్ధర |
| ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
| లయగ్రాహి, లయవిభాతి |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
పంచచామరము
[మార్చు]జరేఫలున్జరేఫలున్జసంయుతంబు లై తగన్
గరూ పరిస్థితిం బొసంగి గుంఫనం బెలర్పఁగా
విరించి సంఖ్యనందమైనవిశ్రమంబు లందగన్
బ్రరూఢమైనఁ బద్మనాభ పంచచామరం బగున్
గణ విభజన
[మార్చు]| IUI | UIU | IUI | UIU | IUI | U | ||
| జ | ర | జ | ర | జ | గ | ||
| ప్రసన్న | పింఛమా | లికా ప్ర | భా విచి | త్రితాంగుఁ | డుం |
లక్షణములు
[మార్చు]| • | పాదాలు: | నాలుగు |
| • | 16 | |
| • | ప్రతిపాదంలోని గణాలు: | జ, ర, జ, ర, జ, గ |
| • | యతి : | ప్రతిపాదంలోనూ 10వ అక్షరము |
| • | ప్రాస: | పాటించవలెను |
| • | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన పంచచామర వృత్త పద్యాల సంఖ్య: 1
(భా-10.1-586-పంచ.)
ప్రసన్న పింఛమాలికా ప్రభా విచిత్రితాంగుఁడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం
బ్రసన్న గోపబాల గీత బాహువీర్యుఁ డయ్యు ను
ల్లసించి యేగె గోపకు ల్చెలంగి చూడ మందకున్.