అనంత్

వికీపీడియా నుండి
(పుణ్యమూర్తుల అనంత్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అనంత్ బాబు
జననం
పుణ్యమూర్తుల అనంత్ బాబు

వృత్తినటుడు
బంధువులురాజబాబు, చిట్టిబాబు

పుణ్యమూర్తుల అనంత్ సినీ నటుడు.[2] 500 కి పైగా సినిమాలలో నటించాడు.[3] అనంత్, హాస్యనటుడు రాజబాబు తమ్ముడు.[4] ఇతని అన్న పుణ్యమూర్తుల చిట్టిబాబు కూడా సినీ నటుడే. రాజబాబు సోదరులు తొమ్మిది మందిలో అనంత్ ఆఖరి వాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అనంత్ కాకినాడ దగ్గర ఇంజరంలో జన్మించాడు. తరువాత అతని కుటుంబం రాజమండ్రికి వెళ్ళారు. తొమ్మిదో తరగతి దాకా అక్కడే చదివాడు. తరువాత చదువు హైదరాబాదులో సాగింది. అక్కడే బీ.కాం చదివాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత నాగార్జున స్టీల్స్ లో కొద్ది కాలం పనిచేశాడు. ఆయనకు ఒక అబ్బాయి శ్రీసత్య సాయి నాగేంద్ర బాబు. అమెరికాలో విద్యనభ్యసించాడు.

కెరీర్

[మార్చు]

మొదట్లో టీవీ సీరియళ్ళలో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అనగనగా ఒక శోభ అనే సీరియల్ లో మొదటి సారిగా నటించాడు. ఈ సీరియల్ కు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సంభాషణలు రాశాడు. పరమానందయ్య శిష్యుల కథ సీరియల్ కు గాను నంది అవార్డు లభించింది. నారీ నారీ నడుమ మురారి తో సినిమాల్లో ప్రవేశించాడు.

నారీ నారీ నడుమ మురారి, అనంత్ మొదటి సినిమా

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "TORI Live Show with Comedian Ananth Babu by RJ Mama Mahesh". youtube.com. తెలుగు వన్. Retrieved 31 August 2016.
  2. "మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెబ్ సైటులో అనంత్ పేజీ". maastars.com. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. Retrieved 31 August 2016.
  3. "రాజబాబు తమ్ముడిగా పుట్టడం ..." sakshi.com. జగతి పబ్లికేషన్స. Retrieved 31 August 2016.
  4. "Ananth". tollymovies.com. Retrieved 31 August 2016.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=అనంత్&oldid=4196723" నుండి వెలికితీశారు